ఓం ప్రాణదాయ నమః | ॐ प्राणदाय नमः | OM Prāṇadāya namaḥ
ప్రాణాన్ దదాతి ప్రాణులు చేష్టించుటకు ఆవస్యకమగు పంచ మహా ప్రాణములు అయిన ప్రాణము, అపానము, వ్యానము, ఉదాన సమానములూ, పంచ ఉపప్రాణములు అయిన నాగము, కూర్మము, కృకరము, దేవదత్త ధనంజయములను జీవులకు ఇచ్చు వాడు.
:: తైత్తీరీయోపనిషత్ - ద్వితీయాధ్యాయః, సప్తమోఽనువాకః ::
అసద్వా ఇదమగ్ర ఆసీత్ । తతో వై స దజాయత తదాత్మానగ్‍ం స్వయ మకురుత । తస్మాత్తత్సుకృత ముచ్యత ఇతి । యద్వై తత్సుకృతమ్ । రసో వై సః । రసగ్‍ం హ్యేవాయం లబ్ధ్వాఽఽనందీ భవతి । కే హ్యేవాఽన్యాత్కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ । ఏష హ్యేవానందయాతి ॥ 1 ॥
పూర్వమునందు పరబ్రహ్మ స్వరూపముగా చెప్పబడిన ఈ ప్రపంచము సృష్టికి పూర్వము వ్యాకృతమై నామరూప విశేషములకు విపరీతమగు అవ్యాకృతమైన పరబ్రహ్మముగానే యుండెను. అట్టి అవ్యాకృత పరబ్రహ్మము నుండియే ప్రవివిక్తమగు నామరూప విశేషముగల జగత్తు పుట్టెను. ఏ కారణమువలన ఆ పరబ్రహ్మము ఈ ప్రకారము తన్ను తాను చేసికొనెనో ఆ కారణమునుండియే బ్రహ్మము స్వకర్తృకమైనదని చెప్పబడుచున్నది. ఇట్లు స్వకర్తృకమైన ఆ పరబ్రహ్మము, తృప్తి హేతువగు ఆనందకరమైన రసస్వరూపముగానున్నది. ఇట్టి రసస్వరూపమును జీవి పొంది సుఖవంతుడగుచున్నాడు. ఈ సుఖస్వరూపమైన పరమాత్మ హృదయాకాశమునందు లేని యెడల ఎవడు ప్రాణాపానాది వ్యాపారము చేయును? ఈ పరమాత్మయే లోకమును సుఖపెట్టుచున్నాడు.
Prāṇān dadāti One who bestows or activates the five main vital energies of Prāṇa, Apāna, Vyāna, Udāna and Samāna as also the other (sub vital) energies of Nāga, Kūrma, Kr̥kara, Devadatta and Dhananjaya.
Taittīrīyopaniṣat - Chapter 2, Anuvāka 7
Asadvā idamagra āsīt, Tato vai sa dajāyata tadātmānagˈṃ svaya makuruta, Tasmāttatsukr̥ta mucyata iti, Yadvai tatsukr̥tam, Raso vai saḥ, Rasagˈṃ hyevāyaṃ labdhvā’’naṃdī bhavati, Ke hyevā’nyātkaḥ prāṇyāt yadeṣa ākāśa ānaṃdo na syāt, Eṣa hyevānaṃdayāti. (1)
In the beginning was verily this non-existent. From that (Parabrahma) was generated the existent. That made Itself by Itself. Therefore It is called Self-made. That one who is self-made is verily the joy. Having attained this joy, (man) becomes blessed. Who would have lived and breathed, had not this sky of bliss existed? This verily It is that bestows bliss.
ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः । |
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥ |
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః । |
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥ |
Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ । |
Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి