21 జన, 2013

79. క్రమః, क्रमः, Kramaḥ

ఓం క్రమాయ నమః | ॐ क्रमाय नमः | OM Kramāya namaḥ


క్రామతి నడుచును, దాటును, పరువెత్తును. అనేజ దేకం మనసో జవీయః - 'ఆ ఏకైక తత్త్వము తాను కదలకయే యుండియు మనస్సు కంటెను శీఘ్రగతి కలది' అను శ్రుతిప్రమాణముచే పరమాత్మ తన సర్వప్రవృత్తులయందును ఎల్లరకంటెను శీఘ్రతర గతి కలవాడు. లేదా అట్టి క్రమమునకు (శీఘ్రగతికిని విస్తరణమునకు) హేతుభూతుడు.

క్రాంతే విష్ణుమ్ అను మను స్మృతి (12.121) వచనమున 'గతి విషయమున విష్ణుని భావన చేయవలెను.' విష్ణుని అనుగ్రహమున తమ సంకల్పిత కార్యములు శీఘ్రగతితో ముందునకు సాగుటకు హేతువగునని ఈ మనువచనమునకు భావము.



Krāmati / क्रामति He walks or is the cause of walking (progressing). Or vide Manu Smr̥ti (12.121) Krāṃte Viṣṇumक्रांते विष्णुम् In the matter of walking, Viṣṇu.

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः
अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ
Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి