ఓం సర్వలక్షణలక్షణ్యాయ నమః | ॐ सर्वलक्षणलक्षण्याय नमः | OM Sarvalakṣaṇalakṣaṇyāya namaḥ
లక్షణం అనునది ప్రమాణమునకును, ప్రమాణములవలన సిద్ధించు జ్ఞానమునకును పేరు. కావున సర్వైః లక్షణైః ప్రమాణైః యత్ లక్షణం జ్ఞానం జాయతే తత్ సర్వలక్షణలక్షణమ్ సర్వములగు లక్షణములచే, ప్రమాణములచే ఏ జ్ఞానము కలుగునో అది సర్వలక్షణలక్షణం అనబడును. సర్వలక్షణలక్షణే సాధుః సర్వలక్షణ్లక్షణ్యః అన్ని విధములగు ప్రత్యక్షాది ప్రమాణములచేత కలుగు జ్ఞానవిషయమున ఉత్తముడుగా గోచరించువాడు కావున శ్రీమహావిష్ణువునకు 'సర్వలక్షణలక్షణ్యః' అని వ్యవహారము శాస్త్రములందు తగిలియున్నది. ఏలయన అన్ని ప్రమాణములచేతను ఎరుగదగిన పరమార్థ తత్త్వము ఆ మహానుభావుడే.
अतुलश्शरभो भीमस्समयज्ञो हविर्हरिः । |
सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः ॥ ३९ ॥ |
అతులశ్శరభో భీమస్సమయజ్ఞో హవిర్హరిః । |
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిఞ్జయః ॥ ౩౯ ॥ |
Atulaśśarabho bhīmassamayajño havirhariḥ । |
Sarvalakṣaṇalakṣaṇyo lakṣmīvān samitiñjayaḥ ॥ 39 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి