9 అక్టో, 2013

340. శౌరిః, शौरिः, Śauriḥ

ఓం శౌరయే నమః | ॐ शौरये नमः | OM Śauraye namaḥ


శౌరిః, शौरिः, Śauriḥ

శూరస్య వసుదేవస్య చాపత్యం శౌరి రుచ్యతే శూరుని అనగా వసుదేవుని సంతానము (శ్రీకృష్ణుడు) గనుక శౌరిః.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము ::
క. ఆ శౌరికి దెరువోసఁగెఁ బ్ర, కాశోద్దత తుమ్గ భంగ కలిత ధరాశా
    కాశ యగు యమున మును సీ, తేశునకుఁ బయోధి త్రోవ యిచ్చిన భంగిన్‍. (144)

అలా వెడుతూ ఉండగా అతని దారికి యమునానది అడ్డు వచ్చింది. ఎగసిపడుతున్న తరంగాలు మళ్ళీ విరిగిపోతూ దిక్కులనూ, ఆకాశాన్నీ ఏకం చేస్తున్నట్లు ఉరవళ్ళు పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తూ ఉంది. పూర్వం సీతాపతి అయిన రామచంద్రునకు సముద్రం దారి యిచ్చినట్లు, యమునానది వసుదేవునకు దారియిచ్చింది.



Śūrasya vasudevasya cāpatyaṃ śauri rucyate / शूरस्य वसुदेवस्य चापत्यं शौरि रुच्यते One who as Śrī Kr̥ṣṇa was the son of  Śūra i.e., Vasudeva.

Śrīmad Bhāgavate - Canto 10, Chapter 3
Tataśca śaurirbhagavatpracoditaḥ sutaṃ samādāya sa sūtikāgr̥hāt,
Yadā bahirgantumiyeṣa tarhyajā yā yogamāyājani nandajāyayā. 47.

:: श्रीमद्भागवते - दशम स्कन्धे, तृतीयोऽध्यायः ::
ततश्च शौरिर्भगवत्प्रचोदितः सुतं समादाय स सूतिकागृहात् ।
यदा बहिर्गन्तुमियेष तर्ह्यजा या योगमायाजनि नन्दजायया ॥ ४७ ॥

Thereafter, exactly when Vasudeva, being inspired by the Lord, was about to take the newborn child from the delivery room, Yogamāyā, the Lord's spiritual energy, took birth as the daughter of the wife of Mahārāja Nanda.

अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।
अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥

అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।
అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥

Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।
Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి