27 అక్టో, 2013

358. సమయజ్ఞః, समयज्ञः, Samayajñaḥ

ఓం సమయజ్ఞాయ నమః | ॐ समयज्ञाय नमः | OM Samayajñāya namaḥ


యఃసృష్టి స్థితి సంహార సమయాన్ షడృతూనుత ।
జానాతీత్యథవా సర్వభూతేషు సమతార్చనా ।
సాధ్వీ యస్యసనృహరిస్సమయజ్ఞః ఇతీర్యతే ॥

సృష్టి స్థితి సంహారముల సమయమును వేరు వేరుగా దేనిని ఎపుడాచరించవలయునో ఎరుగును. లేదా ఋతురూపములగు ఆరు సమయములను ఎరుగును. అవి ఎరిగి ఆ ఋతు ధర్మములను ప్రవర్తింపజేయును. లేదా 'సమ-యజ్ఞః' అను విభాగముచే సర్వభూతముల విషయమున సమము అనగా సమత్వము లేదా సమతాదృష్టి యజ్ఞముగా లేదా ఆరాధనముగా ఎవని విషమున కలదో అట్టివాడు.


अतुलश्शरभो भीमस्समयज्ञो हविर्हरिः ।
सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः ॥ ३९ ॥

అతులశ్శరభో భీమస్సమయజ్ఞో హవిర్హరిః ।
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిఞ్జయః ॥ ౩౯ ॥

Atulaśśarabho bhīmassamayajño havirhariḥ ।
Sarvalakṣaṇalakṣaṇyo lakṣmīvān samitiñjayaḥ ॥ 39 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి