31 జులై, 2014

635. కుమ్భః, कुम्भः, Kumbhaḥ

ఓం కుమ్భాయ నమః | ॐ कुम्भाय नमः | OM Kumbhāya namaḥ

కుమ్భ సమేఽస్మిన్ సమస్తం ప్రతిష్ఠిత మితేశ్వరః ।
కుమ్భ ఇత్యుచ్యతే సర్భిర్వేదవిద్యా విశారదైః ॥

కడవ వంటివాడు. కుంభమునందు నీరువలె సర్వమును ఈతనియందు ప్రతిష్ఠితముగా అనగా నిలుకడనందినదిగా నున్నది.

कुम्भ समेऽस्मिन् समस्तं प्रतिष्ठित मितेश्वरः ।
कुम्भ इत्युच्यते सर्भिर्वेदविद्या विशारदैः ॥

Kumbha same’smin samastaṃ pratiṣṭhita miteśvaraḥ,
Kumbha ityucyate sarbhirvedavidyā viśāradaiḥ.

The One who is like a pot. Just like water that stays put in a jar, everything rests in Him and hence He is called Kumbhaḥ.

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

30 జులై, 2014

634. అర్చితః, अर्चितः, Arcitaḥ

ఓం అర్చితాయ నమః | ॐ अर्चिताय नमः | OM Arcitāya namaḥ

అర్చితః, अर्चितः, Arcitaḥ

సర్వలోకార్చితైశ్చాపి విరిఞ్చ్యాదిభిరర్చితః ।
ఇత్యర్చిత ఇతి ప్రోక్తః పరమాత్మా హరిర్బుధైః ॥

సర్వలోకార్చితులగు విరించాదులచే (బ్రహ్మ) కూడ అర్చించబడువాడుగనుక ఆ పరమాత్మ అర్చితః అని చెప్పబడును.

सर्वलोकार्चितैश्चापि विरिञ्च्यादिभिरर्चितः ।
इत्यर्चित इति प्रोक्तः परमात्मा हरिर्बुधैः ॥

Sarvalokārcitaiścāpi viriñcyādibhirarcitaḥ,
Ityarcita iti proktaḥ paramātmā harirbudhaiḥ.

Since the Lord is worshiped even by the likes of Viriñci or Brahma, He is known as Arcitaḥ.

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

29 జులై, 2014

633. అర్చిష్మాన్, अर्चिष्मान्, Arciṣmān

ఓం అర్చిష్మతే నమః | ॐ अर्चिष्मते नमः | OM Arciṣmate namaḥ

అర్చిష్మాన్, अर्चिष्मान्, Arciṣmān

అర్చిష్మన్తే యదీయేన స్వర్చిషా భాస్కరాదయః ।
స విష్ణురేవ భగవాన్ ముఖ్యోఽర్చిష్మా నితీర్యతే ॥

మహత్త్వముగల అర్చిస్సులు అనగా కిరణములు, జ్వాలలు ఈతనికి కలవు. ఎవని అర్చిస్సులచే చంద్ర సూర్యాదులును అర్చిష్మంతులు అగుచున్నారో, ఆ పరమాత్ముడే ముఖ్యుడగు అర్చిష్మంతుడు. ఈతని సాదృశ్యము వలననే ఇతరులు అర్చిష్మంతులనదగును.

:: శ్రీమద్భగవద్గీత క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము ::
జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే ।
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ ॥ 18 ॥

(పరబ్రహ్మము) ప్రకాశించెడు సూర్యచంద్రాగ్న్యాది పదార్థములకుగూడ ప్రకాశమునిచ్చునది. తమస్సు (అజ్ఞానము) కంటె వేఱైనదియు, జ్ఞానస్వరూపమైనదియు, తెలియదగినదియు, జ్ఞానగుణములచే పొందదగినదియు, సమస్తప్రాణులయొక్క హృదయమునందు విశేషించియున్నదియునని చెప్పబడుచున్నది.

अर्चिष्मन्ते यदीयेन स्वर्चिषा भास्करादयः ।
स विष्णुरेव भगवान् मुख्योऽर्चिष्मा नितीर्यते ॥

Arciṣmante yadīyena svarciṣā bhāskarādayaḥ,
Sa viṣṇureva bhagavān mukhyo’rciṣmā nitīryate.

From Him radiate great Arciṣ - illuminating flames, rays. He by whom the luminaries like sun, moon etc., get their luminosity is alone the preeminent Arciṣmān.

:: श्रीमद्भगवद्गीत क्षेत्रक्षेत्रज्ञविभाग योगमु ::
ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते ।
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ॥ १८ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 13
Jyotiṣāmapi tajjyotistamasaḥ paramucyate,
Jñānaṃ jñeyaṃ jñānagamyaṃ hr̥di sarvasya viṣṭhitam. 18.

That is the Light even of the lights; It is spoken as beyond darkness. It is Knowledge, the Knowable, and the Known. It exists specially in the hearts of all.

अर्चिष्मान्अर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మాన్అర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

28 జులై, 2014

632. శోకనాశనః, शोकनाशनः, Śokanāśanaḥ

ఓం శోకనాశనాయ నమః | ॐ शोकनाशनाय नमः | OM Śokanāśanāya namaḥ

శోకనాశనః, शोकनाशनः, Śokanāśanaḥ

స్మృతి మాత్రేణ భక్తానాం శోకం నాశయతీతి సః ।
శోకనాశన ఇత్యుక్తో విష్ణుర్విద్యద్భిరచ్యుతః ॥

స్మరణమాత్రముచేతనే భక్తుల శోకమును నశింపజేయువాడుగనుక శ్రీ విష్ణువు శోకనాశనహః అని కీర్తింపబడుతాడు.

स्मृति मात्रेण भक्तानां शोकं नाशयतीति सः ।
शोकनाशन इत्युक्तो विष्णुर्विद्यद्भिरच्युतः ॥

Smr̥ti mātreṇa bhaktānāṃ śokaṃ nāśayatīti saḥ,
Śokanāśana ityukto viṣṇurvidyadbhiracyutaḥ.

Since Lord Viṣṇu destroys the grief of His devotees by their mere thought of Him, He is known as Śokanāśanaḥ.

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥

27 జులై, 2014

631. విశోకః, विशोकः, Viśokaḥ

ఓం విశోకాయ నమః | ॐ विशोकाय नमः | OM Viśokāya namaḥ

విశోకః, विशोकः, Viśokaḥ

విగతశ్శోకోఽస్యహరేః మహానన్ద స్వరూపిణి ।
ఇత్యుచ్యతే స భగవాన్ విశోక ఇతి సూరిభిః ॥

ఎవని శోకము విగతమో అనగా ఎవని శోకము తొలగి దూరమై యున్నదో అట్టివాడు విశోకః. పరమానందైక రూపుడు కావున పరమాత్ముడు విశోకుడు లేదా శోకరహితుడు.

विगतश्शोकोऽस्यहरेः महानन्द स्वरूपिणि ।
इत्युच्यते स भगवान् विशोक इति सूरिभिः ॥

Vigataśśoko’syahareḥ mahānanda svarūpiṇi,
Ityucyate sa bhagavān viśoka iti sūribhiḥ.

The One who is free from  affliction is Viśokaḥ. Since the Lord is the embodiment of supreme bliss, no grief can ever afflict him and hence He is always content with joy.

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥

26 జులై, 2014

630. భూతిః, भूतिः, Bhūtiḥ

ఓం భూతయే నమః | ॐ भूतये नमः | OM Bhūtaye namaḥ

భూతిః, भूतिः, Bhūtiḥ

భూతిస్సత్తా విభూతిర్వా విభూతీనాం నిమితత్తః ।
సర్వాసామితి వా భూతిరితి విష్ణుస్సమీర్యతే ॥

భూతిః, భవనం, సత్తా - అను మూడు పదములకును ఉనికి అని అర్థము. 'భూ' ధాతువు నుండి 'ఉనికి' అను భావార్థమున 'క్తిన్‍' ప్రత్యయముతో ఏర్పడు శబ్దము భూతిః. నిత్యమును, శుద్ధమును అగు ఉనికియే పరమాత్ముని రూపము. లేదా సర్వవిభూతులకును అనగా పరమాత్ముని రూప విశేషములైన ఐశ్వర్యములకును మూలకారణమగువాడుగనుక 'భూతిః'.

:: శ్రీమద్భగవద్గీత - మోక్షసన్న్యాస యోగము ::
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ॥ 78 ॥

ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడున్ను, ఎచట ధనుర్ధారియగు అర్జునుడున్ను ఉందురో అచట సంపదయు, విజయమున్ను, ఐశ్వర్యమున్ను, ధృడమగు నీతియు ఉండునని నా (సంజయుని) అభిప్రాయము.

भूतिस्सत्ता विभूतिर्वा विभूतीनां निमितत्तः ।
सर्वासामिति वा भूतिरिति विष्णुस्समीर्यते ॥

Bhūtissattā vibhūtirvā vibhūtīnāṃ nimitattaḥ,
Sarvāsāmiti vā bhūtiriti viṣṇussamīryate.

Bhūtiḥ, Bhavanaṃ and Sattā - these three words imply glorious existence. The root 'Bhū', which means existence or glory, when conjoined with morpheme 'ktin', the word Bhūtiḥ is derived. Eternal and pure existence is the very form of Lord. Or since from Him all kinds of opulence emanate, He is called  Bhūtiḥ.

:: श्रीमद्भगवद्गीत - मोक्षसन्न्यास योगमु ::
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम ॥ ७८ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 18
Yatra yogeśvaraḥ kr̥ṣṇo yatra pārtho dhanurdharaḥ,
Tatra śrīrvijayo bhūtiḥ dhruvā nītirmatirmama. 78.

Where there is Kr̥ṣṇa, the Lord of the yogas, and where there is Pārth (Arjuna), the wielder of the bow, there will be fortune, victory, prosperity and unfailing prudence.  Such is my (Sañjaya) conviction.

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥

25 జులై, 2014

629. భూషణః, भूषणः, Bhūṣaṇaḥ

ఓం భూషణాయ నమః | ॐ भूषणाय नमः | OM Bhūṣaṇāya namaḥ

భూషణః, भूषणः, Bhūṣaṇaḥ

స్వేచ్ఛావతారైర్బహుభిర్భూమిం భూషయతీతి సః ।
విష్ణుర్భూషణ ఇత్యుక్తో వేదవిద్యా విశారదైః ॥

అనేకములగు స్వేచ్ఛావతారములతో అవతరించి భూమిని అలంకరించుచున్నాడుగనుక ఆ విష్ణుదేవుడు భూషణః అని వేదవిద్యా విశారదులచే నుతింపబడుచున్నాడు.

:: పోతన భాగవతము తృతీయ్స్ స్కంధము ::
సీ. మానవైక వికాసమానమై తనకును విస్మయజనకమై వెలయునట్టి
     యాత్మీయ యోగమాయాశక్తిఁ జేపట్టి చూపుచు నత్యంత సుభగ మగుచు
     భూషణంబులకును భూషణంబై వివేకముల కెల్లను బరాకాష్ఠ యగుచు
     సకల కల్యాణ సంస్థానమై సత్యమై తేజరిల్లెడునట్టి దివ్యమూర్తి
తే. తాన తానమూర్తి నిజశక్తిఁ దగ ధరింప, యమతనూభవు రాజసూయాధ్వరంబు
     నందు నెవ్వని శుభమూర్తి నర్థితోడ, నిండు వేడుకఁజూచి వర్ణించి రెలమి. (89)

మానవులకు మహాభ్యుదయానికి అవధియై, తనకు కూడ ఆశ్చర్యాన్ని కలిగించే తన యోగ మాయా బలమును స్వీకరించి ప్రకటించుచు మిక్కిలి సుందరమైన అలంకారములకే అలంకారమై, జ్ఞానానికి పెన్నిధానమై, సకల శుభాలకూ సన్నిధానమై, సత్యమై, నిత్యమై దీపించే ఆ దివ్యమంగళమూర్తి తన ఆకారాన్ని తన శక్తివల్ల తానే ధరించాడు. ధర్మరాజుని రాజసూయ యాగంలో మూర్తీభవించిన ఆనందనందనుని సౌందర్యమును మిక్కిలి ఆనందముతో అందరూ సందర్శించారు. మిక్కిలి సంతోషముతో అభివర్ణించారు.
 
स्वेच्छावतारैर्बहुभिर्भूमिं भूषयतीति सः ।
विष्णुर्भूषण इत्युक्तो वेदविद्या विशारदैः ॥

Svecchāvatārairbahubhirbhūmiṃ bhūṣayatīti saḥ,
Viṣṇurbhūṣaṇa ityukto vedavidyā viśāradaiḥ.

With various incarnations that He took of His free will, He adorned the earth and hence Lord Viṣṇu is praised by the name Bhūṣaṇaḥ.

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे द्वितीयोऽध्यायः ::
यन्मर्त्यलीलौपयिकं स्वयोगमायाबलं दर्शयता गृहीतम् ।
विस्मापनं स्वस्य च सौभगर्द्धेह् परं पदं भूषनभूषणाङ्गम् ॥ १२ ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 2
Yanmartyalīlaupayikaṃ svayogamāyābalaṃ darśayatā gr̥hītam,
Vismāpanaṃ svasya ca saubhagarddheh paraṃ padaṃ bhūṣanabhūṣaṇāṃgam. 12.

The Lord appeared in the mortal world by His internal potency, yoga-māya. He came in His eternal form, which is just suitable for His pastimes. These pastimes were wonderful for everyone, even for those proud of their own opulence, including the Lord Himself in His form as the Lord of Vaikuṇṭha. Thus His transcendental body is the ornament of all ornaments.

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥

24 జులై, 2014

628. భూశయః, भूशयः, Bhūśayaḥ

ఓం భూశయాయ నమః | ॐ भूशयाय नमः | OM Bhūśayāya namaḥ

లఙ్కాం ప్రతి స పన్థానమన్విష్యన్ సాగరం ప్రతి ।
భూమౌ శేత ఇతి హరిర్భూశయః ప్రోచ్యతే బుధైః ॥

లంకా (సేతునిర్మాణ) విషయమున మార్గము నన్వేషించుచు, ఆ సంధర్భమున సాగరము నుద్దేశించి భూమిపై శయనించిన రామరూపుడగు పరమాత్మ భూశయః.

:: శ్రీమద్రామాయణే యుద్ధకాణ్డే ఏకవింశః సర్గః ::
తతః సాగరవేలాయాం దర్భాన్ ఆస్తీర్య రాఘవః ।
అఞ్జలిం ప్రాఙ్గ్ముఖః కృత్వా ప్రతిశిశ్యే మహోదధేః ।
బాహుం భుజగబోగాభమ్ ఉపధాయారిసూదనః ॥ 1 ॥

శత్రుభయంకరుడైన శ్రీరాముడు సముద్రతీరమునందలి ఇసుకతిన్నెపై వాడియైన మొనలుగల దర్భలను పఱచుకొనెను. పిదప ఆ ప్రభువు ప్రాజ్ముఖుడై, సముద్రమునకు అంజలి ఘటించి, సర్పశరీరమువలె మృదువైనదియు, పూర్వము మేలిమి బంగారు ఆభరణములతో అలంకృతమైనదియు అగు తన కుడిచేతిని తలగడగా జేసికొని శయనించెను.

लङ्कां प्रति स पन्थानमन्विष्यन् सागरं प्रति ।
भूमौ शेत इति हरिर्भूशयः प्रोच्यते बुधैः ॥

Laṅkāṃ prati sa panthānamanviṣyan sāgaraṃ prati,
Bhūmau śeta iti harirbhūśayaḥ procyate budhaiḥ.

In His search for a route to reach Lanka, Lord Rāma lay on the ground and hence He is called Bhūśayaḥ.

:: श्रीमद्रामायणे युद्धकाण्डे एकविंशः सर्गः ::
ततः सागरवेलायां दर्भान् आस्तीर्य राघवः ।
अञ्जलिं प्राङ्ग्मुखः कृत्वा प्रतिशिश्ये महोदधेः ।
बाहुं भुजगबोगाभम् उपधायारिसूदनः ॥ १ ॥

Śrīmad Rāmāyaṇa - Book 6, Chapter 21
Tataḥ sāgaravelāyāṃ darbhān āstīrya rāghavaḥ,
Añjaliṃ prāṅgmukhaḥ kr̥tvā pratiśiśye mahodadheḥ,
Bāhuṃ bhujagabogābham upadhāyārisūdanaḥ. 1.

Thereafter Rāma, the annihilator of enemies, spreading sacred grass on the sea shore, making a respectful salutation to the great ocean with his face turned eastward, lied down with his arm, resembling the body of a snake, as his head rest.

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥

23 జులై, 2014

627. శాశ్వతస్థిరః, शाश्वतस्थिरः, Śāśvatasthiraḥ

ఓం శాశ్వతస్థిరాయ నమః | ॐ शाश्वतस्थिराय नमः | OM Śāśvatasthirāya namaḥ

నోపైతి విక్రియాం శశ్వద్ భవన్నపి కదాచన ।
ఇతి కేశవశ్శాశ్వతః స్థిర ఇత్యుచ్యతే బుధైః ।
శాశ్వతస్థిర ఇత్యేకం నామాప్యభిమతం హరేః ॥

శాశ్వతుడూ, స్థిరుడు. ఎల్లప్పుడును ఉండెడివాడైనను ఎన్నడును తన స్వరూపాదులయందు మార్పును ఏమాత్రమును పొందువాడు కాదుగనుక శాశ్వతస్థిరః. శాశ్వతః స్థిరః అని రెండు పదములు కలిపి సవిశేషణైక నామమని శ్రీ శంకరులు పేర్కొనిరి.

नोपैति विक्रियां शश्वद् भवन्नपि कदाचन ।
इति केशवश्शाश्वतः स्थिर इत्युच्यते बुधैः ।
शाश्वतस्थिर इत्येकं नामाप्यभिमतं हरेः ॥

Nopaiti vikriyāṃ śaśvad bhavannapi kadācana,
Iti keśavaśśāśvataḥ sthira ityucyate budhaiḥ,
Śāśvatasthira ityekaṃ nāmāpyabhimataṃ hareḥ.

Eternal and unchanging. Though he existed and will exist forever, He is never subject to any change and hence Lord Hari is Śāśvatasthiraḥ. Śrī Śankara clarifies that as an epithet, the two names Śāśvataḥ and Sthiraḥ make up for one name i.e., Śāśvatasthiraḥ.

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥

22 జులై, 2014

626. అనీశః, अनीशः, Anīśaḥ

ఓం అనీశాయ నమః | ॐ अनीशाय नमः | OM Anīśāya namaḥ

న విద్యతే హరేరీశ ఇత్యేషోఽనీశ ఈర్యతే ।
న తస్యేశే కశ్చనేతి శ్రుతిశీర్షసమీరణాత్ ॥

ఈతనికి ఈతని పైన తన ప్రభుత్వమును చూపగల ఈశుడు ఎవ్వరును లేరు గనుక ఆ హరి అనీశుడు.

:: పోతన భాగవతము ద్వితీయ స్కంధము ::
చ. తలకొని యమ్మహాత్మకుఁడు దాల్చిన యయ్యవతారకర్మముల్‍
     వెలయఁగ నస్మదాదులము వేయి విధంబుల సన్నుతింతు, మ
     య్యలఘు ననంతునిం జిదచిదాత్మకు నాద్యు ననీశు నీశ్వరుం
     దెలియఁగ నేర్తుమే తవిలి? దివ్య చరిత్రున కేను మ్రొక్కెదన్‍. (109)

ఆ మహాత్ముడు జగర్దక్షణకు పూనుకొని ఆయా అవతారములలో చేసిన పనులు మా బోంట్లం వేయి విధాల వినుతిస్తూ వుంటాము. మహామహుడూ, తుదిలేనివాడూ, చిదచిత్స్వరూపుడూ, మొదటివాడూ, తనకు ప్రభువు అన్నవాడు లేనివాడూ, తానే ప్రభువైనవాడూ అయిన ఆ దేవుని ఎంత ప్రయత్నించినా మనము తెలుసుకోగలమా? దివ్యశీలుడైన ఆ దేవదేవునకు నేను నమస్కరిస్తాను.

न विद्यते हरेरीश इत्येषोऽनीश ईर्यते ।
न तस्येशे कश्चनेति श्रुतिशीर्षसमीरणात् ॥

Na vidyate harerīśa ityeṣo’nīśa īryate,
Na tasyeśe kaścaneti śrutiśīrṣasamīraṇāt.

Since Lord Hari has no Lord superior to Him, He is called Anīśaḥ.

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥

21 జులై, 2014

625. సర్వతశ్చక్షుః, सर्वतश्चक्षुः, Sarvataścakṣuḥ

ఓం సర్వతచక్షుసే నమః | ॐ सर्वतचक्षुसे नमः | OM Sarvatacakṣuse namaḥ

సర్వతశ్చక్షుః, सर्वतश्चक्षुः, Sarvataścakṣuḥ

సర్వం పశ్యతి వుశ్వాత్నా స్వచైతన్యేన సర్వతః ।
ఇత్యేవ సర్వతశ్చక్షురితి సఙ్కీర్త్యతే హరిః ॥

తన స్వరూపమేయగు చైతన్యముతో ప్రతియొక విషయమును చూచునుగనుక ఆ హరి సర్వతశ్చక్షుః అని నుతింపబడుతాడు.

:: శ్వేతాశ్వతరోపనిషత్ తృతీయోఽధ్యాయః ::
విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో బాహురుత విశ్వతస్పాత్ ।
సమ్బాహుభ్యాం దమతి సమ్పతత్రైః ద్యావా పృథివీ జనయన్దేవ ఏకః ॥ 3 ॥

ఆత్మదేవుడును, అద్వితీయుడునునగు పరమాత్మ ఆకాశమును, భూమిని పుట్టించుచున్నవాడయి అంతటను నేత్రములు గలవాడుగానున్నాడు. మరియు అంతట ముఖములుగలవాడును, అంతట బాహువులు గలవాడును అంతట పాదములు కలవాడును అయి, బాహువులతో మనుష్యులను, రెక్కలతో పక్షులను చేర్చుచున్నాడు.

सर्वं पश्यति वुश्वात्ना स्वचैतन्येन सर्वतः ।
इत्येव सर्वतश्चक्षुरिति सङ्कीर्त्यते हरिः ॥

Sarvaṃ paśyati vuśvātnā svacaitanyena sarvataḥ,
Ityeva sarvataścakṣuriti saṅkīrtyate hariḥ.

Since Lord Hari sees everything everywhere by His own intelligence, He is called Sarvataścakṣuḥ.

:: श्वेताश्वतरोपनिषत् तृतीयोऽध्यायः ::
विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वतस्पात् ।
सम्बाहुभ्यां दमति सम्पतत्रैः द्यावा पृथिवी जनयन्देव एकः ॥ ३ ॥

Śvetāśvatara Upaniṣat - Chapter 3
Viśvataścakṣuruta viśvato mukho viśvato bāhuruta viśvataspāt,
Sambāhubhyāṃ damati sampatatraiḥ dyāvā pr̥thivī janayandeva ekaḥ. 3.

His eyes are everywhere, His faces everywhere, His arms everywhere, everywhere His feet. He it is who endows men with arms, birds with feet and wings and men likewise with feet. Having produced heaven and earth, He remains as their non-dual manifester.

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥

20 జులై, 2014

624. ఉదీర్ణః, उदीर्णः, Udīrṇaḥ

ఓం ఉదీర్ణాయ నమః | ॐ उदीर्णाय नमः | OM Udīrṇāya namaḥ

సర్వభూతేభ్యః ఉద్రిక్త ఉదీర్ణ ఇతి కథ్యతే అన్నిటికంటెను మిక్కిలిగా ఉద్రేకించి పై స్థితికి చేరి ఉన్నవాడు ఉదీర్ణః.

सर्वभूतेभ्यः उद्रिक्त उदीर्ण इति कथ्यते / Sarvabhūtebhyaḥ udrikta udīrṇa iti kathyate As He is apart from and above all beings, increased, He is Udīrṇaḥ.

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥

19 జులై, 2014

623. ఛిన్నసంశయః, छिन्नसंशयः, Chinnasaṃśayaḥ

ఓం ఛిన్నసంశయాయ నమః | ॐ छिन्नसंशयाय नमः | OM Chinnasaṃśayāya namaḥ

కరతలామలకవత్ సర్వసాక్షాత్కృతేర్హరేః ।
సంశయః క్వాపి నాస్తిఛిన్నసంశయ ఉచ్యతే ॥

 ఏవని సంశయములన్నియు తెగినవియో, ఎవనికి ఏ సంశయములును లేవో అట్టివాడు. కరతలమునందలి అమలకమును అనగా అరచేతియందు ఉన్న ఉసిరికాయవలె ప్రతియొక విషయమును సాక్షాత్కరింపజేసినొనినవాడగు ఈ పరమాత్మకు ఏ విషయమునందును సంశయము ఉండదు. అంతటి విఅమ జ్ఞానస్వరూపుడగు పరమాత్మ ఛిన్నసంశయః.

करतलामलकवत् सर्वसाक्षात्कृतेर्हरेः ।
संशयः क्वापि नास्तिछिन्नसंशय उच्यते ॥

Karatalāmalakavat sarvasākṣātkr̥terhareḥ,
Saṃśayaḥ kvāpi nāstichinnasaṃśaya ucyate.

One who has no doubts as everything is directly discernible. He understands everything as clearly has holding a Amalika (Indian gooseberry) in ones palm. To whom there is no doubt whatever is Chinnasaṃśayaḥ.

स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।
विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥

స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥

Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,
Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥

18 జులై, 2014

622. సత్కీర్తిః, सत्कीर्तिः, Satkīrtiḥ

ఓం సత్కీర్తయే నమః | ॐ सत्कीर्तये नमः | OM Satkīrtaye namaḥ

సతీత్యవితధా కీర్తిర్యస్య సత్కీర్తిరేవ సః అసత్యము కాని, సత్యమైన కీర్తి ఈతనికి కలదు.

सतीत्यवितधा कीर्तिर्यस्य सत्कीर्तिरेव सः / Satītyavitadhā kīrtiryasya satkīrtireva saḥ His renown is ever true, never belied.

स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।
विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥

స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥

Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,
Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥

17 జులై, 2014

621. అవిధేయాఽఽత్మా, अविधेयाऽऽत्मा, Avidheyā’’tmā

ఓం విధేయాత్మనే నమః | ॐ विधेयात्मने नमः | OM Vidheyātmane namaḥ

నకేనాపి విధేయోఽయం స్వాత్మేతి పరమేశ్వరః ।
అవిధేయాత్మేతి హరిరచ్యుతే విదుషాం వరైః ॥

విధి అనగా ఇది ఇట్లు ఉన్నది. ఇది ఇట్లు ఉండును; ఇది ఇట్లు చేయుము అని చెప్పుట. ఈ విధముగ చెప్పుటనే విధానము అందురు; ఈ విధమున విధానమును విధిని చేయుటకు యోగ్యుడుకానీ, శక్యుడుకానీ 'విధేయః' అనబడును. అట్లు విధేయముకాని ఆత్మ స్వరూపము ఎవనిదియో అట్టివాడు. పరమాత్ముని స్వరూపము ఇట్టిది అని చెప్ప శక్యముకాదు. నీవు ఇది ఇట్లు చేయుము అని ఎవరిచేతను విధీంచబడుటకు అతడు శక్యుడు కానివాడు.

नकेनापि विधेयोऽयं स्वात्मेति परमेश्वरः ।
अविधेयात्मेति हरिरच्युते विदुषां वरैः ॥

Nakenāpi vidheyo’yaṃ svātmeti parameśvaraḥ,
Avidheyātmeti hariracyute viduṣāṃ varaiḥ.

The One whose ātma or nature is not under the sway of anybody.

स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।
विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥

స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥

Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,
Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥

16 జులై, 2014

620. విజితాఽఽత్మా, विजिताऽऽत्मा, Vijitā''tmā

ఓం విజితాత్మనే నమః | ॐ विजितात्मने नमः | OM Vijitātmane namaḥ

విజిత ఆత్మాహియేన విజితాత్మా స ఈర్యతే ఎవనిచే ఆత్మ (మనస్సు) జయించబడినదియో ఆతండు విజితాత్మ.

विजित आत्माहियेन विजितात्मा स ईर्यते / Vijita ātmāhiyena vijitātmā sa īryate  He by whom the ātma i.e., manas has been conquered is Vijitātmā.

स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।
विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥

స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥

Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,
Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥

15 జులై, 2014

619. జ్యోతిర్గణేశ్వరః, ज्योतिर्गणेश्वरः, Jyotirgaṇeśvaraḥ

ఓం జ్యోతిర్గణేశ్వరాయ నమః | ॐ ज्योतिर्गणेश्वराय नमः | OM Jyotirgaṇeśvarāya namaḥ

జ్యోతిర్గణేశ్వరః, ज्योतिर्गणेश्वरः, Jyotirgaṇeśvaraḥ

విష్ణుర్జ్యోతిర్గణానాం య ఈశ్వర స్స హి కేశవః ।
జ్యోతిర్గణేశ్వర ఇతి ప్రోచ్యతే విధుషాం వరైః ॥

సూర్యాది జ్యోతిస్సుల గణములకు ఈశ్వరుడుగనుక విష్ణుదేవుని జ్యోతిర్గణేశ్వరుడని నుతించెదరు.

:: కఠోపనిషత్ (ద్వితీయాధ్యాయము) ఐదవ వల్లి ::
నతత్ర సూర్యోభాతి న చన్ద్రతారకం నేమా విద్యుతో భాన్తి కుతోఽయమగ్నిః ।
తమేవ భాన్త మనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి ॥ 15 (101) ॥

సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రములు, విద్యుత్తులు అక్కడ ప్రకాశింపవు. ఇక ఈ అగ్ని సంగతి చెప్పవలెనా? ఆ యాత్మ ప్రకాశించుటచే దానిని ఆశ్రయించుకొని మిగిలినవన్నియును భాసించుచున్నవి. ఆత్మ వెలుగుచే ఇదంతయు ప్రకాశించుచున్నది.

:: శ్రీమద్భగవద్గీత పురుషోత్తమప్రాప్తి యోగము ::
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ ।
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ॥ 12 ॥

సూర్యునియందు ఏ తేజస్సు అనగా ప్రకాశము లేదా చైతన్యము ప్రపంచమునంతను ప్రకాశింపజేయుచున్నదో, అట్లే చంద్రునియందును, అగ్నియందును ఏ తేజస్సుగలదో, అది యంతయును నాదిగా నేరుంగుము.

विष्णुर्ज्योतिर्गणानां य ईश्वर स्स हि केशवः ।
ज्योतिर्गणेश्वर इति प्रोच्यते विधुषां वरैः ॥

Viṣṇurjyotirgaṇānāṃ ya īśvara ssa hi keśavaḥ,
Jyotirgaṇeśvara iti procyate vidhuṣāṃ varaiḥ.

Since Viṣṇu is the Lord of all luminous bodies, He is called Jyotirgaṇeśvaraḥ.

:: कठोपनिषत् (द्वितीयाध्याय) 5वा वल्लि ::
नतत्र सूर्योभाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः ।
तमेव भान्त मनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति ॥ १५ (१०१) ॥

Kaṭhopaniṣat Part II, Canto III
Natatra sūryobhāti na candratārakaṃ Nemā vidyuto bhānti kuto’yamagniḥ,
Tameva bhānta manubhāti sarvaṃ tasya bhāsā sarvamidaṃ vibhāti. 15 (101).

There the sun does not shine, neither does the moon and the stars; nor do these flashes of lightening shine. How can this fire? By His shine, all these shine; through His lustre all these are variously illuminated.

:: श्रीमद्भगवद्गीत पुरुषोत्तमप्राप्ति योग ::
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥ १२ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 15
Yadādityagataṃ tejo jagadbhāsayate’khilam,
Yaccandramasi yaccāgnau tattejo viddhi māmakam. 12.

That light in the sun which illumines the whole world, that which is in the moon, and that which is in fire - know that light to be Mine.

स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः
विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥

స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥

Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,
Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥

14 జులై, 2014

618. నన్దిః, नन्दिः, Nandiḥ

ఓం నన్ద్యే నమః | ॐ नन्द्ये नमः | OM Nandye namaḥ

నన్దిరిత్యుచ్యతే విష్ణుః పరమానన్దవిగ్రహః నందిః అనగా ఆనందము అనియే అర్థము. పరమాత్ముడగు విష్ణువు పరమానందమే తన విగ్రహము అనగా రూపముగాగలవాడుగనుక నందిః అని కీర్తింప బడుతాడు.

नन्दिरित्युच्यते विष्णुः परमानन्दविग्रहः / Nandirityucyate viṣṇuḥ paramānandavigrahaḥ Nandiḥ means being blissful. Lord Viṣṇu is embodiment of such blissful state and hence He is called Nandiḥ.

स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।
विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥

స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥

Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,
Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥

13 జులై, 2014

617. శతానన్దః, शतानन्दः, Śatānandaḥ

ఓం శతానన్దాయ నమః | ॐ शतानन्दाय नमः | OM Śatānandāya namaḥ

శతానన్దః, शतानन्दः, Śatānandaḥ

పరమానన్ద ఏవైకః శతధాభిద్యతే హరిః ।
ఉపాధిభేదాదితి స శతానన్ద ఇతీర్యతే ।
ఏతస్యేత్యాదిబృహదారణ్యకోపనిషచ్ఛ్రుతేః ॥

వాస్తవమున తాను ఒక్కటియే అయి యుండియు ఉపాధి భేదము వలన వేర్వేరు విధముల వేరయినను, ఒకేయొక పరమానందము ఏ పరమాత్ముని రూపమో అట్టివాడు శతానందః.

:: బృహదారణ్యకోపనిషత్ షష్ఠాద్యాయః తృతీయం బ్రాహ్మణం ::
సలిల ఏకో ద్రష్టాఽద్వైతో భవ త్యేష బ్రహ్మలోకః స మ్రాడితి హైన మనుశాశన యాజ్ఞవల్క్య ఏషాస్య గతి రేషాస్యపరమా సమ్పదేషోఽస్యపరమోలోక ఏషోఽస్య పరమ ఆనన్ద ఏతస్యైవా నన్ద స్యాన్యాని భూతాని మాత్రా ముపజీవన్తి ॥ 32 ॥

ఆత్మ స్వచ్ఛమైన ఉదకమువంటిది. ఉదకమునందువలెనే, సుషుప్తియందు రెండవ వస్తువు లేనిది. దేహేంద్రియోపాధి భేదములేని ఈ ఆత్మ సుషుప్తికాలమునందు స్వకీయమైన ఆత్మ తేజస్సునందు ఉన్నది. ఈ ఆత్మ బ్రహ్మస్వరూపమైన లోకము. ఈ విధముగా యాజ్ఞవల్క్య ఋషి జనక మహారాజునకు బోధించెను. ఈ విజ్ఞానమయాత్మకు, ఇది శ్రేష్ఠమైన స్థానము మరియు శ్రేష్ఠమైన సంపత్తు. ఇదియే శ్రేష్ఠమైన లోకము. ఇదియే శ్రేష్ఠమైన ఆనందము. ఇతర భూతములు ఈ ఆననందము యొక్క అంశమును అనుసరించి జీవించుచున్నవి.

परमानन्द एवैकः शतधाभिद्यते हरिः ।
उपाधिभेदादिति स शतानन्द इतीर्यते ।
एतस्येत्यादिबृहदारण्यकोपनिषच्छ्रुतेः ॥

Paramānanda evaikaḥ śatadhābhidyate hariḥ,
Upādhibhedāditi sa śatānanda itīryate,
Etasyetyādibr̥hadāraṇyakopaniṣacchruteḥ.

Paramānanda supreme bliss is one only. Due to differences of limitations, it is broken into hundreds. The One, in spite of this, who is of the form of such eternal bliss is Śatānandaḥ.

:: बृहदारण्यकोपनिषत् षष्ठाद्यायः तृतीयं ब्राह्मणं ::
सलिल एको द्रष्टाऽद्वैतो भव त्येष ब्रह्मलोकः स म्राडिति हैन मनुशाशन याज्ञवल्क्य एषास्य गति रेषास्यपरमा सम्पदेषोऽस्यपरमोलोक एषोऽस्य परम आनन्द एतस्यैवा नन्द स्यान्यानि भूतानि मात्रा मुपजीवन्ति ॥ ३२ ॥

Br̥hadāraṇyaka Upaniṣat - Part 6, Chapter 3
Salila eko draṣṭā’dvaito bhava tyeṣa brahmalokaḥ sa mrāḍiti haina manuśāśana yājñavalkya eṣāsya gati reṣāsyaparamā saṃpadeṣo’syaparamoloka eṣo’sya parama ānaṃda etasyaivā naṃda syānyāni bhūtāni mātrā mupajīvaṃti. 32.

It becomes transparent like water, one, the witness, and without a second. This is the world of Brahman. O Emperor Janaka. Thus did Yājñavalkya instruct Janaka: This is its supreme attainment, this is its supreme glory, this is its highest world, this is its supreme bliss. On a particle of this very bliss other beings live.

स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।
विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥

స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥

Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,
Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥

12 జులై, 2014

616. స్వఙ్గః, स्वङ्गः, Svaṅgaḥ

ఓం స్వాఙ్గాయ నమః | ॐ स्वाङ्गाय नमः | OM Svāṅgāya namaḥ

స్వఙ్గః, स्वङ्गः, Svaṅgaḥ

అఙ్గాని శోభనాన్యస్యేత్యచ్యుతః స్వఙ్గ ఉచ్యతే సుందరమగు అంగములును, అవయవములు ఈతనికిగలవు కనుక అచ్యుతుడు స్వంగః. అంగము అనగా శరీరము అనియు అర్థము. సు + అంగః సుందరమగు శరీరము కలవాడనియు చెప్పవచ్చును.

:: శ్రీమద్రామాయణే సున్దరకాణ్డే పఞ్చత్రింశస్సర్గః ::
విపులాంశో మహాబాహుః కమ్బుగ్రీవః శుభాననః ।
గూఢజత్రుస్సుతామ్రాక్షో రామో దేవి జనైః శ్రుతః ॥ 15 ॥
దున్దుభిస్వననిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ ।
సమస్సమవిభక్తాఙ్గో వర్ణం శ్యామం సమాశ్రితః ॥ 16 ॥

శ్రీరాముడు విశాలములైన భుజములు, దీర్ఘములైన బాహువులు, శంఖమువంటి కంఠముగలవాడు. శుభప్రదమైన ముఖముగలవాడు. కండరములతో మూసికొనిపోయిన సంధియెముకగలవాడు. మనోహరములైన ఎఱ్ఱనికన్నులుగలవాడు. లోకవిఖ్యాతుడు. అతడు దుందుభిధ్వనివలె గంభీరమైన కంఠ స్వరముగలవాడు. నిగనిగలాడు శరీరచ్ఛాయగలవాడు. ప్రతాపశాలి. ఎక్కువ తక్కువలు లేకుండా పరిపుష్టములైన చక్కని అవయవములుగలవాడు. మేఘశ్యామవర్ణ శోభితుడు.

अङ्गानि शोभनान्यस्येत्यच्युतः स्वङ्ग उच्यते / Aṅgāni śobhanānyasyetyacyutaḥ svaṅga ucyate Since Lord Acyuta is with proportionate and beautiful body parts, He is called Svaṅgaḥ. Su + aṅgaḥ. Aṅgaḥ also can mean body. Hence Svaṅgaḥ can also mean the One with a beautiful body.

:: श्रीमद्रामायणे सुन्दरकाण्डे पञ्चत्रिंशस्सर्गः ::
विपुलांशो महाबाहुः कम्बुग्रीवः शुभाननः ।
गूढजत्रुस्सुताम्राक्षो रामो देवि जनैः श्रुतः ॥ १५ ॥
दुन्दुभिस्वननिर्घोषः स्निग्धवर्णः प्रतापवान् ।
समस्समविभक्ताङ्गो वर्णं श्यामं समाश्रितः ॥ १६ ॥

Śrīmad Rāmāyaṇa - Book 5, Chapter 35
Vipulāṃśo mahābāhuḥ kambugrīvaḥ śubhānanaḥ,
Gūḍajatrussutāmrākṣo rāmo devi janaiḥ śrutaḥ. 15.
Dundubhisvananirghoṣaḥ snigdhavarṇaḥ pratāpavān,
Samassamavibhaktāṅgo varṇaṃ śyāmaṃ samāśritaḥ. 16.

Rama is a broad shouldered and a long-armed man. He has a shell-like neck. He has a handsome countenance. He has a hidden collar-bone. He has beautiful red eyes. His fame is heard about by people. He has a voice like the sound of a kettle-drum. He has a shining skin. He is full of splendour. He is square-built. His limbs are built symmetrically. He is endowed with a dark-brown complexion.

स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।
विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥

స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥

Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,
Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥

11 జులై, 2014

615. స్వక్షః, स्वक्षः, Svakṣaḥ

ఓం స్వక్షాయ నమః | ॐ स्वक्षाय नमः | OM Svakṣāya namaḥ

శోభనే పుణ్డరీకాభే అక్షిణీస్తో హరేరితిః ।
స్వక్ష ఇత్యుచ్యతే విష్ణుర్వేదవిద్యావిశారదైః ॥

సుందరములును, పద్మములవలె ప్రకాశించునవియగు అక్షులు అనగా కన్నులుగలవాడుగనుక ఆ విష్ణుదేవుడు స్వక్షః (సు + అక్షః) అని కీర్తించబడుతాడు.

शोभने पुण्डरीकाभे अक्षिणीस्तो हरेरितिः ।
स्वक्ष इत्युच्यते विष्णुर्वेदविद्याविशारदैः ॥

Śobhane puṇḍarīkābhe akṣiṇīsto hareritiḥ,
Svakṣa ityucyate viṣṇurvedavidyāviśāradaiḥ.

Since His eyes are auspicious and resemble Lotus flower, He has the divine name Svakṣaḥ (सु + अक्षः / Su + Akṣaḥ).

स्वक्षस्स्वङ्गश्शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः ।
विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः ॥ ६६ ॥

స్వక్షస్స్వఙ్గశ్శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ 66 ॥

Svakṣassvaṅgaśśatānando nandirjyotirgaṇeśvaraḥ,
Vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṃśayaḥ ॥ 66 ॥

10 జులై, 2014

614. లోకత్రయాఽఽశ్రయః, लोकत्रयाऽऽश्रयः, Lokatrayā’’śrayaḥ

ఓం లోకత్రయాశ్రాయ నమః | ॐ लोकत्रयाश्राय नमः | OM Lokatrayāśrāya namaḥ

ఆశ్రయత్వాచ్చ లోకానాం త్రయాణాం పరమేశ్వరః ।
లోకత్రయాశ్రయ ఇతి విష్ణురేవాభిధీయతే ॥

మూడు లోకములందలి ప్రాణులకును ఆశ్రయము అగువాడుగనుక శ్రీ విష్ణువు లోకత్రయాఽఽశ్రయః.

आश्रयत्वाच्च लोकानां त्रयाणां परमेश्वरः ।
लोकत्रयाश्रय इति विष्णुरेवाभिधीयते ॥

Āśrayatvācca lokānāṃ trayāṇāṃ parameśvaraḥ,
Lokatrayāśraya iti viṣṇurevābhidhīyate.

Since He is the refuge of the three worlds, Lord Viṣṇu is called Lokatrayāśrayaḥ.

श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।
श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,
Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

9 జులై, 2014

613. శ్రీమాన్, श्रीमान्, Śrīmān

ఓం శ్రీమతే నమః | ॐ श्रीमते नमः | OM Śrīmate namaḥ

శ్రీమాన్, श्रीमान्, Śrīmān

శ్రియోఽస్య సన్తీతి శ్రీమానితి విష్ణుః సముచ్యతే సకల విధములగు శ్రీలు ఈతనికి కలవు. సర్వ శుభలక్షణ సంపన్నుడు గనుక శ్రీమాన్‍.

:: శ్రీమద్రామాయణే యుద్ధకాణ్డే త్రయస్త్రింశః సర్గః ::
దీర్ఘవృత్తభుజః శ్రీమాన్ మహోరస్కః ప్రతాపవాన్ ।
ధన్వీ సహననోపేతో ధర్మాత్మా భువి విశ్రుతః ॥ 11 ॥

శ్రీరాముడు పొడవైన, బలిష్ఠములైన బాహువులుగలవాడు. సర్వ శుభలక్షణ సంపన్నుడు. విశాలమైన వక్షఃస్థలముగలవాడు. ఆయన ప్రతాపమునకు తిరుగులేదు. ధనుస్సూ దివ్యము అయినది. శరీరసౌష్ఠవముగలవాడు. భూమండలమున ధర్మాత్ముడిగా వాసిగాంచినవాడు.

22. శ్రీమాన్, श्रीमान्, Śrīmān
178. శ్రీమాన్‌, श्रीमान्‌, Śrīmān
220. శ్రీమాన, श्रीमान, Śrīmān

श्रियोऽस्य सन्तीति श्रीमानिति विष्णुः समुच्यते / Śriyo’sya santīti śrīmāniti viṣṇuḥ samucyate He has every kind of Śrī or every kind of illustrious opulence and hence He is Śrīmān.

:: श्रीमद्रामायणे युद्धकाण्डे त्रयस्त्रिंशः सर्गः ::
दीर्घवृत्तभुजः श्रीमान् महोरस्कः प्रतापवान् ।
धन्वी सहननोपेतो धर्मात्मा भुवि विश्रुतः ॥ ११ ॥

Śrīmad Rāmāyaṇa - Book 6, Chapter 33
Dīrghavr̥ttabhujaḥ śrīmān mahoraskaḥ pratāpavān,
Dhanvī sahananopeto dharmātmā bhuvi viśrutaḥ. 11 .

Rama, who is endowed with long and well rounded arms, an illustrious man, who is large-chested, a man of great energy, an archer well known in the world, a man endowed with muscularity, a righteous minded man, a is person of celebrity on earth.

22. శ్రీమాన్, श्रीमान्, Śrīmān
178. శ్రీమాన్‌, श्रीमान्‌, Śrīmān
220. శ్రీమాన, श्रीमान, Śrīmān
श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।
श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,
Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

8 జులై, 2014

612. శ్రేయః, श्रेयः, Śreyaḥ

ఓం శ్రేయసే నమః | ॐ श्रेयसे नमः | OM Śreyase namaḥ

అనపాయనసుఖావాప్తి లక్షణం శ్రేయ ఉచ్యతే ।
తచ్చ రూపం పరస్యేతి తద్బ్రహ్మ శ్రేయ ఉచ్యతే ॥

ఎన్నడును దూరముకాని సుఖప్రాప్తి రూపమగునది శ్రేయము అనబడును. అట్టి శ్రేయము పరమాత్ముని రూపమే గనుక శ్రేయః.

अनपायनसुखावाप्ति लक्षणं श्रेय उच्यते ।
तच्च रूपं परस्येति तद्ब्रह्म श्रेय उच्यते ॥

Anapāyanasukhāvāpti lakṣaṇaṃ śreya ucyate,
Tacca rūpaṃ parasyeti tadbrahma śreya ucyate.

Attainment of permanent Sukha i.e., happiness characterizes Śreya. That pertains only to the Lord. Hence He is Śreyaḥ.

श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।
श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,
Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

7 జులై, 2014

611. శ్రీకరః, श्रीकरः, Śrīkaraḥ

ఓం శ్రీకరాయ నమః | ॐ श्रीकराय नमः | OM Śrīkarāya namaḥ

అర్చయతాం చ స్తువతాం భక్తాణాం స్మరతామపి స్మరించు, స్తుతించు, అర్చించు భక్తులకు శ్రీని కలుగజేయువాడు శ్రీకరః.

अर्चयतां च स्तुवतां भक्ताणां स्मरतामपि / Arcayatāṃ ca stuvatāṃ bhaktāṇāṃ smaratāmapi Since He dowers those remember Him, praise Him and worship Him, He is called Śrīkaraḥ.

श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।
श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,
Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

6 జులై, 2014

610. శ్రీధరః, श्रीधरः, Śrīdharaḥ

ఓం శ్రీధరాయ నమః | ॐ श्रीधराय नमः | OM Śrīdharāya namaḥ

జననీం సర్వభూతానాం వహన్ స్వే వక్షసి శ్రియమ్ ।
మహావిష్ణుః శ్రీధరః ఇత్యుచ్యతే పరమేశ్వరః ॥

సర్వ జీవ జననియగు శ్రీని తన వక్షమునందు ధరించునుగనుక శ్రీ విష్ణుదేవునకు శ్రీధరః అని నామము.

जननीं सर्वभूतानां वहन् स्वे वक्षसि श्रियम् ।
महाविष्णुः श्रीधरः इत्युच्यते परमेश्वरः ॥

Jananīṃ sarvabhūtānāṃ vahan sve vakṣasi śriyam,
Mahāviṣṇuḥ śrīdharaḥ ityucyate parameśvaraḥ.

Since He bears on His bossom, Śrī who is the mother of all creatures, Lord Viṣṇu has the divine name 'Śrīdharaḥ'.

:: श्रीमद्बागवते द्वादशस्कन्धे द्वादशोऽध्यायः ::
यशः श्रियामेव परिश्रमः परो वर्णाश्रमाचारतपः श्रुतादिषु ।
अविस्मृतिः श्रीधरपादपद्मयोर्गुणानुवादश्रवणादरादिभिः ॥ ५४ ॥

Śrīmad Bāgavata - Canto 12, Chapter 12
Yaśaḥ śriyāmeva pariśramaḥ paro varṇāśramācāratapaḥ śrutādiṣu,
Avismr̥tiḥ Śrīdharapādapadmayorguṇānuvādaśravaṇādarādibhiḥ. 54.

The great endeavor one undergoes in executing the ordinary social and religious duties of the varṇāśrama system, in performing austerities, and in hearing from the Vedas culminates only in the achievement of mundane fame and opulence. But by respecting and attentively hearing the recitation of the transcendental qualities of the Supreme Lord, the husband of the goddess of fortune, one can remember His lotus feet.

श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।
श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,
Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

5 జులై, 2014

609. శ్రీవిభావనః, श्रीविभावनः, Śrīvibhāvanaḥ

ఓం శ్రీవిభావనాయ నమః | ॐ श्रीविभावनाय नमः | OM Śrīvibhāvanāya namaḥ

వివిధాస్సర్వ భూతానాం విభావయతి యః శ్రియః ।
తత్తత్కర్మానురూపేణ స హరిః శ్రీవిభావనః ॥

సర్వ భూతములకును తమ తమ కర్మములకు తగిన విధముగా వివిధములగు శ్రీలను విశేషముగా కలుగజేయువాడుగనుక హరికి శ్రీవిభావనః అను నామముగలదు.

विविधास्सर्व भूतानां विभावयति यः श्रियः ।
तत्तत्कर्मानुरूपेण स हरिः श्रीविभावनः ॥

Vividhāssarva bhūtānāṃ vibhāvayati yaḥ śriyaḥ,
Tattatkarmānurūpeṇa sa hariḥ śrīvibhāvanaḥ.

Since Lord Hari accords appropriate Śrī or different kinds of opulence on the beings in accordance to their deeds, He is known as Śrīvibhāvanaḥ.

श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः
श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః
శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,
Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

4 జులై, 2014

608. శ్రీనిధిః, श्रीनिधिः, Śrīnidhiḥ

ఓం శ్రీనిధయే నమః | ॐ श्रीनिधये नमः | OM Śrīnidhaye namaḥ

శ్రీనిధిః, श्रीनिधिः, Śrīnidhiḥ

అఖిలాః శ్రీయో నిధీయన్తే సర్వశక్తిమయే హరౌ ।
ఇతి స శ్రీనిధిరితి ప్రోచ్యతే విదుషాం వరైః ॥

సకల శ్రీవిభూతుల నిధిగనుక శ్రీనిధిః. సర్వ శక్తిమయుడగు ఈతనియందే సకల శ్రీలును నిలుపబడియున్నవిగనుక ఆ హరికి శ్రీనిధిః అను నామముగలదు.

अखिलाः श्रीयो निधीयन्ते सर्वशक्तिमये हरौ ।
इति स श्रीनिधिरिति प्रोच्यते विदुषां वरैः ॥

Akhilāḥ śrīyo nidhīyante sarvaśaktimaye harau,
Iti sa śrīnidhiriti procyate viduṣāṃ varaiḥ.

In Lord Hari, who is all powerful, all the Śrī or every kind of opulence i.e., treasures are deposited and Hence He is called Śrīnidhiḥ.

श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।
श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,
Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

3 జులై, 2014

607. శ్రీనివాసః, श्रीनिवासः, Śrīnivāsaḥ

ఓం శ్రీనివాసాయ నమః | ॐ श्रीनिवासाय नमः | OM Śrīnivāsāya namaḥ

శ్రీనివాసః, श्रीनिवासः, Śrīnivāsaḥ

శ్రీ శబ్దేన తు లక్ష్యన్తే శ్రీమన్తస్తేషు సర్వదా ।
వసతీతి శ్రీనివాస ఇతి కేశవ ఉచ్యతే ॥

(ఋక్‍, యజుర్‍, సామతదంగాది రూపమగు విద్యయే 'శ్రీ' అనబడును. అట్టి 'శ్రీ'గలవారు శ్రీమంతులు.) శ్రీమంతులయందు నిత్యమును వసించువాడుగనుక ఆ కేశవునకు శ్రీనివాసః అను నామము.

श्री शब्देन तु लक्ष्यन्ते श्रीमन्तस्तेषु सर्वदा ।
वसतीति श्रीनिवास इति केशव उच्यते ॥

Śrī śabdena tu lakṣyante śrīmantasteṣu sarvadā,
Vasatīti Śrīnivāsa iti keśava ucyate.

(R̥k, Yajur and Sāma are the Śrīḥ of those who possess it. Such are known as Śrīmanta.) Lord Keśava who always resides with the Śrīmanta is called Śrīnivāsaḥ.

श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।
श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,
Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

2 జులై, 2014

606. శ్రీశః, श्रीशः, Śrīśaḥ

ఓం శ్రీశాయ నమః | ॐ श्रीशाय नमः | OM Śrīśāya namaḥ

శ్రీశః, श्रीशः, Śrīśaḥ

శ్రియ ఈశః శ్రీశ ఇతి మహావిష్ణుః సముచ్యతే శ్రీకి ఈశుడు అనగా ప్రభువుగనుక మహావిష్ణువు శ్రీశః.

:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::
క. హృదయేశ! నీ ప్రసన్నత, పదివేలవపాలి లేశభాగముకతనం
    ద్రిదశేంద్రత్వము గలదఁట!, తుది నిను మెప్పింప నేది దొరకదు శ్రీశా! (726)

ఓ శ్రీశా! లక్ష్మీరమణా! పరమాత్మా! నీ అనుగ్రహములో పదివేలవ వంతులో ఒక లేశ భాగము వల్ల దేవేంద్రపదవి కలుగుతుందట. ఇకనీకు మెప్పు కలిగిస్తే లభించని భాగ్యము ఎమి ఉంటుంది?

श्रिय ईशः श्रीश इति महाविष्णुः समुच्यते  / Śriya īśaḥ śrīśa iti mahāviṣṇuḥ samucyate Since Lord Mahā Viṣṇu is the īśaḥ i.e., Lord of Śrī, He is called Śrīśaḥ.

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे एकोनत्रिंशोऽध्यायः ::
श्रीर्यत्पदाम्बुजरजश्चकमे तुलस्या लब्धाआपि वक्षसि पदं किल भृत्यजुष्टम् ।
 यस्याः स्ववीक्षण उतान्यसुरप्रयासस् तद्वद्वयं च तव पादरजः प्रपन्नाः ॥ ३७ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 29
Śrīryatpadāṃbujarajaścakame tulasyā labdhāāpi vakṣasi padaṃ kila bhr̥tyajuṣṭam,
Yasyāḥ svavīkṣaṇa utānyasuraprayāsas tadvadvayaṃ ca tava pādarajaḥ prapannāḥ. 37.

Goddess Lakṣmi, whose glance is sought after by the gods as well with great endeavor, has achieved the unique position of always remaining on the chest of her Lord, Nārāyaṇa. Still, she desires the dust of His lotus feet, even though she has to share that dust with Tulasi devi and indeed with the Lord's many other servants. Similarly, we have approached the dust of Your lotus feet for shelter.

श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।
श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,
Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

1 జులై, 2014

605. శ్రీదః, श्रीदः, Śrīdaḥ

ఓం శ్రీదాయ నమః | ॐ श्रीदाय नमः | OM Śrīdāya namaḥ

శ్రియం దదాతి భక్తేభ్య ఇతి శ్రీదః ఇతీర్యతే భక్తులకు 'శ్రీ' కటాక్షించువాడుగనుక శ్రీదః.

श्रियं ददाति भक्तेभ्य इति श्रीदः इतीर्यते / Śriyaṃ dadāti bhaktebhya iti śrīdaḥ itīryate Since He confers Śrī upon His devotees, He is called Śrīdaḥ.