26 జులై, 2013

265. సుభుజః, सुभुजः, Subhujaḥ

ఓం సుభుజాయ నమః | ॐ सुभुजाय नमः | OM Subhujāya namaḥ


సుభుజః, सुभुजः, Subhujaḥ

జగద్రక్షకా అస్య నృహరేః శోభనా భుజాః ।
యతస్సఏవ భగవాన్ విష్ణుస్సుభుజ ఈర్యతే ॥

జగద్రక్షణ చేయు శోభనములగు భుజములు గల విష్ణువు సుభుజః.

:: పోతన భాగవతము - పదునొకండవ స్కంధము ::
చ. నగుమోమున్ సుమధ్యమును నల్లని మేనును లచ్చి కాట ప
     ట్టగు నురమున్ మహాభుజము లంచితకుండలకర్ణముల్ మదే
     భ గతియు నీల వేణియుఁ గృపారసదృష్టియుఁ గల్గు వెన్నుఁ డి
     మ్ముగఁ బొడసూపుఁగాతఁ గనుమూసిన యప్పుడు విచ్చినప్పుడున్‍. (124)

నవ్వు ముఖమూ, చక్కని నడుమూ, నల్లని దేహము, లక్ష్మీదేవికి నివాసమైన వక్షమూ, పెద్ద బాహువులూ, అందమైన కుండలాలు గల చెవులూ, గజగమనమూ, నల్లని జుట్టూ, దయారసం చిందే చూపు గలిగిన విష్ణుమూర్తి నేను కనులు మూసినపుడూ, తెరిచినపుడూ పొడసూపుగాత!



Jagadrakṣakā asya nr̥hareḥ śobhanā bhujāḥ,
Yatassaeva bhagavān viṣṇussubhuja īryate.

जगद्रक्षका अस्य नृहरेः शोभना भुजाः ।
यतस्सएव भगवान् विष्णुस्सुभुज ईर्यते ॥

Lord Viṣṇu is with beautiful and auspicious arms, which protect the worlds. Hence He is Subhujaḥ.

Śrīmad Bhāgavata - Canto 11, Chapter 14
Samaṃ praśāntaṃ sumukhaṃ dīrghacārucaturbhujam,
Sucārusundaragrīvaṃ sukapolaṃ śucismitam. (38)

:: श्रीमद्भागवते एकादशस्कन्धे चतुर्दशोऽध्यायः ::
समं प्रशान्तं सुमुखं दीर्घचारुचतुर्भुजम् ।
सुचारुसुन्दरग्रीवं सुकपोलं शुचिस्मितम् ॥ ३८ ॥

That form is perfectly proportioned, gentle and cheerful. It possesses four beautiful long arms, a charming, beautiful neck, a handsome forehead, a pure smile.

सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः ।
नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥

Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ ।
Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి