3 జులై, 2013

242. సత్కృతః, सत्कृतः, Satkr̥taḥ

ఓం సత్కృతాయ నమః | ॐ सत्कृताय नमः | OM Satkr̥tāya namaḥ


సత్కృతః, सत्कृतः, Satkr̥taḥ
పూజితై రపి పూజితః పూజితులగు బ్రహ్మేంద్రాదులచేత గూడ పూజించబడువాడు.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము (వామన చరితము)::
సీ. యోగమార్గంబున నూహించి బహువిధ పుష్పదామంబులఁ బూజజేసి
దివ్యగంధంబులు తెచ్చి సమర్పించి ధూపదీపములఁ దోడ్తోడ నిచ్చి
భూరి లాజాక్షతంబులు సల్లి ఫలములు గానిక లిచ్చి రాగములఁ బొగడి
శంఖాదిరవముల జయ ఘోషములు వేసి 'కరుణాంబునిధి! త్రివిక్రమ' యటంచు
తే. బ్రహ్మమొదలు లోకపాలురు గొనియాడి; రెల్ల దిశల వనచరేశ్వరుండు
జంబవంతుఁ డరిగి చాటె భేరీధ్వని, వెలయఁ జేసి విష్ణు విజయ మనుచు. (632)

లోకాలను పాలించే బ్రహ్మాదులు మహావిష్ణువును యోగమార్గంలో ఊహించి పలువిధాలైన పూలమాలలతో పూజించినారు. మేలైన సుగంధ వస్తువులూ, ధూపదీపాలనూ సమర్పించినారు. పేలాలనూ, అక్షతలనూ చల్లినారు. ఫలాలను కానుక పెట్టినారు. సంతోషంతో పొగడినారు. శంఖాలను ఊదినారు. 'జయ జయ' నాదాలు చేసినారు. 'కరుణాసముద్రా! త్రివిక్రమ దేవా!' అని కొనియాడినారు. భల్లూకరాజైన జాంబవంతుడు అన్ని దిక్కులలో డంకా మ్రోగించుతూ "విష్ణుదేవుని విజయాన్ని" చాటినాడు.



Pūjitai rapi pūjitaḥ / पूजितै रपि पूजितः Worshiped even by those who are worshiped.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 21
Brahmādayo lokanāthāḥ svanāthāya samādr̥tāḥ,
Sānugā balimājahruḥ saṅkṣiptātmavibhūtaye. (5)
Toyaiḥ samrhaṇaiḥ sragbhirdivyagandhānulepanaiḥ,
Dhūpairdīpaiḥ surabhibhirlājākṣataphalāṅkuraiḥ. (6)

:: श्रीमद्भागवते अष्टम स्कन्धे एकविंशोऽध्यायः ::
ब्रह्मादयो लोकनाथाः स्वनाथाय समादृताः ।
सानुगा बलिमाजह्रुः सङ्क्षिप्तात्मविभूतये ॥ ५ ॥
तोयैः सम्र्हणैः स्रग्भिर्दिव्यगन्धानुलेपनैः ।
धूपैर्दीपैः सुरभिभिर्लाजाक्षतफलाङ्कुरैः ॥ ६ ॥ 

Lord Brahmā and all the predominating deities of the various planetary systems began to worship Lord Vāmanadeva, their supreme master, who had reduced Himself from His all-pervading form to His original form. They collected all the ingredients and paraphernalia for this worship.

They worshiped the Lord by offering fragrant flowers, water, pādya and arghya, sandalwood pulp and aguru pulp, incense, lamps, fused rice, unbroken grains, fruits, roots and sprouts. While so doing, they offered prayers indicating the glorious activities of the Lord and shouted "Jaya! Jaya!" They also danced, played instruments, sang, sounded conch-shells and beat kettledrums, in this way worshiping the Lord.

सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥

Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి