1 అక్టో, 2013

332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

ఓం వాసుదేవాయ నమః | ॐ वासुदेवाय नमः | OM Vāsudevāya namaḥ


వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

వాసుర్వసతి వాసయత్యాచ్ఛాదయతి వా జగత్ ।
దీవ్యతీక్రీడతే దేవః కేశవో విజిగీషతే ॥

అన్నిటియందును తాను అంతర్యామిగా వసించును. అన్నిటినీ తనయందు వసింపజేయును. అన్నిటినీ తన రక్షణతో కప్పియుంచును. ఈ వ్యుత్పత్తులచే 'వాసుః' అను శబ్దము నిష్పన్నమగును. 'దివ్‌' అను ధాతువునకుగల అర్థములను బట్టి 'దీవ్యతి' అనగా జగత్సృష్టి స్థితి లయాదివ్యాపారము నిర్వర్తించుట రూపమున క్రీడించుచుండును. దుష్టులను జయింపగోరుచుండును. జగములందు జీవరూపమున వ్యవహరించుచుండును. స్వయంప్రకాశుడుగా ప్రకాశించుచుండును. స్తుతించబడుచుండును. సంచరించుచుండును. అను వీనిలో ఏయర్థముతోనైననూ 'దేవః' అను వ్యవహారము విష్ణునందు చెల్లును.

:: మహాభారతము - శాంతి పర్వణి మోక్షధర్మ పర్వ ఏకచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
ఛాయదామి నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః ।
సర్వభూతాధివాసశ్చ వాసుదేవస్తతో హ్యహమ్ ॥ 41 ॥

నేనే సూర్యునివలె అయి సూర్యుడు తన కిరణములతోవలె సర్వ జగత్తును కప్పివేయుచున్నాను. నేను సర్వ భూతములకును అధివసించు ఆశ్రయస్థానము కూడా అయి యున్నాను. అందువలన నేను వాసుదేవుడనుగా తత్త్వజ్ఞులచే తలచబడుచున్నాను.

:: మహాభారతము - ఉద్యోగ పర్వణి యానసంధి పర్వ సప్తతితమోఽధ్యాయః ::
వసనాత్ సర్వభూతానాం వసుత్వాద్ దేవయోనితః ।
వాసుదేవస్తతో వేద్యో బృహత్త్వాద్ విష్ణురుచ్యతే ॥ 3 ॥

సర్వభూతములను వాసించుట లేదా కప్పివేయుట వలనను (వసువు), అన్ని భూతములును తనయందు వసించువాడగుటచే (వాసు), దేవతలకును మూలస్థానము అగుటవలననూ (దేవః) - ఈ హేతువులచే అతడు 'వాసుదేవః' అనబడుచున్నాడని తెలియదగినది.

695. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
709. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ




वासुर्वसति वासयत्याच्छादयति वा जगत् ।
दीव्यतीक्रीडते देवः केशवो विजिगीषते ॥


Vāsurvasati vāsayatyācchādayati vā jagat,
Dīvyatīkrīḍate devaḥ keśavo vijigīṣate.


Vāsuḥ/वासुः  implies that He is all pervading and everything is resting in Him. It also means that He envelopes everything in His protection. From meanings of the root 'Div/दिव्' we can infer 'Divyati/दिव्यति' or the One who is engaged in creation, sustenance and dissolution of universe. As the One who is ever wanting to subdue demonic forces or He being the life of creation or He being effulgent or as the One who is eulogized or as being a Pervador - the word 'Devaḥ/देवः' is aptly suitable for addressing Lord Viṣṇu.

:: महाभारते शान्ति पर्वणि मोक्षधर्म पर्वणि एकचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
छायदामि नारा इति प्रोक्ता आपो वै नरसूनवः ।
सर्वभूताधिवासश्च वासुदेवस्ततो ह्यहम् ॥ ४१ ॥ 


Mahābhāra - Book 12,  Mokṣadharma Section, Chapter 341
Chāyadāmi nārā iti proktā āpo vai narasūnavaḥ,
Sarvabhūtādhivāsaśca vāsudevastato hyaham
. 41.


स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः ।
वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ॥ ३६ ॥

స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః ।
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః ॥ ౩౬ ॥

Skandaḥ skandadharo dhuryo varado vāyuvāhanaḥ ।
Vāsudevo br̥hadbhānurādidevaḥ purandaraḥ ॥ 36 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి