31 జులై, 2013

270. వసుః, वसुः, Vasuḥ

ఓం వసవే నమః | ॐ वसवे नमः | OM Vasave namaḥ


దీయమానం వసు సః ఏవ వసుదః నామమున చెప్పబడినట్లు పరమాత్మునిచే ఈయబడు 'వసు' లేదా 'ధనము' కూడ అతడే కనుక అతనిని వసుః అనదగును.

లేదా ఆవాసయతి ఆచ్ఛాదయతి ఆత్మస్వరూపం మాయయా ఇతి వసుః తన స్వరూపమును మాయచేత వాసించును లేదా కప్పివేయును.

లేదా వసతి అంతరిక్షే ఏవ అసాధారణేన వసనేన న అన్యత్ర ఇతి వాయుః వసుః ఇతి ఉచ్యతే ఇతర దేవతల వలెను ఇతర ప్రాణులవలెను ద్యుల్లోకమందో భూలోకమందో కాక అసాధారణముగా అంతరిక్షమునందే వసించును కావున ఈ వ్యుత్పత్తిచే వాయువు వసుః. అసాధారణమగు ఈ వాయువు కూడ పరమాత్ముని విభూతియే కదా.

:: కఠోపనిషత్ - (ద్వితీయాధ్యాయము) 5వ వల్లి ::
హంసః శుచిషద్ వసురన్తరిక్షసద్ హోతా వేదిష దతిథిర్దురోణషత్ ।
నృషద్వరస దృతసద్ వ్యోమస దబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ ॥ 2 (88) ॥

సూర్యునివలె స్వర్గములో నివసించును. వాయువువలె ఆకాశములో నివసించును. అగ్నివలె భూమియందును, అతిథివలె గృహములోనూ నివసించును. ఆ పురుషుడు మానవులలోనూ, దేవతలలోనూ, యజ్ఞములలోనూ, సత్యములోనూ, అగ్నిలోను కూడ నిండియుండును. జలములో జన్మించుచున్నాడు. భూమిలో జన్మించుచున్నాడు. కొండలలోనుద్భవించుచున్నాడు. ఆయాత్మ సత్యస్వరూపుడై ప్రకాశించుచున్నాడు.



Dīyamānaṃ vasu saḥ eva / दीयमानं वसु सः एव He Himself is the wealth (Vasudaḥ) which is given; so He is Vasuḥ.

Or Āvāsayati ācchādayati ātmasvarūpaṃ māyayā iti Vasuḥ / आवासयति आच्छादयति आत्मस्वरूपं मायया इति वसुः He veils His nature by māya; Vasaḥ means a cloth worn around the limbs to cover them.

Or Vasati aṃtarikṣe eva asādhāraṇena vasanena na anyatra iti vāyuḥ vasuḥ iti ucyate / वसति अंतरिक्षे एव असाधारणेन वसनेन न अन्यत्र इति वायुः वसुः इति उच्यते One who as air moves about having one's exclusive Vāsa or residence in the Ākāsa.

Kaṭhopaniṣat - Part II, Canto II
Haṃsaḥ śuciṣad vasurantarikṣasad hotā vediṣa datithirduroṇaṣat,
Nr̥ṣadvarasa dr̥tasad vyomasa dabjā gojā r̥tajā adrijā r̥taṃ br̥hat. (2)

:: कठोपनिषत् - (द्वितीयाध्याय) ५व वल्लि ::
हंसः शुचिषद् वसुरन्तरिक्षसद् होता वेदिष दतिथिर्दुरोणषत् ।
नृषद्वरस दृतसद् व्योमस दब्जा गोजा ऋतजा अद्रिजा ऋतं बृहत् ॥ २ (८८) ॥

As the moving Sun He dwells in heaven; as air He pervades all and dwells in the inter-space; as fire He resides on the earth; as Soma He stays in the jar; He lives among men; He lives among gods; He dwells in truth; He dwells in space; He is born in water; He takes birth from the earth; He is born in the sacrifice; He emerges from the mountains; He is unchanging and He is great.

सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रोवसुदो वसुः
नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ॥ २९ ॥

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రోవసుదో వసుః
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౨౯ ॥

Subhujo durdharo vāgmī mahendrovasudo vasuḥ
Naikarūpo br̥hadrūpaḥ śipiviṣṭaḥ prakāśanaḥ ॥ 29 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి