29 ఆగ, 2014

664. బ్రహ్మ, ब्रह्म, Brahma

ఓం బ్రాహ్మణే నమః | ॐ ब्राह्मणे नमः | OM Brāhmaṇe namaḥ


సత్త్వాది లక్షణం బ్రహ్మ సత్యం జ్ఞానమితి శ్రుతేః ।
ప్రత్యస్తమితి భేదం యత్ సత్తా మాత్రమగోచరమ్ ॥
వచసా మాత్మ సంవేద్యం తద్‍జ్ఞానం బ్రహ్మ సంజ్ఞితం ।
ఇతి విష్ణు పురాణే శ్రీ పరాశరసమీరణాత్ ॥

'బృహి - వృద్ధౌ' అను ధాతువునుండి బృంహతి - వృద్ధినందును, చాల పెద్దదిగనుండును, బృంహయతి - వృద్ధినందిచును అను అర్థములలో 'బ్రహ్మ' అను శబ్దము నిష్పన్నమగుచున్నది.

'సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ' అను తైత్తిరీయోపనిషద్ వాక్యమునుబట్టి సత్యము, జ్ఞానము అనునవి తన రూపముగా కలదియు, అవధిరహితమును అగునది 'బ్రహ్మ'. ఈ శ్రుతి వాక్యముననుసరించి మిగుల పెద్దదియు, అనంతమయినదియు, అన్నిటిని సృజించునదియు, వర్ధిల్లజేయునదియునగు బ్రహ్మతత్త్వమే శ్రీ విష్ణువు.

:: శ్రీ విష్ణుమహాపురాణే షష్ఠాంశే సప్తమోఽధ్యాయః ::
ప్రత్యస్త్మితభేదం యత్సత్తామాత్రమగోచరమ్ ।
వచసామాత్మసంవేద్యం తజ్ఞ్జ్ఞానం బ్రహ్మసంజ్ఞితమ్ ॥ 53 ॥

విశేష రూపమున మరుగు పడిన సకల భేదములు కలిగినదియు, ఏకైకాఖండ తత్త్వమును, సత్తా అనగా ఉనికి మాత్రము తన రూపముగా కలదియు, వాక్కులకు అగోచరమును, తన అంతర్ముఖ వృత్తిగల ఆత్మతత్త్వమునకు మాత్రమే తెలియునదియు అగు ఏ జ్ఞానము కలదో అదియే బ్రహ్మము అను నామము కలది.



सत्त्वादि लक्षणं ब्रह्म सत्यं ज्ञानमिति श्रुतेः ।
प्रत्यस्तमिति भेदं यत् सत्ता मात्रमगोचरम् ॥
वचसा मात्म संवेद्यं तद्‍ज्ञानं ब्रह्म संज्ञितं ।
इति विष्णु पुराणे श्री पराशरसमीरणात् ॥

Sattvādi lakṣaṇaṃ brahma satyaṃ jñānamiti śruteḥ,
Pratyastamiti bhedaṃ yat sattā mātramagocaram.
Vacasā mātma saṃvedyaṃ tadˈjñānaṃ brahma saṃjñitaṃ,
Iti viṣṇu purāṇe śrī parāśarasamīraṇāt.

From the root 'Br̥hi', Br̥ṃhati meaning the one that grows, Br̥ṃhayati - the one that causes growth, the word Brahma originates.

As explained in Taittirīya upaniṣad 'Satyaṃ Jñānamanaṃtaṃ Brahma' - Brahma is of the nature of existence, knowledge and infinitude. Being great and all-pervading, Lord Viṣṇu, hence, is Brahma.

:: श्री विष्णुमहापुराणे षष्ठांशे सप्तमोऽध्यायः ::
प्रत्यस्त्मितभेदं यत्सत्तामात्रमगोचरम् ।
वचसामात्मसंवेद्यं तज्ञ्ज्ञानं ब्रह्मसं ज्ञितम् ॥ ५३ ॥

Śrī Viṣṇu Mahā Purāṇa - Part 6, Chapter 7
Pratyastmitabhedaṃ yatsattāmātramagocaram,
Vacasāmātmasaṃvedyaṃ tajñjñānaṃ brahmasaṃ jñitam. 53.

That Knowledge which negates difference, which refers to pure existence, which is beyond the grasp of senses and realized in the Self is indicated by Brahma.

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ,
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి