28 అక్టో, 2013

359. హవిర్హరిః, हविर्हरिः, Havirhariḥ

ఓం హవిర్హరయే నమః | ॐ हविर्हरये नमः | OM Havirharayē namaḥ


హవిర్భాగం హరతి యజ్ఞములందు హవిస్సును, హవిర్భాగమును అందుకొనును. 'అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభు రేవ చ' (గీతా 9.24) సర్వ యజ్ఞములందును హవిస్సును భుజించు యజ్ఞఫలదాతయగు భోక్తయు, ప్రభుడను నేనే కదా! అను భగవద్వచనము ఇందులకు ప్రమాణము. లేదా 'హూయతే హవిషా' ఇతి హవిః హవిస్సుగా తాను హవనము చేయబడువాడు. 'అబద్నన్ పురుషం పశుమ్‍' (పురుష సూక్తమ్‍) దేవతలు తాము చేయు యజ్ఞమున విరాట్పురుషునే పశువునుగా హవిస్సునకై బంధించిరి' అను శ్రుతి ఇట ప్రమాణము. దీనిచే హరి 'హవిః' అనదగియున్నాడు. స్మృతిమాత్రేణ పుంసాం పాపం సంసారం వా హరతి ఇతి హరిద్వర్ణవాన్ ఇతి వా హరిః స్మరణమాత్రముచేతనే జీవుల పాపమునుగాని, సంసారమునుగాని హరించును. అథవా పచ్చని వర్ణము కలవాడు అను వ్యుత్పత్తిచే 'హరిః' అని నారాయణునకు పేరు. హవిః + హరిః రెండును కలిసి హవిర్హరిః అగును. 

'హరా మ్యఘం చ స్మర్తౄణాం హవిర్భాగం క్రతుష్వహం వర్ణశ్చ మే హరిః శ్రేష్ఠ స్తస్మా ద్ధరి రహం స్మృతః' నేను నన్ను స్మరించిన వారి పాపమును హరింతును. యజ్ఞములయందు హవిర్భాగమును కూడ హరింతును (అందుకొనెదను). నా వర్ణమును శ్రేష్ఠమగు హరిద్వర్ణము. అందువలన నన్ను 'హరిః' అని తత్త్వవేత్తలు తలతురు అను భగవద్వచనము ఇందు ప్రమాణము.

अतुलश्शरभो भीमस्समयज्ञो हविर्हरिः
सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः ॥ ३९ ॥

అతులశ్శరభో భీమస్సమయజ్ఞో హవిర్హరిః
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిఞ్జయః ॥ ౩౯ ॥

Atulaśśarabho bhīmassamayajño havirhariḥ
Sarvalakṣaṇalakṣaṇyo lakṣmīvān samitiñjayaḥ ॥ 39 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి