ఓం హిరణ్యగర్భాయ నమః | ॐ हिरण्यगर्भाय नमः | OM Hiraṇyagarbhāya namaḥ
గర్భః అనగా మాత్రుదరవర్తి శిశువు. 'విరించి' అనబడు చతుర్ముఖ బ్రహ్మ మొదట తానుద్భవించుటకు ముందు హిరణ్యమయమగు అండమునందు ఉండెను కావున అతడు 'హిరణ్య గర్భః'. హిరణ్యమయమగు అండమందలి గర్భము. హిరణ్య గర్భః సమవర్తతాఽగ్రే (ఋగ్వేద సంహిత 10.121.1) 'మొదట హిరణ్య గర్భుడే ఉండెను' అను శ్రుతి ఇందులకు ప్రమాణము. హిరణ్య గర్భ తత్త్వమును విష్ణుని విభూతియే.
:: పోతన భాగవతము - పదునొకండవ స్కందము ::
వ. అనుటయు హరి యుద్ధవునకుం జెప్ప; 'నట్లు మత్ప్రేరితంబులైన మహదాది గుణంబులు గూడి యండంబై యుధ్భవించె; నా యండంబువలన నే నుద్భవించితిని; నంత నా నాభివివరంబున బ్రహ్మ యుదయించె; సాగరారణ్య నదీనద సంఘంబులు మొదలుగాఁ గల జగన్నిర్మాణంబు లతని వలనం గల్పించితిని; నంత శతానందులకు శతాబ్దంబులు పరిపూర్ణంబైన ధాత్రి గంధంబునం దడంగు; నాగంధం బుదకంబునం గలయు; నా యుదకంబు రసంబున లీనం బగు; నా రసంబు తేజోరూపంబగు; నా తేజంబు రూపంబున సంక్రమించు; నా రూపంబు వాయువందుం గలయు; వాయువు స్పర్శగుణ సంగ్రాహ్యం బైన స్పర్శగుణం బాకాశంబున లయంబగు; నా యాకాశంబు శబ్దతన్మాత్రచే గ్రసియింపఁబడిన నింద్రియంబులు మనో వైకారిక గుణంబులం గూడి యీశ్వరునిం బొంది, యీశ్వరరూపంబు దాల్చు;
నేను రజస్సత్త్వ తమోగుణ సమేతుండనై త్రిమూర్తులు వహించి, జగదుత్పత్తి స్థితిలయ కారణుండనై వర్తిల్లుదుఁ; గావున నీ రహస్యంబు నీకు నుపదేశించితిఁ, బరమ పావనుండవుఁ బరమ భక్తి యుక్తుండవుగ' మ్మని చెప్పె; నంత.
అనగా హరి ఉద్ధవునితో ఇలా అన్నాడు - ఆ విధంగా నా చేత ప్రేరేపించబడి మహత్తు మొదలైన గుణాలు అన్నీ కలిసి ఒక అండంగా ఏర్పడ్డాయి. ఆ అండం నుంచి నేను పుట్టాను. అంత నా నాభి రంధ్రంలోనుంచి బ్రహ్మ పుట్టాడు. సముద్రాలు, అరణ్యాలు, నదులు, నదములు మొదలైన ప్రపంచమంతా అతనిచేత నేనే నిర్మీంపజేశాను. ఆ బ్రహ్మకు నూరేండ్లు నిండిన తర్వాత భూమి గంధంలో అణగిపోతుంది. గంధం నీటిలో కలుస్తుంది. ఆ నీరు రసములో లీన మవుతుంది. ఆ రసం తేజస్సు యొక్క రూపాన్ని ధరిస్తుంది. ఆ తేజస్సు రూపమునందు సంక్రమిస్తుంది. ఆ రూపం వాయువులో కలుస్తుంది. ఆ వాయువు స్పర్శగా మారుతుంది. ఆ స్పర్శ గుణం ఆకాశంలో లయమవుతుంది. ఆ ఆకాశం శబ్ద తన్మాత్రచే గ్రహింప బడుతుంది ఇంద్రియాలు మనోవికార గుణాలతో కూడి ఈశ్వరునితో కూడి ఈశ్వరునిలో లీనమై ఈశ్వరరూపాన్ని ధరిస్తవి.
నేను రజస్సు, సత్త్వము, తమస్సు అనే మూడు గుణాలతో కూడి మూడు మూర్తులు ధరించి సృష్టియొక్క పుట్టుకకూ, ఉనికికీ, నాశనానికీ కారణుడనై వర్తిస్తాను, ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. పరమపావనుడవైనావు. పరమ భక్తియుక్తుడవు కావలసిందని కృష్ణుడు పలికాడు.
One who is Ātman of even Brahmā the creator who is otherwise known as Hiraṇyagarbhaḥ - the luminous globe that contains the whole universe in the seminal form. Hiraṇya garbhaḥ samavartatā’gre (R̥gveda saṃhita 10.121.1) at first, Hiraṇya garbha alone existed.
Śrīmad Bhāgavata - Canto 11, Chapter 24
Mayā sañcoditā bhāvāḥ sarve saṃhatyakāriṇaḥ,
Aṇḍamutpādayāmāsurmamāyatanamuttamam. (9)
:: श्रीमद्भागवत - एकादशस्कन्धे, चतुर्विंषोऽध्याय ::
मया सञ्चोदिता भावाः सर्वे संहत्यकारिणः ।
अण्डमुत्पादयामासुर्ममायतनमुत्तमम् ॥ ९ ॥
Impelled by Me, all these elements combined to function in an orderly fashion and together gave birth to the golden universal egg, which is My excellent place of residence.
ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः । |
हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥ |
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః । |
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥ |
Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ । |
Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి