ఓం పద్మినే నమః | ॐ पद्मिने नमः | OM Padmine namaḥ
|
పద్మీ, पद्मी, Padmī |
పద్మం హస్తే విద్యత ఇత్యతః పద్మీతి కీర్త్యతే ఈ భగవానుని హస్తమునందు పద్మము ఉన్నది.
:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
సీ.
తరణి సుధాకర కిరణ సమంచిత సరసీరుహోత్పల స్రగ్విలాసుఁ
గంకణ నూపుర గ్రైవేయ ముద్రికా హార కుండల కిరీటాభిరాముఁ
గమనీయ సాగర కన్యకా కౌస్తుభ మణి భూషణోద్భాసమాన వక్షు
సలలిత దరహాస చంద్రికా ధవళిత చారు దర్పణ విరాజత్కపోలు
తే.
శంఖ చక్ర గదా పద్మ చారు హస్తు, నలికులాలక రుచి భాస్వదలిక ఫలకుఁ
బీత కౌశేయవాసుఁ గృపాతరంగి, త స్మితేక్షణుఁ బంకజోదరుని హరిని. (750)
సూర్య కిరణాలు సోకి వికసించిన తామరపూలతోనూ, చంద్రకిరణాలు సోకి వికసించిన కలువపూలతోనూ కట్టిన సుందరమైన పూలమాలలను ధరించి ఉన్నాడు. చేతులకు కంకణాలనూ, పాదాలకు నూపురాలనూ, కంఠాభరణాలనూ, అంగుళీయకాలనూ, రత్నహారాలనూ, మకరకుండలాలనూ, కిరీటాన్నీ, ధరించి ప్రకాశించుతున్నాడు. లావణ్యరాశియైన లక్ష్మీదేవితో కౌస్తుభమణితో ధగధగ మెరిసే వక్షస్స్థలం కలిగి ఉన్నాడు. సొగసైన చిరునవ్వు వెన్నెలలతో ముద్దులొలికే చెక్కుటద్దాలతో విరాజిల్లుతున్నాడు. శంఖం, చక్రం, గద, పద్మం చేతుల్లో ధరించి ఉన్నాడు. తుమ్మెదల వంటి నల్లని ముంగురులతో అందంగా ప్రకాశించే ఫాలఫలకం కలవాడై ఉన్నాడు. ఇంకా ఆ పంకజనాభుడైన హరి పచ్చని పట్టు వస్త్రం ధరించి సుందరమందహాసంతో దాక్షిణ్యం పొంగిపొరలే కటాక్ష వీక్షణాలతో అలరుతున్నాడు.
Padmaṃ haste vidyata ityataḥ padmīti kīrtyate / पद्मं हस्ते विद्यत इत्यतः पद्मीति कीर्त्यते There is a Lotus flower in His hand and hence He is known as Padmī.
Śrīmad Bhāgavata - Canto 4, Chapter 24
Prītiprahasitāpāṅgamalakai rūpaśōbhitam,
Lasatpaṅkajakiñjalka dukūlaṃ mr̥iṣṭakuṇḍalam. 47.
Sphuratkirīṭavalaya hāranūpuramēkhalam,
Śaṅkhacakragadāpadma mālāmaṇyuttamarddhimat. 48.
:: श्रीमद्भागवते - चतुर्थ स्कन्दे, चतुर्विंशोऽध्यायः ::
प्रीतिप्रहसितापाङ्गमलकै रूपशोभितम् ।
लसत्पङ्कजकिञ्जल्क दुकूलं मृष्टकुण्डलम् ॥ ४७ ॥
स्फुरत्किरीटवलय हारनूपुरमेखलम् ।
शङ्खचक्रगदापद्म मालामण्युत्तमर्द्धिमत् ॥ ४८ ॥
The Lord is super-excellently beautiful on account of His open and merciful smile and His sidelong glance upon His devotees. His black hair is curly, and His garments, waving in the wind, appear like flying saffron pollen from lotus flowers. His glittering earrings, shining helmet, bangles, garland, ankle bells, waist belt and various other bodily ornaments combine with conchshell, disc, club and lotus flower to increase the natural beauty of the Kaustubha pearl on His chest.
अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः । |
अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥ |
|
అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః । |
అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥ |
|
Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ । |
Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥ |