22 ఫిబ్ర, 2014

476. ధర్మకృత్‌, धर्मकृत्‌, Dharmakr̥t

ఓం ధర్మకృతే నమః | ॐ धर्मकृते नमः | OM Dharmakr̥te namaḥ


ధర్మకృత్‌, धर्मकृत्‌, Dharmakr̥t

ధర్మాధర్మ విహీనోఽపి ధర్మమేవ కరోతి యః ।
శ్రీవిష్ణుర్ధర్మమర్యాదాస్థాపనార్థం స ధర్మకృత్ ॥

ధర్మమును ఆచరించువాడు. తాను స్వయముగా ధర్మమును కానీ, అధర్మమును కానీ ఆచరించవలసిన పనిలేకున్నను ధర్మమర్యాద స్థాపనకై - ధర్మమును తాను ఆచరించి చూపి తాను లోకమునకు ఉదాహరణముగా ఉండువాడుగనుక ఆ శ్రీ విష్ణు దేవుడు ధర్మకృత్‍.

:: శ్రీమద్రామాయణే బాల కాండే ప్రథమస్సర్గః ::
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ॥ 13 ॥
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ।
వేదవేదాంగతత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః ॥ 14 ॥

(శ్రీరాముడు) స్వ-పర భేదములులేక అందరిని రక్షించువాడు. ధర్మమును స్వయముగా ఆచరించుచు, లోకులచే ఆచరింపజేయుచు దానిని కాపాడు వాడు. స్వధర్మమును పాటించువాడు. తనను ఆశ్రయించినవారు ఎట్టివారైనను వారిని రక్షించువాడు. వేదవేదాంగముల పరమార్థమును ఎఱిగినవాడు. ధనుర్వేదమునందును ఆరితేరినవాడు.



धर्माधर्म विहीनोऽपि धर्ममेव करोति यः ।
श्रीविष्णुर्धर्ममर्यादास्थापनार्थं स धर्मकृत् ॥

Dharmādharma vihīno’pi dharmameva karoti yaḥ,
Śrīviṣṇurdharmamaryādāsthāpanārthaṃ sa dharmakr̥t.

Though He is not bound by a need to be righteous or otherwise, He follows the righteous path setting the example for the establishment of Dharma. Hence Lord Viṣṇu is known by the name Dharmakr̥t.

:: श्रीमद्रामायणे बाल कांडे प्रथमस्सर्गः ::
रक्षिता जीवलोकस्य धर्मस्य परिरक्षिता ॥ १३ ॥ 
रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य च रक्षिता ।
वेदवेदांगतत्त्वज्ञो धनुर्वेदे च निष्ठितः ॥ १४ ॥ 

Śrīmad Rāmāyaṇa - Book I, Chapter I
Rakṣitā jīvalokasya dharmasya parirakṣitā. 13.
Rakṣitā svasya dharmasya svajanasya ca rakṣitā,
Vedavedāṃgatattvajño dhanurvede ca niṣṭhitaḥ. 14.

He (Śrī Rāmā) is a guardian of all living beings and he guards probity, in its entirety. He is the champion of his own self-righteousness and also champions for adherent's welfare in the same righteousness, and he is a scholar in the essence of Vedas and their ancillaries too. He is an expert in dhanur Veda, the Art of Archery

धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।
अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥

ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।
అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥

Dharmagub dharmakr̥d dharmī sadasatkṣaramakṣaram,
Avijñātā sahasrāṃśurvidhātā kr̥talakṣaṇaḥ ॥ 51 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి