30 నవం, 2014

757. తేజోవృషః, तेजोवृषः, Tejovr̥ṣaḥ

ఓం తేజోవృషాయ నమః | ॐ तेजोवृषाय नमः | OM Tejovr̥ṣāya namaḥ

సర్వదాదిత్య రూపేణ వర్షణాత్ తేజసామపామ్ ।
తేజోవృష ఇతి ప్రోక్తోమహావిష్ణుర్బుధోత్తమైః ॥

ఎల్ల సమయములందును ఆదిత్య రూపమున తేజస్సులు అను జలములను వర్షించుచుండును; అదియు పరమాత్ముని రూప విశేషమే!

सर्वदादित्य रूपेण वर्षणात् तेजसामपाम् ।
तेजोवृष इति प्रोक्तोमहाविष्णुर्बुधोत्तमैः ॥

Sarvadāditya rūpeṇa varṣaṇāt tejasāmapām,
Tejovr̥ṣa iti proktomahāviṣṇurbudhottamaiḥ.

In the form of the sun, He rains the tejas or radiance which takes the form of waters; so Tejovr̥ṣaḥ.

तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥

తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥

Tejovr̥ṣo dyutidharassarvaśastrabhr̥tāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśr̥ṅgo gadāgrajaḥ ॥ 81 ॥

29 నవం, 2014

756. ధరాధరః, धराधरः, Dharādharaḥ

ఓం ధరాధరాయ నమః | ॐ धराधराय नमः | OM Dharādharāya namaḥ

అంశైరశేషైః శేషాద్యైరశేషాం ధారయన్ ధరామ్ ।
ధరాధర ఇతి ప్రోక్తో మహావిష్ణుర్బుధోత్తమైః ॥

శేషాది రూపములు కలవి అగు తన సర్వాంశముల చేతను ధరను అనగా భూమిని ధరించువాడు కనుక శ్రీ మహా విష్ణువు ధరాధరః అని నుతింపబడును.

:: శ్రీమద్భాగవతే చతుర్థ స్కన్ధే సప్తదశోఽధ్యాయః ::
అపాముపస్థే మయి నావ్యవస్థితాః ప్రజా భవానద్య రిరక్షిషుః కిల ।
స వీరమూర్తిః సమభూద్ధరాధరో యో మాం పయస్యుగ్రశరో జిఘాంససి ॥ 35 ॥

అలా పూనుకొని ఆదివరాహ రూపమును ధరియించి పాతాళములోనున్న నన్ను దయతో రక్షించి పైకి లేవనెత్తినందుకు నీకు ధరాధర అను నామము ఆపాదించబడినది...

अंशैरशेषैः शेषाद्यैरशेषां धारयन् धराम् ।
धराधर इति प्रोक्तो महाविष्णुर्बुधोत्तमैः ॥

Aṃśairaśeṣaiḥ śeṣādyairaśeṣāṃ dhārayan dharām,
Dharādhara iti prokto mahāviṣṇurbudhottamaiḥ.

Since He supports the earth by His amśās or manifestations like Ādi Śeṣa and other such, He is called Dharādharaḥ.

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे सप्तदशोऽध्यायः ::
अपामुपस्थे मयि नाव्यवस्थिताः प्रजा भवानद्य रिरक्षिषुः किल ।
स वीरमूर्तिः समभूद्धराधरो यो मां पयस्युग्रशरो जिघांससि ॥ ३५ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 17
Apāmupasthe mayi nāvyavasthitāḥ prajā bhavānadya rirakṣiṣuḥ kila,
Sa vīramūrtiḥ samabhūddharādharo yo māṃ payasyugraśaro jighāṃsasi. 35.

My dear Lord, in this way You once protected me by rescuing me from the water, and consequently Your name has been famous as Dharādhara - He who holds the planet earth...

अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।
सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥

Amānī mānado mānyo lokasvāmī trilokadhr̥k,
Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥

28 నవం, 2014

755. సత్యమేధాః, सत्यमेधाः, Satyamedhāḥ

ఓం సత్యమేధసే నమః | ॐ सत्यमेधसे नमः | OM Satyamedhase namaḥ

సత్యమేధాస్య యత్తస్మాత్ సత్యమేధా ఇతీర్యతే అదికాని దానిని అదిగా తలచనదియు, ఆవస్తువును ఆవస్తువుగా తలచు సత్యయగు ప్రజ్ఞ ఈతనికి కలదు కనుక సత్యమేధాః.

सत्यमेधास्य यत्तस्मात् सत्यमेधा इतीर्यते / Satyamedhāsya yattasmāt satyamedhā itīryate Since His intelligence is never falsified, is always true - He is known by the name Satyamedhāḥ.

अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।
सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥

Amānī mānado mānyo lokasvāmī trilokadhr̥k,
Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥

27 నవం, 2014

754. ధన్యః, धन्यः, Dhanyaḥ

ఓం ధన్యాయ నమః | ॐ धन्याय नमः | OM Dhanyāya namaḥ

ధన్య ఇత్యుచ్యతే విష్ణుర్యత్ కృతార్థస్తతో హి సః కృతార్థుడు అనగా తలచిన కోరికలు యీరేడినవాడు కనుక విష్ణువు ధన్యః అని చెప్పబడును.

धन्य इत्युच्यते विष्णुर्यत् कृतार्थस्ततो हि सः / Dhanya ityucyate viṣṇuryat kr̥tārthastato hi saḥ Since Lord Viṣṇu is kr̥tārtha or of realized purpose, He is called Dhanyaḥ.

अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।
सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥

Amānī mānado mānyo lokasvāmī trilokadhr̥k,
Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥

26 నవం, 2014

753. మేధజః, मेधजः, Medhajaḥ

ఓం మేధజాయ నమః | ॐ मेधजाय नमः | OM Medhajāya namaḥ

మేధేఽధ్వరే జాయత ఇత్యసౌ మేధజ ఉచ్యతే మేధము అనగా యజ్ఞము నందు యజ్ఞేశ్వర రూపమున జనించును.

मेधेऽध्वरे जायत इत्यसौ मेधज उच्यते / Medhe’dhvare jāyata ityasau medhaja ucyate The One who is born from Medha i.e., yajña or sacrifice is Medhajaḥ.

अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।
सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥

Amānī mānado mānyo lokasvāmī trilokadhr̥k,
Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥

25 నవం, 2014

752. సుమేధా, सुमेधा, Sumedhā

ఓం సుమేధసే నమః | ॐ सुमेधसे नमः | OM Sumedhase namaḥ

సుమేధా ఉచ్యతే విష్ణుర్మేధా ప్రజ్ఞాఽస్య శోభనా విష్ణునకు శోభనము, సర్వగ్రాహి అగు ప్రజ్ఞ కలదు కనుక సుమేధా అని కీర్తింపబడును. 

['నిత్య మచిస్ ప్రజామేధయోః' (పాణినీ 5.4.122) చే సమాసాంత ప్రత్యయముగా 'అసిచ్‍' ప్రత్యయము రాగా రూపము 'సుమేధాః' (శోభనా + మేధా = సు + మేధా + అసిచ్ = సు + మేధ్ + అస్ = సుమేధస్‍)

सुमेधा उच्यते विष्णुर्मेधा प्रज्ञाऽस्य शोभना / Sumedhā ucyate viṣṇurmedhā prajñā’sya śobhanā Since Lord Viṣṇu is with medhās or intelligence which is śobhanā i.e., auspicious and bright - He is called Sumedhā.

अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।
सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥

Amānī mānado mānyo lokasvāmī trilokadhr̥k,
Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥

24 నవం, 2014

751. త్రిలోకధృక్, त्रिलोकधृक्, Trilokadhr̥k

ఓం త్రిలోకధృషే నమః | ॐ त्रिलोकधृषे नमः | OM Trilokadhr̥ṣe namaḥ

త్రిలోకధృగితి ప్రోక్తః లోకాంస్త్రీన్ యోహ్యధారయత్ మూడు లోకములను ధరించువాడు కనుక లోకధృక్ అని నుతింపబడును.

:: పోతన భాగవతము చతుర్థ స్కంధము ::
సీ. పంకజనాభాయ సంకర్షణాయ శాం, తాయ విశ్వప్రభోధాయ భూత

సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదే, వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వి

కారాయ కర్మవిస్తారకాయ త్రయీ, పాలాయ త్రైలోక్యపాలకాయ

సోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వ, యం జ్యోతిషే దురంతాయ కర్మ
తే. సాధనాయ పురాపురుషాయ యజ్ఞ, రేతసే జీవతృప్తాయ పృథ్విరూప

కాయ లోకాయ నభస్తేఽన్తకాయ విశ్వ యోనయే విష్ణవే జిష్ణవే నమోఽస్తు (702)

లోకాత్మకమైన పద్మము నీ బొడ్డున ఉన్నది. అహంకారానికి అధిష్ఠాతవయిన సంకర్షణుడవు నీవు. నీవు శాంతుడవు. విశ్వమునకు ఉపదేశకుడవు. తన్మాత్రలకు, ఇంద్రియములకు నీవే ఆశ్రయము. నీవు అవ్యక్తుడవు. చిత్తమునకు అధిష్ఠాతవయిన వాసుదేవుడవు నీవు. నీవు విశ్వమెల్లా నిండియుండెడివాడవు. పుణ్యశరీరుడవు. నిర్వికారుడవు. కర్మములనుండి దాటించువాడవు. వేదసంరక్షకుడవు. ప్రాణ రూపమున మూడు లోకాలలో విస్తరించియుండువాడవు నీవు. నీవు మూడు లోకములకును పాలకుడవు. నీవు సోమరూపుడవు. తేజో బలములుగలవాడవు. స్వయముగా ప్రకాశించెడివాడవు. నీవు అంతములేనివాడవు. కర్మములకును సాధనమైనవాడవు. పురాణ పురుషుడవు. యజ్ఞఫల రూపుడవు. జీవ తృప్తుడవు. భూ స్వరూపుడవు. ఆకాశము నీవే. నీవు ముఖాగ్నిచేత లోకలను దహిస్తావు. నీవు సృష్టికర్తవు. విష్ణుడవు. జిష్ణుడవు. నీకు నమస్కారము.

त्रिलोकधृगिति प्रोक्तः लोकांस्त्रीन् योह्यधारयत् / Trilokadhr̥giti proktaḥ lokāṃstrīn yohyadhārayat Since He supports the three worlds, He is called Trilokadhr̥k.

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे चतुर्विंशोऽध्यायः ::
सर्वसत्त्वात्मदेहाय विशेषाय स्थवीयसे ।
नमस्त्रैलोक्यपालाय सह ओजोबलाय च ॥ ३९ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 24
Sarvasattvātmadehāya viśeṣāya sthavīyase,
Namastrailokyapālāya saha ojobalāya ca. 39.

My dear Lord, You are the gigantic universal form which contains all the individual bodies of the living entities. You are the maintainer of the three worlds, and as such You maintain the mind, senses, body, and air of life within them. I therefore offer my respectful obeisances unto You.

अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक्
सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్
సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥

Amānī mānado mānyo lokasvāmī trilokadhr̥k,
Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥

23 నవం, 2014

750. లోకస్వామీ, लोकस्वामी, Lokasvāmī

ఓం లోకస్వామినే నమః | ॐ लोकस्वामिने नमः | OM Lokasvāmine namaḥ

చతుర్దశానాం లోకానామీశ్వరత్వాజ్జనార్దనః ।
లోకస్వామీత్యుచ్యతే స పురాణైర్విద్వదుత్తమైః ॥

చతుర్దశ లోకాలకును ఈశ్వరుడగు జనార్దనుడు లోకాలకు స్వామి కనుక లోకస్వామీ అని చెప్పబడును.

:: పోతన భాగవతము ద్వితీయ స్కంధము ::
వ. వినుము. చతుర్దశలోకంబులందు మీఁది యేడు లోకంబులు శ్రీమహావిష్ణువునకుం గటిప్రదేశంబున నుండి యూర్ద్వదేహ మనియును, గ్రింది యేడు లోకంబులు జఘనంబునుండి యధోదేహ మనియునుం బలుకుదురు. ప్రపంచ శరీరుండగు భగవంతుని ముఖంబువలన బ్రహ్మకులంబును, బాహువులవలన క్షత్రియకులంబును, నూరువుల వలన వైశ్యకులంబును, బాదంబులవలన శూద్రకులంబును జనియించెనని చెప్పుదురు; భూలోకంబు గటి ప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు, మహర్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబు స్తనద్వయంబు, సనాతనంబును బ్రహ్మనివాసంబును నైన సత్యలోకంబు శిరము, జఘన ప్రదేశంబతలంబు, తొడలు వితలంబు, జానువులు సుతలంబు, జంఘలు తలాతలంబు, గుల్ఫంబులు మహీతలంబు, పదాగ్రంబులు రసాతలంబు, పాదతలంబు పాతాళంబు నని (లోకమయుంగా) భావింతురు... (89)

ఈ పదునాలుగు లోకాలలోనూ పై యేడు లోకాలును శ్రీ మహావిష్ణువునకు నడుమునుండి పై శరీరము. క్రింది యేడు లోకములును నడుము నుండి క్రింది శరీరము. ప్రపంచమే భగవంతుని శరీరము. ఆయన ముఖమునుండి బ్రహ్మ కులము, బాహువులనుండి క్షత్రియ కులము, తొడల నుండి వైశ్యకులము, పాదముల నుండి శూద్ర కులము పుట్టినవని వర్ణించెదరు.

ఆ మహా విష్ణువునకు కటి స్థలము భూలోకము (1), నాభి భువర్లోకము (2), హృదయము సువర్లోకము (3), వక్షము మహర్లోకము (4), కంఠము జనలోకము (5), స్తనములు తపోలోకము (6), శిరస్సు సనాతనమైన బ్రహ్మ నివసించెడి సత్య లోకము (7), జఘనము అతలము (8), తొడలు వితలము (9), మోకాళ్ళు సుతలము (10), పిక్కలు తలాతలము (11), చీలమండలము మహాతలము (12), కాలి మునివేళ్ళు రసాతలము (13), అరికాలు పాతాళము (14). ఈ కారణముగా ఆయనను లోకమయుడు అని భావించెదరు.

चतुर्दशानां लोकानामीश्वरत्वाज्जनार्दनः ।
लोकस्वामीत्युच्यते स पुराणैर्विद्वदुत्तमैः ॥

Caturdaśānāṃ lokānāmīśvaratvājjanārdanaḥ,
Lokasvāmītyucyate sa purāṇairvidvaduttamaiḥ.

As Lord Janārdana is the Lord of fourteen worlds, He is aptly called Lokasvāmī.

:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे पञ्चमोऽध्यायः ::
यस्येहावयवैर्लोकान्कल्पयन्ति मनीषिणः ।
कट्यादिभिरधः सप्त सप्तोर्ध्वं जघनादिभिः ॥ ३६ ॥
पुरुषस्य मुखं ब्रह्म क्षत्रमेतस्य बाहवः ।
ऊर्वोर्वैश्यो भगवतः पद्भ्यां शूद्रो व्यजायत ॥ ३७ ॥
भूर्लोकः कल्पितः पद्भ्यां भुवर्लोकोऽस्य नाभितः ।
हृदा स्वर्लोक उरसा महर्लोको महात्मनः ॥ ३८ ॥
ग्रीवायां जनलोकोऽस्य तपोलोकः स्तनद्वयात् ।
मूर्धभिः सत्यलोकस्तु ब्रह्मलोकः सनातनः ॥ ३९ ॥
तत्कट्यां चातलं कॢप्तमूरुभ्यां वितलं विभोः ।
जानुभ्यां सुतलं शुद्धं जङ्घाभ्यां तु तलातलम् ॥ ४० ॥
महातलं तु गुल्फाभ्यां प्रपदाभ्यां रसातलम् ।
पातालं पादतलत इति लोकमयः पुमान् ॥ ४१ ॥

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 5
Yasyehāvayavairlokānkalpayanti manīṣiṇaḥ,
Kaṭyādibhiradhaḥ sapta saptordhvaṃ jaghanādibhiḥ. 36.
Puruṣasya mukhaṃ brahma kṣatrametasya bāhavaḥ,
Ūrvorvaiśyo bhagavataḥ padbhyāṃ śūdro vyajāyata. 37.
Bhūrlokaḥ kalpitaḥ padbhyāṃ bhuvarloko’sya nābhitaḥ,
Hr̥dā svarloka urasā maharloko mahātmanaḥ. 38.
Grīvāyāṃ janaloko’sya tapolokaḥ stanadvayāt,
Mūrdhabhiḥ satyalokastu brahmalokaḥ sanātanaḥ. 39.
Tatkaṭyāṃ cātalaṃ kḷuptamūrubhyāṃ vitalaṃ vibhoḥ,
Jānubhyāṃ sutalaṃ śuddhaṃ jaṅghābhyāṃ tu talātalam. 40.
Mahātalaṃ tu gulphābhyāṃ prapadābhyāṃ rasātalam,
Pātālaṃ pādatalata iti lokamayaḥ pumān. 41.

Great philosophers imagine that the complete planetary systems in the universe are displays of the different upper and lower limbs of the universal body of the Lord.

The brāhmaṇas represent His mouth, the kṣatriyas His arms, the vaiśyas His thighs, and the śūdras are born of His legs.

The lower planetary systems, up to the limit of the earthly stratum (1), are said to be situated in His legs. The middle planetary systems, beginning from Bhuvarloka (2), are situated in His navel. And the still higher planetary systems, occupied by the gods (3) and emancipated sages and saints (4), are situated in the chest of the Supreme Lord.

From the forefront of the chest up to the neck of the universal form of the Lord are situated the planetary systems named Janaloka (5) and Tapoloka (6), whereas Satyaloka (7), the topmost planetary system, is situated on the head of the form. The spiritual planets, however, are eternal.

My dear son Nārada, know from me that there are seven lower planetary systems out of the total fourteen. The first planetary system, known as Atala (8), is situated on the waist; the second, Vitala (9), is situated on the thighs; the third, Sutala (10), on the knees; the fourth, Talātala (11), on the shanks; the fifth, Mahātala (12), on the ankles; the sixth, Rasātala (13), on the upper portion of the feet; and the seventh, Pātāla (14), on the soles of the feet. Thus the virāṭ form of the Lord is full of all planetary systems.

अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।
सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥

Amānī mānado mānyo lokasvāmī trilokadhr̥k,
Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥

22 నవం, 2014

749. మాన్యః, मान्यः, Mānyaḥ

ఓం మాన్యాయ నమః | ॐ मान्याय नमः | OM Mānyāya namaḥ

సర్వేశ్వరత్వాద్ యో మాన్యైః సర్వైరిన్ద్రాదిభిర్యతః ।
మాననీయః పూజనీయస్త స్మాన్మాన్య ఇతీర్యతే ॥

తాను సర్వాత్మకుడు అనగా సర్వమును తన రూపే అగువాడు కావున సర్వులచే ఆదరింపదగినవాడు కనుక మాన్యః.

:: శ్రీమద్రామాయణే అరణ్యకాణ్డే ద్వాదశస్సర్గః ::
రాజా సర్వస్య లోకస్య ధర్మచారీ మహారథః ।
పూజనీయశ్చ మాన్యశ్చ భవాన్ ప్రాప్తః ప్రియాతిథిః ॥ 30 ॥

ఓ రామా! నీవు సమస్త ప్రజలకును రాజువు. ధర్మ నిరతుడవు. మహా యోధుడవు. నీవు మాన్యుడవు, పూజ్యుడవు. నేడు మాకు ప్రియమైన అతిథివి.

सर्वेश्वरत्वाद् यो मान्यैः सर्वैरिन्द्रादिभिर्यतः ।
माननीयः पूजनीयस्त स्मान्मान्य इतीर्यते ॥

Sarveśvaratvād yo mānyaiḥ sarvairindrādibhiryataḥ,
Mānanīyaḥ pūjanīyasta smānmānya itīryate.

As He is the Lord of all, He is worthy of universal worship and hence He is called Mānyaḥ.

:: श्रीमद्रामायणे अरण्यकाण्डे द्वादशस्सर्गः ::
राजा सर्वस्य लोकस्य धर्मचारी महारथः ।
पूजनीयश्च मान्यश्च भवान् प्राप्तः प्रियातिथिः ॥ ३० ॥

Śrīmad Rāmāyaṇa - Book 3, Chapter 12
Rājā sarvasya lokasya dharmacārī mahārathaḥ,
Pūjanīyaśca mānyaśca bhavān prāptaḥ priyātithiḥ. 30.

O Rāmā! You are the king of all the world, the treader in the path of righteousness, great charioteer of probity, and you are the venerable and estimable one, and you have arrived as my dear guest.

अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।
सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥

Amānī mānado mānyo lokasvāmī trilokadhr̥k,
Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥

21 నవం, 2014

748. మానదః, मानदः, Mānadaḥ

ఓం మానదాయ నమః | ॐ मानदाय नमः | OM Mānadāya namaḥ

స్వమాయయాత్మాభిమానం సర్వేషామప్య నాత్మసు ।
వాదదాతి స్వభక్తానామ్ సత్కారం మానమేనవా ॥
ఖణ్డయత్సాత్మాభిమానమ్ తత్త్వజ్ఞానామవాత్మసు ।
ఇతివా మానద ఇది శ్రీహరిః ప్రోచ్యతే బుధైః ॥

మానమును ఇచ్చువాడు, మానమును ఖండించువాడు మానదః అను రెండు వ్యుత్పత్తులును ఈ నామమునకు చెప్పదగును. ఈ రెండు వ్యుత్పత్తులకును భాష్యకారులు ఇచ్చు వివరణము ఇది.

తన మాయచే ఎల్లవారికిని అనాత్మవస్తువుల విషయమున 'ఇది ఆత్మ' అను ఆత్మాభిమానమును కలిగించుచు ఉన్నాడు.

తత్త్వ వేత్తలకు మాత్రము అనాత్మవస్తు విషయమున ఆత్మాభిమానమును ఖండించును. తన భక్తులకు మాన సత్కారమును ఇచ్చును.

स्वमाययात्माभिमानं सर्वेषामप्य नात्मसु ।
वाददाति स्वभक्तानाम् सत्कारं मानमेनवा ॥
खण्डयत्सात्माभिमानम् तत्त्वज्ञानामवात्मसु ।
इतिवा मानद इदि श्रीहरिः प्रोच्यते बुधैः ॥

Svamāyayātmābhimānaṃ sarveṣāmapya nātmasu,
Vādadāti svabhaktānām satkāraṃ mānamenavā.
Khaṇḍayatsātmābhimānam tattvajñānāmavātmasu,
Itivā mānada idi śrīhariḥ procyate budhaiḥ.

The name Mānadaḥ can be interpreted either as 'causes pride' or 'cuts off pride.' Scholars provide below reasoning to support the two possibilities.

By the power of His māya, He causes attachment as to the ātman to things which are not ātman.

He cuts off from the knowers of the Truth the thought of the ātman in what are not the ātman. He confers māna or prestige on His devotees.

अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।
सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥

Amānī mānado mānyo lokasvāmī trilokadhr̥k,
Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥

20 నవం, 2014

747. అమానీ, अमानी, Amānī

ఓం అమానినే నమః | ॐ अमानिने नमः | OM Amānine namaḥ

అమానీతి హరిః ప్రోక్తః స్వచ్ఛసంవేదనాకృతేః ।
అనాత్మవస్తుష్వాత్మాభిమానో నాస్తస్య యద్ధరేః ॥

మానము అనగా అనాత్మ వస్తువులను ఆత్మనుగా తలచు భ్రాంతి లేని వాడు అనాత్మ. నిర్విషయకమగు సంవేదనము తన స్వస్వరూపముగా కల ఈ పరమాత్మునకు 'ఇది ఆత్మ' అను అభిమానము ఉండదు కనుక అనాత్మ.

अमानीति हरिः प्रोक्तः स्वच्छसंवेदनाकृतेः ।
अनात्मवस्तुष्वात्माभिमानो नास्तस्य यद्धरेः ॥

Amānīti hariḥ proktaḥ svacchasaṃvedanākr̥teḥ,
Anātmavastuṣvātmābhimāno nāstasya yaddhareḥ.

The One who has no pride is Amānī. As He is of the form of pure consciousness, He has no leaning towards things which are not the ātma.

अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।
सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥

Amānī mānado mānyo lokasvāmī trilokadhr̥k,
Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥

19 నవం, 2014

746. చలః, चलः, Calaḥ

ఓం చలాయ నమః | ॐ चलाय नमः | OM Calāya namaḥ

వాయు రూపేణ చలతీత్యసౌ చల ఇతీర్యతే వాయు రూపమున చలించుచుండును కనుక చలః.

वायु रूपेण चलतीत्यसौ चल इतीर्यते / Vāyu rūpeṇa calatītyasau cala itīryate Since He moves in the form of wind, He is called Calaḥ.

सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।
वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥

Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,
Vīrahā viṣamaśśūnyo ghr̥tāśīracalaścalaḥ ॥ 79 ॥

18 నవం, 2014

745. అచలః, अचलः, Acalaḥ

ఓం అచలాయ నమః | ॐ अचलाय नमः | OM Acalāya namaḥ

నస్వరూపాత్ నసామర్థ్యాత్ నచ జ్ఞానాదికాద్గుణాత్ ।
చలనం విద్యతేఽస్యేత్యచల ఇత్యుచ్యతే హరిః ॥

పరమాత్ముడు తన స్వరూపమునుండి కాని, సామర్థ్యమునుండి కాని, జ్ఞానాది గుణముల నుండి కాని చలనమునందడు కావున 'అచలః' అనబడును.

:: శ్రీమద్రామాయణే అరణ్యకాణ్డే పఞ్చవింశస్సర్గః ::
స తైః ప్రహరణైర్ఘోరైః భిన్నగాత్రో న వివ్యథే ।
రామః ప్రదీప్తైర్బహుభిః వజ్రైరివ మహాచలః ॥ 13 ॥

అగ్ని జ్వాలలవలె వెలుగులను విరజిమ్ముచున్న వజ్రాయుధములు ఎంతగా ఖండించుచున్నను నిశ్చలముగానుండెడి మహా పర్వతమువలె ఆ రాక్షసులు తీవ్రములైన ఆయుధములచే తన శరీరమును ఎంతగా గాయ పరచినను, శ్రీ రాముడు ఏ మాత్రము వ్యథ చెందలేదు.

नस्वरूपात् नसामर्थ्यात् नच ज्ञानादिकाद्गुणात् ।
चलनं विद्यतेऽस्येत्यचल इत्युच्यते हरिः ॥

Nasvarūpāt nasāmarthyāt naca jñānādikādguṇāt,
Calanaṃ vidyate’syetyacala ityucyate hariḥ.

Since the Lord does not stray from His nature, power, wisdom and other qualities - He is called Acalaḥ.

:: श्रीमद्रामायणे अरण्यकाण्डे पञ्चविंशस्सर्गः ::
स तैः प्रहरणैर्घोरैः भिन्नगात्रो न विव्यथे ।
रामः प्रदीप्तैर्बहुभिः वज्रैरिव महाचलः ॥ १३ ॥

Śrīmad Rāmāyaṇa Book III, Chapter 25
Sa taiḥ praharaṇairghoraiḥ bhinnagātro na vivyathe,
Rāmaḥ pradīptairbahubhiḥ vajrairiva mahācalaḥ. 13.

As his body is gashed with those gruesome assault weapons - Rama is not enfeebled, as like an enormous mountain that can withstand even if battered by very many highly blazing thunderbolts of Indra.

सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।
वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥

Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,
Vīrahā viṣamaśśūnyo ghr̥tāśīracalaścalaḥ ॥ 79 ॥

17 నవం, 2014

744. ఘృతాశీః, घृताशीः, Ghr̥tāśīḥ

ఓం ఘృతాశీశాయ నమః | ॐ घृताशीशाय नमः | OM Ghr̥tāśīśāya namaḥ

ఘృతా విగలితా అస్యహ్యాశిషః ప్రార్థనా యతః ।
తతో ఘృతాశిరిత్యుక్తో విష్ణుర్విబుధ సత్తమైః ॥

తన నుండి జారిపోయిన ఆశీస్సులు లేదా కోరికలు కలవాడు. అనగా ఈతడు సంపూర్ణ కాముడు కావున ఈతనికి ఏ కోరికలును లేవు కనుక ఘృతాశీః.

घृता विगलिता अस्यह्याशिषः प्रार्थना यतः ।
ततो घृताशिरित्युक्तो विष्णुर्विबुध सत्तमैः ॥

Ghr̥tā vigalitā asyahyāśiṣaḥ prārthanā yataḥ,
Tato ghr̥tāśirityukto viṣṇurvibudha sattamaiḥ.

All blessings that grant desires melted away from Him since He has no desires. This is why He is called Ghr̥tāśīḥ.

सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।
वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥

Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,
Vīrahā viṣamaśśūnyo ghr̥tāśīracalaścalaḥ ॥ 79 ॥

16 నవం, 2014

743. శూన్యః, शून्यः, Śūnyaḥ

ఓం శూన్యాయ నమః | ॐ शून्याय नमः | OM Śūnyāya namaḥ

సర్వ విశేష రహితః శూన్యవత్ శూన్య ఉచ్యతే శూన్యము వంటివాడు. ఏలయన - పరమాత్ముడు సర్వ విశేష రహితుడు. అతనిని గుర్తించుటకు సహకారులగు ఏ విశేషములును లేదా ఇతర వస్తువులనుండి వేరు పరచు భేదక లక్షణములును లేవు. ఇతని కంటె ఇతరులు మరి ఎవ్వరును లేరు కదా!

सर्व विशेष रहितः शून्यवत् शून्य उच्यते / Sarva viśeṣa rahitaḥ śūnyavat śūnya ucyate As He is devoid of all qualities, He is Śūnyaḥ, as it were. There are no attributes to uniquely identify Him. There are no qualities that make Him indifferent to any other thing; hence He is Śūnyaḥ.

सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।
वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥

Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,
Vīrahā viṣamaśśūnyo ghr̥tāśīracalaścalaḥ ॥ 79 ॥

15 నవం, 2014

742. విషమః, विषमः, Viṣamaḥ

ఓం విషమాయ నమః | ॐ विषमाय नमः | OM Viṣamāya namaḥ

స సర్వ విలక్షణత్వాద్ యత్సమోనైవ విద్యతే ।
తస్మాద్ విషమ ఇత్యుక్తో వేదవిద్యావిశారదైః ।
న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోన్య ఇతి భారతాత్ ॥

తనకు సములగు వారి నుండి వేరగువాడు. అనగా ఈతనితో సములెవ్వరును లేరు. పరస్పరము సములుగానుండు వారందరకంటె విలక్షణుడు. అనగా ఈతనికి సములు ఎవ్వరును లేరు.

:: శ్రీమద్భగవద్గీత - విశ్వరూప సన్దర్శన యోగము ::
పితాఽసి లోకస్య చరాచరస్య త్వమ్స్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ ।
న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో లోకత్రయేఽప్యప్రతిమప్రభావ ॥ 43 ॥

సాటిలేని ప్రభావముగల ఓ కృష్ణమూర్తి! మీరు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమునంతకును తండ్రి అయియున్నారు. మఱియు మీరు పూజ్యులును, సర్వ శ్రేష్ఠులగు గురువులును అయి వెలయుచున్నారు. ముల్లోకములందును మీతో సమానమైనవారు లేరు. ఇక మిమ్ములను మించినవారు మఱియొకరెట్లుండగలరు?

स सर्व विलक्षणत्वाद् यत्समोनैव विद्यते ।
तस्माद् विषम इत्युक्तो वेदविद्याविशारदैः ।
न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोन्य इति भारतात् ॥

Sa sarva vilakṣaṇatvād yatsamonaiva vidyate,
Tasmād viṣama ityukto vedavidyāviśāradaiḥ,
Na tvatsamo’styabhyadhikaḥ kutonya iti bhāratāt.

As He is different from everything His equal, He has no equal. He is different from all those that are mutually equal and hence He is with no equals.

:: श्रीमद्भगवद्गीत - विश्वरूप सन्दर्शन योग ::
पिताऽसि लोकस्य चराचरस्य त्वम्स्य पूज्यश्च गुरुर्गरीयान् ।
न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ॥ ४३ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 11
Pitā’si lokasya carācarasya tvamsya pūjyaśca gururgarīyān,
Na tvatsamo’styabhyadhikaḥ kuto’nyo lokatraye’pyapratimaprabhāva. 43.

You are the Father of all beings moving and non-moving; to this world You are worthy of worship, the Teacher, and greater than a teacher. There is none equal to You; how at all can there be anyone greater even in all the three worlds, O You of unrivaled power?

सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।
वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥

Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,
Vīrahā viṣamaśśūnyo ghr̥tāśīracalaścalaḥ ॥ 79 ॥

14 నవం, 2014

741. వీరహా, वीरहा, Vīrahā

ఓం వీరఘ్నే నమః | ॐ वीरघ्ने नमः | OM Vīraghne namaḥ

ధర్మత్రాయణాయ యో వీరానసురప్రవరాన్హరిః ।
హన్తీతి వీరహేత్యుక్తః పురాణార్థశారదైః ॥

ధర్మ రక్షణమునకై వీరులగు అసుర ముఖ్యులను చంపువాడు కనుక హరికి వీరహా అను నామము కలదు.

166. వీరహా, वीरहा, Vīrahā

धर्मत्रायणाय यो वीरानसुरप्रवरान्हरिः ।
हन्तीति वीरहेत्युक्तः पुराणार्थशारदैः ॥

Dharmatrāyaṇāya yo vīrānasurapravarānhariḥ,
Hantīti vīrahetyuktaḥ purāṇārthaśāradaiḥ.

For the protection of dharma, He kills the valiant asura chiefs and hence He is called Vīrahā.

166. వీరహా, वीरहा, Vīrahā

सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।
वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥

Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,
Vīrahā viṣamaśśūnyo ghr̥tāśīracalaścalaḥ ॥ 79 ॥

13 నవం, 2014

740. చన్దనాఙ్గది, चन्दनाङ्गदि, Candanāṅgadi

ఓం చన్దనాఙ్గదినే నమః | ॐ चन्दनाङ्गदिने नमः | OM Candanāṅgadine namaḥ

భూషితశ్చన్దనైః సమ్యగాహ్లాదిభిరనుత్తమైః ।
కేయూరైరఙ్గదైర్విష్ణురుచ్యతే చన్దనాఙ్గదీ ॥

ఈతనికి ఆహ్లాదకరములగు భుజకీర్తులు అను ఆభరణములు కలవు. వానిచే అలంకరించబడియుండువాడు కనుక ఆ పరమాత్మునకు చందనాంగది అను నామము కలదు.

भूषितश्चन्दनैः सम्यगाह्लादिभिरनुत्तमैः ।
केयूरैरङ्गदैर्विष्णुरुच्यते चन्दनाङ्गदी ॥

Bhūṣitaścandanaiḥ samyagāhlādibhiranuttamaiḥ,
Keyūrairaṅgadairviṣṇurucyate candanāṅgadī.

His arms are ornamented by Keyūras or armlets which are attractive and pleasing and hence He is called Candanāṅgadi.

सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी
वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥

Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,
Vīrahā viṣamaśśūnyo ghr̥tāśīracalaścalaḥ ॥ 79 ॥

12 నవం, 2014

739. వరాఙ్గః, वराङ्गः, Varāṅgaḥ

ఓం వరాఙ్గాయ నమః | ॐ वराङ्गाय नमः | OM Varāṅgāya namaḥ

వరాణి శోభనాన్యఙ్గాన్యస్యేతి పరమేశ్వరః ।
వరఙ్గ ఇత్యయం విష్ణురుచ్యతే విబుధోత్తమైః ॥

వరములు - శ్రేష్టములు, చూడ సుందరములును, శుభకరములును అగు అంగములు ఈతనికి కలవుగనుక వరాంగః.

वराणि शोभनान्यङ्गान्यस्येति परमेश्वरः ।
वरङ्ग इत्ययं विष्णुरुच्यते विबुधोत्तमैः ॥

Varāṇi śobhanānyaṅgānyasyeti parameśvaraḥ,
Varaṅga ityayaṃ viṣṇurucyate vibudhottamaiḥ.

Since His limbs are vara i.e., beautiful, excellent, He is called Varāṅgaḥ.

सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।
वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥

Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,
Vīrahā viṣamaśśūnyo ghr̥tāśīracalaścalaḥ ॥ 79 ॥

11 నవం, 2014

738. హేమాఙ్గః, हेमाङ्गः, Hemāṅgaḥ

ఓం హేమాఙ్గాయ నమః | ॐ हेमाङ्गाय नमः | OM Hemāṅgāya namaḥ

హేమేవాఙ్గం వపురస్యేత్యయం హేమాఙ్గ ఉచ్యతే ।
హిరణ్య వర్ణః పురుషః ఇత్యాదిశ్రుతివాక్యతః ॥

బంగరు వంటి శరీరము ఉన్నవాడు గనుక విష్ణువు హేమాంగః. 'యదా పశ్యః పశ్యతే రుక్మవర్ణమ్‍' (ఛాన్దోగ్యోపనిషత్ 1.6.6) ఆదిత్యునియందు మండలాంతర్భాగమున ఏ ఈ హిరణ్మయ పురుషుడు కలడో' అను శ్రుతి వచనము ఈ విషయమున ప్రమాణము.

हेमेवाङ्गं वपुरस्येत्ययं हेमाङ्ग उच्यते ।
हिरण्य वर्णः पुरुषः इत्यादिश्रुतिवाक्यतः ॥

Hemevāṅgaṃ vapurasyetyayaṃ hemāṅga ucyate,
Hiraṇya varṇaḥ puruṣaḥ ityādiśrutivākyataḥ.

Since His body is like gold, He is called Hemāṅgaḥ. 'यदा पश्यः पश्यते रुक्मवर्णम्' / 'Yadā paśyaḥ paśyate rukmavarṇam' (Chāndogyopaniṣat 1.6.6) 'The golden Person in the disc of the sun' from śruti is a reference.

सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।
वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥

Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,
Vīrahā viṣamaśśūnyo ghr̥tāśīracalaścalaḥ ॥ 79 ॥

10 నవం, 2014

737. సువరణవర్ణః, सुवरणवर्णः, Suvaraṇavarṇaḥ

ఓం సువర్ణవర్ణాయ నమః | ॐ सुवर्णवर्णाय नमः | OM Suvarṇavarṇāya namaḥ

సువర్ణస్యేవ వర్ణోఽస్య విష్ణోర్భగవతో హరేః ।
ఇతి సువర్ణవర్ణస్స యథా పశ్య ఇతి శ్రుతేః ॥

బంగారపు వన్నెవంటి వన్నె కలవాడుగనుక విష్ణుదేవుడు సువర్ణవర్ణః అని చెప్పబడును.

:: ముణ్డకోపనిషత్ తృతీయముణ్డకే ప్రథమః ఖణ్డః ::
యదా పశ్యః పశ్యతే రుక్మవర్ణం కర్తారమీశం పురుషం బ్రహ్మయోనిమ్ ।
తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరఞ్జనః పరమం సామ్య ముపైతి ॥ 3 ॥

సృష్టికర్తకుగూడ కారణభూతుడైన ఆ పరమాత్మను - విద్వాంసుడు బంగారరపు వన్నెతో తేజః స్వరూపునిగా ఎప్పుడు దర్శించుచున్నాడో, అప్పుడా బ్రహ్మజ్ఞాని పుణ్యపాప బంధములనుండి విముక్తుడై నిరంజనుడై సర్వోత్తమమైన ఆ సమాన స్థితిని పొందుచున్నాడు.

सुवर्णस्येव वर्णोऽस्य विष्णोर्भगवतो हरेः ।
इति सुवर्णवर्णस्स यथा पश्य इति श्रुतेः ॥

Suvarṇasyeva varṇo’sya viṣṇorbhagavato hareḥ,
Iti suvarṇavarṇassa yathā paśya iti śruteḥ.

Since He is with the hue of gold, Lord Viṣṇu is called Suvaraṇavarṇaḥ.

:: मुण्डकोपनिषत् तृतीयमुण्डके प्रथमः खण्डः ::
यदा पश्यः पश्यते रुक्मवर्णं कर्तारमीशं पुरुषं ब्रह्मयोनिम् ।
तदा विद्वान् पुण्यपापे विधूय निरञ्जनः परमं साम्य मुपैति ॥ ३ ॥

Muṇḍakopaniṣat - Third muṇḍaka, Canto I
Yadā paśyaḥ paśyate rukmavarṇaṃ kartāramīśaṃ puruṣaṃ brahmayonim,
Tadā vidvān puṇyapāpe vidhūya nirañjanaḥ paramaṃ sāmya mupaiti. 3.

When the seer sees the Puruṣa - the golden hued, creator,  lord and the source of inferior Brahman, then the illumined one completely shakes off both merit and demerit, becomes taintless, and attains absolute equality.

सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।
वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥

Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,
Vīrahā viṣamaśśūnyo ghr̥tāśīracalaścalaḥ ॥ 79 ॥

9 నవం, 2014

736. భక్తవత్సలః, भक्तवत्सलः, Bhaktavatsalaḥ

ఓం భక్తవత్సలాయ నమః | ॐ भक्तवत्सलाय नमः | OM Bhaktavatsalāya namaḥ

భక్త స్నేహయుక్తో విష్ణుర్భక్తవత్సల ఉచ్యతే భక్తుల విషయమున స్నేహభావము కలవాడు గనుక విష్ణునకు భక్తవత్సలః అను నామము కలదు.

भक्त स्नेहयुक्तो विष्णुर्भक्तवत्सल उच्यते / Bhakta snehayukto viṣṇurbhaktavatsala ucyate Since Lord Viṣṇu has fondness for His devotees, He is called Bhaktavatsalaḥ.

एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥

8 నవం, 2014

735. మాధవః, माधवः, Mādhavaḥ

ఓం మాధవాయ నమః | ॐ माधवाय नमः | OM Mādhavāya namaḥ

జాతత్వాన్మధుకులే సమాధవః ప్రోచ్యతే బుధైః 'మధువు' అనునతని వంశమున జనించినవాడుగనుక మాధవః.

72. మాధవః, माधवः, Mādhavaḥ
167. మాధవః, माधवः, Mādhavaḥ

जातत्वान्मधुकुले समाधवः प्रोच्यते बुधैः / Jātatvānmadhukule samādhavaḥ procyate budhaiḥ Since (in one of the incarnations) He is born in the family of Madhu, He is also has a name of Mādhavaḥ.

72. మాధవః, माधवः, Mādhavaḥ
167. మాధవః, माधवः, Mādhavaḥ
एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥

7 నవం, 2014

734. లోకనాథః, लोकनाथः, Lokanāthaḥ

ఓం లోకనాథాయ నమః | ॐ लोकनाथाय नमः | OM Lokanāthāya namaḥ

నాథ్యతే యాచ్యతే లోకైః విష్ణురేవ సనాతనః ।
లోకాం స్తపతి వా శాస్తే లోకానామిష్ట ఇత్యుత ।
లోకనాథ ఇతి సద్భిః ప్రోచ్యతే తత్త్వవేదిభిః ॥

నాథృః, నాధృః అను ధాతువులకు యాచించు, ఉపతపింపజేయు, ప్రభుత్వమును చూపు, ఆశాసించు అను అర్థములు ఉన్నట్లు పాణినీయధాతుపాఠమువలన తెలియుచుండుటచే - లోకనాథః అను నామమునకు లోకుల మేలు కోరువాడు, లోకములచేత ప్రార్థింపబడువాడు, లోకములను - అందలి దుష్కర్ములను ఉపతపింపజేయువాడు, లోకముల విషయమున తన ఈశత్వమును, ప్రభుత్వమును వర్తింపజేయువాడు అను అర్థములు చెప్పవచ్చును.

नाथ्यते याच्यते लोकैः विष्णुरेव सनातनः ।
लोकां स्तपति वा शास्ते लोकानामिष्ट इत्युत ।
लोकनाथ इति सद्भिः प्रोच्यते तत्त्ववेदिभिः ॥

Nāthyate yācyate lokaiḥ viṣṇureva sanātanaḥ,
Lokāṃ stapati vā śāste lokānāmiṣṭa ityuta,
Lokanātha iti sadbhiḥ procyate tattvavedibhiḥ.

Because He is sought by the people of the world, or besought by them or because He torments (evil doers) them or blesses them or rules over them, He is called Lokanāthaḥ.

एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥

6 నవం, 2014

733. లోకబన్ధుః, लोकबन्धुः, Lokabandhuḥ

ఓం లోకబన్ధవే నమః | ॐ लोकबन्धवे नमः | OM Lokabandhave namaḥ

విశ్వాధారభూతేఽస్మిన్ సర్వేలోకాస్సవాసవాః ।
బధ్యన్త ఇతి లోకానాం బన్ధుస్తజ్జనకత్వతః ॥
జనకోపమే కుత్రాపి బన్ధుర్నాస్తీతి వా హరిః ।
లోకానాం బన్ధు కృత్యం తత్యచ్ఛృతి స్మృతిలక్షణమ్ ॥
హితాహితోపదేశాంస్తాన్ కృతవానితి స ప్రభుః ।
లోకబన్ధురితి ప్రోక్తః శ్రుతి స్మృతివిశారదైః ॥

ఏదియేకాని దేనియందు బంధించబడునో అట్టిది 'బంధుః' అనబడును. లోకములకు బంధువు అనగా లోకములు ఈతనియందే బంధింపబడి ఆతనినాశ్రయించియున్నవి. లేదా పరమాత్ముడు లోకములకెల్ల తండ్రి కావున తండ్రిని పోలు బంధువు లోకములో మరి యెవ్వడు నుండడు కావునను ఆతడు 'లోకబంధుడే'. లేదా పరమాత్ముడు తాను లోకములకు బంధువుగా చేయదగు పనిని ఆచరించెను. హితాఽహితోపదేశమును చేయగల శ్రుతి స్మృత్యాదిరూప వాఙ్మయమును నిర్మించెను. కావున భగవానుడు లోక బంధుడే.

विश्वाधारभूतेऽस्मिन् सर्वेलोकास्सवासवाः ।
बध्यन्त इति लोकानां बन्धुस्तज्जनकत्वतः ॥
जनकोपमे कुत्रापि बन्धुर्नास्तीति वा हरिः ।
लोकानां बन्धु कृत्यं तत्यच्छृति स्मृतिलक्षणम् ॥
हिताहितोपदेशांस्तान् कृतवानिति स प्रभुः ।
लोकबन्धुरिति प्रोक्तः श्रुति स्मृतिविशारदैः ॥

Viśvādhārabhūte’smin sarvelokāssavāsavāḥ,
Badhyanta iti lokānāṃ bandhustajjanakatvataḥ.
Janakopame kutrāpi bandhurnāstīti vā hariḥ,
Lokānāṃ bandhu kr̥tyaṃ tatyacchr̥ti smr̥tilakṣaṇam.
Hitāhitopadeśāṃstān kr̥tavāniti sa prabhuḥ,
Lokabandhuriti proktaḥ śruti smr̥tiviśāradaiḥ.

All the worlds are bound to Him who is their support. So Lokabandhuḥ.

As He is the Father of all the worlds and as there is no bandhu comparable to the father, He is Lokabandhuḥ.

Or as He does what a bandhu does i.e., giving wholesome advice, prescribing the good and prohibiting the evil in the form of śruti and smr̥ti. So Lokabandhuḥ.

एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥

5 నవం, 2014

732. పదమనుత్తమమ్, पदमनुत्तमम्, Padamanuttamam

ఓం పదమనుత్తమాయ నమః | ॐ पदमनुत्तमाय नमः | OM Padamanuttamāya namaḥ

పద్యతే గమ్యతే బ్రహ్మ ముముక్షుభిరితీర్యతే ।
పదమిత్యుత్తమం నాస్తి బ్రహ్మణస్తదనుత్తమమ్ ।
పదమనుత్తమమితి నామైకం సంవిశేషణమ్ ॥

మోక్షమును కోరువారిచే చేరబడును కావున 'పదమ్‍' అనబడును. దేనికంటె మరి గొప్పది లేదో అట్టిది 'అనుత్తమమ్‍'. అన్నిటికంటెను గొప్పదియు, ముముక్షువులకు చేరునదియు అగు స్తానమో అది పదమనుత్తమమ్‍; అది పరమాత్మ తత్త్వమే.

पद्यते गम्यते ब्रह्म मुमुक्षुभिरितीर्यते ।
पदमित्युत्तमं नास्ति ब्रह्मणस्तदनुत्तमम् ।
पदमनुत्तममिति नामैकं संविशेषणम् ॥

Padyate gamyate brahma mumukṣubhiritīryate,
Padamityuttamaṃ nāsti brahmaṇastadanuttamam,
Padamanuttamamiti nāmaikaṃ saṃviśeṣaṇam.

Padam means the state that is attained by those who desire salvation. That beyond which there is not a superior is anuttamam. Padamanuttamam is one Name wherein the second word is adjective - The Supreme Abode.
एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम्
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥

4 నవం, 2014

731. తద్, तद्, Tad

ఓం తస్మై నమః | ॐ तस्मै नमः | OM Tasmai namaḥ

తనోతీతి బ్రహ్మతదిత్యుచ్యతే విబుధోత్తమైః ।
ఓం తత్సతిది నిర్దేశ ఇతి గీతా ప్రమాణతః ॥

విస్తారమునందునది. విస్తారమునందిచునది. బ్రహ్మము తానే ప్రపంచ రూపమున వృద్ధినందును. ప్రాణులను వృద్ధినందిచును. 'ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధః స్మృతః' (శ్రీమద్భగవద్గీత 17.23) - 'బ్రహ్మమునకు సంబంధించిన నిర్దేశము అనగా పరమాత్మ శబ్దముతో నిర్దేశము ఓం - తత్ - సత్ అని మూడు విధములనుండునని విద్వాంసులచే తలచబడుచున్నది.'

तनोतीति ब्रह्मतदित्युच्यते विबुधोत्तमैः ।
ॐ तत्सतिदि निर्देश इति गीता प्रमाणतः ॥

Tanotīti brahmatadityucyate vibudhottamaiḥ,
Oṃ tatsatidi nirdeśa iti gītā pramāṇataḥ.

Tanoti means pervades; So, Brahman which envelops the entire universe vide the Lord's statement 'ॐ तत्सदिति निर्देशो ब्रह्मण स्त्रिविधः स्मृतः / Oṃ tatsaditi nirdeśo brahmaṇa strividhaḥ smr̥taḥ' (Śrīmad Bhagavad Gīta 17.23) - 'The indicatory syllables of Brahman are threefold as Om Tat Sat.'

एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥

3 నవం, 2014

730. యత్, यत्, Yat

ఓం యస్మై నమః | ॐ यस्मै नमः | OM Yasmai namaḥ

యచ్ఛబ్దేన స్వతస్సిద్ధవస్తూద్దేశ ప్రవాచినా ।
బ్రహ్మ నిర్దిశ్యత ఇతి యద్యతో వేతి వేదతః ॥

'యత్‍' అను సంస్కృతసర్వనామము "ఏది కలదో అది" అని తెలుపుచు, ఇతః పూర్వమే స్వతః సిద్ధమగు వస్తువును ఉద్దేశించి చెప్పుటను తెలుపును. బ్రహ్మ తత్త్వము స్వతః సిద్ధ వస్తువే కదా! కావున పరమాత్మునకు 'యత్‍' అను నామము చెల్లును.

यच्छब्देन स्वतस्सिद्धवस्तूद्देश प्रवाचिना ।
ब्रह्म निर्दिश्यत इति यद्यतो वेति वेदतः ॥

Yacchabdena svatassiddhavastūddeśa pravācinā,
Brahma nirdiśyata iti yadyato veti vedataḥ.

'Yat' is generally used to indicate what is existent, a siddha vastu. By it Brahman is referred to. So Yat means Brahman that is, the Lord.

एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥

2 నవం, 2014

729. కిమ్, किम्, Kim

ఓం కస్మై నమః | ॐ कस्मै नमः | OM Kasmai namaḥ

సర్వ పురుషార్థ రూపం విచార్యం బ్రహ్మ కిన్న్వితి ।
కిమితి ప్రోచ్యతే సద్భిః శ్రుతి తత్త్వవిశారదైః ॥

ఏమి? ఎట్టిది? అను జిజ్ఞాసతో సర్వ పురుషార్థ రూపమగుటచే బ్రహ్మతత్త్వమే విచారణీయము కావున, పరమాత్ముని 'కిమ్' అనదగును.

सर्व पुरुषार्थ रूपं विचार्यं ब्रह्म किन्न्विति ।
किमिति प्रोच्यते सद्भिः श्रुति तत्त्वविशारदैः ॥

Sarva puruṣārtha rūpaṃ vicāryaṃ brahma kinnviti,
Kimiti procyate sadbhiḥ śruti tattvaviśāradaiḥ.

Brahman alone is to be inquired into as kim i.e., what as it is of the form of all puruṣārthas.

एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥

1 నవం, 2014

728. కః, कः, Kaḥ

ఓం కాయ నమః | ॐ काय नमः | OM Kāya namaḥ

సుఖస్వరూపిణం విష్ణుం కశబ్దః సుఖవాచకః ।
విబోధయతి తస్మాత్ సక ఇతి ప్రోచ్యతేబుధైః ।
కం బ్రహ్మేతి శ్రుతేర్విష్ణుః పరమాత్మ సనాతనః ॥

'క' అను శబ్దమునకు సుఖము అని అర్థము. పరమాత్ముడు సుఖస్వరూపుడు కావున అట్టి 'క' అను శబ్దముచే స్తుతించబడును కావున 'కః' అనబడును.

ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మేతి (ఛాందోగ్యోపనిషత్ 4.10.5) - 'ప్రాణము బ్రహ్మము, కం అనగా బ్రహ్మము, ఖం అనగా బ్రహ్మము (క, ఖ - ఈ రెండు అక్షరములు ఒకటే. క = సుఖము, ఆనందము. ఖ = ఆకాశము, హృదయాకాశము. ప్రాణము, ప్రాణమునకు ఆశ్రయమగు ఆకాశము)

सुखस्वरूपिणं विष्णुं कशब्दः सुखवाचकः ।
विबोधयति तस्मात् सक इति प्रोच्यतेबुधैः ।
कं ब्रह्मेति श्रुतेर्विष्णुः परमात्म सनातनः ॥

Sukhasvarūpiṇaṃ viṣṇuṃ kaśabdaḥ sukhavācakaḥ,
Vibodhayati tasmāt saka iti procyatebudhaiḥ,
Kaṃ brahmeti śruterviṣṇuḥ paramātma sanātanaḥ.

The sound 'ka' stands for sukha or happiness. Since the paramātma is embodiment of happiness, He is aptly praised by Kaḥ.

प्राणो ब्रह्म कं ब्रह्म खं ब्रह्मेति / Prāṇo brahma kaṃ brahma khaṃ brahmeti (Chāndogyopaniṣat 4.10.5) - The Prāṇa i.e., life force is Brahman, ka (joy) is Brahman, kha (the ākāśa) is Brahman.