14 జన, 2013

72. మాధవః, माधवः, Mādhavaḥ

ఓం మాధవాయ నమః | ॐ माधवाय नमः | OM Mādhavāya namaḥ


మాయాః ధవః (శ్రియః పతిః) మా అనగా శ్రీ లేదా లక్ష్మి. ఆమెకు ధవుడు అనగా పతి. లేదా బృహదారణ్యకోపనిషత్తునందు ప్రతిపాదించబడిన 'మధు' విద్యచే బోధింపబడువాడు కావున 'మాధవః'. మధోః అయమ్ ఇతడు 'మధు' విద్యకు సంబంధించినవాడు అని విగ్రహవాక్యము. మధు విద్యచే బోధింపబడుటయే పరమాత్మునకు ఆ విద్యతో గల సంబంధము. లేదా 'మౌనా ద్ధ్యానాచ్చ యోగాచ్చ విద్ధి భారత మాధవమ్‌.' (మహాభారతము - ఉద్యోగ పర్వము, సనత్ సుజాత పర్వము 4) 'హే భారతా! మౌనము (మననము) వలనను, ధ్యానము వలనను యోగము (తత్త్వానుసంధానము) వలనను మాధవుని ఎరుగుము' అను వ్యాస వచనము ననుసరించి మౌనధ్యాన యోగములచే ఎరగబడువాడు కావున విష్ణుడు 'మాధవః' అనబడును.



Māyāḥ dhavaḥ (Śriyaḥ patiḥ) मायाः धवः (श्रियः पतिः) The dhava or husband of Mā or Śri who is otherwise known as Lakṣmi लक्ष्मि. Or as mentioned in Br̥hadāraṇyakopaniṣat, He is made known by the Madhu vidyā. Or in the Mahā Bhārata (Udyoga parva, Sanat sujāta parva 4) Vyāsa says 'Maunā ddhyānācca yogācca viddhi bhārata mādhavamˈ, 'मौना द्ध्यानाच्च योगाच्च विद्धि भारत! माधवम्‌' O Bhārata! Know Mādhava by mauna (silence / contemplation), dhyāna (meditation) and Yoga (practice). He who is known by these is Mādhava. Mā signifies mauna, dhā signifies dhyāna and vā yoga.

ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।
Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి