ఓం త్రిలోకేశాయ నమః | ॐ त्रिलोकेशाय नमः | OM Trilokeśāya namaḥ
త్రిలోకేశః, त्रिलोकेशः, Trilokeśaḥ |
త్రయోలోకాస్తదాజ్ఞప్తా వర్తన్తే స్వేషు కర్మసు ।
ఇతి విష్ణుస్త్రిలోకేశ ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥
మూడు లోకములును ఆతనిచే ఆజ్ఞానింపబాడినవగుచు తమ తమ కృత్యముల యందు ప్రవర్తిల్లుచున్నవిగనుక మూడు లోకములకును ఆ విష్ణుదేవుడు ప్రభువు. త్రిలోకేశః.
:: పోతన భాగవతము చతుర్థ స్కంధము ::
సీ. | పంకజనాభాయ సంకర్షణాయ శాం, తాయ విశ్వప్రభోధాయ భూత |
సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదే, వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వి | |
కారాయ కర్మవిస్తారకాయ త్రయీ, పాలాయ త్రైలోక్యపాలకాయ | |
సోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వ, యం జ్యోతిషే దురంతాయ కర్మ | |
తే. | సాధనాయ పురాపురుషాయ యజ్ఞ, రేతసే జీవతృప్తాయ పృథ్విరూప |
కాయ లోకాయ నభస్తేఽన్తకాయ విశ్వ యోనయే విష్ణవే జిష్ణవే నమోఽస్తు (702) |
లోకాత్మకమైన పద్మము నీ బొడ్డున ఉన్నది. అహంకారానికి అధిష్ఠాతవయిన సంకర్షణుడవు నీవు. నీవు శాంతుడవు. విశ్వమునకు ఉపదేశకుడవు. తన్మాత్రలకు, ఇంద్రియములకు నీవే ఆశ్రయము. నీవు అవ్యక్తుడవు. చిత్తమునకు అధిష్ఠాతవయిన వాసుదేవుడవు నీవు. నీవు విశ్వమెల్లా నిండియుండెడివాడవు. పుణ్యశరీరుడవు. నిర్వికారుడవు. కర్మములనుండి దాటించువాడవు. వేదసంరక్షకుడవు. ప్రాణ రూపమున మూడు లోకాలలో విస్తరించియుండువాడవు నీవు. నీవు మూడు లోకములకును పాలకుడవు. నీవు సోమరూపుడవు. తేజో బలములుగలవాడవు. స్వయముగా ప్రకాశించెడివాడవు. నీవు అంతములేనివాడవు. కర్మములకును సాధనమైనవాడవు. పురాణ పురుషుడవు. యజ్ఞఫల రూపుడవు. జీవ తృప్తుడవు. భూ స్వరూపుడవు. ఆకాశము నీవే. నీవు ముఖాగ్నిచేత లోకలను దహిస్తావు. నీవు సృష్టికర్తవు. విష్ణుడవు. జిష్ణుడవు. నీకు నమస్కారము.
त्रयोलोकास्तदाज्ञप्ता वर्तन्ते स्वेषु कर्मसु ।
इति विष्णुस्त्रिलोकेश इति सङ्कीर्त्यते बुधैः ॥
Trayolokāstadājñaptā vartante sveṣu karmasu,
Iti viṣṇustrilokeśa iti saṅkīrtyate budhaiḥ.
Subject to His command, the three worlds perform their respective actions because of which Viṣṇu is called the Lord of three worlds or Trilokeśaḥ.
:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे चतुर्विंशोऽध्यायः ::
सर्वसत्त्वात्मदेहाय विशेषाय स्थवीयसे ।
नमस्त्रैलोक्यपालाय सह ओजोबलाय च ॥ ३९ ॥
Śrīmad Bhāgavata - Canto 4, Chapter 24
Sarvasattvātmadehāya viśeṣāya sthavīyase,
Namastrailokyapālāya saha ojobalāya ca. 39.
My dear Lord, You are the gigantic universal form which contains all the individual bodies of the living entities. You are the maintainer of the three worlds, and as such You maintain the mind, senses, body, and air of life within them. I therefore offer my respectful obeisances unto You.
कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः । |
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥ |
కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః । |
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥ |
Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ, |
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి