29 మార్చి, 2015

876. విహాయసగతిః, विहायसगतिः, Vihāyasagatiḥ

ఓం విహాయసగతయే నమః | ॐ विहायसगतये नमः | OM Vihāyasagataye namaḥ


విహాయసం గతిర్యస్య విష్ణోః పదముతాంశుమాన్ ।
విహాయస గతిరితి ప్రోచ్యతే విష్ణురేవ సః ॥

విహాయసము అనగా హృదయపుండరీకమునందలి సూక్ష్మాకాశము. ఈతడు అట్టి విహాయసము ఆశ్రయస్తానముగానున్నవాడు. త్రివిక్రమావతారమున తన పాదమునకు ఆకాశము ఆశ్రయముగానయ్యెను కావున ఆకాశము ఆశ్రయముగా కలది విష్ణుని పాదమును కావచ్చును. ఆకాశమును ఆశ్రయించి సంచరించుచుండు ఆదిత్యుడనియు ఈ నామమునకు అర్థము చెప్పవచ్చును. 'విహాయసము' అనగా ఆకాశమని అర్థము కావున దానిని ఆశ్రయముగా చేసికొనియుండువానిని ఈ నామము తెలుపును.



विहायसं गतिर्यस्य विष्णोः पदमुतांशुमान् ।
विहायस गतिरिति प्रोच्यते विष्णुरेव सः ॥

Vihāyasaṃ gatiryasya viṣṇoḥ padamutāṃśumān,
Vihāyasa gatiriti procyate viṣṇureva saḥ.

Vihāyasa means ākāśa i.e., space within the heart. He dwells in such space. Or during the Vāmana incarnation, His feet encompassed the skies; so the One who dwells in the sky. Or in the form of sun, He moves through the sky. Since Vihāyasa means the sky or space, the One who had it as abode is Vihāyasagatiḥ.

विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।
रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥

విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥

Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,
Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి