26 జన, 2013

84. ఆత్మవాన్, आत्मवान्, Ātmavān

ఓం ఆత్మవతే నమః | ॐ आत्मवते नमः | OM Ātmavate namaḥ


ఆత్మా అనగా తాను. ఆత్మనః అనగా తనకు సంబంధించిన అని అర్థము. ఆత్మనః అస్య అస్తి స్వప్రతిష్ఠాత్వేన ఇతి ఆత్మవాన్ ఆత్మా 'తాను' లేదా ఆత్మనః 'తన మహిమ' మాత్రమే తన నిలుకడ చోటుగా కలవాడు.

:: ఛాందోగ్యోపనిషత్ - సప్తమః ప్రపాఠకః, చతుర్వింశః ఖండః ::
యత్రనాన్యత్పశ్యతి నాన్యత్ శృణోతి నాన్యద్విజానాతి స భూమాఽథ య త్రాన్యత్పశ్య త్యస్యత్ శృణో త్యన్యద్విజానాతి తదల్పం యోవై భూమా తదమృత మథ యదల్పం తన్మర్త్యం స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వే మహిమ్ని యది వాన మహిమ్నితి ॥ 1 ॥

[సనత్కుమారుడు చెప్పెను] ఏ ఆత్మయందు, ఆత్మకంటే వేరైనది కనిపించుటలేదో, వినిపించుటలేదో తెలియబడుటలేదో అదియే అనంతమైనది (భూమా). దీనికంటే వేరైనదంతయు అల్పము. అనంతస్వరూపమగు ఆత్మ (బ్రహ్మము) నాశరహితమైనది. అల్పమైనదానికి నాశనము కలదు. [నారదుడు ప్రశ్నించెను] ఓ భగవన్‌! ఆ అనంతమైనది (బ్రహ్మము) దేనియందు ప్రతిష్ఠితమై యున్నది? [సనత్కుమారుడు సమాధానమునిచ్చెను] తన మహిమయందే తాను ప్రతిష్ఠితమై యున్నది. అది నిరాలంబము.

:: పోతన భాగవతము - శ్రీ కృష్ణావతార ఘట్టము ::
క. సర్వము నీలోనిదిగా, సర్వాత్ముఁడ, వాత్మవస్తు సంపన్నుఁడవై
     సర్వమయుఁడ వగు నీకును, సర్వేశ్వర! లేవు లోనుసంధులు వెలియున్‍.


సృష్టి అంతా నీలోనే ఉన్నది గనుక సర్వమునకూ ఆత్మ అయిన వాడవు నీవు. నీ చేత తయారైన వస్తువులలో సర్వమునందు నిండి ఉన్న నీకు లోపల, బయట, మధ్య ఉండే మార్పులు అనేవి లేవు. కనుకనే నీవు సర్వేశ్వరుడవు.



Ātmanaḥ asya asti svapratiṣṭhātvena iti ātmavān / आत्मनः अस्य अस्ति स्वप्रतिष्ठात्वेन इति आत्मवान् As He is established in His own glory, He is Ātmavān i.e., requiring no other support than Himself.

Chāndogyopaniṣat - Part Seven, Chapter 24
Yatranānyatpaśyati nānyat śr̥ṇoti nānyadvijānāti sa bhūmā’tha ya trānyatpaśya tyasyat śr̥ṇo tyanyadvijānāti tadalpaṃ yovai bhūmā tadamr̥ta matha yadalpaṃ tanmartyaṃ sa bhagavaḥ kasmin pratiṣṭhita iti sve mahimni yadi vāna mahimniti. (1)

:: छांदोग्योपनिषत् - सप्तमः प्रपाठकः, चतुर्विंशः खंडः ::
यत्रनान्यत्पश्यति नान्यत् शृणोति नान्यद्विजानाति स भूमाऽथ य त्रान्यत्पश्य त्यस्यत् शृणो त्यन्यद्विजानाति तदल्पं योवै भूमा तदमृत मथ यदल्पं तन्मर्त्यं स भगवः कस्मिन् प्रतिष्ठित इति स्वे महिम्नि यदि वान महिम्निति ॥ १ ॥

[Sanatkumāra said] Where one sees nothing else, hears nothing else, understands nothing else - that is the Infinite. Where one sees something else, hears something else, understands something else - that is the finite. The Infinite is immortal, the finite mortal. [Nārada inquired] Venerable Sir, in what does the Infinite find Its support? [Sanatkumāra responded] In Its own greatness - or not even in greatness.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 3
Evaṃ bhavānbuddhayanumeyalakṣaṇairgrāhyairguṇaiḥ sannapi tadguṇāgrahaḥ,
Anāvr̥tatvādbahirantaraṃ na te sarvasya sarvātmana ātmavastunaḥ.
(17)

:: श्रीमद्भागवते दशमस्कन्धे तृतीयोऽध्यायः ::
एवं भवान्बुद्धयनुमेयलक्षणैर्ग्राह्यैर्गुणैः सन्नपि तद्गुणाग्रहः ।
अनावृतत्वाद्बहिरन्तरं न ते सर्वस्य सर्वात्मन आत्मवस्तुनः ॥ १७ ॥


With our senses we can perceive some things, but not everything. Consequently, He is beyond perception by the senses. Although in touch with the modes of material nature, He is unaffected by them. He is the prime factor in everything, the all-pervading, undivided Supersoul. For Him, therefore, there is no external or internal.

ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ।
अनुत्तमो दुरादर्षः कृतज्ञः कृतिरात्मवान् ॥ ९ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౯ ॥

Īśvaro vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ ।
Anuttamo durādarṣaḥ kr̥tajñaḥ kr̥tirātmavān ॥ 9 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి