5 అక్టో, 2013

336. అశోకః, अशोकः, Aśokaḥ

ఓం అశోకాయ నమః | ॐ अशोकाय नमः | OM Aśokāya namaḥ


అశోకః, अशोकः, Aśokaḥ

హరిశ్శోకాదిషడూర్మివర్జితోఽశోక ఉచ్యతే క్షుద్బాధ (ఆకలి), పిపాస (దాహము), శోకము, మోహము లేదా అవివేకము, జరా (వార్ధక్యము) మరియూ మరణములనే షడూర్ములు (ఆరు వికారాలు) లేనివాడుగనుక ఆ హరికి అశోకః అని పేరు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తరభాగము ::
సీ. అవ్యయు ననఘు ననంతశక్తిని బరు లై నట్టి బ్రహ్మ రుద్రామరేంద్ర
     వరుల కీశ్వరుఁ డైనవాని సర్వాత్మకు జ్ఞానస్వరూప సమానరహితు
     వరదుని జగదుద్భవ స్థితి సంహార హేతుభూతుని హృశీకేశు నభవు
     బ్రహ్మచిహ్నంబులై పరఁగు సుజ్ఞాన శ క్త్యాదుల నొప్పు బ్రహ్మంబు నీశు
ఆ. నజు షడూర్మరహితు నిజయోగమాయా వి, మోహితాఖిలాత్ము ముఖ్యచరితు
     మహితతేజ నాదిమధ్యాంతహీనునిఁ, జిన్మయాత్ము నిను భజింతుఁ గృష్ణ! (429)

అవ్యయుడవు, అనంత శక్తియుతుడవు, బ్రహ్మాది దేవతలకే అధీశ్వరుడవు, సర్వాత్మకుడవు, జ్ఞాన స్వరూపుడవు, అనుపమానుడవు, వరదుడవు, సృష్టిస్థితిలయకారకుడవు, హృశీకేశుడవు, అభవుడవు, పరబ్రహ్మస్వరూపుడవు, షడుర్మిరహితుడవు, పరబ్రహ్మస్వరూపుడవు, యోగమాయచేత సర్వజగత్తును సమ్మోహపరచువాడవు, మహనీయతేజుడవు, ఆదిమధ్యాంత రహితుడవు, చిన్మయాత్ముడవు అయిన ఓ కృష్ణా! నిన్ను ప్రార్ధిస్తున్నాను.



Hariśśokādiṣaḍūrmivarjito’śoka ucyate / हरिश्शोकादिषडूर्मिवर्जितोऽशोक उच्यते Since Lord Hari is free of six  six waves of material disturbance viz., hunger, thirst, decay, death, grief and illusion, He is called Aśokaḥ.

अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।
अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥

అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।
అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥

Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।
Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి