28 ఫిబ్ర, 2014

482. అవిజ్ఞాతా, अविज्ञाता, Avijñātā

ఓం అవిజ్ఞాత్రే నమః | ॐ अविज्ञात्रे नमः | OM Avijñātre namaḥ


కర్తృత్వాది వికల్ప విజ్ఞానం కల్పితమాత్మని ।
తద్వాసనాఽవకుంఠితో విజ్ఞాతా జీవ ఏవ హి ।
తతో విలక్షణో విష్ణురవిజ్ఞాతేతి కథ్యతే ॥

తనయందు కర్తృత్వము (కర్త), భోక్తృత్వము (అనుభవించుట) మొదలగునవి కలవు అను అనుభవమును పొందువాడు విజ్ఞాతా అనబడును. అతడే జీవుడు. విజ్ఞాత కానివాడు అవిజ్ఞాత; అతడే పరమాత్ముడు. శుద్ధమగు ఆత్మతత్త్వమునందు కర్తృత్వము, భోక్తృత్వము మొదలగు వైవిధ్యముల అనుభవము కల్పితముగా పరిగణింపబడుతుంది. కావుననే అట్టి వాసనలు, అనుభవములచేత కప్పివేయబడిన జీవుడు విజ్ఞాత. అతనికంటె విలక్షణుడైన శుద్ధ చైతన్యరూపుడైన విష్ణు పరమాత్మ అవిజ్ఞాత.

:: శ్రీమద్భగవద్గీత - క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము ::
సర్వేన్ద్రియగుణాభాసం సర్వేన్ద్రియవివర్జితమ్ ।
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణమ్ గుణభోక్తృ చ ॥ 15 ॥
బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ ।
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్ ॥ 16 ॥
అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ ।
భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ॥ 17 ॥
జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే ।
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ ॥ 18 ॥

జ్ఞేయస్వరూపమగు ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియములయొక్క గుణములను ప్రకాశింపజేయునదియు, సమస్తేంద్రియములు లేనిదియు, దేనిని అంటనిదియు, సమస్తమును భరించునదియు, గుణరహితమైనదియు, గుణములననుభవించునదియు, ప్రాణులయొక్క వెలుపలను - లోపలను ఉండునదియు, కదలనిదియు, కదలునదియు, అతిసూక్ష్మమైనుండునదియు, విభజింపబడనిదియైనను ప్రాణులందు విభజింపబడినదానివలె నున్నదియు, ప్రాణులను సృష్టించునదియు, పోషించునదియు, లయింపజేయునదియు అని తెలిసికొనదగినది. మఱియు అది ప్రకాశించెడు సూర్యచంద్రాగ్న్యాది పదార్థములకుగూడ ప్రకాశమునిచ్చునదియు, తమస్సు కంటె వేఱైనదియు, జ్ఞానస్వరూపమైనదియు, తెలియదగినదియు, జ్ఞానగుణములచే బొందదగినదియు, సమస్తప్రాణులయొక్క హృదయమునందు విశేషించియున్నదియు అని చెప్పబడుచున్నది.



कर्तृत्वादि विकल्प विज्ञानं कल्पितमात्मनि ।
तद्वासनाऽवकुंठितो विज्ञाता जीव एव हि ।
ततो विलक्षणो विष्णुरविज्ञातेति कथ्यते ॥

Kartr̥tvādi vikalpa vijñānaṃ kalpitamātmani,
Tadvāsanā’vakuṃṭhito vijñātā jīva eva hi,
Tato vilakṣaṇo viṣṇuravijñāteti kathyate.

The jīva is the knower limited by false idea of doership, agency etc. Thus, the jīva is known as Vijñātā. One who is under the influence of illusion. Whereas the indwelling Ātma or soul is not subject to such false illusion and hence is called Avijñātā.

:: श्रीमद्भगवद्गीत - क्षेत्रक्षेत्रज्ञ विभाग योग ::
सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् ।
असक्तं सर्वभृच्चैव निर्गुणम् गुणभोक्तृ च ॥ १५ ॥
बहिरन्तश्च भूतानामचरं चरमेव च ।
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् ॥ १६ ॥
अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् ।
भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ॥ १७ ॥
ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते ।
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ॥ १८ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 13
Sarvendriyaguṇābhāsaṃ sarvendriyavivarjitam,
Asaktaṃ sarvabhr̥ccaiva nirguṇam guṇabhoktr̥ ca. 15.
Bahirantaśca bhūtānāmacaraṃ carameva ca,
Sūkṣmatvāttadavijñeyaṃ dūrasthaṃ cāntike ca tat. 16.
Avibhaktaṃ ca bhūteṣu vibhaktamiva ca sthitam,
Bhūtabhartr̥ ca tajjñeyaṃ grasiṣṇu prabhaviṣṇu ca. 17.
Jyotiṣāmapi tajjyotistamasaḥ paramucyate,
Jñānaṃ jñeyaṃ jñānagamyaṃ hr̥di sarvasya viṣṭhitam. 18.

Shining through the functions of all the organs and yet devoid of any organ; unattached and verily the supporter of all; without quality and the perceiver of qualities existing outside and inside all beings; moving as well as non-moving, It is incomprehensible due to subtleness. So also, It is far away and yet near. And that Knowable, though undivided, appears to be existing as divided in all beings and It is the sustainer of all beings as also the devourer and originator. That is the Light even of the lights; It is spoken of as beyond darkness. It is Knowledge, the Knowable and the Known. It exists specially in the hearts of all.

धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।
अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥

ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।
అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥

Dharmagub dharmakr̥d dharmī sadasatkṣaramakṣaram,
Avijñātā sahasrāṃśurvidhātā kr̥talakṣaṇaḥ ॥ 51 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి