24 జన, 2013

82. కృతజ్ఞః, कृतज्ञः, Kr̥tajñaḥ

ఓం కృతజ్ఞాయ నమః | ॐ कृतज्ञाय नमः | OM Kr̥tajñāya namaḥ


కృతం (ప్రాణినాం పుణ్యా పుణ్యాత్మకం కర్మ) జానాతి ఆయా ప్రాణుల పుణ్యా పుణ్య కర్ములను ఎరిగియుండును. లేదా తనకు భక్తులచే అర్పణ చేయబడిన దానిని కరుణతో ఎరుగును. ఉపాసకులు తనకు పత్ర పుష్పాదికమును ఈయగా దానిని అనంత కరుణతో ఎరిగి వారికి మోక్షమును ఇచ్చును.

:: పోతన భాగవతము - దశమ స్కందము, కుచేలోపాఖ్యానము ::
వ. అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠులైన సజ్జనులు లేశమాత్రంబగు పదార్థంబైన భక్తిపూర్వకంబుగా సమర్పించిన నది కోటిగుణితంబుగాఁ గైకొని మన్నించుటకు నిదియ దృష్టాంతంబు గాదె! మలిన దేహుండును, జీర్ణాంబరుండు నని చిత్తంబున హేయంబుగాఁ బాటింపక నా చేనున్న యడుకు లాదరంబున నారగించి నన్నుం గృతార్థునిం జేయుట యతని నిర్హేతుక దయయ కాదె! యట్టి కారుణ్య సాగరుండైన గోవిందుని చరణారవిందంబుల యందుల భక్తి ప్రతిభవంబునఁ గలుగుం గాక! యని యప్పుండరీకాక్షుని యందుల భక్తి తాత్పర్యంబునం దగిలి పత్నీసమేతుండై నిఖిల భోగంబులయందు నాసక్తిం బొరయక, రాగాది విరహితుండును నిర్వికారండునునై యఖిలక్రియలయందు ననంతుని యనంతధ్యాన సుధారసంబునం జొక్కుచు విగతబంధనుండై యపవర్గప్రాప్తి నొందె; మఱియును.

భక్తి తత్పరులైన సజ్జనులు సమర్పించిన పదార్థం లేశ మాత్రమే అయినా భగవంతుడు దానిని కోటానుకోట్లుగా భావించి స్వీకరించి భక్తులను అనుగ్రహిస్తాడనటానికి నా (కుచేలుని) వృత్తాంతమే తార్కాణం. మాసిన నా శరీరాన్ని, చినిగిన బట్టల్నీ చూచి శ్రీకృష్ణుడు మనస్సులోనయినా ఏవగించుకోలేదు. నా వద్దనున్న అటుకులను ప్రీతితో ఆరగించి నన్ను ధన్యుణ్ణి చేయడంలో అచ్యుతుని నిర్హేతుక వాత్సల్యం అభివ్యక్తమౌతూ ఉంది. అంతటి కరుణాసాగరుడైన గోవిందుని పాదారవిందాలమీద నాకు జన్మజన్మలకూ నిండైన భక్తి నెల్కొని ఉండు గాక! ఈ రీతిగా తలపోసి హరిస్మరణం మరవకుండా కుచేలుడు తన ఇల్లాలితో కలిసి జీవించాడు. భోగాలపై ఆసక్తి లేకుండా రాగద్వేషాది ద్వంద్వాల కతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారస వాహినిలో ఓలలాడుతూ భవబంధాలను బాసి ముక్తుడయ్యాడు.



Kr̥taṃ (prāṇināṃ puṇyā puṇyātmakaṃ karma) jānāti / कृतं (प्राणिनां पुण्या पुण्यात्मकं कर्म) जानाति One who knows everything about what has been done (Kr̥ta) by Jīvas. Even to those who make a small offering of leaf, flower etc., He grants Mokṣa (liberation).

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 81
Kiñcitkarotvurvapi yatsvadattaṃ
  Suhr̥tkr̥taṃ phalgvapi bhūrikārī,
Mayopaṇītaṃ pr̥thukaikamuṣṭiṃ
  pratyagrahītprītiyuto mahātmā.
(35)

:: श्रीमद्भागवते महापुराणे दशमस्कन्धे, नामैकाशीतितमोऽध्यायः ::
किञ्चित्करोत्वुर्वपि यत्स्वदत्तं
  सुहृत्कृतं फल्ग्वपि भूरिकारी ।
मयोपणीतं पृथुकैकमुष्टिं
  प्रत्यग्रहीत्प्रीतियुतो महात्मा ॥ ३५ ॥


The Lord considers even His greatest benedictions to be insignificant, while He magnifies even a small service rendered to Him by His devotee. Thus with pleasure the Supreme Soul accepted a single palmful of the flat rice I brought Him.

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।
अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।
Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి