3 ఫిబ్ర, 2014

457. సూక్ష్మః, सूक्ष्मः, Sūkṣmaḥ

ఓం సూక్ష్మాయ నమః | ॐ सूक्ष्माय नमः | OM Sūkṣmāya namaḥ


శబ్దాదయో హి చ వియదాదీనాముత్తరోత్తరమ్ ।
స్థూలత్వ హేతవ స్తేషామభావాత్ సూక్ష్మతా హరేః ।
సర్వగతం సు సూక్ష్మమిత్యాది శ్రుతి సమీరణాత్ ॥

పరమాత్మ నుండి ఆకాశము శబ్దమనుగుణముతో జనించెను. అట్లే ఆకాశమునుండి వాయువు శబ్ద స్పర్శములతో, దాని నుండి అగ్ని శబ్దస్పర్శరూపములతో, దాని నుండి జలము శబ్దస్పర్శరూపరసములతో, దాని నుండి పృథివి శబ్ద స్పర్శ రూప రస గంధములతో ఇట్లు జనించెను. ఆయాభూతములయందు గల శబ్దాదిగుణములు అవి ఒకదానికంటె మరియొకటి స్థూలతరమగుటకు హేతువులు. కాని 'అశబ్దమస్పర్శమ్‌' ఇత్యాది శ్రుతిననుసరించి పరమాత్మనందు శబ్దాదులు ఏవియు లేకపోవుటచేతను పంచ భూతములలోను సూక్ష్మతమమగు ఆకాశమునకు కూడ జన్మహేతువగుటచేతను అట్టి ఆత్మ అన్నిటికంటెను సూక్ష్మతమము అనుట సమంజసము. 'సర్వగతం సుసూక్ష్మమ్‌' (ముణ్డకోపనిషత్ 1.1.6) 'ఆత్మ తత్త్వము సర్వత్ర ఉండునదియు, అత్యంత సూక్ష్మమును' అను శ్రుతి ఇందులకు ప్రమాణము.



Śabdādayo hi ca viyadādīnāmuttarottaram,
Sthūlatva hetava steṣāmabhāvāt sūkṣmatā hareḥ,
Sarvagataṃ su sūkṣmamityādi śruti samīraṇāt.

शब्दादयो हि च वियदादीनामुत्तरोत्तरम् ।
स्थूलत्व हेतव स्तेषामभावात् सूक्ष्मता हरेः ।
सर्वगतं सु सूक्ष्ममित्यादि श्रुति समीरणात् ॥

One who is subtle because He is without any gross causes like sound etc. The causes of the grossness of the succeeding elements from ether/sky downwards to earth are sound, touch, shape, taste and smell. The Lord is without these. 'Sarvagataṃ susūkṣmam / सर्वगतं सुसूक्ष्मम्‌' (Muṇḍakopaniṣat 1.1.6) says He who is very subtle and has entered into everything.

सुव्रतस्सुमुखस्सूक्ष्मः सुघोषस्सुखदस्सुहृत् ।
मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः ॥ ४९ ॥

సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ ౪౯ ॥

Suvratassumukhassūkṣmaḥ sughoṣassukhadassuhr̥t ।
Manoharo jitakrodho vīrabāhurvidāraṇaḥ ॥ 49 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి