10 జులై, 2013

249. విశిష్టః, विशिष्टः, Viśiṣṭaḥ

ఓం విశిష్టాయ నమః | ॐ विशिष्टाय नमः | OM Viśiṣṭāya namaḥ


విశిష్టః, विशिष्टः, Viśiṣṭaḥ

విశిష్యతే సర్వం అతిశేతే విశేషించును; సర్వమును మించియుండును.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::
సీ. భావించి కొందఱు బ్రహ్మంబు నీ వని తలపోసి కొందఱు ధర్మ మనియుఁ
జర్చించి కొందఱు సదసదీశ్వరుఁడని సరవిఁ గొందఱు శక్తి సహితుఁడనియుఁ
జింతించి కొందఱు చిరతరుం డవ్యయుఁ డాత్మతంత్రుఁడు పరుం డధికుఁడనియుఁ
దొడరి యూహింతురు తుది నద్వయద్వయ సదసద్విశిష్ట సంశ్రయుఁడ నీవు;
తే. తలఁప నొక్కింత వస్తుభేదంబు గలదె, కంకణాదులు పసిఁడి యొక్కటియ కాదె?
కడలు పెక్కైన వార్ధి యొక్కటియ కాదె? భేద మంచును నిను వికల్పింప వలదు. (386)

నీవు పరబ్రహ్మవని కొందరు భావిస్తారు. నీవు ధర్మమని కొందరు తలుస్తారు. నీవు ప్రకృతి పురుషులకంటె పరుడవని కొందరంటారు. నీవు శక్తిస్వరూపుడవని కొందరు ధ్యానిస్తారు. విష్ణువుగా శాశ్వతుడుగా, స్వతంత్రుడుగా పరమపురుషుడుగా ఉత్తముడుగా కొందరు నిన్ను ఊహిస్తారు. అన్నింటినీ మించి సాటిలేని వాడవు నీవు. సదసత్తులకు పవిత్రమైన నిలయం నీవు. ఆలోచించి చూస్తే కంకణం మొదలైన బంగారు నగలూ, బంగారమూ వాస్తవముగా ఒకటే కదా! అనంతమైన అలలూ సముద్రమూ ఒకటే కదా! అందువల్ల పైకి భేదం కనిపిస్తున్నా నీకు ఈ సృష్టికీ వాస్తవంగా భేదం లేనే లేదు.



Viśiṣyate sarvaṃ atiśete / विशिष्यते सर्वं अतिशेते One who excels everything.

असंख्येयोऽप्रमेयात्मा विशिष्टश्शिष्टकृच्छुचिः ।
सिद्दार्थस्सिद्धसङ्कल्पः सिद्धिदस्सिद्धिसाधनः ॥ २७ ॥

అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టశ్శిష్టకృచ్ఛుచిః ।
సిద్దార్థస్సిద్ధసఙ్కల్పః సిద్ధిదస్సిద్ధిసాధనః ॥ ౨౭ ॥

Asaṃkhyeyo’prameyātmā viśiṣṭaśśiṣṭakr̥cchuciḥ ।
Siddārthassiddhasaṅkalpaḥ siddhidassiddhisādhanaḥ ॥ 27 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి