28 ఆగ, 2014

663. బ్రహ్మా, ब्रह्मा, Brahmā

ఓం బ్రహ్మణే నమః | ॐ ब्रह्मणे नमः | OM Brahmaṇe namaḥ


బ్రహ్మా, ब्रह्मा, Brahmā

బ్రహ్మా బ్రహ్మాత్మనాసర్వం సృజతీతి జనార్దనః ।
బృహత్వాత్ బృంహణత్వాచ్చ విష్ణుర్బ్రహ్మేతి కీర్త్యతే ॥

జగములను సృజించెడి కార్యబ్రహ్మ అయిన చతుర్ముఖ బ్రహ్మనుగూడ సృజించెడి కారణ బ్రహ్మ జనార్దనుడు. కావుననే బ్రహ్మా. మరియు కార్యకారణాతీత బ్రహ్మను, బృహత్వ బ్రహ్మణ్యములును తనలోనే కలిగియున్నందున విష్ణుదేవుడు బ్రహ్మా అని కీర్తించబడుతాడు.

వ.అనఘా! యేనును బ్రహ్మయు శివుండును నీజగంబులకుఁ గారణభూతుల; మందు నే నీశ్వరుండను నుపద్రష్టను స్వయంప్రకాశకుండను నై గుణమయం బయిన యాత్మీయమాయం బ్రవేశించి జనన వృద్ధి విలయంబులకు హేతు భూతంబు లగు తత్తత్‍క్రియోచితంబులైన బ్రహ్మరుద్రాది నామధేయంబుల నొందు చుందుదు; నట్టి నద్వితీయ బ్రహ్మరూపకుండ నైన నా యందు నజ భవాదులను భూతగణంబులను మూఢుండగువాఁడు వేరుగాఁ జూచు; మనుజుండు శరీరంబునకుఁ గరచరణాదులు వేరుగాఁ దలంపని చందంబున మద్భక్తుం డగువాఁడు నా యందు భూతజాలంబు భిన్నంబుగాఁ దలంపండు. గావున మా మువ్వుర నెవ్వండు వేరు సేయకుండు వాఁడు కృతార్థుండని యానతిచ్చిన దక్షుండును. (207)

పుణ్యాత్ముడా! నేనూ, బ్రహ్మ, శివుడూ మువ్వురం ఈ లోకములకు హేతుభూతులము. నేను ఈశ్వరుడను. సాక్షిని స్వయంప్రకాశకుడను. నేను త్రిగుణాత్మకమైన నా మాయను ప్రవర్తింపజేసి సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహిస్తూ ఆయా పనులకు తగిన బ్రహ్మరుద్రాది నామములను పొందుతు ఉంటాను. నా కంటె వేరగు పరబ్రహ్మ రూపము లేదు. బ్రహ్మ, శివుడు మొదలగు వారినీ, జీవకోటినీ బుద్ధిహీనుండు నా కంటె వేరుగా చూస్తాడు. మనుష్యుడు తన చేతులు, కాళ్ళు మొదలగు అవయవములను తన శరీరముకంటె వేరుగ చూడడుగదా! అటులనే నా భక్తుడు జీవులను నా కంటె వేరుగ భావింపడు. హరిహరబ్రహ్మలమైన మా ముగ్గురును వేరుగ చూడనివాడు ధన్యుడు.



ब्रह्मा ब्रह्मात्मनासर्वं सृजतीति जनार्दनः ।
बृहत्वात् बृंहणत्वाच्च विष्णुर्ब्रह्मेति कीर्त्यते ॥

Brahmā brahmātmanāsarvaṃ sr̥jatīti janārdanaḥ,
Br̥hatvāt br̥ṃhaṇatvācca viṣṇurbrahmeti kīrtyate.

Lord Brahma, who creates the worlds is himself created by Lord Janardana and hence He is Brahmā. As also since Lord Viṣṇu contains the universe along with its creator within Himself, He is called Brahmā.

:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे सप्तमोऽध्यायः ::
अहं ब्रह्मा च शर्वश्च जगतः कारणं परम् ।
आत्मेश्वर उपद्रष्टा स्वयन्दृगविशॆषणः ॥ ५० ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 7
Ahaṃ brahmā ca śarvaśca jagataḥ kāraṇaṃ param,
Ātmeśvara upadraṣṭā svayandr̥gaviśeṣaṇaḥ. 50.

Brahmā, Lord Śiva and I are the supreme cause of the material manifestation. I am the Supersoul, the self sufficient witness. But impersonally there is no difference between Brahmā, Lord Śiva and Me.

ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥

Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ,
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి