4 అక్టో, 2013

335. పురన్దరః, पुरन्दरः, Purandaraḥ

ఓం పురన్దరాయ నమః | ॐ पुरन्दराय नमः | OM Purandarāya namaḥ


పురన్దరః, पुरन्दरः, Purandaraḥ

పురాణామ్ సురశత్రూణాం దారణాత్ స పురందరః దేవ శత్రువుల పురములను బ్రద్దలు చేయును.

:: పోతన భాగవతము - ద్వితీయ స్కంధము ::
సీ. తోయజ హిత వంశ దుగ్ధ పారావార రాకా విహార కైరవహితుండు
    కమనీయ కోసలక్ష్మాభృత్సుతా గర్భ సంపుట లసన్మౌక్తికంబు
    నిజపాదసేవక వ్రజ దుఃఖ నిబిడాంధ కార విస్ఫురిత పంకరుహసఖుఁడు
    దశరథేశ్వర కృతధ్వర వాటికా ప్రాంగణాకర దేవతానోకహంబు
తే. చటుల దానవ గహన వైశ్వానరుండు, రావణాటోప శైల పురందరుండు
    నగుచు లోకోపకారార్థ మవతరించె, రాముఁడై చక్రి లోకాభిరాముఁడగుచు. (155)

చక్రధరుడైన శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయడానికై జగదభిరాముడైన శ్రీరాముడుగా అవతరించాడు. ఆయన సూర్యవంశమనే పాల్కడలికి పున్నమచందురుడు. కోసలరాజు కూతురైన కౌసల్యాదేవి గర్భమనే ముత్తెపు చిప్పలో పుట్టిన మేలి ముత్యం. తన పాదసేవకుల శోకమనే చిమ్మచీకట్లను పోకార్చే సూర్యభగవానుడు. దశరథమహారాజు గారి పుత్రకామేష్ఠి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్పవృక్షం. దానవులనే దారుణారణ్యాన్ని దహించే కార్చిచ్చు. రావణుని గర్వమనే పర్వతాన్ని బద్దలు చేసే ఇంద్రుడు.



Purāṇām suraśatrūṇāṃ dāraṇāt sa puraṃdaraḥ / पुराणाम् सुरशत्रूणां दारणात् स पुरंदरः He destroys the Purās or cities of the enemies of the gods.

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 7
Yasmā adādudadhirūḍabhayāṅgavēpō mārgaṃ sapadyaripuraṃ haravaddidakṣōḥ,
Dūrē suhr̥inmathitarōṣasuśōṇadr̥iṣṭayā tātapyamānamakarōraganakracakraḥ. 24.

:: श्रीमद्भागवत - द्वितीयस्कनधे सप्तमोऽध्यायः ::
यस्मा अदादुदधिरूडभयाङ्गवेपो मार्गं सपद्यरिपुरं हरवद्दिदक्षोः ।
दूरे सुहृन्मथितरोषसुशोणदृष्टया तातप्यमानमकरोरगनक्रचक्रः ॥ २४ ॥

Lord Rāmacandra, being aggrieved for His distant intimate friend (Sīta), glanced over the city of the enemy Rāvaṇa with red-hot eyes like those of Hara. The great ocean, trembling in fear, gave Him His way because its family members, the aquatics like the sharks, snakes and crocodiles, were being burnt by the heat of the angry red-hot eyes of the Lord.

स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।
वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥

స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥

Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ ।
Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి