31 ఆగ, 2014

666. బ్రహ్మవిత్, ब्रह्मवित्, Brahmavit

ఓం బ్రహ్మవిదే నమః | ॐ ब्रह्मविदे नमः | OM Brahmavide namaḥ


వేదం యధావత్ వేదార్థం వేత్తీతి బ్రహ్మ విద్ధరిః బ్రహ్మను అనగా వేదమును, వేదార్థమును ఉన్నది ఉన్నట్లుగా ఎరిగియుండువాడు వేదవిత్‍.



वेदं यधावत् वेदार्थं वेत्तीति ब्रह्म विद्धरिः / Vedaṃ yadhāvat vedārthaṃ vettīti brahma viddhariḥ He who knows Brahma i.e., Vedas and Vedartha i.e., the true meaning of Vedas - correctly is Brahmavit.

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ,
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

30 ఆగ, 2014

665. బ్రహ్మ వివర్ధనః, ब्रह्म विवर्धनः, Brahma vivardhanaḥ

ఓం బ్రహ్మవివర్ధనాయ నమః | ॐ ब्रह्मविवर्धनाय नमः | OM Brahmavivardhanāya namaḥ


బ్రహ్మణాం తప ఆదీనా మనేకానాం వివర్ధనాత్ ।
బ్రహ్మవివర్ధన ఇతి ప్రభురేవాభి ధీయతే ॥

బ్రహ్మ సంజ్ఞ గల తపస్సు, వేదములు, విప్రులు, జ్ఞానములను అనేకమలుగా వృద్ధినొందించువాడుగనుక ఆ విష్ణు ప్రభువునకు బ్రహ్మ వివర్ధనః అను నామము గలదు.



ब्रह्मणां तप आदीना मनेकानां विवर्धनात् ।
ब्रह्मविवर्धन इति प्रभुरेवाभि धीयते ॥

Brahmaṇāṃ tapa ādīnā manekānāṃ vivardhanāt,
Brahmavivardhana iti prabhurevābhi dhīyate.

As the Lord promotes austerity, the Vedas, sages and wisdom that are indicated by the word Brahma, He is called Brahma vivardhanaḥ.

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः
ब्रह्मविद्भ्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః
బ్రహ్మవిద్భ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ,
Brahmavidbhrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

29 ఆగ, 2014

664. బ్రహ్మ, ब्रह्म, Brahma

ఓం బ్రాహ్మణే నమః | ॐ ब्राह्मणे नमः | OM Brāhmaṇe namaḥ


సత్త్వాది లక్షణం బ్రహ్మ సత్యం జ్ఞానమితి శ్రుతేః ।
ప్రత్యస్తమితి భేదం యత్ సత్తా మాత్రమగోచరమ్ ॥
వచసా మాత్మ సంవేద్యం తద్‍జ్ఞానం బ్రహ్మ సంజ్ఞితం ।
ఇతి విష్ణు పురాణే శ్రీ పరాశరసమీరణాత్ ॥

'బృహి - వృద్ధౌ' అను ధాతువునుండి బృంహతి - వృద్ధినందును, చాల పెద్దదిగనుండును, బృంహయతి - వృద్ధినందిచును అను అర్థములలో 'బ్రహ్మ' అను శబ్దము నిష్పన్నమగుచున్నది.

'సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ' అను తైత్తిరీయోపనిషద్ వాక్యమునుబట్టి సత్యము, జ్ఞానము అనునవి తన రూపముగా కలదియు, అవధిరహితమును అగునది 'బ్రహ్మ'. ఈ శ్రుతి వాక్యముననుసరించి మిగుల పెద్దదియు, అనంతమయినదియు, అన్నిటిని సృజించునదియు, వర్ధిల్లజేయునదియునగు బ్రహ్మతత్త్వమే శ్రీ విష్ణువు.

:: శ్రీ విష్ణుమహాపురాణే షష్ఠాంశే సప్తమోఽధ్యాయః ::
ప్రత్యస్త్మితభేదం యత్సత్తామాత్రమగోచరమ్ ।
వచసామాత్మసంవేద్యం తజ్ఞ్జ్ఞానం బ్రహ్మసంజ్ఞితమ్ ॥ 53 ॥

విశేష రూపమున మరుగు పడిన సకల భేదములు కలిగినదియు, ఏకైకాఖండ తత్త్వమును, సత్తా అనగా ఉనికి మాత్రము తన రూపముగా కలదియు, వాక్కులకు అగోచరమును, తన అంతర్ముఖ వృత్తిగల ఆత్మతత్త్వమునకు మాత్రమే తెలియునదియు అగు ఏ జ్ఞానము కలదో అదియే బ్రహ్మము అను నామము కలది.



सत्त्वादि लक्षणं ब्रह्म सत्यं ज्ञानमिति श्रुतेः ।
प्रत्यस्तमिति भेदं यत् सत्ता मात्रमगोचरम् ॥
वचसा मात्म संवेद्यं तद्‍ज्ञानं ब्रह्म संज्ञितं ।
इति विष्णु पुराणे श्री पराशरसमीरणात् ॥

Sattvādi lakṣaṇaṃ brahma satyaṃ jñānamiti śruteḥ,
Pratyastamiti bhedaṃ yat sattā mātramagocaram.
Vacasā mātma saṃvedyaṃ tadˈjñānaṃ brahma saṃjñitaṃ,
Iti viṣṇu purāṇe śrī parāśarasamīraṇāt.

From the root 'Br̥hi', Br̥ṃhati meaning the one that grows, Br̥ṃhayati - the one that causes growth, the word Brahma originates.

As explained in Taittirīya upaniṣad 'Satyaṃ Jñānamanaṃtaṃ Brahma' - Brahma is of the nature of existence, knowledge and infinitude. Being great and all-pervading, Lord Viṣṇu, hence, is Brahma.

:: श्री विष्णुमहापुराणे षष्ठांशे सप्तमोऽध्यायः ::
प्रत्यस्त्मितभेदं यत्सत्तामात्रमगोचरम् ।
वचसामात्मसंवेद्यं तज्ञ्ज्ञानं ब्रह्मसं ज्ञितम् ॥ ५३ ॥

Śrī Viṣṇu Mahā Purāṇa - Part 6, Chapter 7
Pratyastmitabhedaṃ yatsattāmātramagocaram,
Vacasāmātmasaṃvedyaṃ tajñjñānaṃ brahmasaṃ jñitam. 53.

That Knowledge which negates difference, which refers to pure existence, which is beyond the grasp of senses and realized in the Self is indicated by Brahma.

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ,
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

28 ఆగ, 2014

663. బ్రహ్మా, ब्रह्मा, Brahmā

ఓం బ్రహ్మణే నమః | ॐ ब्रह्मणे नमः | OM Brahmaṇe namaḥ


బ్రహ్మా, ब्रह्मा, Brahmā

బ్రహ్మా బ్రహ్మాత్మనాసర్వం సృజతీతి జనార్దనః ।
బృహత్వాత్ బృంహణత్వాచ్చ విష్ణుర్బ్రహ్మేతి కీర్త్యతే ॥

జగములను సృజించెడి కార్యబ్రహ్మ అయిన చతుర్ముఖ బ్రహ్మనుగూడ సృజించెడి కారణ బ్రహ్మ జనార్దనుడు. కావుననే బ్రహ్మా. మరియు కార్యకారణాతీత బ్రహ్మను, బృహత్వ బ్రహ్మణ్యములును తనలోనే కలిగియున్నందున విష్ణుదేవుడు బ్రహ్మా అని కీర్తించబడుతాడు.

వ.అనఘా! యేనును బ్రహ్మయు శివుండును నీజగంబులకుఁ గారణభూతుల; మందు నే నీశ్వరుండను నుపద్రష్టను స్వయంప్రకాశకుండను నై గుణమయం బయిన యాత్మీయమాయం బ్రవేశించి జనన వృద్ధి విలయంబులకు హేతు భూతంబు లగు తత్తత్‍క్రియోచితంబులైన బ్రహ్మరుద్రాది నామధేయంబుల నొందు చుందుదు; నట్టి నద్వితీయ బ్రహ్మరూపకుండ నైన నా యందు నజ భవాదులను భూతగణంబులను మూఢుండగువాఁడు వేరుగాఁ జూచు; మనుజుండు శరీరంబునకుఁ గరచరణాదులు వేరుగాఁ దలంపని చందంబున మద్భక్తుం డగువాఁడు నా యందు భూతజాలంబు భిన్నంబుగాఁ దలంపండు. గావున మా మువ్వుర నెవ్వండు వేరు సేయకుండు వాఁడు కృతార్థుండని యానతిచ్చిన దక్షుండును. (207)

పుణ్యాత్ముడా! నేనూ, బ్రహ్మ, శివుడూ మువ్వురం ఈ లోకములకు హేతుభూతులము. నేను ఈశ్వరుడను. సాక్షిని స్వయంప్రకాశకుడను. నేను త్రిగుణాత్మకమైన నా మాయను ప్రవర్తింపజేసి సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహిస్తూ ఆయా పనులకు తగిన బ్రహ్మరుద్రాది నామములను పొందుతు ఉంటాను. నా కంటె వేరగు పరబ్రహ్మ రూపము లేదు. బ్రహ్మ, శివుడు మొదలగు వారినీ, జీవకోటినీ బుద్ధిహీనుండు నా కంటె వేరుగా చూస్తాడు. మనుష్యుడు తన చేతులు, కాళ్ళు మొదలగు అవయవములను తన శరీరముకంటె వేరుగ చూడడుగదా! అటులనే నా భక్తుడు జీవులను నా కంటె వేరుగ భావింపడు. హరిహరబ్రహ్మలమైన మా ముగ్గురును వేరుగ చూడనివాడు ధన్యుడు.



ब्रह्मा ब्रह्मात्मनासर्वं सृजतीति जनार्दनः ।
बृहत्वात् बृंहणत्वाच्च विष्णुर्ब्रह्मेति कीर्त्यते ॥

Brahmā brahmātmanāsarvaṃ sr̥jatīti janārdanaḥ,
Br̥hatvāt br̥ṃhaṇatvācca viṣṇurbrahmeti kīrtyate.

Lord Brahma, who creates the worlds is himself created by Lord Janardana and hence He is Brahmā. As also since Lord Viṣṇu contains the universe along with its creator within Himself, He is called Brahmā.

:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे सप्तमोऽध्यायः ::
अहं ब्रह्मा च शर्वश्च जगतः कारणं परम् ।
आत्मेश्वर उपद्रष्टा स्वयन्दृगविशॆषणः ॥ ५० ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 7
Ahaṃ brahmā ca śarvaśca jagataḥ kāraṇaṃ param,
Ātmeśvara upadraṣṭā svayandr̥gaviśeṣaṇaḥ. 50.

Brahmā, Lord Śiva and I are the supreme cause of the material manifestation. I am the Supersoul, the self sufficient witness. But impersonally there is no difference between Brahmā, Lord Śiva and Me.

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ,
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

27 ఆగ, 2014

662. బ్రహ్మకృత్, ब्रह्मकृत्, Brahmakr̥t

ఓం బ్రహ్మకృతే నమః | ॐ ब्रह्मकृते नमः | OM Brahmakr̥te namaḥ


కర్తృత్వాత్ తప ఆదీనాం విష్ణుర్బ్రహ్మకృదుచ్యతే బ్రహ్మణ్యః అను నామమునందు ప్రస్తావించబడిన తపస్సు, వేదములు, విప్రులు మరియూ జ్ఞానము అను వానిని కలిగించు వాడు బ్రహ్మకృత్‍. వానికి మేలును చేయువాడు.



कर्तृत्वात् तप आदीनां विष्णुर्ब्रह्मकृदुच्यते  / Kartr̥tvāt tapa ādīnāṃ viṣṇurbrahmakr̥ducyate As elucidated in explanation of the divine name Brahmaṇyaḥ - austerity, the Vedas, sages and wisdom that are indicated by the word Brahma, are created by Him and also taken care of and hence He is called Brahmakr̥t.

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ,
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

26 ఆగ, 2014

661. బ్రహ్మణ్యః, ब्रह्मण्यः, Brahmaṇyaḥ

ఓం బ్రహ్మణ్యాయ నమః | ॐ ब्रह्मण्याय नमः | OM Brahmaṇyāya namaḥ


తపో వేదాశ్చ విప్రాశ్చ జ్ఞానం చ బ్రహ్మ సంజ్ఞితమ్।
తేభ్యో హితత్వాద్బ్రహ్మణ్య ఇతి విష్ణుః సమీర్యతే ॥

తపస్సు, వేదములు, విప్రులు, జ్ఞానము - ఇవి బ్రహ్మ అను సంజ్ఞ కలవి. వీనికి హితము కలిగించువాడుగనుక విష్ణువు బ్రహ్మణ్యః అని చెప్పబడును.

:: ఋగ్వేదాన్తర్గత ఆత్మ బోధోపనిషత ::
...బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూధనః ।
బ్రహ్మణ్యః పుణ్డరీకాక్షో బ్రహ్మణ్యో విష్ణురచ్యుతః... ॥ 2 ॥



तपो वेदाश्च विप्राश्च ज्ञानं च ब्रह्म संज्ञितम् ।
तेभ्यो हितत्वाद्ब्रह्मण्य इति विष्णुः समीर्यते ॥

Tapo vedāśca viprāśca jñānaṃ ca brahma  saṃjñitam,
Tebhyo hitatvādbrahmaṇya iti viṣṇuḥ samīryate.

Austerity, the Vedas, sages and wisdom are indicated by the word Brahma. As Lord Viṣṇu is beneficial to them, He is called Brahmaṇyaḥ.

:: ऋग्वेदान्तर्गत आत्म बोधोपनिषत ::
...ब्रह्मण्यो देवकीपुत्रो ब्रह्मण्यो मधुसूधनः ।
ब्रह्मण्यः पुण्डरीकाक्षो ब्रह्मण्यो विष्णुरच्युतः... ॥ २ ॥

Ātmabodhopaniṣat
...Brahmaṇyo devakīputro brahmaṇyo madhusūdhanaḥ,
Brahmaṇyaḥ puṇḍarīkākṣo brahmaṇyo viṣṇuracyutaḥ.... 2.

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ,
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

25 ఆగ, 2014

660. ధనఞ్జయః, धनञ्जयः, Dhanañjayaḥ

ఓం ధనంజయాయ నమః | ॐ धनंजयाय नमः | OM Dhanaṃjayāya namaḥ


అర్జునో యద్దిగ్విజయో ప్రభూతమజయద్ధనమ్ ।
ధనఞ్జయాఖ్యోఽర్జునోఽపి స్వాభేదేనోచ్యతే హరిః ।
పాణ్డవానాం ధనఞ్జయ ఇతిగీతా సమీరణాత్ ॥

ధర్మరాజు చేసిన రాజసూయ యాగమునకై దిగ్విజయ కాలమునందు అత్యధికమగు ధనమును జయించి తెచ్చెనుగనుక అర్జునునకు ధనంజయుడు అను పేరుగలదు. శ్రీమద్భగవద్గీత (10.30) లో గీతాచార్యుడు 'పాణ్డవానాం ధనఞ్జయః' అనగా పాండవులలో ధనంజయుడను నేనే అను వచనమును బట్టి ఆ అర్జునుడూ శ్రీ విష్ణుదేవుని విభూతియే.



अर्जुनो यद्दिग्विजयो प्रभूतमजयद्धनम् ।
धनञ्जयाख्योऽर्जुनोऽपि स्वाभेदेनोच्यते हरिः ।
पाण्डवानां धनञ्जय इतिगीता समीरणात् ॥

Arjuno yaddigvijayo prabhūtamajayaddhanam,
Dhanañjayākhyo’rjuno’pi svābhedenocyate hariḥ,
Pāṇḍavānāṃ dhanañjaya itigītā samīraṇāt. 

Arjuna acquired, by conquest abundant wealth required for the Rājasūya Yajña performed by Dharmarāja and Hence Arjuna has the name of Dhanañjaya also; and in Śrīmad Bhagavad Gīta Lord Himself said 'Pāṇḍavānāṃ Dhanañjayaḥ' meaning I am Arjuna amongst the pāṇḍavānās.


कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।
अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr̥tāgamaḥ,
Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

24 ఆగ, 2014

659. అనన్తః, अनन्तः, Anantaḥ

ఓం అనన్తాయ నమః | ॐ अनन्ताय नमः | OM Anantāya namaḥ


వ్యాప్తిత్వాదథ నిత్యత్వాత్ సర్వాత్మత్వాచ్చ కేశిహాః ।
దేశతఃకాల్తో వాపి వస్తుతశ్చాపి కేశవః ॥
అపరిచ్ఛిన్న ఇత్యేష స్వామ్యనన్త ఇతీరితః ।
సత్యం జ్ఞానమనన్తమిత్యాది శ్రుతిసమీరణాత్ ॥
గన్ధర్వాప్సరః సిద్ధాః కిన్నరోరగః చారణాః ।
నాన్తం గుణానాం గచ్ఛన్తి తేనానన్తోఽయమవ్యయః ॥
ఇతి విష్ణుపురాణే శ్రీపరాశరసమీరణాత్ ।
వాఽనన్త ఇత్యుచ్యతేఽయం విష్ణుర్విద్వద్భిరుత్తమైః ॥

ఎవనికి పరిమితీ, అంతము లేదో అట్టి పరమాత్ముడు అనన్తః. అ) వ్యాపిగావున దేశమునుబట్టి, ఆ) నిత్యుడుగావున కాలమునుబట్టి, ఇ) సర్వమును తానే కావున వస్తువునుబట్టి కాని ఈతని అవధి, అంతము పరిచ్ఛేదించ అనగా నిర్ణయించ శక్యము కాదు. లేదా విష్ణుపురానమునందు శ్రీ పరాశరమునిచే ప్రస్తావించబడినట్లు - గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, కిన్నరులు, నాగులు, చారణులు - ఇట్టి ఎవ్వరును ఈ పరమాత్ముని గుణముల చివరి హద్దును లేదా అంతమును చేరజాలరు. ఆ హేతువుచే అవికారియగు పరమాత్మ, అవ్యయుడు అనంతుడనబడుచున్నాడు.



व्याप्तित्वादथ नित्यत्वात् सर्वात्मत्वाच्च केशिहाः ।
देशतःकाल्तो वापि वस्तुतश्चापि केशवः ॥
अपरिच्छिन्न इत्येष स्वाम्यनन्त इतीरितः ।
सत्यं ज्ञानमनन्तमित्यादि श्रुतिसमीरणात् ॥
गन्धर्वाप्सरः सिद्धाः किन्नरोरगः चारणाः ।
नान्तं गुणानां गच्छन्ति तेनानन्तोऽयमव्ययः ॥
इति विष्णुपुराणे श्रीपराशरसमीरणात् ।
वाऽनन्त इत्युच्यतेऽयं विष्णुर्विद्वद्भिरुत्तमैः ॥

Vyāptitvādatha nityatvāt sarvātmatvācca keśihāḥ,
Deśataḥkālto vāpi vastutaścāpi keśavaḥ.
Aparicchinna ityeṣa svāmyananta itīritaḥ,
Satyaṃ jñānamanantamityādi śrutisamīraṇāt.
Gandharvāpsaraḥ siddhāḥ kinnaroragaḥ cāraṇāḥ,
Nāntaṃ guṇānāṃ gacchanti tenānanto’yamavyayaḥ.
Iti viṣṇupurāṇe śrīparāśarasamīraṇāt,
Vā’nanta ityucyate’yaṃ viṣṇurvidvadbhiruttamaiḥ.

As He pervades, as He is eternal and is of the nature of all ātmas, He is without limits of space, time and object. Hence Anantaḥ. By Viṣṇu Purāṇa text, the gandharvas, apsaras, siddhas, kinneras, uragas, and cāraṇas cannot exhaust the recital of His divine qualities. For that reason, He is Ananta, Avyaya - imperishable.

कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।
अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr̥tāgamaḥ,
Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

23 ఆగ, 2014

658. వీరః, वीरः, Vīraḥ

ఓం వీరాయ నమః | ॐ वीराय नमः | OM Vīrāya namaḥ


విష్ణుర్గత్యాది మత్త్యాత్సవీర ఇత్యభిధీయతే

'వీ' అను ధాతువునకు పలు అర్థములుగలవు. వీ గతి వ్యాప్తి ప్రజన కాన్తి అసన ఖాదనేషు. వ్యాప్తి - అనగా ఎందయినను చేరియుండువాడు; ప్రజననము - మిక్కిలిగా ప్రపంచమును జనింపజేయువాడు; కాంతి - ప్రకాశముగలవాడు; అసనము - అసురులు మొదలయిన వారిని సంహరించుటకై ఏ ఆయుధములయినను ఎంతటి దూరమునకయినను విసిరివేయ సామర్థ్యముగలవాడు; ఖాదము - ప్రళయకాలమున సర్వ ప్రాణులను హరించువాడు.

పై అర్థములుగల 'వీ' అను ధాతువునకు 'ర' - 'కలది' అను అర్థముగల ప్రత్యయము చేరగా వీరః అను నామము వచ్చును.  'వీ' ధాత్వర్థములన్నియు తన ధర్మములుగా గలవాడు కనుక ఆ విష్ణు దేవుడు వీరః అనబడును.

401. వీరః, वीरः, Vīraḥ
643. వీరః, वीरः, Vīraḥ



विष्णुर्गत्यादि मत्त्यात्सवीर इत्यभिधीयते  / Viṣṇurgatyādi mattyātsavīra ityabhidhīyate The root 'Vī' has many interpretations. वी गति व्याप्ति प्रजन कान्ति असन खादनेषु / Vī gati vyāpti prajana kānti asana khādaneṣu. 'Vī' can mean motion, pervasion (to pervade), creation, effulgence, throwing (weapon) and annihilation. The suffix 'ra' implies (the One) with. Hence Lord Viṣṇu by the reason of having all capabilities/attributes as defined by the root 'Vī' is Vīraḥ.

401. వీరః, वीरः, Vīraḥ
643. వీరః, वीरः, Vīraḥ
कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।
अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr̥tāgamaḥ,
Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

22 ఆగ, 2014

657. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ

ఓం విష్ణవే నమః | ॐ विष्णवे नमः | OM Viṣṇave namaḥ


రోదసీ వ్యాప్యకాన్తిరభ్యధికాస్యస్థితేతి సః ।
విష్ణురిత్యుచ్యతే సద్భిః కేశవోఽయం త్రివిక్రమః ॥

విషౢ వ్యాప్తౌ అను ధాతువు నుండి 'వేవేష్టి' - 'వ్యాపించి యున్నది' అను అర్థమున విష్ణు శబ్దము ఏర్పడును. పృథివీలోక ద్యుల్లోకముల నడిమి ప్రదేశమును వ్యాపించి ఈతని అభ్యధిక కాంతి నిలిచియున్నదిగావున విష్ణుః అనబడును.

:: శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
గతిశ్చ సర్వభూతానాం ప్రజనశ్చాపి భారత ।
వ్యాప్తా మే రోదసీ పార్థ కన్తిశ్చాభ్యధికా మమ ॥ 42 ॥
అధిభూతాని చాన్తేషు తదిచ్ఛంశ్చాస్మిభారత ।
క్రమణాచ్చాప్యహం పార్థ విష్ణురిత్యభిసం జ్ఞితః ॥ 43 ॥


అర్జునా! అన్ని ప్రాణులయొక్క గతి, ఉత్పత్తుల స్థానము నేనైయున్నాను. పృథివీ ఆకాశములంతటను వ్యాపించియున్నాను. నా తేజము అన్నిటిని మించినది. అంతకాలమునందు జీవిలు ఏ పరబ్రహ్మమును పొందగోరుతారో అదీ నేనే. నేను సర్వమును అతిక్రమించియున్నవాడను. ఈ కారణములవల్ల నాకు విష్ణువు అన్న నామముగలదు.

2. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ 
258. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ



रोदसी व्याप्यकान्तिरभ्यधिकास्यस्थितेति सः ।
विष्णुरित्युच्यते सद्भिः केशवोऽयं त्रिविक्रमः ॥

Rodasī vyāpyakāntirabhyadhikāsyasthiteti saḥ,
Viṣṇurityucyate sadbhiḥ keśavo’yaṃ trivikramaḥ.

From the root विषॢ व्याप्तौ / Viṣḷu vyāptau, the word वेवेष्टि / veveṣṭi is derived which means pervading - from which the word  Viṣṇu is derived. His splendor pervades the firmament and remains beyond; so Viṣṇuḥ.

:: श्रीमहाभारते शान्तिपर्वणि मोक्षधर्मपर्वणि एकचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
गतिश्च सर्वभूतानां प्रजनश्चापि भारत ।
व्याप्ता मे रोदसी पार्थ कन्तिश्चाभ्यधिका मम ॥ ४२ ॥
अधिभूतानि चान्तेषु तदिच्छंश्चास्मिभारत ।
क्रमणाच्चाप्यहं पार्थ विष्णुरित्यभिसं ज्ञितः ॥ ४३ ॥

Śrī Mahābhārata -  Book 12, Chapter 341
Gatiśca sarvabhūtānāṃ prajanaścāpi bhārata,
Vyāptā me rodasī ptha kantiścābhyadhikā mamaār. 42.
Adhibhūtāni cānteṣu tadicchaṃścāsmibhārata,
Kramaṇāccāpyahaṃ pārtha viṣṇurityabhisaṃ jñitaḥ. 43.

I am the Source and Destiny of all beings. I pervade firmament and beyond. Mine is the superior splendor. I am the destiny aspired by all upon during their end of life. I am situated atop having transgressed everything. These are the reasons O Arjuna, I am known as Viṣṇu.

2. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ 
258. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ

कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।
अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr̥tāgamaḥ,
Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

21 ఆగ, 2014

656. అనిర్దేశ్యవపుః, अनिर्देश्यवपुः, Anirdeśyavapuḥ

ఓం అనిర్దేశ్యవపుషే నమః | ॐ अनिर्देश्यवपुषे नमः | OM Anirdeśyavapuṣe namaḥ


ఇదం తదీదృశం వేతి నిర్దేష్టుం యన్న శక్యతే ।
గుణాద్యతీతయా శ్రీవిష్ణోరమితి తేజసః ।
తదేవ రూపమ్స్యేతి సోఽనిర్దేశ్యవపుర్హరిః ॥

గుణములు, రూపము మొదలగువానికి అతీతము కావున - ఇదీ, అదీ, ఇట్టిదీ అని నిర్దేశ్యించుటకు శక్యముకాని వపువు అనగా శరీరము ఈతనిదిగనుక అనిర్దేశ్యవపుః.

:: పోతన భాగవతము - సప్తమ స్కంధము ::
వ. ఇట్లు సర్వాత్మకంబై యిట్టి దట్టి దని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు దానయై య మ్మహావిష్ణునియందుఁ జిత్తంబుఁ జేర్చి తన్మయుండయి పరమానందంబునం బొంది యున్న ప్రహ్లాదునియందు రాక్షసేంద్రుడు దన కింకరుల చేతం జేయించుచున్న మారణకర్మంబులు పాపకర్ముని యందుఁ బ్రయుక్తంబులైన సత్కారంబులుం బోలె విఫలంబు లగుటం జూచి. (196)

ఇలా ప్రహ్లాదుడు ఎవరూ వర్ణింపలేని ఆ పరబ్రహ్మ స్వరూపం తానే అయ్యాడు. మనస్సు మహావిష్ణునియందు నిల్పి తనను తానే మరిచిపోయాడు. దివ్యమైన ఆనందంతో పరవశించి పోయాడు. పాపాత్ముని పట్ల జరిపే సన్మానాలు ఎలా అయితే విఫలం అవుతాయో అదే విధంగా ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు పెట్టే భయంకర బాధలన్నీ విఫలమై పోయాయి.

177. అనిర్దేశ్యవపుః, अनिर्देश्यवपुः, Anirdeśyavapuḥ



इदं तदीदृशं वेति निर्देष्टुं यन्न शक्यते ।
गुणाद्यतीतया श्रीविष्णोरमिति तेजसः ।
तदेव रूपम्स्येति सोऽनिर्देश्यवपुर्हरिः ॥

Idaṃ tadīdr̥śaṃ veti nirdeṣṭuṃ yanna śakyate,
Guṇādyatītayā śrīviṣṇoramiti tejasaḥ,
Tadeva rūpamsyeti so’nirdeśyavapurhariḥ.

Due to transcending the guṇās, it is impossible to indicate His form as 'this', 'that' or 'like this' and hence Lord Viṣṇu is called Anirdeśyavapuḥ.

:: श्रीमद्भागवते - सप्तमस्कन्धे, षष्टोऽध्यायः ::
प्रत्यगात्मस्वरूपेण दृश्यरूपेण च स्वयम् ।
व्याप्यव्यापकनिर्देश्यो ह्यनिर्देश्योऽविकल्पितः ॥ २२ ॥

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 6
Pratyagātmasvarūpeṇa dr̥śyarūpeṇa ca svayam,
Vyāpyavyāpakanirdeśyo hyanirdeśyo’vikalpitaḥ. (22)

He is indicated as that which is pervaded and as the all-pervading Supersoul, but actually He cannot be indicated. He is changeless and undivided. He is simply perceived as the supreme sac-cid-ānanda. Being covered by the curtain of the external energy, to the atheist He appears nonexistent.


कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।
अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr̥tāgamaḥ,
Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

20 ఆగ, 2014

655. కృతాగమః, कृतागमः, Kr̥tāgamaḥ

ఓం కృతాగమాయ నమః | ॐ कृतागमाय नमः | OM Kr̥tāgamāya namaḥ


యేనాగమః ఖలు కృతః శ్రుతిస్మృత్యాదిలక్షణః ।
శ్రుతిస్మృతీ మమైవాజ్ఞే ఇత్యుక్తైర్హరిణైవ వా ॥
వేదాశ్శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ ।
ఇతి విష్ణు పురాణేఽత్ర పరాశర మునీరణాత్ ॥

శ్రుతులు, స్మృతులు మొదలగు రూపమున ఉన్న శాస్త్రము ఎవనిచే రచించబడినదో అట్టివాడు కృతాగమః. శ్రుతిస్మృతీ మమైవాజ్ఞే - శ్రుతి స్మృతులు నా ఆజ్ఞలే అని ఆ పరమాత్ముడే చెప్పియున్నాడు. వేదాశ్శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్ధనాత్ అని విష్ణు పురాణమునందు పరాశర ముని చెప్పినవిధమున వేదములు, శాస్త్రములు, విజ్ఞానము - ఇది అంతయు జనార్దనుని నుండి ఉత్పత్తినందును.



येनागमः खलु कृतः श्रुतिस्मृत्यादिलक्षणः ।
श्रुतिस्मृती ममैवाज्ञे इत्युक्तैर्हरिणैव वा ॥
वेदाश्शास्त्राणि विज्ञानमेतत्सर्वं जनार्दनात् ।
इति विष्णु पुराणेऽत्र पराशर मुनीरणात् ॥

Yenāgamaḥ khalu kr̥taḥ śrutismr̥tyādilakṣaṇaḥ,
Śrutismr̥tī mamaivājñe ityuktairhariṇaiva vā.
Vedāśśāstrāṇi vijñānametatsarvaṃ janārdanāt,
Iti viṣṇu purāṇe’tra parāśara munīraṇāt.

The āgamas made up of śrutis and smr̥tis were all produced by Him and hence Kr̥tāgamaḥ vide the Lord's statement Śrutismr̥tī mamaivājñe - śruti and smr̥ti are my commands. And also as told by sage Parāśara in Viṣṇu Purāṇa Vedāśśāstrāṇi vijñānametatsarvaṃ janārdanāt - the Vedas, śāstrās and wisdom, all are from Lord Janārdana.

कामदेवः कामपालः कामी कान्तः कृतागमः
अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr̥tāgamaḥ,
Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

19 ఆగ, 2014

654. కాన్తః, कान्तः, Kāntaḥ

ఓం కాన్తాయ నమః | ॐ कान्ताय नमः | OM Kāntāya namaḥ


అభిరూపతమం దేహం వహన్ కాన్త ఇతీర్యతే ।
ద్విపరార్థాన్తకాలే దుఃఖాన్తఃకాన్తో హరిః స్మృతః ।
విష్ణుర్లోకాన్తకారీతి వా కాన్త ఇతి కథ్యతే ॥

మిగుల సుందరమగు దేహము కలిగియుండిన సుందరరూపుడు కాంతుడు. లేదా రెండు పరార్థముల కస్య అంతం కరోతి అను విభాగమున బ్రహ్మకు అంతము కలిగించువాడని కూడ అర్థము చెప్పవచ్చును. బ్రహ్మదేవుని కాలపరిమాణము ననుసరించి బ్రహ్మదేవుని కూడా అంతమందిచువాడుగనుక కాంతః.



अभिरूपतमं देहं वहन् कान्त इतीर्यते ।
द्विपरार्थान्तकाले दुःखान्तःकान्तो हरिः स्मृतः ।
विष्णुर्लोकान्तकारीति वा कान्त इति कथ्यते ॥

Abhirūpatamaṃ dehaṃ vahan kānta itīryate,
Dviparārthāntakāle duḥkhāntaḥkānto hariḥ smr̥taḥ,
Viṣṇurlokāntakārīti vā kānta iti kathyate.

Since He bears a very handsome body, He is called Kāntaḥ. Also, the divine name can be interpreted as combination of ka and antaḥ; ka meaning Lord Brahma and antaḥ meaning the end. Hence at the close of the second parārdha, the end of Brahma too arises from Him and hence He is Kāntaḥ.

कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।
अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr̥tāgamaḥ,
Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

18 ఆగ, 2014

653. కామీ, कामी, Kāmī

ఓం కామినే నమః | ॐ कामिने नमः | OM Kāmine namaḥ


పూర్ణకామ స్వరూపత్వాత్ కామీతి ప్రోచ్యతే హరిః ఈతని కోరికలు అన్నియును పూర్ణములు అయియే యున్నవి. ఈతడు పొందవలసిన కోరికల ఫలములు ఏవియు లేవు. పూర్ణ కామ స్వరూపుడు. పూర్ణ కాముడుగానుండుటయే ఈతని స్వరూపము.



पूर्णकाम स्वरूपत्वात् कामीति प्रोच्यते हरिः / Pūrṇakāma svarūpatvāt kāmīti procyate hariḥ As His desires are ever fulfilled, He is Kāmī.

कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।
अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr̥tāgamaḥ,
Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

17 ఆగ, 2014

652. కామపాలః, कामपालः, Kāmapālaḥ

ఓం కామపాలాయ నమః | ॐ कामपालाय नमः | OM Kāmapālāya namaḥ


సర్వేషాం కామినాం సర్వాన్ కామాన్ పాలయతీతి సః ।
కామపాల ఇతి ప్రోక్తో విష్ణుర్విబుధసత్తమైః ॥

కోరికలు కలవారి కోరికలను తీర్చి వారిని పాలించువాడుగనుక విష్ణువు కామపాలః అని చెప్పబడును.



सर्वेषां कामिनां सर्वान् कामान् पालयतीति सः ।
कामपाल इति प्रोक्तो विष्णुर्विबुधसत्तमैः ॥

Sarveṣāṃ kāmināṃ sarvān kāmān pālayatīti saḥ,
Kāmapāla iti prokto viṣṇurvibudhasattamaiḥ.

He takes care of the ones with desires by fulfilling them and hence Lord Viṣṇu is called Kāmapālaḥ.

कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।
अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr̥tāgamaḥ,
Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

16 ఆగ, 2014

651. కామదేవః, कामदेवः, Kāmadevaḥ

ఓం కామదేవాయ నమః | ॐ कामदेवाय नमः | OM Kāmadevāya namaḥ


ధర్మాదిపురుషార్థానాం చతుష్టయ మభీప్సుభిః ।
కామ్యత ఇత్యయం కామ ఉచ్యతే విబుధైర్హరిః ।
కామశ్చాసౌ స దేవశ్చ కామదేవ ఇతీర్యతే ॥

కోరికలు కోరువారిచేత కోరబడును కావున - 'ప్రార్థించబడును' అను అర్థమున భగవానుడు కామః అనబడును. 'కాముడు' అగు దేవుడు కావున 'కామదేవః' అగును. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అను నాలుగు పురుషార్థములను కోరువారు ఈతనిని ప్రార్థింతురు.



धर्मादिपुरुषार्थानां चतुष्टय मभीप्सुभिः ।
काम्यत इत्ययं काम उच्यते विबुधैर्हरिः ।
कामश्चासौ स देवश्च कामदेव इतीर्यते ॥

Dharmādipuruṣārthānāṃ catuṣṭaya mabhīpsubhiḥ,
Kāmyata ityayaṃ kāma ucyate vibudhairhariḥ,
Kāmaścāsau sa devaśca kāmadeva itīryate.

He is kāmyate or desired by those who wish to have the four puruṣārthas viz., dharma, artha, kāma, and mokṣa. So He is Kāma. He is Kāma and deva and hence He is Kāmadevaḥ.

कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।
अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥

Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr̥tāgamaḥ,
Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

15 ఆగ, 2014

650. హరిః, हरिः, Hariḥ

ఓం హరయే నమః | ॐ हरये नमः | OM Haraye namaḥ


సహేతుకం వా సంసారం హరతీతి హరిః స్మృతః జనన మరణ ప్రవాహ రూపమగు సంసారముల హేతువగు అవిద్యను కూడ హరించువాడు హరి.



सहेतुकं वा संसारं हरतीति हरिः स्मृतः / Sahetukaṃ vā saṃsāraṃ haratīti hariḥ smr̥taḥ Since He liquidates saṃsāra i.e., material existence with its cycle of births and deaths with its cause of avidya or lack of knowledge, He is called Hari.

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

14 ఆగ, 2014

649. కేశిహా, केशिहा, Keśihā

ఓం కేశిఘ్నే నమః | ॐ केशिघ्ने नमः | OM Keśighne namaḥ


కేశిహా, केशिहा, Keśihā

కేశినామానమసురమ్ హతవానితి కేశిహా కేశి అను నామముగల అసురుని హతమార్చినందున కేశిహా అను నామము ఆ విష్ణుదేవునకుగలదు.

ఇంద్రుడినీ, వరుణుడినిసైతము మించినవాడు, శౌర్యానికి సముద్రములాంటివాడు అయిన కేశి అనే రక్కసుడు కంసుని ప్రోత్సాహముతో వారువమై అనగా అశ్వ రూపమున వాయువేగముతో నందుని మందలోకి ప్రవేశించి సంకటములు కలిగించినవాడు.

:: పోతన భాగవతము దశమ స్కంధము పూర్వ భాగము ::
క. నలినాక్షుఁడు లీలాగతి, విఅలయముఁ బొందించె నిట్లు వీరావేశిన్‍
     బలలాశిన్ జగదభినవ, బలరాశిన్ విజితశక్రపాశిం గేశిన్‍. (1176)

వీరావేశం గలవాడు, మాంసాశనుడూ, లోకములో నూతనశక్తి రాశిగానున్నవాడు, ఇంద్రునీ, వరుణునీ జయించినవాడు అయిన కేశిని తామరరేకులవంటి కన్నులు గల శ్రీ కృష్ణుడు అలవోకగా అంతము నొందించినాడు.



केशिनामानमसुरम् हतवानिति केशिहा / Keśināmānamasuram hatavāniti keśihā Since Lord Viṣṇu killed an asura by name Keśi, He is called Keśihā.

The demon Keśi, sent by Kamsa, appeared in Vraja as a great horse. Running with the speed of the mind, he tore up the earth with his hooves. The hairs of his mane scattered the clouds, and he terrified everyone present with his loud neighing.When the Lord Kr̥ṣṇa saw how the demon was frightening His village of Gokula by neighing terribly and shaking the clouds with his tail, the Lord came forward to meet him. Keśi was searching for Krishna to fight, so the Lord stood before him and challenged him to approach.

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे सप्तत्रिंशोऽध्यायः ::
समेधमानेन स कृष्णबाहुना निरुद्धवायुस्चरणंश्च विक्षिपन् ।
प्रस्विन्नगात्रः परिवृत्तलोचनः पपात लण्डं विसृजन्क्षितौ व्यसुः ॥ ७ ॥
तद्देहतः कर्कतिकाफलोपमाद्व्यसोरपाकृष्य भुजं महाभुजः ।
अविस्मितोऽयत्नहतारिकः सुरैः प्रसूनवर्षैर्वर्षद्भिरीडितः ॥ ८ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 37
Samedhamānena sa kr̥ṣṇabāhunā niruddhavāyuscaraṇaṃśca vikṣipan,
Prasvinnagātraḥ parivr̥ttalocanaḥ papāta laṇḍaṃ visr̥jankṣitau vyasuḥ. 7.
Taddehataḥ karkatikāphalopamādvyasorapākr̥ṣya bhujaṃ mahābhujaḥ,
Avismito’yatnahatārikaḥ suraiḥ prasūnavarṣairvarṣadbhirīḍitaḥ. 8.

As Lord Kr̥ṣṇa's expanding arm completely blocked Keśi's breathing, his legs kicked convulsively, his body became covered with sweat, and his eyes rolled around. The demon then passed stool and fell on the ground, dead.

The mighty-armed Kr̥ṣṇa withdrew His arm from Keśi's body, which now appeared like a long karkatika fruit. Without the least display of pride at having so effortlessly killed His enemy, the Lord accepted the worship of gods in the form of flowers rained down from above.

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

13 ఆగ, 2014

648. కేశవః, केशवः, Keśavaḥ

ఓం కేశవాయ నమః | ॐ केशवाय नमः | OM Keśavāya namaḥ


కేశవః, केशवः, Keśavaḥ

సూర్యాదికేషు సఙ్క్రాన్తా అంశవః కేశసంజ్ఞితాః।
తద్వత్తయా కేశవ ఇత్యుచ్యతే విబుధైర్హరిః ॥

సూర్యుడు మొదలగు తేజో గోళములయందు సంక్రమించినట్టి (కేశములు అను వ్యవహార సంజ్ఞగల) కిరణములు ఈతనికి గలవు గనుక ఆ పరమాత్మునికి కేశవః అను నామము.

:: శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయాః ::
అంశవో యత్ ప్రకాశన్తే మమైతే కేశసంజ్ఞితాః ।
సర్వజ్ఞాః కేశవం తస్మాన్మామాహుర్ద్విజసత్తమాః ॥48 ॥

నా అంశువులు లేదా కిరణములు ఏవి ప్రకాశించుచున్నవో అవి కేశములు అను సంజ్ఞగలవి. అందువలననే సర్వజ్ఞులగు బ్రాహ్మణ శ్రేష్ఠులు నన్ను కేశవః అనుచున్నారు.

బ్రహ్మవిష్ణుశివాభిఖ్యాః శక్తయః కేశసంజ్ఞితాః ।
తద్వత్తయా వా కేశవ ఉక్త్రాస్త్రయ ఇత్ శ్రుతేః ॥

బ్రహ్మ, విష్ణు, శివులు - ఈ శక్తి త్రయమునకు 'కేశాః' అని వ్యవహారము. అట్టి కేశులు ఆ పరమాత్మయొక్క శక్తిరూపులుగా ఉన్నారు. 'త్రయః కేశినః' (ఋగ్వేదము 1.64.44) - 'కేశములు (తేజోవంతములైన కిరణములు) గలవారు ముగ్గురు చెప్పబడుచున్నారు' అని శ్రుతి వచించుచున్నది.

మునినా విష్ణుపురాణే మత్కేశౌ వసుధాతలే ।
ఇత్యత్ర కేశ శబ్దో హి ప్రయుక్తశ్శక్తి వాచకః ॥


నా కేశములు భూతలమునందు (బ్రహ్మ రుద్రులు) ప్రసిద్ధులుగానున్నారు అను విష్ణుపురాణ వచనముచే (పంచమాంశే ప్రథమోఽధ్యాయః) కేశ శబ్దము 'శక్తి' అను అర్థమును చెప్పునదిగా ప్రయోగించబడియున్నది.

త్రయః కేశిన ఇత్యాది శ్రుతౌ ధర్మైకమూలకే ।
కోబ్రహ్మేతి సమాఖ్యాతః ఈశోఽహం సర్వదేహినాం ॥
అవాన్తరాంశ సమ్భూతౌ తస్మాత్ కేశవ నామవాన్ ।
ఇతి హరివంశే వ్యాస మునినా పరికీర్తనాత్ ॥

'కః అనగా బ్రహ్మయని లెస్సగా చెప్పబడుచున్నది. నేను సర్వప్రాణులకును ఈశుడను. మేము ఇరువురము నీయంశ వలన జనించితిమి. అందువలన నీవు 'కేశవః' అను నామము కలవాడవయితివి' అని హరి వంశమున రుద్రుని వచనము.



सूर्यादिकेषु सङ्क्रान्ता अंशवः केशसंज्ञिताः।
तद्वत्तया केशव इत्युच्यते विबुधैर्हरिः ॥

Sūryādikeṣu saṅkrāntā aṃśavaḥ keśasaṃjñitāḥ,
Tadvattayā keśava ityucyate vibudhairhariḥ.

Keśa is the name given to rays of luminous objects like sun etc. As He has them, He is called Keśavaḥ.

:: श्रीमहाभारते शान्तिपर्वणि मोक्षधर्मपर्वणि एकचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायाः ::
अंशवो यत् प्रकाशन्ते ममैते केशसंज्ञिताः ।
सर्वज्ञाः केशवं तस्मान्मामाहुर्द्विजसत्तमाः ॥४८ ॥

Śrī Mahābhārata - Śānti Parva, Mokṣadharma Parva - Chapter 341
Aṃśavo yat prakāśante mamaite keśasaṃjñitāḥ,
Sarvajñāḥ keśavaṃ tasmānmāmāhurdvijasattamāḥ.48.

My rays which illumine are called keśas. Therefore, learned people, the best among the dvijas (twice born) call me Keśava.

ब्रह्मविष्णुशिवाभिख्याः शक्तयः केशसंज्ञिताः ।
तद्वत्तया वा केशव उक्त्रास्त्रय इत् श्रुतेः ॥

Brahmaviṣṇuśivābhikhyāḥ śaktayaḥ keśasaṃjñitāḥ,
Tadvattayā vā keśava uktrāstraya it śruteḥ.

The śaktis or powers called Brahmā, Viṣṇu and Śiva are designated as  Keśas. Having them, He is Keśava. Trayaḥ Keśinaḥ / त्रयः केशिनः (R̥g veda 1.64.44) - There are three Keśins.

मुनिना विष्णुपुराणे मत्केशौ वसुधातले ।
इत्यत्र केश शब्दो हि प्रयुक्तश्शक्ति वाचकः ॥

Muninā viṣṇupurāṇe matkeśau vasudhātale,
Ityatra keśa śabdo hi prayuktaśśakti vācakaḥ.

As mentioned in Viṣṇu purāṇa (part 5, chapter 1), 'My Keśas are in the earth.' Here too the word keśa is used as a synonym for śakti. 

त्रयः केशिन इत्यादि श्रुतौ धर्मैकमूलके ।
कोब्रह्मेति समाख्यातः ईशोऽहं सर्वदेहिनां ॥
अवान्तरांश सम्भूतौ तस्मात् केशव नामवान् ।
इति हरिवंशे व्यास मुनिना परिकीर्तनात् ॥

Trayaḥ keśina ityādi śrutau dharmaikamūlake,
Kobrahmeti samākhyātaḥ īśo’haṃ sarvadehināṃ.
Avāntarāṃśa sambhūtau tasmāt keśava nāmavān,
Iti harivaṃśe vyāsa muninā parikīrtanāt.

It is mentioned in Harivaṃśa that Rudra praises the Lord as 'Ka means Brahma and I am Īsa, the Lord of all that are embodied. We i.e, Brahma and Rudra are Your aṃśās i.e., manifestations. So, You have the name Keśavaḥ.

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

12 ఆగ, 2014

647. త్రిలోకేశః, त्रिलोकेशः, Trilokeśaḥ

ఓం త్రిలోకేశాయ నమః | ॐ त्रिलोकेशाय नमः | OM Trilokeśāya namaḥ


త్రిలోకేశః, त्रिलोकेशः, Trilokeśaḥ

త్రయోలోకాస్తదాజ్ఞప్తా వర్తన్తే స్వేషు కర్మసు ।
ఇతి విష్ణుస్త్రిలోకేశ ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥

మూడు లోకములును ఆతనిచే ఆజ్ఞానింపబాడినవగుచు తమ తమ కృత్యముల యందు ప్రవర్తిల్లుచున్నవిగనుక మూడు లోకములకును ఆ విష్ణుదేవుడు ప్రభువు. త్రిలోకేశః.

:: పోతన భాగవతము చతుర్థ స్కంధము ::
సీ. పంకజనాభాయ సంకర్షణాయ శాం, తాయ విశ్వప్రభోధాయ భూత
సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదే, వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వి
కారాయ కర్మవిస్తారకాయ త్రయీ, పాలాయ త్రైలోక్యపాలకాయ
సోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వ, యం జ్యోతిషే దురంతాయ కర్మ
తే. సాధనాయ పురాపురుషాయ యజ్ఞ, రేతసే జీవతృప్తాయ పృథ్విరూప
కాయ లోకాయ నభస్తేఽన్తకాయ విశ్వ యోనయే విష్ణవే జిష్ణవే నమోఽస్తు (702)

లోకాత్మకమైన పద్మము నీ బొడ్డున ఉన్నది. అహంకారానికి అధిష్ఠాతవయిన సంకర్షణుడవు నీవు. నీవు శాంతుడవు. విశ్వమునకు ఉపదేశకుడవు. తన్మాత్రలకు, ఇంద్రియములకు నీవే ఆశ్రయము. నీవు అవ్యక్తుడవు. చిత్తమునకు అధిష్ఠాతవయిన వాసుదేవుడవు నీవు. నీవు విశ్వమెల్లా నిండియుండెడివాడవు. పుణ్యశరీరుడవు. నిర్వికారుడవు. కర్మములనుండి దాటించువాడవు. వేదసంరక్షకుడవు. ప్రాణ రూపమున మూడు లోకాలలో విస్తరించియుండువాడవు నీవు. నీవు మూడు లోకములకును పాలకుడవు. నీవు సోమరూపుడవు. తేజో బలములుగలవాడవు. స్వయముగా ప్రకాశించెడివాడవు. నీవు అంతములేనివాడవు. కర్మములకును సాధనమైనవాడవు. పురాణ పురుషుడవు. యజ్ఞఫల రూపుడవు. జీవ తృప్తుడవు. భూ స్వరూపుడవు. ఆకాశము నీవే. నీవు ముఖాగ్నిచేత లోకలను దహిస్తావు. నీవు సృష్టికర్తవు. విష్ణుడవు. జిష్ణుడవు. నీకు నమస్కారము.



त्रयोलोकास्तदाज्ञप्ता वर्तन्ते स्वेषु कर्मसु ।
इति विष्णुस्त्रिलोकेश इति सङ्कीर्त्यते बुधैः ॥

Trayolokāstadājñaptā vartante sveṣu karmasu,
Iti viṣṇustrilokeśa iti saṅkīrtyate budhaiḥ.

Subject to His command, the three worlds perform their respective actions because of which Viṣṇu is called the Lord of three worlds or Trilokeśaḥ.

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे चतुर्विंशोऽध्यायः ::
सर्वसत्त्वात्मदेहाय विशेषाय स्थवीयसे ।
नमस्त्रैलोक्यपालाय सह ओजोबलाय च ॥ ३९ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 24
Sarvasattvātmadehāya viśeṣāya sthavīyase,
Namastrailokyapālāya saha ojobalāya ca. 39.

My dear Lord, You are the gigantic universal form which contains all the individual bodies of the living entities. You are the maintainer of the three worlds, and as such You maintain the mind, senses, body, and air of life within them. I therefore offer my respectful obeisances unto You.

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

11 ఆగ, 2014

646. త్రిలోకాత్మా, त्रिलोकात्मा, Trilokātmā

ఓం త్రిలోకాత్మనే నమః | ॐ त्रिलोकात्मने नमः | OM Trilokātmane namaḥ


త్రయాణామపి లోకానామన్తర్యామితయా హరిః ।
ఆత్మేతి వా త్రయో లోకా భిన్ద్యన్తే నైవ వస్తుతః ॥
ఇతి వోక్తస్త్రిలోకాత్మేత్యచ్యుతో విదుషాం వరైః ॥

ఎల్ల ప్రాణులకును అంతర్యామి రూపమున ఉన్నవాడు కావున మూడు లోకములకు దేహాంతర్వర్తి అయిన చైతన్యస్వరూపమైన ఆత్మ తానే. మూడు లోకములును ఎవని స్వరూపమో అట్టివాడు త్రిలోకాత్మా. ఏలయన లోక త్రయములు వాస్తవమున పరమాత్మ కంటె వేరుకావు గదా!



त्रयाणामपि लोकानामन्तर्यामितया हरिः ।
आत्मेति वा त्रयो लोका भिन्द्यन्ते नैव वस्तुतः ॥
इति वोक्तस्त्रिलोकात्मेत्यच्युतो विदुषां वरैः ॥

Trayāṇāmapi lokānāmantaryāmitayā hariḥ,
Ātmeti vā trayo lokā bhindyante naiva vastutaḥ.
Iti voktastrilokātmetyacyuto viduṣāṃ varaiḥ.

He is the indwelling Antaryāmi of all being in all the three worlds, i.e., He is their Ātma or Soul. Or since the three worlds are not really different from Him, He is Trilokātmā.

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

10 ఆగ, 2014

645. శూరజనేశ్వరః, शूरजनेश्वरः, Śūrajaneśvaraḥ

ఓం శూరజనేశ్వరాయ నమః | ॐ शूरजनेश्वराय नमः | OM Śūrajaneśvarāya namaḥ


యొవాసవాదీనాం శూరజనానాం పరమేశ్వరః ।
శౌర్యస్యాతిశయేనేష్టో విష్ణుః శూరజనేశ్వరః ॥

తన శౌర్యాతిశయముచే ఈతడు శూరజనులగు ఇంద్రాదులకును ఈశత్వము అనగా ప్రభుత్వమును వహించుచున్నాడు గనుక, ఆ విష్ణు దేవుడు శూరజనేశ్వరః అని చెప్పబడును.



यॊवासवादीनां शूरजनानां परमेश्वरः ।
शौर्यस्यातिशयेनेष्टो विष्णुः शूरजनेश्वरः ॥

Yóvāsavādīnāṃ śūrajanānāṃ parameśvaraḥ,
Śauryasyātiśayeneṣṭo viṣṇuḥ śūrajaneśvaraḥ.

By His superior prowess, exceedingly greater than heroes like Indra etc., He lords upon all these powerful ones and hence Lord Viṣṇu is called Śūrajaneśvaraḥ.

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

9 ఆగ, 2014

644. శౌరిః, शौरिः, Śauriḥ

ఓం శౌరయే నమః | ॐ शौरये नमः | OM Śauraye namaḥ


శౌరిః, शौरिः, Śauriḥ

శూరకులోద్భవత్వాచ్ఛౌరిరుచ్యతే శూరుడు అను యాదవుని వంశమున పురుష సంతతిగా జనించినందున శౌరిః. (వాసుదేవుడు వసుదేవుని పుత్రుడు. వసుదేవుని తండ్రి శూరసేనుడు)

:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
చ. హరి దన నాభిపంకరుహమందు జనించిన యట్టి భారతీ
    శ్వరుఁ డతిభక్తి వేఁడ యదువంశమునన్ బలకృష్ణమూర్తులై
    పరఁగ జనించి భూభారముఁ బాపిన భవ్యులు రేవతీందిరా
    వరు లట శూరసేనుని నివాసమునన్ సుఖ మున్నవారలే? (49)

తన నాభి కమలము నుండి పుట్టిన బ్రహ్మదేవుడు పరమభక్తితో ప్రార్థింపగా శ్రీహరి - బలరాముడుగా, కృష్ణుడుగా యదువంశములో ఉదయించినాడు. అటుల పుట్టి భూభారమును పోగొట్టిన మహోదయులు, రేవతీరుక్మిణీ హృదయప్రియులు అయిన రామకృష్ణులు తమ తాతగారు అయిన శూరసేనుని గృహములో సుఖముగా ఉన్నారా?



शूरकुलोद्भवत्वाच्छौरिरुच्यते / Śūrakulodbhavatvācchaurirucyate Since the Lord took birth in Śūra clan, He is called Śauriḥ. (Vasudeva is the father of Lord Vāsudeva; Vasudeva is son of Śūrasena).

:: श्रीमद्भागवते दशमस्कन्धे द्वितीयोऽध्यायः ::
ततो जग्न्मङ्गलमच्युतांशं समाहितं शूरसुतेन देवी ।
दधार सर्वात्मकमात्मभूतं काष्ठा यथानन्दकरं मनस्तः ॥ १८ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 2
Tato jagnmaṃgalamacyutāṃśaṃ samāhitaṃ śūrasutena devī,
Dadhāra sarvātmakamātmabhūtaṃ kāṣṭhā yathānaṃdakaraṃ manastaḥ. 18.

Thereafter, accompanied by plenary expansions, the fully opulent Lord, who is all-auspicious for the entire universe, was transferred from the mind of Vasudeva to the mind of Devakī. Devakī, having thus been initiated by Vasudeva, became beautiful by carrying Lord Kṛṣṇa, the original consciousness for everyone, the cause of all causes, within the core of her heart, just as the east becomes beautiful by carrying the rising moon.

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

8 ఆగ, 2014

643. వీరః, वीरः, Vīraḥ

ఓం వీరాయ నమః | ॐ वीराय नमः | OM Vīrāya namaḥ


వీరః, वीरः, Vīraḥ

వీరః శూరః శూరుడు, మహా విక్రమశాలి.

:: శ్రీమద్రామాయణే అరణ్యకాణ్డే త్రిపఞ్చాశస్సర్గః ::
నిమేషన్తరమాత్రేణ వినా భ్రాత్రా మహావనే ।
రాక్షసా నిహతా యేన సహస్రాణి చతుర్దశ ॥ 23 ॥
స కథం రాఘవో వీరః సర్వాస్త్రకుశలో బలీ ।
న త్వాం హన్యాచ్ఛరైస్తీక్ష్ణైః ఇష్టభార్యాపహారిణమ్ ॥ 24 ॥

(సీతా దేవి రావణునితో) ఆనాడు దండకారణ్యమునందు తమ్మునితోడు లేకుండగనే రాముడు ఒక్కడే ఖరుడు మొదలగు పదునాలుగువేలమంది రాక్షసయోధులను ఒక్క నిముషములో మట్టి గరిపించెను. వివిధములగు అస్త్రములను ప్రయోగించుటలో ఆరితేరినవాడు, మహా వీరుడు, బలశాలియు అయిన అట్టి శ్రీరాముడు అతని ప్రియభార్యను అపహరించిన నిన్ను తీక్ష్ణమైన శరములచే చంపకుండ ఎట్లుండగలడు?

401. వీరః, वीरः, Vīraḥ



वीरः शूरः / Vīraḥ Śūraḥ Brave and Valiant.

:: श्रीमद्रामायणे अरण्यकाण्डे त्रिपञ्चाशस्सर्गः ::
निमेषन्तरमात्रेण विना भ्रात्रा महावने ।
राक्षसा निहता येन सहस्राणि चतुर्दश ॥ २३ ॥
स कथं राघवो वीरः सर्वास्त्रकुशलो बली ।
न त्वां हन्याच्छरैस्तीक्ष्णैः इष्टभार्यापहारिणम् ॥ २४ ॥

Śrīmad Rāmāyaṇa - Book 3, Chapter 53
Nimeṣantaramātreṇa vinā bhrātrā mahāvane,
Rākṣasā nihatā yena sahasrāṇi caturdaśa. 23.
Sa kathaṃ rāghavo vīraḥ sarvāstrakuśalo balī,
Na tvāṃ hanyāccharaistīkṣṇaiḥ iṣṭabhāryāpahāriṇam. 24.

By whom fourteen thousand demons are killed in war just within a minute, single-handedly without any help from his brother, how then that brave and mighty Raghava, an expert in all kinds of missiles, not eliminate you, the stealer of his chosen wife, with his mordant arrows?" Thus Seetha poured forth her ire at Ravana

401. వీరః, वीरः, Vīraḥ

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

7 ఆగ, 2014

642. కాలనేమినిహా, कालनेमिनिहा, Kālaneminihā

ఓం కాలనేమినిఘ్నే నమః | ॐ कालनेमिनिघ्ने नमः | OM Kālaneminighne namaḥ


కాలనేమినిహా, कालनेमिनिहा, Kālaneminihā

అసురం కాలనేమింనిజఘానేతి జనార్దనః ।
కాలనేమినిహేత్యుక్తో వేదవిద్యా విశారదైః ॥

కాలనేమియను రక్కసుని సంహరించినందున ఆ జనార్దనునికి కాలనేమినిహా అను నామము గలదు.

:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::
ఆ. కాలనేమి ఘోర కంఠీరవము నెక్కి, తార్‍క్ష్యు శిరము శూలధారఁ బొడువ
     నతని పోటుముట్టు హరి కేల నంకించి, దానఁ జావఁ బొడిచె దానవునిని. (345)

కాలనేమి అను దానవ వీరుడు భయంకరమైన సింహముపై కూర్చొన్నవాడై, గరుడుని తలపై వాడియైన బల్లెముతో కుమ్మినాడు. వాని ఆయుధమును విష్ణువు పట్టుకొని దానితోనే ఆ రక్కసుడు చనిపోయేటట్లు పొడిచి సంహరించినాడు.



असुरं कालनेमिंनिजघानेति जनार्दनः ।
कालनेमिनिहेत्युक्तो वेदविद्या विशारदैः ॥

Asuraṃ kālanemiṃnijaghāneti janārdanaḥ,
Kālaneminihetyukto vedavidyā viśāradaiḥ.

Since Lord Janārdana killed the demon Kālanemini,He is called Kālaneminihā.

:: श्रीमद्भागवते अष्टमस्कन्धे दशमोऽध्यायः ::
दृष्ट्वा मृधे गरुडवाहमिभारिवाह आविध्य शूलमहिनोदथ कालनेमिः ।
तल्लिलया गरुडमूर्ध्नि पतद्गृहीत्वा तेनाहनन्नृप सवाहमरिं त्र्यधीशः ॥ ५६ ॥

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 10
Dr̥ṣṭvā mr̥dhe garuḍavāhamibhārivāha āvidhya śūlamahinodatha kālanemiḥ,
Tallilayā garuḍamūrdhni patadgr̥hītvā tenāhanannr̥pa savāhamariṃ tryadhīśaḥ. 56.

Being carried by a lion, the demon Kālanemini when he saw that the Lord carried by Garuda, was on the battlefield, he immediately took his trident, whirled it and discharged it at Garuda's head. Lord Hari, the master of the three worlds, immediately caught the trident, and with the very same weapon he killed the enemy Kalanemi, along with his carrier, the lion.

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

6 ఆగ, 2014

641. అమితవిక్రమః, अमितविक्रमः, Amitavikramaḥ

ఓం అమితవిక్రమాయ నమః | ॐ अमितविक्रमाय नमः | OM Amitavikramāya namaḥ


అమితోఽతులితో యస్య విక్రమస్స జనార్ధనః ।
అవిహింసిత విక్రమోఽమిత్ విక్రమ ఈర్యతే ॥

పరిమితముకాని అమితము అయిన విక్రమము, శక్తి లేదా పాదన్యాసము గలవాడు అమితవిక్రమః. లేదా ఎవరిచేతను బాధించబడనిదియగు విక్రమము కలవాడు.



अमितोऽतुलितो यस्य विक्रमस्स जनार्धनः ।
अविहिंसित विक्रमोऽमित् विक्रम ईर्यते ॥

Amito’tulito yasya vikramassa janārdhanaḥ,
Avihiṃsita vikramo’mit vikrama īryate.

The One with unlimited, incomparable valor. Or He whose valor has not been impaired is Amitavikramaḥ.

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

5 ఆగ, 2014

640. ప్రద్యుమ్నః, प्रद्युम्नः, Pradyumnaḥ

ఓం ప్రద్యుమ్నాయ నమః | ॐ प्रद्युम्नाय नमः | OM Pradyumnāya namaḥ


ద్యుమ్నం ప్రకృష్టం ద్రవిణం యస్య ప్రద్యుమ్న ఏవ సః ।
చతుర్వ్యూహేష్వన్యతమ ఇతి వా సతథోచ్యతే ॥

ఉత్తమమైన ద్యుమ్నము అనగా శుద్ధజ్ఞానరూపమగు ధనము ఈతనికి కలదుగనుక ప్రద్యుమ్నః. లేదా 'చతుర్వ్యూహ' (138. చతుర్వ్యూహః, चतुर्व्यूहः, Caturvyūhaḥ) నామము నందు ప్రస్తావించబడిన నాలుగు వ్యూహములలో ప్రద్యుమ్న వ్యూహము కూడ ఈతనే.

:: శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకోనచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
న చ జీవం వినా బ్రహ్మన్ వాయవశ్చేష్టయన్తుత ।
స జీవః పరిసంఖ్యాతహ్ శేషః సంకర్షణః ప్రభుః ॥ 36 ॥
తస్మాత్ సనత్కుమారత్వం యోఽలభత్ స్వేన కర్మణా ।
సస్మింశ్చ సర్వభూతాని ప్రలయం యాన్తి సంక్షయమ్ ॥ 37 ॥
స మనః సర్వభూతానాం ప్రద్యుమ్నః పరిపఠ్యేతే ।


జీవము లేక ప్రాణవాయువు వ్యాపారము అనగా చేష్ట చేయలేదు. అట్టి జీవమే శేషుడు లేదా భగవాన్ సంకర్షణుడుగా చెప్పబడుచున్నాడు. అట్టి సంకర్షణుడు లేదా జీవునినుండి ఉత్పన్నమై, తన కర్మల (ధ్యాన పూజాదులు) ద్వారా సనత్కుమారత్వమును అనగా జీవన్ముక్తిని పొందుతున్నది. అట్టి ఏ సనత్కుమారత్వమున సమస్త ప్రాణికోటియును లయ, క్షయములను పొందుచున్నవో, అట్టి సంపూర్ణ భూతముల మనమే 'ప్రద్యుమ్న' గా చెప్పబడుచున్నది.



द्युम्नं प्रकृष्टं द्रविणं यस्य प्रद्युम्न एव सः ।
चतुर्व्यूहेष्वन्यतम इति वा सतथोच्यते ॥

Dyumnaṃ prakr̥ṣṭaṃ draviṇaṃ yasya pradyumna eva saḥ,
Caturvyūheṣvanyatama iti vā satathocyate.

He who has infinite wealth. Or since being one of the four vyuhas (138. చతుర్వ్యూహః, चतुर्व्यूहः, Caturvyūhaḥ), Pradyumna is also the Lord Himself.

:: श्री महाभारते शान्तिपर्वणि मोक्षधर्मपर्वणि एकोनचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
न च जीवं विना ब्रह्मन् वायवश्चेष्टयन्तुत ।
स जीवः परिसङ्ख्यातह् शेषः सङ्कर्षणः प्रभुः ॥ ३६ ॥
तस्मात् सनत्कुमारत्वं योऽलभत् स्वेन कर्मणा ।
सस्मिंश्च सर्वभूतानि प्रलयं यान्ति संक्षयम् ॥ ३७ ॥
स मनः सर्वभूतानां प्रद्युम्नः परिपठ्येते । 


Śrī Mahābhārata - Book XII, Chapter 339
Na ca jīvaṃ vinā brahman vāyavaśceṣṭayantuta,
Sa jīvaḥ parisaṃkhyātah śeṣaḥ saṃkarṣaṇaḥ prabhuḥ.
36.
Tasmāt sanatkumāratvaṃ yo’labhat svena karmaṇā,
Sasmiṃśca sarvabhūtāni pralayaṃ yānti saṃkṣayam.
37.
Sa manaḥ sarvabhūtānāṃ pradyumnaḥ paripaṭhyete,

Without, again, the entrance of Jīva into the body, the mind dwelling within it cannot cause it to move and act. He that enters the body is possessed of great puissance and is called Jīva. He is known also by other names, viz., Śeṣa and Sankarṣana. He that takes his rise, from that Sankarṣana, by his own acts, Sanatkumāra, and in whom all creatures merge when the universal dissolution comes, is the Mind of all creatures and is called by the name of Pradyumna.

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

4 ఆగ, 2014

639. అప్రతిరథః, अप्रतिरथः, Apratirathaḥ

ఓం అప్రతిరథాయ నమః | ॐ अप्रतिरथाय नमः | OM Apratirathāya namaḥ


న విద్యతే ప్రతిరథః ప్రతిపక్షోఽస్య చక్రిణః ।
ఇత్యప్రతిరథ ఇతి ప్రోచ్యతే విబుధైర్హరిః ॥

పోటీబడగల ప్రతిపక్షుడు అనగా ప్రతిరథుడు లేనివాడు అప్రతిరథః. ఆ పరమాత్మతో పోటీబడగల సమర్థుడెవ్వడు?



न विद्यते प्रतिरथः प्रतिपक्षोऽस्य चक्रिणः ।
इत्यप्रतिरथ इति प्रोच्यते विबुधैर्हरिः ॥

Na vidyate pratirathaḥ pratipakṣo’sya cakriṇaḥ,
Ityapratiratha iti procyate vibudhairhariḥ.

The One who has no opponent rival to Him is Apratirathaḥ. Who is competent enough to rival the Lord?

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

3 ఆగ, 2014

638. అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ

ఓం అనిరుద్ధాయ నమః | ॐ अनिरुद्धाय नमः | OM Aniruddhāya namaḥ



చతుర్వ్యూహేషు చతురః శత్రుర్భిర్ననిరుద్ధ్యతే ।
కదాచిద్వేతి సవిష్ణురనిరుద్ధ ఇతీర్యతే ॥

వాసుదేవుడు, ప్రద్యుమ్నుడూ, సంకర్షణుడూ, అనిరుద్ధుడూ అను నాలుగు వ్యూహములలో నాలుగవ వ్యూహము కూడ తానే అయి యున్నవాడు. లేదా ఎన్నడును శత్రువులచే అడ్డగించబడువాడు కాడు.

:: శ్రీ మహాభారతే శాన్తి పర్వణి మోక్షధర్మపర్వణి ఏకచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
తస్మాత్ సర్వాః ప్రవర్తన్తే సర్గప్రలయవిక్రియాః ।
తపో యజ్ఞశ్చ యష్టా చ పురాణాః పురుషో విరాట్ ॥ 25 ॥
అనిరుద్ధ ఇతి ప్రోక్తో లోకానాం ప్రభవాప్యయః । 25 ½

(పదునెనిమిది గుణాలుగల సత్త్వము అనగా ఆదిపురుషరూపము) నుండే సృష్టి ప్రళయము అనే సంపూర్ణ వికారములు ఉద్భవిస్తాయి. ఆ స్వరూపమే తపమూ, యజ్ఞమూ, యజమానీ. అదే పురాతన విరాట్ రూపము. దానినే అనిరుద్ధుడు అని కూడా అందురు. దాని నుండే లోకాల సృష్టీ ప్రళయాలు సంభవిస్తాయి.

185. అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ



चतुर्व्यूहेषु चतुरः शत्रुर्भिर्ननिरुद्ध्यते ।
कदाचिद्वेति सविष्णुरनिरुद्ध इतीर्यते ॥

Caturvyūheṣu caturaḥ śatrurbhirnaniruddhyate,
Kadācidveti saviṣṇuraniruddha itīryate.

Of the four Vyuha forms or manifestations of God, the fourth i.e., Aniruddha is also Lord's form. Or the One who is never overcome by adversaries.

:: श्री महाभारते शान्ति पर्वणि मोक्षधर्मपर्वणि एकचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
तस्मात् सर्वाः प्रवर्तन्ते सर्गप्रलयविक्रियाः ।
तपो यज्ञश्च यष्टा च पुराणाः पुरुषो विराट् ॥ २५ ॥
अनिरुद्ध इति प्रोक्तो लोकानां प्रभवाप्ययः । २५ ½

Śrī Mahābhārata - Book XII, Chapter 342
Tasmāt sarvāḥ pravartante sargapralayavikriyāḥ,
Tapo yajñaśca yaṣṭā ca purāṇāḥ puruṣo virāṭ. 25.
Aniruddha iti prokto lokānāṃ prabhavāpyayaḥ (25 ½)

From (Supreme Nature) it flows all the modifications of both Creation and Destruction. (It is identical with my Prakr̥ti or Nature). It is the penances that people undergo. He is both the sacrifice that is performed and the sacrificer that performs the sacrifice. He is the ancient and the infinite Puruṣa. He is otherwise called Aniruddha and is the source of the Creation and the Destruction of the universe.

185. అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

2 ఆగ, 2014

637. విశోధనః, विशोधनः, Viśodhanaḥ

ఓం విశోధనాయ నమః | ॐ विशोधनाय नमः | OM Viśodhanāya namaḥ


విశోధనః, विशोधनः, Viśodhanaḥ

స్మృతిమాత్రేణ పాపానాం (శోధనాత్‍) క్షపణాత్ స విశోధనః తన స్మరణ మాత్రముచేతనే పాపములను నశింపజేసి పాపులను విశుద్ధులనుగా చేయువాడు విశోధనః

:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
సీ. బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్ని కీలలు హరినామ కీర్తనములు
గురుతల్ప కల్మష క్రూర సర్పములకుఁ గేకులు హరినామ కీర్తనములు
తపనీయ చౌర్య సంతమసంబుకను సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు
మధుపాన కిల్బిష మదనాగ సమితికిఁ గేసరుల్ హరినామ కీర్తనములు
గీ. మహిత యోగోగ్ర నిత్యసమాధి విధుల, నలరు బ్రహ్మాది సురులకు నందరాని
భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య, ఖేలనంబులు హరినామ కీర్తనములు. (118)

భగవంతుని నామసంకీర్తనలు బ్రహ్మహత్య మొదలైన పాపాములు అనే అడవులకు అగ్నిజ్వాలలు. హరినామ కీర్తనలు గురుద్రోహమనే ఘోర సర్పాలకు నెమళ్ళు. భగవన్నామ కీర్తనలు బంగారమును దోంగిలించడమనే మహా పాపరూపమైన చీకట్లను పోగొట్టే సూర్యకిరణములు.  హరినామ కీర్తనములు మధుపాన మహాపాపమనే మదపుటేనుగులను సంహరించే సింహాలు. మహిమతోగూడిన యోగసమాధి విధులతో ఒప్పే బ్రహ్మ మొదలగు దేవతలకు సైతము అందరాని మోక్ష సామ్రాజ్య వైభవ విలాసములు హరినామ కీర్తనములు.



स्मृतिमात्रेण पापानां (शोधनात्‍) क्षपणात् स विशोधनः / Smr̥timātreṇa pāpānāṃ (śodhanātˈ) kṣapaṇāt sa Viśodhanaḥ Since by mere remembrance He erases the sins, he purifies the sinners and hence He is Viśodhanaḥ.

:: श्रीमद्भागवते षष्ठस्कन्धे द्वितीयोऽध्यायः ::
अयम् हि कृतनिर्वेशो जन्मकोट्यंहसामपि ।
यद्व्याजहार विवशो नाम स्वस्त्ययनं हरेः ॥ ७ ॥

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 2
Ayam hi kr̥tanirveśo janmakoṭyaṃhasāmapi,
Yadvyājahāra vivaśo nāma svastyayanaṃ hareḥ. 7.

(Ajāmiḷa) has already atoned for all his sinful actions. Indeed, he has atoned not only for sins performed in one life but for those performed in millions of lives, for in a helpless condition he chanted the holy name of Nārāyaṇa. Even though he did not chant purely, he chanted without offense, and therefore he is now pure and eligible for liberation.

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

1 ఆగ, 2014

636. విశుద్ధాత్మా, विशुद्धात्मा, Viśuddhātmā

ఓం విశుద్ధాత్మనే నమః | ॐ विशुद्धात्मने नमः | OM Viśuddhātmane namaḥ


అసావాత్మా విశుద్ధశ్చ విశుద్ధాత్మేతి కథ్యతే గుణత్రయాతీతుడు కావున విశుద్ధమగు ఆత్మ స్వరూపము గల ఆ పరమాత్మ విశుద్ధాత్మగా పిలువబడును.



असावात्मा विशुद्धश्च विशुद्धात्मेति कथ्यते / Asāvātmā viśuddhaśca viśuddhātmeti kathyate Since He is beyond the three guṇas, He is Viśuddha or pure.  Since His is the purest ātma or soul, He is Viśuddhātmā.

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥