1 మార్చి, 2015

848. కథితః, कथितः, Kathitaḥ

ఓం కథితాయ నమః | ॐ कथिताय नमः | OM Kathitāya namaḥ


సర్వైర్వేదైః కథిత ఇత్యుచ్యతః కథితః స్మృతః ।
వేదైశ్చ సర్వై రహమేవేత్యతః కథితః శ్రుతః ॥
సోఽధ్వనః రమాప్నోతీత్యత్రోక్తం కిం తదధ్వనః ।
విష్ణోర్వ్యాపనశీలస్య సత్తత్త్వం పరమం పదం ॥
ఇత్యాకాంక్షాం పురస్కృత్య పరత్వం ప్రతిపాద్యతే ।
ఇన్ద్రియేభ్యః పరా హ్యర్థా ఇత్యారభ్య పరాగతిః ॥
ఇత్యన్తేన యః కథితః స ఏవ కథిత స్మృతః ॥

చెప్పబడినవాడు. ప్రతిపాదించబడినవాడు. తెలియజేయబడినవాడు. వేదములు మొదలగు వానిచేత ఈ విష్ణు పరమాత్ముడే 'పరుడు' అనగా సర్వోత్కృష్టుడు అని చెప్పబడినాడు. సర్వ వేదములచేతను ఒకే మాటగా చెప్పబడినవాడు - అని యైనను చెప్పవచ్చును.

'సర్వే వేదా య త్పద మామనంతి' (కఠోపనిషత్ 1.2.15) - 'సర్వ వేదములును ఏ తెలియబడదగిన పరబ్రహ్మ తత్త్వమును ప్రతిపాదించుచున్నవో'

'వేదైశ్చ సర్వై రహమేవ వేద్యః' (శ్రీమద్భగవద్గీత 15.15) - 'సర్వ వేదముల చేతను తెలియబడదగినవాడను నేనే'

'వేదే రామాయణే పుణ్య భారతే భరతర్షభ । అదౌ మధ్యే తథా చాన్తే విష్ణుః సర్వత్ర గీయతే ॥' (హరివంశము 323.93) - 'హే భరత వంశ శ్రేష్ఠా! పుణ్యకరములగు వేద రామాయణ, మహాభారతములయందు వాని ఆది మధ్యాంతములందంతటను విష్ణువు కీర్తించబడుచున్నాడు' ఈ మొదలగు శ్రుతి, స్మృత్యాది వచనముల ప్రామాణ్యముచే ఈ అర్థము నిశ్చితమగుచున్నది.

సర్వత్ర సర్వకాలములయందును సర్వముగా వ్యాపించియుండువాడగు వ్యాపనశీలుడు అగు 'విష్ణుని' మార్గమునకు సంబంధించి, ఆ మార్గమున పయనించి చేరదగిన కట్టకడపటి గమ్యస్థానముగా తెలియదగు పరమతత్త్వము తాత్త్విక లక్షణములతో కూడిన పరమ పదము ఏది? అను ప్రశ్నము కలుగగా, ఆ విష్ణు పరమాత్ముడు ఇంద్రియాదులగు సర్వతత్త్వములకంటెను పరుడుగా శ్రుత్యాదులచే ప్రతిపాదించబడుచున్నాడు. ఆ విషయమున 'ఇన్ద్రియేభ్యః పరా హర్థాః' అనునది మొదలుగా 'పురుషాన్న పరం కిన్చిత్ సా కాష్ఠా సా పరా గతిః' (కఠోపనిషత్ 1.3.10-11) చే చెప్పబడిన పరమ పురుషుడే ఇచ్చట 'కథితః' అను నామముచే చెప్పబడియున్నారు అని సమాధానము.

:: కఠోపనిషత్ ప్రథమాధ్యాయము 3వ వల్లి ::
విజ్ఞాన సారథి ర్యస్తు మనః ప్రగ్రహవా న్నరః ।
సోఽధన్వః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్ ॥ 9 ॥
ఇన్ద్రియేభ్యః పరాహ్యార్థాః అర్ధేభ్యశ్చ పరం మనః ।
మనసస్తు పరా బుద్ధి ర్బు ద్ధేరాత్మా మహాన్ పరః ॥ 10 ॥
మహతః పరమవ్యక్త మవ్యక్తా త్పురుషః పరః ।
పురషాన్న పరఙ్కీమ్చిత్సా కాష్ఠా సా పరాగతిః ॥ 11 ॥

ఎవనికి విజ్ఞానమను సారథియు, స్వాధీనములోనున్న మనస్సు అను కళ్ళెమును ఉండునో, అట్టివాడు జీవితమార్గముయొక్క గమ్యమును సర్వవ్యాపక బ్రహ్మపదమైన విష్ణు పదమును చేరుచున్నాడు.

ఇంద్రియములను స్థూలములనుగా గ్రహించుచున్నది. ఈ ఇంద్రియములకు కారణభూతములగు శబ్దాది విషయములు, ఇంద్రియముల కంటె సూక్ష్మములు అగుచున్నవి. ఆ శబ్దాది విషయముల కంటె ప్రత్యగాత్మ భూతమగు మనస్సు మహత్తైనది. మనస్సు కంటె బుద్ధి గొప్పది. బుద్ధి కంటె మహతత్త్వము పరమైనదిగానున్నది.

మహతత్త్వముకంటె పరమైనది అవ్యక్తము. అవ్యక్తము కంటె పరమైనవాడు ప్రత్యగాత్మ పురుషుడు. ఆ పురుషునికన్న శ్రేష్ఠమైనది మరియొకటి లేదు. అదియే పరమ గమ్యము. అవ్యక్త, అవ్యాకృత, ఆకాశాది నామవాచ్యము



सर्वैर्वेदैः कथित इत्युच्यतः कथितः स्मृतः ।
वेदैश्च सर्वै रहमेवेत्यतः कथितः श्रुतः ॥
सोऽध्वनः रमाप्नोतीत्यत्रोक्तं किं तदध्वनः ।
विष्णोर्व्यापनशीलस्य सत्तत्त्वं परमं पदं ॥
इत्याकांक्षां पुरस्कृत्य परत्वं प्रतिपाद्यते ।
इन्द्रियेभ्यः परा ह्यर्था इत्यारभ्य परागतिः ॥
इत्यन्तेन यः कथितः स एव कथित स्मृतः ॥

Sarvairvedaiḥ kathita ityucyataḥ kathitaḥ smr̥taḥ,
Vedaiśca sarvai rahamevetyataḥ kathitaḥ śrutaḥ.
So’dhvanaḥ ramāpnotītyatroktaṃ kiṃ tadadhvanaḥ,
Viṣṇorvyāpanaśīlasya sattattvaṃ paramaṃ padaṃ.
Ityākāṃkṣāṃ puraskr̥tya paratvaṃ pratipādyate,
Indriyebhyaḥ parā hyarthā ityārabhya parāgatiḥ.
Ityantena yaḥ kathitaḥ sa eva kathita smr̥taḥ.

By the Vedas, He alone is declared Supreme.

He is celebrated by all the Vedas vide the śruti 'सर्वे वेदा य त्पद मामनन्ति / Sarve vedā ya tpada māmananti' (Kaṭhopaniṣat 1.2.15) - 'He who is celebrated by all the Vedas.'

'वेदैश्च सर्वै रहमेव वेद्यः / Vedaiśca sarvai rahameva vedyaḥ' (Śrīmad Bhagavad Gīta 15.15) - I alone am to be known by all the Vedas.

'वेदे रामायणे पुण्य भारते भरतर्षभ । अदौ मध्ये तथा चान्ते विष्णुः सर्वत्र गीयते ॥ / Vede rāmāyaṇe puṇya bhārate bharatarṣabha, adau madhye tathā cānte viṣṇuḥ sarvatra gīyate.' (Harivaṃśa 323.93) - In the holy Vedas, the Rāmāyaṇa, Bhārata, at the beginning and at the end Viṣṇu is sung everywhere.

:: कठोपनिषत् प्रथमाध्याय ३व वल्लि ::
विज्ञान सारथि र्यस्तु मनः प्रग्रहवा न्नरः ।
सोऽधन्वः पारमाप्नोति तद्विष्णोः परमं पदम् ॥ ९ ॥
इन्द्रियेभ्यः पराह्यार्थाः अर्धेभ्यश्च परं मनः ।
मनसस्तु परा बुद्धि र्बु द्धेरात्मा महान् परः ॥ १० ॥
महतः परमव्यक्त मव्यक्ता त्पुरुषः परः ।
पुरषान्न परङ्कीम्चित्सा काष्ठा सा परागतिः ॥ ११ ॥

Kaṭhopaniṣat Canto 1, Chapter 3
Vijñāna sārathi ryastu manaḥ pragrahavā nnaraḥ,
So’dhanvaḥ pāramāpnoti tadviṣṇoḥ paramaṃ padam. 9.
Indriyebhyaḥ parāhyārthāḥ ardhebhyaśca paraṃ manaḥ,
Manasastu parā buddhi rbu ddherātmā mahān paraḥ. 10.
Mahataḥ paramavyakta mavyaktā tpuruṣaḥ paraḥ,
Puraṣānna paraṅkīmcitsā kāṣṭhā sā parāgatiḥ. 11.

The man, however, who has as his charioteer a discriminating intellect, and who has under control the reins of the mind, attains the end of the road; and that is the highest place of Viṣṇu.

The sense-objects are higher than the senses and the mind is higher than the sense-objects; but the intellect is higher than the mind and the Great Soul is higher than the intellect.

The Unmanifested is higher than Mahat; the Puruṣa is higher than the Unmanifested. There is nothing higher than the Puruṣa. He is the culmination, He is the highest goal.

भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः ।
आश्रमः श्रमणः क्षामस्सुपर्णो वायुवाहनः ॥ ९१ ॥

భారభృత్కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామస్సుపర్ణో వాయువాహనః ॥ 91 ॥

Bhārabhr̥tkathito yogī yogīśaḥ sarvakāmadaḥ,
Āśramaḥ śramaṇaḥ kṣāmassuparṇo vāyuvāhanaḥ ॥ 91 ॥

6 కామెంట్‌లు:

  1. 'అమృతాశ' 'అమృతాంశ.' ఈ రెండింటిలో 813వ నామము సరైనది ఏదో తెలుపగలరు. కొన్ని పుస్తకాలలో అమృతాశ అని, మరికొన్నింటిలో అమృతాంశ అని ఉంటోంది. మీ బ్లాగులోకూడా శ్లోకములో అమృతాంశ అని విడిగా అమృతాశ అని రాసి ఉంది. దీనిపై వీలైతే వివరణ ఇవ్వగలరు.
    --శ్రవణ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ నామాన్ని వ్రాసే సరియైన పద్ధతి "అమృతాఽఽశః / अमृताऽऽशः / Amr̥tā’’śaḥ" అని తెలుస్తోంది..

      తొలగించండి
  2. అయితే చదివేటపుడు 'అమృతాంశో' అని చదవటమే సరైన పద్ధతి అంటారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. 283నామం అమృతాంశూద్భవః అని.
      శంకరుల భాష్యం‌ ప్రకారం 'అమృతాంశో ఉద్భవః యస్యాత్ సః' అని అన్వయం. అమృతాంశువు అంటే చంద్రుడు. ఈ చంద్రుడు క్షీరసముద్రమథనం‌తో జనించిన వాడు. ఆ క్షీరసాగరమథనానికి కారణరూపుడు శ్రీహరి. ఈ నామానికి శంకరులు ఇచ్చిన అన్వయం ఏమిటంటె 'ఎవడు అమృతాంశువు యొక్క ఉద్భవానికి కారణరూపుడో' అతడు అని.

      అందుచేత ఇక్కద పదం యొక్క సరైన స్వరూపం అమృతాంశు అనే తెలుసుకోవాలి మనం. అమృతాంశు అన్నది విష్ణునామం కాదు. నామం 'అమృతాంశూద్భవః' అని గ్రహించాలి.

      813వ నామం అమృతాఽఽశః అని.
      శంకరులు 'స్వాత్మానందరూపం అమృతం అశ్నాతి' అనగా స్వాత్మానందస్వరూపమైన అమృతాన్ని గ్రహిస్తాడు అని. ఇంకా ' భక్తులకు ఇతని పట్ల ఆశ అమృత అనగా నాశనరహితమైన ఆశ అని - ఎందుకంటే అది శాశ్వత ఫలం - మోక్షం - కాబట్టి.

      తొలగించండి