31 డిసెం, 2014

788. కృతకర్మా, कृतकर्मा, Kr̥takarmā

ఓం కృతకర్మణే నమః | ॐ कृतकर्मणे नमः | OM Kr̥takarmaṇe namaḥ


కృతార్థత్వాన్న కర్తవ్యం కిఞ్చిదప్యస్య విద్యతే ।
సర్వం కర్మ కృతమేవేత్యథవాఽయం జనార్దనః ॥
సర్వధర్మాత్మకం కర్మ కృతవానితి కేశవః ।
కృతకర్మేత్యుచ్యతే హి వేదవిద్యా విశారదైః ॥

ఈతనిచేత చేయబడవలసిన క్రియా సమూహము అంతయు చేయబడియేయున్నది; ఇట్లు తాను చేయవలసిన అన్ని పనులును చేసిన కృతార్థుడు అగుటచేత చేయబడదగిన కర్మము ఏ కొంచెమును ఈతనికి లేదు. ఈ హేతువు చేత పరమాత్ముడు కృతకర్మా అనగా చేయవలసిన పనులను చేసిన వాడు అనబడుచున్నాడు.

ధర్మ రూపమగు కర్మము ఎవనిచే ఆచరించబడినదో అట్టివాడు.



कृतार्थत्वान्न कर्तव्यं किञ्चिदप्यस्य विद्यते ।
सर्वं कर्म कृतमेवेत्यथवाऽयं जनार्दनः ॥
सर्वधर्मात्मकं कर्म कृतवानिति केशवः ।
कृतकर्मेत्युच्यते हि वेदविद्या विशारदैः ॥

Kr̥tārthatvānna kartavyaṃ kiñcidapyasya vidyate,
Sarvaṃ karma kr̥tamevetyathavā’yaṃ janārdanaḥ.
Sarvadharmātmakaṃ karma kr̥tavāniti keśavaḥ,
Kr̥takarmetyucyate hi vedavidyā viśāradaiḥ.

As He is kr̥tārtha,  of realized purpose, there is no action left to be done by Him. Hence Kr̥takarmā.

He is the One who has performed actions characterized by dharma.

शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः ।
इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥

శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।
ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥

Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,
Indrakarmā mahākarmā kr̥takarmā kr̥tāgamaḥ ॥ 84 ॥

30 డిసెం, 2014

787. మహాకర్మా, महाकर्मा, Mahākarmā

ఓం మహాకర్మణే నమః | ॐ महाकर्मणे नमः | OM Mahākarmaṇe namaḥ

మహాన్తి వియదాదీని భూతాని సకలాన్యపి ।
కర్మాణి కార్యాణ్యస్యేతి మహాకర్మేతి కీర్త్యతే ॥

చాలా పెద్దవియు, గొప్పవియు అగు ఆకాశాది భూతములు ఈతడు సృజించిన కార్య తత్త్వములే కనుక మహాకర్మా.

672. మహాకర్మా, महाकर्मा, Mahākarmā



महान्ति वियदादीनि भूतानि सकलान्यपि ।
कर्माणि कार्याण्यस्येति महाकर्मेति कीर्त्यते ॥

Mahānti viyadādīni bhūtāni sakalānyapi,
Karmāṇi kāryāṇyasyeti mahākarmeti kīrtyate.

The great elements like the sky are His actions and hence He is called Mahākarmā.

672. మహాకర్మా, महाकर्मा, Mahākarmā

शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः ।
इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥

శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।
ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥

Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,
Indrakarmā mahākarmā kr̥takarmā kr̥tāgamaḥ ॥ 84 ॥

29 డిసెం, 2014

786. ఇన్ద్రకర్మా, इन्द्रकर्मा, Indrakarmā

ఓం ఇన్ద్రకర్మణే నమః | ॐ इन्द्रकर्मणे नमः | OM Indrakarmaṇe namaḥ


కర్మేవేన్ద్రస్యకర్మాస్య విష్ణోరితి జనార్దనః ।
ఐశ్వర్య కర్మేత్యర్ధే స ఇన్ద్రకర్మేతి కీర్త్యతే ॥

ఇంద్రుని కార్యాచరణము వంటి కర్మము ఈతనిది. లేదా ఇంద్రునికి కల ఐశ్వర్యము వంటి ఐశ్వర్యము నిచ్చువాడు కనుక ఇంద్రకర్మా.

:: శ్రీమద్రామాయణే యుద్ధ కాణ్డే విశన్త్యుత్తరశతతమః సర్గః ॥
ఇన్ద్రకర్మా మహేన్ద్రస్త్వం పద్మనాభో రణాన్తకృత్ ।
శరణ్యం శరణం చ త్వామ్ ఆహుర్దివ్యా మహర్షయః ॥ 18 ॥

ఇంద్రునిసైతము సృజించువాడవు, నిరతిశయ ఐశ్వర్యసంపన్నుడవు, నాభియందు పద్మముకలవాడవు, రణమున శత్రువులను రూపుమాపువాడవు, ఆర్తజనులకు అభయమునిచ్చువాడవు, 'శరణాగతవత్సలుడవు' అని సనకాది మహర్షులు నిన్ను కొనియాడుచుందురు.



कर्मेवेन्द्रस्यकर्मास्य विष्णोरिति जनार्दनः ।
ऐश्वर्य कर्मेत्यर्धे स इन्द्रकर्मेति कीर्त्यते ॥

Karmevendrasyakarmāsya viṣṇoriti janārdanaḥ,
Aiśvarya karmetyardhe sa indrakarmeti kīrtyate.

His action is like that of Indra, glorious in nature. Or also since He confers prosperity equal to that of Indra, He is called Indrakarmā.

:: श्रीमद्रामायणे युद्ध काण्डे विशन्त्युत्तरशततमः सर्गः ॥
इन्द्रकर्मा महेन्द्रस्त्वं पद्मनाभो रणान्तकृत् ।
शरण्यं शरणं च त्वाम् आहुर्दिव्या महर्षयः ॥ १८ ॥

Śrīmad Rāmāyaṇa - Book 6, Chapter 120
Indrakarmā mahendrastvaṃ padmanābho raṇāntakr̥t,
Śaraṇyaṃ śaraṇaṃ ca tvām āhurdivyā maharṣayaḥ. 18.

You perform action for Indra the lord of celestials, the Supreme Ruler, the one having a lotus in one's navel and who puts an end to all in battle. The divine sages pronounce you to be fit to afford protection to all and the refuge for all.

शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः ।
इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥

శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।
ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥

Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,
Indrakarmā mahākarmā kr̥takarmā kr̥tāgamaḥ ॥ 84 ॥

28 డిసెం, 2014

785. తన్తువర్ధనః, तन्तुवर्धनः, Tantuvardhanaḥ

ఓం తన్తువర్ధనాయ నమః | ॐ तन्तुवर्धनाय नमः | OM Tantuvardhanāya namaḥ


యో వర్ధయతి తన్తన్తుమ్ విష్ణుశ్చేదయతీతివా ।
తన్తువర్ధన ఇత్యుక్తో మహద్భిర్విదుషాం వరైః ॥

తాను సృజించి విస్తరింపజేసిన ఆ తంతువు అనగా విస్తీర్ణ ప్రపంచమునే విష్ణువు వృద్ధినందిచును పిదప నశింపజేయును కూడ.



यो वर्धयति तन्तन्तुम् विष्णुश्चेदयतीतिवा ।
तन्तुवर्धन इत्युक्तो महद्भिर्विदुषां वरैः ॥

Yo vardhayati tantantum viṣṇuścedayatītivā,
Tantuvardhana ityukto mahadbhirviduṣāṃ varaiḥ.

That universe which is beautifully expanded by Him as a thread is also cut by Him. He protects as well as destroys the universe.

शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः
इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥

శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః
ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥

Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,
Indrakarmā mahākarmā kr̥takarmā kr̥tāgamaḥ ॥ 84 ॥

27 డిసెం, 2014

784. సుతన్తుః, सुतन्तुः, Sutantuḥ

ఓం సుతన్తవే నమః | ॐ सुतन्तवे नमः | OM Sutantave namaḥ


విస్తీర్ణశ్శోభనస్తన్తుజగతోఽస్యేతి కేశవః ।
సుతన్తురితి సమ్ప్రోక్తో వేదతత్త్వవివేకిభిః ॥

తన్యతే ఇతి తన్తుః - విస్తరింపజేయబడుచున్నది అనగా ప్రపంచము. శోభనః తన్తుః ఇతి స్తుతన్తుః - సుందరమగు ఈ విస్తీర్ణ ప్రపంచము ఈతనిదియే! ఈ ప్రపంచమంతయు సృజించి విస్తరింపజేసినవాడు ఈతడే కనుక స్తుతంతుః.



विस्तीर्णश्शोभनस्तन्तुजगतोऽस्येति केशवः ।
सुतन्तुरिति सम्प्रोक्तो वेदतत्त्वविवेकिभिः ॥

Vistīrṇaśśobhanastantujagato’syeti keśavaḥ,
Sutanturiti samprokto vedatattvavivekibhiḥ.

तन्यते इति तन्तुः / Tanyate iti tantuḥ That which expands or in other words - the world. . शोभनः तन्तुः / Śobhanaḥ tantuḥ - This beautiful worldly expanse belongs to Him. His universe is expanded as a beautiful thread and hence He is Sutantuḥ.

शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः ।
इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥

శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।
ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥

Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,
Indrakarmā mahākarmā kr̥takarmā kr̥tāgamaḥ ॥ 84 ॥

26 డిసెం, 2014

783. లోకసారఙ్గః, लोकसारङ्गः, Lokasāraṅgaḥ

ఓం లోకసారఙ్గాయ నమః | ॐ लोकसारङ्गाय नमः | OM Lokasāraṅgāya namaḥ


సారఙ్గవల్లోకసారం యో గృహ్ణాతి స భృఙ్గవత్ ।
లోకసారఙ్గ ఇతి స ప్రోచ్యతే విబుధోత్తమైః ॥
విష్ణుః ప్రజాపతిర్లోకానభ్యతపదితిశ్రుతేః ।
లోకసారః ప్రణవో వా తేన చక్రగదాధరః ॥
ప్రతిపత్తవ్య ఇతి వా లోకసారఙ్గ ఉచ్యతే ।
సాధుః వృషోదరాదిత్వాచ్ఛబ్దోఽయం ప్రోచ్యతే బుధైః ॥

ప్రథమ ప్రజాపతి రూపుడుగానున్న పరమాత్ముడు లోకముల సారమును సారంగమువలె అనగా తుమ్మెద పుష్పములయందలి మకరందరూపమగు సారమువలె గ్రహించును కావుననే ఆ పరమాత్ముడు 'లోకసారంగః' అనబడును.

'ప్రజాపతిర్లోకా నభ్యతపత' (ఛాందోగ్యోపనిషత్ 2.23.3) - 'ప్రజాపతి లోక సారమును గ్రహించు తలంపుతో వానిని ఉద్దేశించి తపమాచరించెను.'

లోకసారః అనగా ప్రణవము. లోక సారమగు ప్రణవముచే తెలియబడువాడు అని కూడ చెప్పవచ్చును.



सारङ्गवल्लोकसारं यो गृह्णाति स भृङ्गवत् ।
लोकसारङ्ग इति स प्रोच्यते विबुधोत्तमैः ॥
विष्णुः प्रजापतिर्लोकानभ्यतपदितिश्रुतेः ।
लोकसारः प्रणवो वा तेन चक्रगदाधरः ॥
प्रतिपत्तव्य इति वा लोकसारङ्ग उच्यते ।
साधुः वृषोदरादित्वाच्छब्दोऽयं प्रोच्यते बुधैः ॥

Sāraṅgavallokasāraṃ yo gr̥hṇāti sa bhr̥ṅgavat,
Lokasāraṅga iti sa procyate vibudhottamaiḥ.
Viṣṇuḥ prajāpatirlokānabhyatapaditiśruteḥ,
Lokasāraḥ praṇavo vā tena cakragadādharaḥ.
Pratipattavya iti vā lokasāraṅga ucyate,
Sādhuḥ vr̥ṣodarāditvācchabdo’yaṃ procyate budhaiḥ.

Like the sāraṅga i.e, the honeybee, He acquires the essence of the worlds so Lokasāraṅgaḥ vide the śruti 'Prajāpatirlokā nabhyatapat' (Chāndogyopaniṣat 2.23.3) 'Prajāpati reflected on mankind'.

The essence of universe i.e, lokasāra is Oṅkāra (ॐ). He is to be attained by it.

शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः ।
इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥

శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।
ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥

Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,
Indrakarmā mahākarmā kr̥takarmā kr̥tāgamaḥ ॥ 84 ॥

25 డిసెం, 2014

782. శుభాఙ్గః, शुभाङ्गः, Śubhāṅgaḥ

ఓం శుభాఙ్గాయ నమః | ॐ शुभाङ्गाय नमः | OM Śubhāṅgāya namaḥ


ధ్యేయత్వాచ్ఛోభనై రఙ్గైః శుభాఙ్గః ఇతి కథ్యతే శోభనములగు అందమైన అంగములతో కూడిన సుందరరూపుడిగా భక్తుల సుద్ధాంతఃకరణములతో ధ్యానము చేయబడదగినవాడు కనుక శుభాంగః.

:: శ్రీమద్రామాయణే సున్దరకాణ్డే పఞ్చత్రింశస్సర్గః ॥
దున్దుభిస్వననిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ ।
సమస్సమవిభక్తాఙ్గో వర్ణం శ్యామం సమాశ్రితః ॥ 16 ॥
త్రిస్థిరస్త్రిప్రలమ్బశ్చ త్రిసమస్త్రిషు చోన్నతః ।
త్రితామ్రస్త్రిషు చ స్నిగ్ధో గమ్భీరస్త్రిషు నిత్యశః ॥ 17 ॥
త్రివలీవాంస్త్ర్యవనతః చతుర్వ్యఙ్గస్త్రిశీర్షవాన్ ।
చతుష్కలశ్చతుర్లేఖః చతుష్కిష్కుశ్చతుస్సమః ॥ 18 ॥
చతుర్దశసమద్వన్ద్వః చతుర్దంష్ట్రశ్చతుర్గతిః ।
మహోష్ఠహనునాసశ్చ పఞ్చస్నిగ్ధోఽష్టవంశవాన్ ॥ 19 ॥
దశపద్మో దశబృహత్ త్రిభిర్వ్యాప్తోద్విశుక్లవాన్ ।
షడున్నతో నవతనుః త్రిభిర్వ్యాప్నోతి రాఘవః ॥ 20 ॥

దుంధుభి ధ్వనివలె గంభీరమైన కంఠ స్వరము కలవాడు. నిగనిగలాడు శరీర ఛాయ కలవాడు. ప్రతాపశాలి, ఎక్కువ తక్కువలు లేకుండ పరిపుష్టములైన చక్కని అంగములు కలవాడు. మేఘ శ్యామ వర్ణ శోభితుడు.

వక్షఃస్థలము, మణికట్టు, పిడికిలి - ఈ మూడు స్థానములును దృఢముగా కలవాడు. దీర్ఘములైన కనుబొమలు, బాహువులు, ముష్కములు కలవాడు. తల వెంట్రుకలు, ముష్కములు, మోకాళ్ళు - ఈ మూడును సమ ప్రమాణమున కలవాడు. ఉన్నతమయిన నాభి, కుక్షి, వక్షః స్థలము కలవాడు. ఎఱ్ఱని నేత్రాంతములు, నఖములు, అఱచేతులు, అఱికాళ్ళు కలవాడు. నునుపయిన పాదరేఖలు, కేశములు, లింగమణియు కలవాడు. ఆయన కంఠస్వరము, నడక, నాభి - ఈ మూడును గంభీరములైనవి.

శ్రీరాముని కంఠమునందు త్రిరేఖలు కలవు. స్తనములు, స్తనాగ్రములు, పాదరేఖలు నిమ్నముగానుండును. ఆయన కంఠము, లింగము, వీపు, పిక్కలు హ్రస్వములుగానుండును. శిరస్సుపై మూడు సుడులు కలవాడు. నాలుగు వేదములను సూచించు రేఖలు కలవాడు; అనగా బొటనివ్రేలి మొదటను, నొసటిపైనను, అఱచేతులలోను అఱికాళ్ళలోను నాలుగేసి రేఖలు కలవు. లలాట, పాద, పాణి తలములయందు నాలుగు రేఖలు కలవాడు. అతడు తొంబదియారు అంగుళముల ఎత్తైనవాడు. దేవతా సమానుడు. ఆయన బాహువులు, మోకాళ్ళు, ఊరువులు, పిక్కలు అనునవి నాల్గును హెచ్చు తగ్గులు లేకుండా సమానముగా నుండువాడు.

పదునాలుగు జతలు - అనగా కనుబొమలు, నాసికా పుటములు, నేత్రములు, చెవులు, పెదవులు, స్తనాగ్రములు, మోచేతులు, మణికట్టులు, మోకాళ్ళు, ముష్కములు, పిరుదులు, చేతులు, పాదములు, పిరుదులపై ఎత్తైన కండరములు సమ ప్రమాణములో కలవాడు. అతడు నాలుగు దంష్ట్రలు కలవాడు. నాలుగు మృగముల (సింహము, పెద్దపులి, ఏనుగు, వృషభము) నడకవంటి నడక కలవాడు. అందమైన పెదవులు, చుబుకము, నాసిక కలవాడు. ఓ దేవీ! ఆ రాముడు నిగనిగలాడు నేత్రములు, పలువరుస, చర్మము, పాదములు, కేశములు కలవాడు. జానకీ! ఆయన శరీరము, చేతివ్రేళ్ళు, కరములు, నాసిక, నయనములు, కర్ణములు, ప్రజనము అను అష్టవంశములు తగిన ప్రమాణములో కలవాడు.

శ్రీరాముడు పద్మములవంటి ముఖము, నేత్రములు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోళ్ళు, హస్తములు, పాదములు కలవాడు. అతడు శ్రేష్ఠమయిన శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయము, నోరు, చేతులు, కాళ్ళు, వీపు అను పది అవయవములు కలవాడు. ఆ శ్రీరాముని తేజస్సు, యశస్సు, సంపదలు సర్వలో ప్రసిద్ధములు. పవిత్రములైన మాతృ, పితృ వంశములు కలవాడు. మఱియు స్వచ్ఛములైన దంతములు, నేత్రములు కలవాడు. చంకలు, ఉదరము, వక్షఃస్థలము, నాసిక, భుజములు, లలాటము అను ఉన్నతములైన ఆరు అంగములుగలవాడు. సూక్ష్మములైన వ్రేళ్ళ కణుపులు, వెంట్రుకలు, రోమములు, గోళ్ళ చర్మము, లింగము, మీసము, దృష్టి, బుద్ధి కలవాడు. పూర్వాహ్ణము, మధ్యాహ్నము, అపరాహ్ణము అను త్రికాలములయందును ధర్మార్థకామములను ఆచరించుచుండువాడు.



ध्येयत्वाच्छोभनै रङ्गैः शुभाङ्गः इति कथ्यते / Dhyeyatvācchobhanai raṅgaiḥ śubhāṅgaḥ iti kathyate As He has to be meditated by devotees as having beautiful well formed limbs, He is called Śubhāṅgaḥ.

:: श्रीमद्रामायणे सुन्दरकाण्डे पञ्चत्रिंशस्सर्गः ॥
दुन्दुभिस्वननिर्घोषः स्निग्धवर्णः प्रतापवान् ।
समस्समविभक्ताङ्गो वर्णं श्यामं समाश्रितः ॥ १६ ॥
त्रिस्थिरस्त्रिप्रलम्बश्च त्रिसमस्त्रिषु चोन्नतः ।
त्रिताम्रस्त्रिषु च स्निग्धो गम्भीरस्त्रिषु नित्यशः ॥ १७ ॥
त्रिवलीवांस्त्र्यवनतः चतुर्व्यङ्गस्त्रिशीर्षवान् ।
चतुष्कलश्चतुर्लेखः चतुष्किष्कुश्चतुस्समः ॥ १८ ॥
चतुर्दशसमद्वन्द्वः चतुर्दंष्ट्रश्चतुर्गतिः ।
महोष्ठहनुनासश्च पञ्चस्निग्धोऽष्टवंशवान् ॥ १९ ॥
दशपद्मो दशबृहत् त्रिभिर्व्याप्तोद्विशुक्लवान् ।
षडुन्नतो नवतनुः त्रिभिर्व्याप्नोति राघवः ॥ २० ॥

Śrīmad Rāmāyaṇa Book V, Chapter 35
Dundubhisvananirghoṣaḥ snigdhavarṇaḥ pratāpavān,
Samassamavibhaktāṅgo varṇaṃ śyāmaṃ samāśritaḥ. 16.
Tristhirastripralambaśca trisamastriṣu connataḥ,
Tritāmrastriṣu ca snigdho gambhīrastriṣu nityaśaḥ. 17.
Trivalīvāṃstryavanataḥ caturvyaṅgastriśīrṣavān,
Catuṣkalaścaturlekhaḥ catuṣkiṣkuścatussamaḥ. 18.
Caturdaśasamadvandvaḥ caturdaṃṣṭraścaturgatiḥ,
Mahoṣṭhahanunāsaśca pañcasnigdho’ṣṭavaṃśavān. 19.
Daśapadmo daśabr̥hat tribhirvyāptodviśuklavān,
Ṣaḍunnato navatanuḥ tribhirvyāpnoti rāghavaḥ. 20.

He has a voice like the sound of a kettle-drum. He has a shining skin. He is full of splendor. He is square-built. His limbs are built symmetrically. He is endowed with a dark-brown complexion.

He is ever firm in three limbs (viz. the breast, waist and fist), long in three (viz. the breast, waist and fist), long in three (viz. the eyebrows, arms and soles), uniform in three (viz. his locks, testicle and knees, elevated in three (viz. his breast, rim of his navel and lower abdomen), coppery in three of the navel and the lower abdomen), coppery in three (viz. the rims of his eyes, nails, palms and soles), soft in three (viz. the lines on his soles, hair and the end of the membrum virile) and always deep in three (viz. the voice, gait and the navel).

He has three folds in the skin of his neck and belly. He is depressed at three places (viz. the middle of his soles, the lines on his soles and the nipples). He is undersized at four places (viz. the neck, membrane virile, the back and the shanks). He is endowed with three spirals in the hair of his head. He has four lines at the root of his thumb (denoting his proficiency in the four Vedas). He has four lines on his forehead (indicating longevity). He is four cubits high (96 inches). He has four pairs of limbs (viz. the cheeks, arms, shanks and knees) equally matched.

He has fourteen other pairs of limbs (viz. the eye brows, nostrils, eyes, ears, lips, nipples, elbows, wrists, knees testicles, lions, hands, feet and thighs) equally matched. The four large teeth at both the ends of his upper and lower jaws are very sharp. He walks in four gaits (resembling the walks of a lion, a tiger, an elephant and a bull). He is endowed with excellent lips, chin and nose. He has five glossy limbs (viz. the hair, eyes, teeth, skin and soles). He has eight long limbs (viz. the arms, fingers and toes, eyes and ears, thighs and shanks).

Rama has ten lotus-like limbs (viz. the countenance, the mouth, the eyes, the tongue, lips, palate, breasts, nails, the hands and the feet). He has ten ample limbs (viz. the chest, the head, the forehead, the neck, the arms, the heart, the mouth the feet, the back and the ears). He is spread through by reason of three (viz. splendor, renown and glory). He is doubly pure (on father's and mother's side). He is elevated in six limbs (viz. the flanks, the abdomen, the breast, the nose, the shoulders and the forehead). He is small, thin, fine or sharp in nine (viz. the hair, the moustaches and the beard, nails the hair on the body, the skin, the finger-joints, the membrum virile, acumen and perception). He pursues religious merit, worldly riches and the sensuous delight in three periods (viz. the forenoon, midday and afternoon).

शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः ।
इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥

శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।
ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥

Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,
Indrakarmā mahākarmā kr̥takarmā kr̥tāgamaḥ ॥ 84 ॥

24 డిసెం, 2014

781. దురారిహా, दुरारिहा, Durārihā

ఓం దురారిఘ్నే నమః | ॐ दुरारिघ्ने नमः | OM Durārighne namaḥ


దురారిణో దానవాదీన్ హన్తీతి పరమేశ్వరః ।
దురారి హేత్యుచ్యతే స పురాణార్థ విశారదైః ॥

చెడుగా వర్తించువారు దురారులు. అట్టి దురారులను అనగా చెడుమార్గమున ప్రవర్తించువారిని సంహరించు పరమేశ్వరుడు దురారిహా.



दुरारिणो दानवादीन् हन्तीति परमेश्वरः ।
दुरारि हेत्युच्यते स पुराणार्थ विशारदैः ॥

Durāriṇo dānavādīn hantīti parameśvaraḥ,
Durāri hetyucyate sa purāṇārtha viśāradaiḥ.

Since He kills vile enemies like asuras and others, He is called Durārihā.

समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

Samāvarto’nivr̥ttātmā durjayo duratikramaḥ,
Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥

23 డిసెం, 2014

780. దురావాసః, दुरावासः, Durāvāsaḥ

ఓం దురావాసాయ నమః | ॐ दुरावासाय नमः | OM Durāvāsāya namaḥ


దుఃఖేనా వాస్యతే చిత్తే సమధౌ యోగిభిర్హరిః ।
ఇతి విష్ణుర్దురావాస ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥

యోగులచే తమ చిత్తములయందు సమాధి స్థితియందు ఎంతయో శ్రమచే నిలుపుకొనబడువాడు కనుక దురావాసః.



दुःखेना वास्यते चित्ते समधौ योगिभिर्हरिः ।
इति विष्णुर्दुरावास इति सङ्कीर्त्यते बुधैः ॥

Duḥkhenā vāsyate citte samadhau yogibhirhariḥ,
Iti viṣṇurdurāvāsa iti saṅkīrtyate budhaiḥ.

In samādhi He is retained in the mind by yogis with difficulty.

समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

Samāvarto’nivr̥ttātmā durjayo duratikramaḥ,
Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥

22 డిసెం, 2014

779. దుర్గః, दुर्गः, Durgaḥ

ఓం దుర్గాయ నమః | ॐ दुर्गाय नमः | OM Durgāya namaḥ


అన్తరాయ ప్రతిహతేర్హరిర్దుఃఖాదవాప్యతే ।
ఇతి దుర్గ ఇతి విష్ణుః ప్రోచ్యతే విద్వదుత్తమైః ॥

సిద్ధి కలుగుటలో విఘ్నములచే దెబ్బతినిన సాధకులచే ఎంతయో శ్రమతో పొందబడువాడు. సాధకులు ఎన్నియో విఘ్నములను దాటిననే కాని ఎంతయో శ్రమచేసిననే కాని భగవద్ప్రాప్తి కలుగదు అని తాత్పర్యము.

:: పోతన భాగవతము చతుర్థ స్కంధము ::
సీ. శోకదావాగ్ని శిఖాకులితంబు పృథు క్లేశఘన దుర్గ దుర్గమంబు
దండధర క్రూర కుండలిశ్లిష్టంబు, పాపకర్మ వ్యాఘ్ర పరివృతంబు
గురు సుఖ దుఃఖ కాకోల పూరిత గర్త మగుచు ననాశ్రయ మైనయట్టి
సంసార మార్గ సంచారులై మృగతృష్ణికలఁబోలు విషయ సంఘము నహ మ్మ
తే. మేతి హేతుక దేహ నికేతనములు, నయి మహాభారవహు లైనయట్టి మూఢ
జనము లేనాఁట మీ పదాబ్జములు గానఁ, జాలు వారలు? భక్తప్రసన్న! దేవ! (173)

భక్తులను అనుగ్రహించే దేవదేవా! సంసారమార్గము శోకము అనే కారుచిచ్చు మంటలచే చీకాకైనది. కష్టాలు అనే గొప్ప కోటలతో దాటరానిది. యముడనే క్రూర సర్పముతో కూడినది. దుర్జనులు అనే పెద్ద పులులతో నిండినది. అంతులేని సుఖదుఃఖాలనే కాలకూట విషముతో నిండిన గుంట వంటిది. దిక్కు లేనిది. అటువంటి సంసార మార్గములో సంచరిస్తూ ఎండమావులవంటి ఇంద్రియ వాంఛలలో పడి కొట్టుమిట్టాడుతూ "నేను, నాది" అనే భావములకు కారణములయిన దేహం గేహం వంటి గొప్ప బరువును మోస్తూ ఉండెడి పరమ మూర్ఖులయిన మానవులు నీ పాద పద్మములను ఎప్పుడును చూడలేరు. 



अन्तराय प्रतिहतेर्हरिर्दुःखादवाप्यते ।
इति दुर्ग इति विष्णुः प्रोच्यते विद्वदुत्तमैः ॥

Antarāya pratihaterharirduḥkhādavāpyate,
Iti durga iti viṣṇuḥ procyate vidvaduttamaiḥ.

He who can only attained by considerable efforts from those who have slipped the path of realizing Him. Or in other words, He who can only be attained with difficulty by those who have overcome impediments.

:: श्रीमद्भागवते पञ्चमस्कन्धे चतुर्दशोऽध्यायः ::
स एष देहत्ममानिनां सत्त्वादिगुणविशेषविकल्पितकुशलाकुशलसमवहारविनिर्मित विविध देहावलिभिर्वियोगसंयोगाद्यनादिसंसारानुभवस्य द्वारभूतेन षडिन्द्रियवर्गेण तस्मिन्दुर्गाध्ववदसुगमेऽध्वन्यापतित ईश्वरस्य भगवतो विष्णोर्वशवर्तिन्या मायया जीवलोकोऽयं यथा वणिक्सार्थोऽर्थपरः स्वदेहनिष्पादितकर्मानुभवः श्मशानवदशिवतमायां संसाराटव्यां गतो नद्यपि विफलबहुप्रतियोगेहस्तत्तापोपसमनीं हरिगुरुचरणरविन्दमधुकरानुपदवीमवरुन्धे ॥ १ ॥

Śrīmad Bhāgavata - Canto 5, Chapter 14
Sa ēṣa dēhatmamānināṃ sattvādiguṇaviśēṣavikalpitakuśalākuśalasamavahāravinirmita vividha dēhāvalibhirviyōgasaṃyōgādyanādisaṃsārānubhavasya dvārabhūtēna ṣaḍindriyavargēṇa tasmindurgādhvavadasugamē’dhvanyāpatita īśvarasya bhagavatō viṣṇōrvaśavartinyā māyayā jīvalōkō’yaṃ yathā vaṇiksārthō’rthaparaḥ svadēhaniṣpāditakarmānubhavaḥ śmaśānavadaśivatamāyāṃ saṃsārāṭavyāṃ gatō nadyapi viphalabahupratiyōgēhastattāpōpasamanīṃ harigurucaraṇaravindamadhukarānupadavīmavarundhē. 1.

A man belonging to the mercantile community is always interested in earning money. Sometimes he enters the forest to acquire cheap commodities like wood and earth and sell them in the city at good prices. Similarly, the conditioned soul, being greedy, enters this material world for some material profit. Gradually he enters the deepest part of the forest, not really knowing how to get out. Having entered the material world, the pure soul becomes conditioned by the material atmosphere, which is created by the external energy under the control of Lord Viṣṇu. Thus the living entity comes under the control of the external energy, daivī māyā. Living independently and bewildered in the forest, he does not attain the association of devotees who are always engaged in the service of the Lord. Once in the bodily conception, he gets different types of bodies one after the other under the influence of material energy and impelled by the modes of material nature. In this way, the conditioned soul goes sometimes to the heavenly planets, sometimes to the earthly planets and sometimes to the lower planets and lower species. Thus he suffers continuously due to different types of bodies. These sufferings and pains are sometimes mixed. Sometimes they are very severe, and sometimes they are not. These bodily conditions are acquired due to the conditioned soul's mental speculation. He uses his mind and five senses to acquire knowledge, and these bring about the different bodies and different conditions. Using the senses under the control of the external illusionary energy, māyā, the living entity suffers the miserable conditions of material existence. He is actually searching for relief, but he is generally baffled, although sometimes he is relieved after great difficulty. Struggling for existence in this way, he cannot get the shelter of pure devotees, who are like bumblebees engaged in loving service at the lotus feet of Lord Viṣṇu.

समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

Samāvarto’nivr̥ttātmā durjayo duratikramaḥ,
Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥

21 డిసెం, 2014

778. దుర్గమః, दुर्गमः, Durgamaḥ

ఓం దుర్గమాయ నమః | ॐ दुर्गमाय नमः | OM Durgamāya namaḥ


గమ్యతే జ్ఞాయతే దుఃకేనేతి దుర్గమ ఉచ్యతే ఎంతయో శ్రమచే మాత్రమే తెలియబడువాడు కనుక దుర్గమః.



गम्यते ज्ञायते दुःकेनेति दुर्गम उच्यते / Gamyate jñāyate duḥkeneti durgama ucyate Is attained, known, with difficulty and hence He is Durgamaḥ.

समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

Samāvarto’nivr̥ttātmā durjayo duratikramaḥ,
Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥

20 డిసెం, 2014

777. దుర్లభః, दुर्लभः, Durlabhaḥ

ఓం దుర్లభాయ నమః | ॐ दुर्लभाय नमः | OM Durlabhāya namaḥ


భక్త్యా దుర్లభాయ లభ్యో విష్ణుర్దుర్లభ ఉచ్యతే ।
జన్మాన్తర సహస్రేషు భక్త్యా లభ్యస్త్వనన్యయా ॥
ఇత్యాది వ్యాసమునిరాడ్ భగవద్యాక్య సంస్మృతేః ॥

దుర్లభమగు భక్తి చేతనే పొందబడువాడు. 'జన్మాంతర సహస్రములయందు ఆచరించబడిన తపము, జ్ఞానము, ధ్యానము, యోగసమాధి మొదలగు వానిచే పాపములు క్షీణించినవారికి మాత్రమే కృష్ణుని విషయమున భక్తి కలుగును' అను శ్రీ వ్యాస భగవద్వచనమును, 'నేను అనన్య భక్తిచేతనే లభ్యుడను' అను భగవద్వచనమును ఇందు ప్రమాణములు.



भक्त्या दुर्लभाय लभ्यो विष्णुर्दुर्लभ उच्यते ।
जन्मान्तर सहस्रेषु भक्त्या लभ्यस्त्वनन्यया ॥
इत्यादि व्यासमुनिराड् भगवद्याक्य संस्मृतेः ॥

Bhaktyā durlabhāya labhyo viṣṇurdurlabha ucyate,
Janmāntara sahasreṣu bhaktyā labhyastvananyayā.
Ityādi vyāsamunirāḍ bhagavadyākya saṃsmr̥teḥ.

As He can be attained only by devotion, which is difficult to practice, He is called Durlabhaḥ vide 'Devotion to Kr̥ṣṇa arises only to men whose sins have died out by tapas, jñāna and samādhi in thousands of other lives' and also the Lord's words: 'I can be attained only by devotion to Me alone'.

समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

Samāvarto’nivr̥ttātmā durjayo duratikramaḥ,
Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥

19 డిసెం, 2014

776. దురతిక్రమః, दुरतिक्रमः, Duratikramaḥ

ఓం దురతిక్రమాయ నమః | ॐ दुरतिक्रमाय नमः | OM Duratikramāya namaḥ


నాతి క్రామన్తి సూర్యాద్యా ఆస్యాజ్ఞాం భయకృత్త్వతః ।
ఇతి దురతిక్రమ ఇత్యుచ్యతే సద్భిరచ్యుతః ॥
భయాదస్యాగ్నిస్తపతి భయాదితి మహద్భయమ్ ।
వజ్రముద్యతమిత్యాది శ్రుతివాక్యానుసారతః ॥

ఈతని ఆజ్ఞ ఎంత శ్రమచేత కూడ అతిక్రమించుటకు శక్యము కాదు. ఈతడు సర్వులకును భయహేతువు కావున సూర్యాదులును ఈతని ఆజ్ఞను అతిక్రమించరు.

:: తైత్తిరీయోపనిషత్ - ఆనందవల్లి (బ్రహ్మానందవల్లి) ద్వితీయాధ్యాయః - అష్టమోఽనువాకః ::
భీషాఽస్మాద్వాతః పవతే । భీషోదేతి సూర్యః । భీషాఽస్మాదగ్నిశ్చేన్ద్రశ్చ । మృత్యుర్ధావతి పఞ్చమ ఇతి । ... (1)

వాయువు పరబ్రహ్మము భయము చేత వీచుచున్నది. సూర్యుడు సైతమూ పరబ్రహ్మము భయము వలన ఉదయించుచున్నాడు. పరబ్రహ్మము వలన భయముచేత అగ్నియు, ఇంద్రుడు, అయిదవవాడగు యముడును ప్రవర్తించుచున్నారు.



नाति क्रामन्ति सूर्याद्या आस्याज्ञां भयकृत्त्वतः ।
इति दुरतिक्रम इत्युच्यते सद्भिरच्युतः ॥
भयादस्याग्निस्तपति भयादिति महद्भयम् ।
वज्रमुद्यतमित्यादि श्रुतिवाक्यानुसारतः ॥

Nāti krāmanti sūryādyā āsyājñāṃ bhayakr̥ttvataḥ,
Iti duratikrama ityucyate sadbhiracyutaḥ.
Bhayādasyāgnistapati bhayāditi mahadbhayam,
Vajramudyatamityādi śrutivākyānusārataḥ.

The One whose commandment cannot be disobeyed. On account of fear, the sun etc., do not transgress Him.

Taittirīya Upaniṣad - Ānandavalli (Brahmānandavalli) Section II - Chapter VIII
Bhīṣā’smādvātaḥ pavate , bhīṣodeti sūryaḥ , bhīṣā’smādagniścendraśca , mr̥tyurdhāvati pañcama iti , ... (1)

:: तैत्तिरीयोपनिषत् - आनंदवल्लि (ब्रह्मानंदवल्लि) द्वितीयाध्यायः - अष्टमोऽनुवाकः ::
भीषाऽस्माद्वातः पवते । भीषोदेति सूर्यः । भीषाऽस्मादग्निश्चेन्द्रश्च । मृत्युर्धावति पञ्चम इति । ... (१)

From Its (parabrahma) fear, the wind blows; from fear rises the sun, from the fear of It again Indra, Fire and the fifth i.e., death, proceed (to their respective duties).

समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

Samāvarto’nivr̥ttātmā durjayo duratikramaḥ,
Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥

18 డిసెం, 2014

775. దుర్జయః, दुर्जयः, Durjayaḥ

ఓం దుర్జాయ నమః | ॐ दुर्जाय नमः | OM Durjāya namaḥ


జేతుం న శక్యత ఇతి దుర్జయః ప్రోచ్యతే హరిః ఎంత శ్రమచే కూడ జయించబడనలవి కానివాడు.



जेतुं न शक्यत इति दुर्जयः प्रोच्यते हरिः / Jetuṃ na śakyata iti durjayaḥ procyate hariḥ The One who cannot be conquered in spite of any amount of effort.

समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

Samāvarto’nivr̥ttātmā durjayo duratikramaḥ,
Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥

17 డిసెం, 2014

774. (అ)నివృత్తాత్మా, (अ)निवृत्तात्मा, (A)Nivr̥ttātmā

ఓం నివృతాత్మనే నమః | ॐ निवृतात्मने नमः | OM Nivr̥tātmane namaḥ


సర్వత్ర వర్తమానత్వాన్న నివృత్తః కుతోఽపి సః ।
ఆత్మాఽథవాస్య మనసో విషయేభ్యో నివర్తనాత్ ॥
ఇత్యనివృత్తాత్మేతి స ప్రోచ్యతే మధుసూదనః ॥

అంతటను ఉండువాడే కావున దేనినుండియు నివృత్తము అనగా లేకుండ పోయినది కాని ఆత్మ ఈతనికి కలదు. 'నివృత్తాత్మా' అని పద విభాగము చేయగా విషయ సుఖములనుండి మరలిన చిత్తము ఈతనికి కలదు అని చెప్పవచ్చును ఏలయన పరమాత్ముడు సంపూర్ణ కాముడు లేదా అట్టివాడగు తత్త్వజ్ఞుడగు ఉపాసకుడు పరమాత్మ రూపమే.



सर्वत्र वर्तमानत्वान्न निवृत्तः कुतोऽपि सः ।
आत्माऽथवास्य मनसो विषयेभ्यो निवर्तनात् ॥
इत्यनिवृत्तात्मेति स प्रोच्यते मधुसूदनः ॥

Sarvatra vartamānatvānna nivr̥ttaḥ kuto’pi saḥ,
Ātmā’thavāsya manaso viṣayebhyo nivartanāt.
Ityanivr̥ttātmeti sa procyate madhusūdanaḥ.

Being omnipresent, His ātma does not withdraw from objects. When the name is considered as Nivr̥ttātmā then the explanation is that He has no inclination towards worldly pleasures.

समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

Samāvarto’nivr̥ttātmā durjayo duratikramaḥ,
Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥

16 డిసెం, 2014

773. సమావర్తః, समावर्तः, Samāvartaḥ

ఓం సమావర్తాయ నమః | ॐ समावर्ताय नमः | OM Samāvartāya namaḥ


సంసార చక్రస్య సమ్యగావర్తక ఇతి ప్రభుః ।
సమావర్త ఇతి విష్ణుః ప్రోచ్యతే విదుషాం వరైః ॥

సంసార చక్రమును తగిన విధమున ప్రవర్తిల్లునట్లు ఆవర్తింప అనగా తిరుగ జేయును.



संसार चक्रस्य सम्यगावर्तक इति प्रभुः ।
समावर्त इति विष्णुः प्रोच्यते विदुषां वरैः ॥

Saṃsāra cakrasya samyagāvartaka iti prabhuḥ,
Samāvarta iti viṣṇuḥ procyate viduṣāṃ varaiḥ.

One who rotates well, the wheel of Saṃsāra.

समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

Samāvarto’nivr̥ttātmā durjayo duratikramaḥ,
Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥

15 డిసెం, 2014

772. ఏకపాత్‌, एकपात्‌, Ekapāt

ఓం ఏకపదే నమః | ॐ एकपदे नमः | OM Ekapade namaḥ


పాదోస్యేత్యాది వేదాశ్చ విష్టభ్యాహ మితిస్మృతేః ।
విష్ణోరస్యైకపాద ఇత్యేకపాదితి కథ్యతే ॥

తన సంపూర్ణ్తత్త్వపు నాలుగవవంతైన సకల ప్రపంచ రూపమగు ఒక పాదము కలవాడు. 'పాదోఽస్య విశ్వా భూతాని...' (పురుష సూక్తము) - 'సకల భూతములును ఈతని ఒక పాదము' శ్రుతియు, 'విష్టభ్యాఽహ మిదం కృత్స్న మేకాంశేన స్థితో జగత్' (10.42) - 'నేనే ఈ సమస్త జగత్తును నా ఏకాంశముతో (చతుర్థాంశముతో) వ్యాపించియున్నాను.' అను గీతా స్మృతియు ఇందు ప్రమాణము.



पादोस्येत्यादि वेदाश्च विष्टभ्याह मितिस्मृतेः ।
विष्णोरस्यैकपाद इत्येकपादिति कथ्यते ॥

Pādosyetyādi vedāśca viṣṭabhyāha mitismr̥teḥ,
Viṣṇorasyaikapāda ityekapāditi kathyate.

His One foot that is one fourth of His full form, is the equivalent of entire universe. 'Pādo’sya viśvā bhūtāni/पादोऽस्य विश्वा भूतानि...' (Puruṣa Sūktam) and the Lord's statement 'Viṣṭabhyā’ha midaṃ kr̥tsna mekāṃśena sthito jagat / विष्टभ्याऽह मिदं कृत्स्न मेकांशेन स्थितो जगत्' - I stand supporting the whole universe with a single fragment of Myself' from Gita (10.42) are references.

चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।
चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥

Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,
Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥

14 డిసెం, 2014

771. చతుర్వేదవిత్‌, चतुर्वेदवित्‌, Caturvedavit

ఓం చతుర్వేదవిదే నమః | ॐ चतुर्वेदविदे नमः | OM Caturvedavide namaḥ


యథావత్ వేత్తి వేదానాం చతుర్ణామర్థమచ్యుతః ।
ఇతి స చతుర్వేదవిదితి కఙ్కీర్త్యతే బుధైః ॥

నాలుగు వేదములను, వాని అర్థములను కూడ ఉన్నవి ఉన్నట్లు వాస్తవరూపమున ఎరుగును కనుక చతుర్వేదవిత్‍.

:: శ్రీమద్భగవద్గీత పురుషోత్తమప్రాప్తి యోగము ::
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్స్మృతిర్జ్ఞాన మపోహనం చ ।
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదన్తకృద్వేదవిదేవ చాహమ్ ॥ 15 ॥

నేను సమస్త ప్రాణులయొక్క హృదయమందున్నవాడను; నావలననే జీవునకు జ్ఞాపకశక్తి, జ్ఞానము, మఱపు కలుగుచున్నవి. వేదములన్నిటిచేతను తెలియదగినవాడను నేనే అయియున్నాను. మఱియు వేదమును ఏరిగినవాడనుగూడ నేనే అయియున్నాను.



यथावत् वेत्ति वेदानां चतुर्णामर्थमच्युतः ।
इति स चतुर्वेदविदिति कङ्कीर्त्यते बुधैः ॥

Yathāvat vetti vedānāṃ caturṇāmarthamacyutaḥ,
Iti sa caturvedaviditi kaṅkīrtyate budhaiḥ.

Since He know the four Vedas and their meaning correctly, He is called Caturvedavit.

:: श्रीमद्भगवद्गीत पुरुषोत्तमप्राप्ति योग ::
सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्स्मृतिर्ज्ञान मपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदन्तकृद्वेदविदेव चाहम् ॥ १५ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 15
Sarvasya cāhaṃ hr̥di sanniviṣṭo mattaḥ ssmr̥tirjñāna mapohanaṃ ca,
Vedaiśca sarvairahameva vedyo vedantakr̥dvedavideva cāham. 15.

And I am seated in the hearts of all. From Me are memory, knowldge and their loss. I alone am the object to be known through all of the Vedas; I am also the originator of the Vedanta and I Myself am the knower of the Vedas.

चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।
चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥

Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,
Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥

13 డిసెం, 2014

770. చతుర్భావః, चतुर्भावः, Caturbhāvaḥ

ఓం చతుర్భావాయ నమః | ॐ चतुर्भावाय नमः | OM Caturbhāvāya namaḥ


ధర్మార్థకామమోక్షాఖ్య పురుషార్థ చతుష్టయమ్ ।
భవత్యుత్ప్రద్యతే యత్తత్స చతుర్భావ ఉచ్యతే ॥

పురుషుడు తన జీవితమునకు ముఖ్య ప్రయోజనములుగా సాధించదగు అంశములైన ధర్మ, అర్థ, కామ, మోక్షములు అను నాలుగు పురుషార్థములును ఈతని నుండియే సిద్ధించును.



धर्मार्थकाममोक्षाख्य पुरुषार्थ चतुष्टयम् ।
भवत्युत्प्रद्यते यत्तत्स चतुर्भाव उच्यते ॥

Dharmārthakāmamokṣākhya puruṣārtha catuṣṭayam,
Bhavatyutpradyate yattatsa caturbhāva ucyate.

The four aspects that a man considers to be the principal accomplishments and goals viz., righteousness, prosperity, gratification and salvation arise from Him or can be achieved only by His grace and hence He is Caturbhāvaḥ.

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे अष्टमोऽध्यायः ::
धर्मार्थकाममोक्षाख्यं य इच्छेच्छ्रेय आत्मनः ।
एकम् ह्येव हरेस्तत्र कारणं पादसेवनम् ॥ ४१ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 8

Dharmārthakāmamokṣākhyaṃ ya icchecchreya ātmanaḥ,
Ekam hyeva harestatra kāraṇaṃ pādasevanam. 41.

Any person who desires the fruits of the four principles - righteousness, prosperity, sense gratification and, at the end, liberation, should engage in the devotional service of the Lord; for worship of His lotus feet yields the fulfillment of all of these.

चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।
चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥

Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,
Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥

12 డిసెం, 2014

769. చతురాత్మా, चतुरात्मा, Caturātmā

ఓం చతురాత్మనే నమః | ॐ चतुरात्मने नमः | OM Caturātmane namaḥ


రాగద్వేషాదిరహిత ఆత్మాహ్యస్య మనోహరః ।
చతుర ఇతిస విష్ణుశ్చతురాత్మేతి కీర్త్యతే ॥
అహఙ్కారమనోబుద్ధి చిత్తేభ్యో హి చతుర్విధః ।
ఆత్మాన్తః కరణం యస్య చతురాత్మాస ఉచ్యతే ॥

రాగద్వేషాదిరహితమగుటచేత చతురమ్ అనగా విదశత్వము లేదా నేర్పుగల ఆత్మ స్వరూపము ఈతనికి కలదు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అను పేరులు దశాభేదములతో కల అంతఃకరణ చతుష్టయమును తన ఆత్మలుగా అనగా రూపములుగా కలవాడు.

137. చతురాత్మా, चतुरात्मा, Caturātmā



रागद्वेषादिरहित आत्माह्यस्य मनोहरः ।
चतुर इतिस विष्णुश्चतुरात्मेति कीर्त्यते ॥
अहङ्कारमनोबुद्धि चित्तेभ्यो हि चतुर्विधः ।
आत्मान्तः करणं यस्य चतुरात्मास उच्यते ॥

Rāgadveṣādirahita ātmāhyasya manoharaḥ,
Catura itisa viṣṇuścaturātmeti kīrtyate.
Ahaṅkāramanobuddhi cittebhyo hi caturvidhaḥ,
Ātmāntaḥ karaṇaṃ yasya caturātmāsa ucyate.

As He is free of attachment and aversion, His ātma i.e., manas is clear and quick.

Or His antaḥkaraṇa is fourfold as manas (inclination), buddhi (intellect), ahanakāra (ego) and citta (wish). So Caturātmā.

137. చతురాత్మా, चतुरात्मा, Caturātmā

चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।
चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥

Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,
Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥

11 డిసెం, 2014

768. చతుర్గతిః, चतुर्गतिः, Caturgatiḥ

ఓం చతుర్గతయే నమః | ॐ चतुर्गतये नमः | OM Caturgataye namaḥ


చతుర్ణామాశ్రమాణాం చ వర్ణానాం పరమేశ్వరః ।
యథోక్త కారిణాం గతిశ్చతుర్గతిరితీర్యతే ॥

శాస్త్ర విధిని అనుసరించి వర్తించు నాలుగు వర్ణముల జనులకును, నాలుగు ఆశ్రమముల జనులకును గతి, గమ్యము, ఆశ్రయము.



चतुर्णामाश्रमाणां च वर्णानां परमेश्वरः ।
यथोक्त कारिणां गतिश्चतुर्गतिरितीर्यते ॥

Caturṇāmāśramāṇāṃ ca varṇānāṃ parameśvaraḥ,
Yathokta kāriṇāṃ gatiścaturgatiritīryate.

The goal of those who observe the four varṇas and āśramas in the ordained way.

चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः
चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥

Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,
Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥

10 డిసెం, 2014

767. చతుర్వ్యూహః, चतुर्व्यूहः, Caturvyūhaḥ

ఓం చతుర్వ్యూహాయ నమః | ॐ चतुर्व्यूहाय नमः | OM Caturvyūhāya namaḥ


శరీరపురుషశ్ఛన్దః పురుషో వేదపూరుషః ।
మహాపురుష ఇతి బాహ్వృచోపనిషదీరితాః ॥
చత్వారః పురుషా వ్యూహాః అస్య విష్ణోర్మహాత్మనః ।
యతస్తతో చతుర్వ్యూహ ఇతి కఙ్కీర్త్యతే బుధైః ॥

శరీర పురుషుడు, ఛందః పురుషుడు, వేద పురుషుడు, మహా పురుషుడు - అను నలుగురు పురుషులను తన నాలుగు వ్యూహములుగా అనగా అమరికలుగా కలవాడు చతుర్వ్యూహః అని బాహ్వృచోపనిషత్ యందు చెప్పబడినది.

:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
క. దివ్యమగు వాసుదేవా, ది వ్యూహ చతుష్టయంబు త్రిజగములందున్‍

సేవ్యం బని చెప్పంబడు, భవ్యగుణా! దాని నెరుఁగఁ బలికెద నీకున్‍. (892)
సీ. సత్త్వ ప్రధానమై స్వచ్ఛమై శాంతమై యూర్మిషట్కంబుల నొసరించి

సురుచిర షాడ్గుణ్య పరిపూర్ణమై నిత్యమై భక్తజన సేవ్యమై తనర్చి

వలనొప్పుచుండు న వ్వాసుదేవ వ్యూహ మంత మహత్తత్త్వమందు నోలి

రూఢిఁ గ్రియాశక్తి రూపంబు గల్గు నహంకార ముత్పన్నమయ్యె, నదియు
తే. సరవి వైకారికంబుఁ దైజసముఁ దామ, సంబు నా మూఁడు దెఱఁగుల జరుగు, నందుఁ

దనరు వైకారికము మనస్సునకు నింద్రి, యములకును గగనముఖ భూతముల కరయ. (893)
వ. అది దేవతారూపంబున నుండుఁ, దైజసాహంకారంబు బుద్ధి ప్రాణంబులుం గలిగి యుండుఁ, దామసాహంకారం బింద్రియ మేళనంబున నర్థమాత్రంబై యుండు మఱియును. (894)
సీ. అట్టి యహంకారమం దదిష్ఠించి సాహస్ర ఫణామండలాభిరాముఁ

డై తనరారు ననంతుఁడు సంకర్షణుం డనఁ దగు పురుషుండు ఘనుఁడు,

మహిత భూతేంద్రియ మానస మయుఁడు నై కర్తృత్వ కార్యత్వ కారణత్వ

ప్రకట శాంతత్వ ఘోరత్వ మూఢత్వాది లక్షణ లక్షితోల్లాసి యగుచు
తే. నుండు నమ్మేటి రెండవ వ్యూహ మనఁగ, ఘన వికారంబుఁ బొందు వైకారికంబు

వలన వినుము మనస్తత్త్వ మెలమిఁ బుట్టె, మఱియు వైకారికంబును మాత! వినుము. (895)
వ. అది యెట్టు లంటెన్ని సామాన్య చింతయు విశేషచింతయు ననం దగు సంకల్ప వికల్పంబులం జేసి కామసంభవం బనంబడు నెద్ది యనిరుద్దాఖ్యం బయిన వ్యూహం, బదియ హృషీకంబులకు నధీశ్వరంబయి సకల యోగీంద్ర సేవ్యం బగుచు శరదందీవరశ్యామం బయి యుండు... (896)

వాసుదేవము, సంకర్షణము, ప్రద్యుమ్నము, అనిరుద్ధము అనే దివ్యమైన ఈ నాలుగు వ్యూహములు ముల్లోకములలోను సేవింపదగినవి. సుగుణవతీ! వానిని నీకు వివరించి చెబుతాను.

వాసుదేవవ్యూహము ఆకలిదప్పులు, శోకమోహాలు, జరామరణాలు అనే ఆరు ఊర్ములనుండి విడివడినదై - ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము, అనే షడ్గుణములతో పరిపూరణమై - సత్త్వగుణ ప్రధానమై, నిర్మలమై, శాంతమై, నిత్యమై, భక్తజన సంసేవ్యమై అలరారుతు ఉంటుంది. మహత్తత్త్వము నుండి క్రియాశక్తి రూపమయిన అహంకారము పుట్టినది. ఆ అహంకారము వైకారికము, తైజసము, తామసము అని మూడు విధములుగా విడివడినది.

వానిలో వైకారికాహంకారము అనేది మనస్సునకు, పంచేంద్రియములకు, ఆకాశాది పంచభూతములకు ఉత్పత్తి స్థానమై దేవతా రూపమై ఉండునది.

తైకసాహంకారము బుద్ధి రూపమును, ప్రాణరూపమును కలిగి ఉండునది. తామసాహంకారము ఇంద్రియార్థములతో సమ్మేళనమును పొంది ప్రయోజనమాత్రమై ఉండునది.

వైకారికమైన సాత్త్వికాహంకారమును అధిష్ఠించి సంకర్షణ వ్యూహము ఒప్పుచుండును. వేయి పడగలతో ప్రకాశించెడివాడు, అనంతుడు అయిన సంకర్షణ పురుషుడు, మహానుభావుడు, పంచభూతములతో, పంచేద్రియములతో, మనస్సునతో నిండి ఉండెడివాడు. కర్త, కార్యము, కారణము అనే రూప భేదములు కలిగి శాంతత్వము, ఘోరత్వము, మూఢత్వమువంటి లక్షణములతో ఉల్లాసముగా ఉండెడివాడు. ఈ మేటి వ్యూహమే రెండవదయిన సంకర్షణ వ్యూహము. దీనినుంచె మనస్తత్త్వము పుట్టినది.

ఈ మనస్తత్త్వమునకు చింతనము సహజము. ఆ చింతనము రెండు విధములు. సామాన్య చింతనము, విశేష చింతనము. వీనికే క్రమముగా సంకల్పము, వికల్పము అని పేరు. ఈ సంకల్పవికల్పముల వల్లనే సృష్టిలోని వస్తువులు వేరు వేరు లక్షణములతో మనకు గోచరిస్తూ ఉంటాయి. వీని వల్లనే వివిధ కామములు ఉత్పన్నమవుతాయి. కనుకనే ఇది ప్రద్యుమ్న వ్యూహము అని చెప్పబడును. ఇక అనిరుద్ధమనే వ్యూహము సంగతి చెప్పెదను. ఇదే ఇంద్రియములు అలన్నింటికిని అధీశ్వరమై, యోగీంద్రులందరకు సంసేవ్యమై శరత్కాలమందలి నల్ల కలువవలె శ్యామల వర్ణముతో విరాజిల్లుతు ఉండునది. 



शरीरपुरुषश्छन्दः पुरुषो वेदपूरुषः ।
महापुरुष इति बाह्वृचोपनिषदीरिताः ॥
चत्वारः पुरुषा व्यूहाः अस्य विष्णोर्महात्मनः ।
यतस्ततो चतुर्व्यूह इति कङ्कीर्त्यते बुधैः ॥

Śarīrapuruṣaśchandaḥ puruṣo vedapūruṣaḥ,
Mahāpuruṣa iti bāhvr̥copaniṣadīritāḥ.
Catvāraḥ puruṣā vyūhāḥ asya viṣṇormahātmanaḥ,
Yatastato caturvyūha iti kaṅkīrtyate budhaiḥ.

As mentioned in the Bāhvr̥copaniṣat - Śarīra puruṣa, Chandaḥ puruṣa, Veda puruṣa and Mahā puruṣa are His four vyūha forms. Therefore He is Caturvyūhaḥ.

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे षड्विंशोऽध्यायः ::
यत्तत्सत्त्वगुनं स्वच्छं शान्तं भगवतह् पदम् ।
यदाहुर्वासुदेवाख्यं चित्तं तन्महदात्मकम् ॥ २१ ॥
स्वच्चत्वमविकारित्वं शान्तत्वमिति चेतसः ।
वृत्तिभिर्लक्षणं प्रोक्तं यथापां प्रकृतिः परा ॥ २२ ॥
महत्तत्त्वाद्विकुर्वानाद्भगवद्वीर्यसम्भवात् ।
क्रियाशक्तिरहङ्कारस्त्रिविधः समपद्यत ॥ २३ ॥
वैकारिकस्तैजसश्च तामसश्च यतो भवः ।
मनसस्चेन्द्रियाणां च भूतानां महतामपि ॥ २४ ॥
सहस्रशिरसं साक्षाद्यमनन्तं प्रचक्षते ।
सङ्कर्षणाख्यं पुरुषं भूतेन्द्रियमनोमयम् ॥ २५ ॥
कर्तृत्वं कारणत्वं च कार्यत्वं चेति लक्षणम् ।
शान्तघोरविमुढत्वमिति वा स्यादहङ्कृतेः ॥ २६ ॥
वैकारिकाद्विकुर्वाणान्मनस्तत्त्वमजायत ।
यत्सङ्कल्पविकल्पाभ्यां वर्तते कामसम्भवः ॥ २७ ॥
यद्विदुर्ह्यनिरुद्धाख्यं हृषीकाणामधीश्वरम् ।
शारदेन्दीवरश्यामं संराध्यं योगिभिह् शनैः ॥ २८ ॥
तैजसात्तु विकुर्वाणाद्बुद्धितत्त्वमभूत्सति ।
द्रव्यस्फुरणविज्ञानमिन्द्रियाणामनुग्रहः ॥ २९ ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 26
Yattatsattvagunaṃ svacchaṃ śāntaṃ bhagavatah padam,
Yadāhurvāsudēvākhyaṃ cittaṃ tanmahadātmakam. 21.
Svaccatvamavikāritvaṃ śāntatvamiti cētasaḥ,
Vr̥ittibhirlakṣaṇaṃ prōktaṃ yathāpāṃ prakr̥itiḥ parā. 22.
Mahattattvādvikurvānādbhagavadvīryasambhavāt,
Kriyāśaktirahaṅkārastrividhaḥ samapadyata. 23.
Vaikārikastaijasaśca tāmasaśca yatō bhavaḥ,
Manasascēndriyāṇāṃ ca bhūtānāṃ mahatāmapi. 24.
Sahasraśirasaṃ sākṣādyamanantaṃ pracakṣatē,
Saṅkarṣaṇākhyaṃ puruṣaṃ bhūtēndriyamanōmayam. 25.
Kartr̥itvaṃ kāraṇatvaṃ ca kāryatvaṃ cēti lakṣaṇam,
Śāntaghōravimuḍatvamiti vā syādahaṅkr̥itēḥ. 26.
Vaikārikādvikurvāṇānmanastattvamajāyata,
Yatsaṅkalpavikalpābhyāṃ vartatē kāmasambhavaḥ. 27.
Yadvidurhyaniruddhākhyaṃ hr̥iṣīkāṇāmadhīśvaram,
Śāradēndīvaraśyāmaṃ saṃrādhyaṃ yōgibhih śanaiḥ. 28.
Taijasāttu vikurvāṇādbuddhitattvamabhūtsati,
Dravyasphuraṇavijñānamindriyāṇāmanugrahaḥ. 29.

The mode of goodness, which is the clear, sober status of understanding the God and which is generally called vāsudeva, or consciousness, becomes manifest in the mahat-tattva.

After the manifestation of the mahat-tattva, these features appear simultaneously. As water in its natural state, before coming in contact with earth, is clear, sweet and unruffled, so the characteristic traits of pure consciousness are complete serenity, clarity, and freedom from distraction.

The material ego springs up from the mahat-tattva, which evolved from the Lord's own energy. The material ego is endowed predominantly with active power of three kinds -- good, passionate and ignorant. It is from these three types of material ego that the mind, the senses of perception, the organs of action, and the gross elements evolve.

The threefold ahankāra, the source of the gross elements, the senses and the mind, is identical with them because it is their cause. It is known by the name of Saṅkarṣaṇa, who is directly Lord Ananta with a thousand heads.

This false ego is characterized as the doer, as an instrument and as an effect. It is further characterized as serene, active or dull according to how it is influenced by the modes of goodness, passion and ignorance.

From the false ego of goodness, another transformation takes place. From this evolves the mind, whose thoughts and reflections give rise to desire.

The mind of the living entity is known by the name of Lord Aniruddha, the supreme ruler of the senses. He possesses a bluish-black form resembling a lotus flower growing in the autumn. He is found slowly by the yogis.

By transformation of the false ego in passion, intelligence takes birth, O virtuous lady. The functions of intelligence are to help in ascertaining the nature of objects when they come into view, and to help the senses.

चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।
चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥

Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,
Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥

9 డిసెం, 2014

766. చతుర్బాహుః, चतुर्बाहुः, Caturbāhuḥ

ఓం చతుర్బాహవే నమః | ॐ चतुर्बाहवे नमः | OM Caturbāhave namaḥ


చతుర్బాహుః, चतुर्बाहुः, Caturbāhuḥ

చత్వారో బాహవోఽస్యేతి చతుర్బాహురితీర్యతే ।
వాసుదేవేరూఢమిదం నమేతి విదుషాం మతమ్ ॥


నాలుగు బాహువులు ఈతనికి కలవు. ఈ నామము వాసుదేవునియందు రూఢము అనగా వాడుక చేయబడుచున్న శబ్దము.

:: పోతన భాగవతము దశమ స్కంధము, పూర్వ భాగము ::
సీ. జలధరదేహు నాజానుచతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షుఁ
జారుగదాశంఖచక్రపద్మవిలాసుఁ గంఠకౌస్తుభమణికాంతి భాసుఁ
గమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు
నురుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు
తే. బాలుఁ బూర్ణేందురుచిజాలు భక్తలోల, పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁ
జూచి తిలకించి పులకించి చోద్య మంది, యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె (112)

అప్పుడు వసుదేవుడు ఆ బాలుని తేరిపారచూచినాడు. ఆ బాలుడు ఆయనకు దివ్య రూపముతో దర్శనమునిచ్చినాడు. ఆ పిల్లవాడు మేఘవర్ణ శరీరమును కలిగియున్నాడు. అతడి పొడవైన నాలుగు బాహువులలో గద, శంఖము, చక్రము, పద్మము వెలుగొందుచున్నాయి. తామరపువ్వు రేకులవంటి కన్నులు, విశాలమైన వక్షఃస్థలము కలవాని కంఠములో కౌస్తుభరత్నపు కాంతులు వెలుగొందుచున్నాయి. అందమైన మొలత్రాడు, కంకణములు, బాహుపురులు ధరించియున్నాడు. శ్రీవత్సము అనెడి మచ్చ వక్షఃస్థలముపైన మెరుస్తున్నది. చెవులకు ఉన్న కుండలముల కాంతితో నుదుటి ముంగురులు వెలుగొందుతున్నాయి. మణులు, వైఢూర్యాలు పొదిగిన కిరీటము ధరించియున్నాడు.

ఆ బిడ్డడు బాలుడుగనే ఉన్నా ఈ దివ్యలక్షణములన్నిటితోను పూర్ణచంద్రుని కాంతులు చిమ్ముతూ ఉన్నాడు. అతడు భక్తులందరిని రక్షించెడివాడు. సృష్టిలోని సుగుణములు అన్నియును అతనివద్దానుండియే పుట్టినవి. అతివిశాలమైన కరుణ కలవాడు.

అటువంటి బాలుని చూచిన వసుదేవుడు మళ్ళీ మళ్ళీ తేరిపారచూచి, పులకించి పోయాడు, ఆశ్చర్యపోయాడు, ఉప్పొంగిపోయాడు. ఆ పారవశ్యమునుండి తేరుకొని ఉత్సాహముతో నిలబడ్డాడు.



चत्वारो बाहवोऽस्येति चतुर्बाहुरितीर्यते ।
वासुदेवेरूढमिदं नमेति विदुषां मतम् ॥


Catvāro bāhavo’syeti caturbāhuritīryate,
Vāsudeverūḍamidaṃ nameti viduṣāṃ matam.


He has four arms. So Caturbāhuḥ. This is well known for Vāsudeva.

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे कृष्णजन्मनि तृतीयोऽध्यायः ::
तमद्भुतं बालकमम्बुजेक्षणं चतुर्भुजं शङ्खगदाद्युदायुधम् ।
श्रīवत्सलक्ष्मं गलशॊभिकौस्तुभं पीताम्बरं सान्द्रपयोदसौभगम् ॥ ९ ॥
महार्हवैदूर्यकिरीटकुण्डल त्विषा परिष्वक्तसहस्रकुन्तलम् ।
उद्दामकाञ्च्यङ्गदकङ्कणादिभिर्विरोचमानं वसुदेव ऐक्षत ॥ १० ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 3
Tamadbhutaṃ bālakamambujekṣaṇaṃ caturbhujaṃ śaṅkhagadādyudāyudham,
Śrīvatsalakṣmaṃ galaśóbhikaustubhaṃ pītāmbaraṃ sāndrapayodasaubhagam. 9.
Mahārhavaidūryakirīṭakuṇḍala tviṣā pariṣvaktasahasrakuntalam,
Uddāmakāñcyaṅgadakaṅkaṇādibhirvirocamānaṃ vasudeva aikṣata. 10.

Vasudeva then saw the newborn child, who had very wonderful lotus-like eyes and who bore in His four hands the four weapons śańkha, cakra, gadā and padma. On His chest was the mark of Śrīvatsa and on His neck the brilliant Kaustubha gem. Dressed in yellow, His body blackish like a dense cloud, His scattered hair fully grown, and His helmet and earrings sparkling uncommonly with the valuable gem Vaidūrya, the child, decorated with a brilliant belt, armlets, bangles and other ornaments, appeared very wonderful.

चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।
चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥

Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,
Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥

8 డిసెం, 2014

765. చతుర్మూర్తిః, चतुर्मूर्तिः, Caturmūrtiḥ

ఓం చతుర్మూర్తయే నమః | ॐ चतुर्मूर्तये नमः | OM Caturmūrtaye namaḥ


యే విరాట్సూత్రావ్యాకృతతురీయాఖ్యా మహాత్మనః ।
విష్ణోశ్చతస్ర ఆత్మానో మూర్తయోఽస్య హరేరితి ॥
కృష్ణాపీతాసితారక్తేత్యచ్యుతః శ్రుతిపారగైః ।
చతస్రో మూర్తయోఽస్యేతి వా చతుర్మ్రూర్తిరుచ్యతే ॥

విరాట్‍, సూత్రము, అవ్యాకృతము మరియు తురీయము అను నాలుగు మూర్తులు కలవాడు. కృతయుగమున తెల్లనిది, త్రేతాయుగమున ఎఱ్ఱనిది, ద్వాపరయుగమున పచ్చనిది, కలియుగమున నల్లనిది అని ఇట్లు నాలుగు మూర్తులు కలవాడు.



ये विराट्सूत्राव्याकृततुरीयाख्या महात्मनः ।
विष्णोश्चतस्र आत्मानो मूर्तयोऽस्य हरेरिति ॥
कृष्णापीतासितारक्तेत्यच्युतः श्रुतिपारगैः ।
चतस्रो मूर्तयोऽस्येति वा चतुर्म्रूर्तिरुच्यते ॥

Ye virāṭsūtrāvyākr̥taturīyākhyā mahātmanaḥ,
Viṣṇoścatasra ātmāno mūrtayo’sya hareriti.
Kr̥ṣṇāpītāsitāraktetyacyutaḥ śrutipāragaiḥ,
Catasro mūrtayo’syeti vā caturmrūrtirucyate.

Virāṭ, Sūtra, Avyākr̥tam and Turīya are the names of His four bodies. Fair complexion during Kr̥tayuga. ruddish during tretāyuga, yellow in dvāparayuga and dark complexion during kaliyuga are His forms.

चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।
चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥

Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,
Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥

7 డిసెం, 2014

764. గదాగ్రజః, गदाग्रजः, Gadāgrajaḥ

ఓం గదాగ్రజాయ నమః | ॐ गदाग्रजाय नमः | OM Gadāgrajāya namaḥ


మన్త్రేణ నిగదేనాగ్రే జాయతే యో జనార్దనః ।
నిశబ్దలోపఙ్కృత్వా స గదాగ్రజః ఇతీర్యతే ॥
శ్రీ వాసుదేవావరజో గదో నామమహాయశాః ।
తస్మా దగ్రే జాయత ఇత్యపి విష్ణుస్తథోచ్యతే ॥

(ని)గదేన అగ్రే జాయతే అనగా నిగదము (మంత్ర) రూపమున ముందుగానే జనియించినవాడు. నిత్య తత్త్వమగు శబ్ద బ్రహ్మము అందరికంటెను ముందే జనించి స్వతః సిద్ధమై యుండును కదా! ఇందు 'నిగద' శబ్దమునందలి 'ని' అను నిపాతము లోపింపజేయబడునపుడు నిగదము అను అర్థమున 'గద' శబ్దమే ఇచ్చట ఉచ్చరించబడినది.

లేదా శ్రీకృష్ణావతారమున తన తమ్ముడగు గదుని కంటె ముందే జనించినవాడు.గదుడు వసుదేవ రోహిణులకు శ్రీ కృష్ణిని తరువాత జన్మించినవాడు.



मन्त्रेण निगदेनाग्रे जायते यो जनार्दनः ।
निशब्दलोपङ्कृत्वा स गदाग्रजः इतीर्यते ॥
श्री वासुदेवावरजो गदो नाममहायशाः ।
तस्मा दग्रे जायत इत्यपि विष्णुस्तथोच्यते ॥

Mantreṇa nigadenāgre jāyate yo janārdanaḥ,
Niśabdalopaṅkr̥tvā sa gadāgrajaḥ itīryate.
Śrī vāsudevāvarajo gado nāmamahāyaśāḥ,
Tasmā dagre jāyata ityapi viṣṇustathocyate.

(नि)गदेन अग्रे जायते / (ni)gadena agre jāyate In the form of nigada i.e., mantra He is born before everything. As śabda brahma, He originated before anything. The letter ni in nigadāgraja is dropped and it becomes Gadāgrajaḥ instead of Nigadāgrajaḥ.

Or since the name of Lord Kr̥ṣna's younger brother born of Vasudeva from Rohiṇi, is Gada, He is called Gadāgrajaḥ i.e., the elder born to Gada.

तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥

తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥

Tejovr̥ṣo dyutidharassarvaśastrabhr̥tāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśr̥ṅgo gadāgrajaḥ ॥ 81 ॥

6 డిసెం, 2014

763. నైకశృఙ్గః, नैकशृङ्गः, Naikaśr̥ṅgaḥ

ఓం నైకశృఙ్గాయ నమః | ॐ नैकशृङ्गाय नमः | OM Naikaśr̥ṅgāya namaḥ


చతుఃశృఙ్గోనైక శృఙ్గః చత్వారీత్యాదిమన్త్రతః శబ్ద బ్రహ్మ రూపమును వర్ణించునదిగా వ్యాఖ్యానించబడు మంత్రము తైత్తిరీయారణ్యకమున ఈ విధముగ నున్నది.

:: తైత్తిరీయారణ్యకే దశమ ప్రపాఠకః, ద్వాదశాఽనువాకః ::
చత్వారి శృఙ్గా త్రయోఽస్య పాదా - ద్వే శీర్షే సప్త హస్తాసోఽస్య ।
త్రిదా బద్ధో ఋషభో రోరవీతి - మహాదేవో మర్త్యాగ్‍ం ఆవివేశ ॥ 2 ॥


వృషభముగా భావింపబడు శబ్దబ్రహ్మమునకు - నామములు, ఆఖ్యాతములు(1), ఉపసర్గములు(2) మరియు నిపాతములు(3) అను నాలుగు విధములగు శబ్దభేదములే నాలుగు కొమ్ములును; భూతభవిష్యద్వర్తమాన కాలములు అను మూడు పాదములును; నిత్యములు(4), కార్యరూపములు(5) అను రెండు విధములగు శబ్దములే రెండు శిరస్సుల వలెను, ఏడు విభక్తులే ఏడు హస్తముల వలెను కలవు. ఆ వృషభము హృదయము, కంఠము, శిరము అను మూడు స్థానములయందు నిలుపబడి యుండును. సర్వ కామములను వర్షించుటచే 'వృషభము' అనబడు శబ్దబ్రహ్మ రూపుడు పరమాత్ముడు.

1.ఆఖ్యాతములు = క్రియాపదములు.
2.ఉపసర్గములు = అర్థ విశేషమును తెలుపుటకై క్రియాపదములకు ముందు ప్రయోగించబడు ప్ర, పరా, ప్రతి మొదలగు నిపాత శబ్దములు.
3.నిపాతములు = వ్యుత్పత్తి, శబ్దరూప నిర్మాణ ప్రక్రియ, తెలియరానివియు వివిదార్థములో ప్రయోగించ బడునవియు అగు శబ్దములు.
4.నిత్యములు = స్వయం సిద్ధములు.
5.కార్యరూపములు = జనించునవి.



चतुःशृङ्गोनैक शृङ्गः चत्वारीत्यादिमन्त्रतः / Catuḥśr̥ṅgonaika śr̥ṅgaḥ catvārītyādimantrataḥ Śabda Brahman or the sound form of Brahman is described to be with many (four) horns.

:: तैत्तिरीयारण्यके दशम प्रपाठकः, द्वादशाऽनुवाकः ::
चत्वारि शृङ्गा त्रयोऽस्य पादा - द्वे शीर्षे सप्त हस्तासोऽस्य ।
त्रिदा बद्धो ऋषभो रोरवीति - महादेवो मर्त्याग्‍ं आविवेश ॥ २ ॥

Taittirīy Āraṇyaka - Section 10, Chapter 12
Catvāri śr̥ṅgā trayo’sya pādā - dve śīrṣe sapta hastāso’sya,
Tridā baddho r̥ṣabho roravīti - mahādevo martyāgˈṃ āviveśa. 2.

The Sound form of Brahman called Vr̥ṣabha is imagined to be with - noun, verb, preposition and indeclinable sounds as four horns; past, present and future tenses as three legs; constants and derivatives as two heads and the seven vibhaktis or affixes as the 7 arms. This Vr̥ṣabha is located in windpipe, heart and head.

तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥

తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥

Tejovr̥ṣo dyutidharassarvaśastrabhr̥tāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśr̥ṅgo gadāgrajaḥ ॥ 81 ॥

5 డిసెం, 2014

762. వ్యగ్రః, व्यग्रः, Vyagraḥ

ఓం వ్యగ్రాయ నమః | ॐ व्यग्राय नमः | OM Vyagrāya namaḥ


అగ్రం విగత మస్యేతి వ్యగ్ర ఇత్యుచ్యతే హరిః ।
భక్తాభీష్ట ప్రదానేషు వ్యగ్రత్వాద్వా తథోచ్యతే ॥

ఎవనినుండి అయితే అగ్రం - తుది - వినాశము విగతముగా అనగా తొలగినదిగా అయినదో అతడు వ్యగ్రః. నాశరహితుడు. లేదా విశిష్టమగు అగ్రము అనగా తత్పరత కలవాడు వ్యగ్రుడు. భక్తులకు ఈప్సిత ఫలములను ఇచ్చుట విషయమున తత్పరత కలిగిన వ్యగ్రుడు.



अग्रं विगत मस्येति व्यग्र इत्युच्यते हरिः ।
भक्ताभीष्ट प्रदानेषु व्यग्रत्वाद्वा तथोच्यते ॥

Agraṃ vigata masyeti vyagra ityucyate hariḥ,
Bhaktābhīṣṭa pradāneṣu vyagratvādvā tathocyate.

The One for whom agra or end/destruction has vanished is Vyagraḥ. The indestructible One.

Or Vyagraḥ can also mean the One who is ever eager. In the matter of fulfilling the desires of devotees, He is ever intent.

तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥

తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥

Tejovr̥ṣo dyutidharassarvaśastrabhr̥tāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśr̥ṅgo gadāgrajaḥ ॥ 81 ॥

4 డిసెం, 2014

761. నిగ్రహః, निग्रहः, Nigrahaḥ

ఓం నిగ్రహాయ నమః | ॐ निग्रहाय नमः | OM Nigrahāya namaḥ


నిగృహ్ణాతి స్వవసేనేత్యసౌ నిగ్రహ ఉచ్యతే తన ఇచ్చా బలముతోనే మాయతో సహా దృశ్య ప్రపంచమునందలి సర్వమును తన అదుపులోనుంచి నిగ్రహించువాడు కనుక నిగ్రహః.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము ::
సీ. పరమ! నీ ధామంబు భాసురసత్త్వంబు; శాంతంబు; హతరజస్తమము; నిత్య
మధికతపోమయ; మట్లు గావున మాయ నెగడెడి గుణములు నీకు లేవు
గుణహీనుఁడవు గాన గుణముల నయ్యెడి లోభాదికములు నీలోనఁ జేర
వైన దుర్జన నిగ్రహము శిష్ట రక్షయుఁ దగిలి సేయఁగ దండధారి వగుచు
తే. జగముభర్తవు; గురుఁడవు; జనకుఁడవును, జగదధీశుల మను మూఢజనులు దలఁక
నిచ్చ పుట్టిన రూపంబు లీవు దాల్చి, హితము సేయుదు గాదె లోకేశ్వరేశ! (938)

పరమపురుషా! నీ స్వరూపము శుద్ధ సత్త్వమయంబు. శాంతము నైనది. రజస్తమో విరహితంబు. శాశ్వతంబు. మిక్కుటమైన తపో దీప్తితో నిండినది. అందుచే మాయవల్ల జనియించెడి గుణములు నీకు లేవు. నీవు త్రిగుణాతీతుండవు కనుక ఆ గుణముల వలన సంక్రమించెడి లోభము మొదలగు వర్గములు నీలో నెలకొనవు. అయినను దుర్జనులను శిక్షించుటకును, సజ్జనులను సంరక్షించుటకును దండమును ధరియించుచున్నావు. నీవు జగములకు పతివి. ఆచార్యుడవు. కన్న తండ్రివి. తామే లోకేశ్వరులమని భావించెడి ఖలులు భీతిల్లెడినగునట్లు ఇచ్చ వచ్చిన రూపములను ధరియించి మేలు చేకూర్చెదవు. స్వామీ! నీవు లోకాధిపతులకు అధిపతివి.



निगृह्णाति स्ववसेनेत्यसौ निग्रह उच्यते / Nigr̥hṇāti svavasenetyasau nigraha ucyate Merely by the power of His wish, He controls everything in the material world including the delusional force of māya and hence He is called Nigrahaḥ.

:: श्रीमद्भागवते दशमस्कन्धे पञ्चशत्तमोऽध्यायः ::
स्थित्युद्भवान्तं भुवनत्रयस्य यः समीहितेऽनन्तगुणः स्वलीलया ।
न तस्य चित्रं परपक्षनिग्रहस्तथापि मर्त्यानुविधस्य वर्ण्यते ॥ २९ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 50
Sthityudbhavāntaṃ bhuvanatrayasya yaḥ samīhitē’nantaguṇaḥ svalīlayā,
Na tasya citraṃ parapakṣanigrahastathāpi martyānuvidhasya varṇyatē. 29.

For Him who orchestrates the creation, maintenance and dissolution of the three worlds and who possesses unlimited spiritual qualities, it is hardly amazing that He subdues an opposition. Still, when the Lord does so, imitating human behavior, sages glorify His acts.

तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥

తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥

Tejovr̥ṣo dyutidharassarvaśastrabhr̥tāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśr̥ṅgo gadāgrajaḥ ॥ 81 ॥

3 డిసెం, 2014

760. ప్రగ్రహః, प्रग्रहः, Pragrahaḥ

ఓం ప్రగ్రహాయ నమః | ॐ प्रग्रहाय नमः | OM Pragrahāya namaḥ


ప్రగృహ్ణాతి హరిః పత్ర పుష్పాదికముపాహృతమ్ ।
భక్తైరితి ప్రగ్రహ ఇత్యుచ్యతే విబుధోత్తమైః ॥
ధావతో విషయారణ్యే దుర్ధాన్తేన్ద్రియ వాజినః ।
తత్ప్రసాదేన బధ్నాతి రశ్మినేవేతి వా హరిః ॥

మిక్కిలిగా గ్రహించువాడు ప్రగ్రహః. భక్తులచే తనకు ఉపహారముగా సమర్పింపబడు పత్ర పుష్పాదికమును కూడ గొప్ప పదార్థముగా గ్రహించువాడు.

అరణ్యమునందు అదుపులోనుంచుటకు అలవికానటువంటి అశ్వములు పరుగెత్తుచున్నట్లు అదుపు తప్పిన విషయ సుఖములు, విషయసుఖ వాంఛలను తన అనుగ్రహమనబడెడి పగ్గముతో కట్టివేయును.



प्रगृह्णाति हरिः पत्र पुष्पादिकमुपाहृतम् ।
भक्तैरिति प्रग्रह इत्युच्यते विबुधोत्तमैः ॥
धावतो विषयारण्ये दुर्धान्तेन्द्रिय वाजिनः ।
तत्प्रसादेन बध्नाति रश्मिनेवेति वा हरिः ॥

Pragr̥hṇāti hariḥ patra puṣpādikamupāhr̥tam,
Bhaktairiti pragraha ityucyate vibudhottamaiḥ.
Dhāvato viṣayāraṇye durdhāntendriya vājinaḥ,
Tatprasādena badhnāti raśmineveti vā hariḥ.

The One who receives greatly. He receives offerings made by devotees even like a leaf or flower in great abundance is Pragrahaḥ.

He controls, by the reins dowered by His grace, the horses that are the sense organs which caper in the forest of sense objects.

तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥

తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥

Tejovr̥ṣo dyutidharassarvaśastrabhr̥tāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśr̥ṅgo gadāgrajaḥ ॥ 81 ॥

2 డిసెం, 2014

759. సర్వశస్త్రభృతాంవరః, सर्वशस्त्रभृतांवरः, Sarvaśastrabhr̥tāṃvaraḥ

ఓం సర్వశస్త్రభృతాంవరాయ నమః | ॐ सर्वशस्त्रभृतांवराय नमः | OM Sarvaśastrabhr̥tāṃvarāya namaḥ


సర్వశస్త్రభృతాంవరః, सर्वशस्त्रभृतांवरः, Sarvaśastrabhr̥tāṃvaraḥ

సర్వశస్త్రభృతాం శ్రేష్ఠః సర్వశస్త్రభృతాం వరః ఆయుధ ధారులందరిలో వరుడు, శ్రేష్ఠుడు.

:: శ్రీమద్రామాయణే అయోధ్యకాణ్డే అష్టనవతితమస్సర్గః ::
కృతకార్యమిదం దుర్గం వనం వ్యాళనిషేవితమ్ ।
యదధ్యాస్తే మహాతేజా రామః శస్త్రభృతాం వరః ॥ 13 ॥

ఈ గిరి వనమున కాలసర్పములు, క్రూర మృగములు నివసించుటచే ఇది చొఱరానిదే అయినప్పటికిని, ఆయుధ ధారులలో శ్రేష్టుడును, మహా పరాక్రమశాలియు అయిన శ్రీరాముడు దీనిని (చిత్రకూటము) ఆదరించి, ఇచట ఉండుటచే దీని ఉనికి చరితార్థమైనది. దీని ప్రాశస్త్యము పెరిగినది.

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ ।
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ॥ 31 ॥

నేను పవిత్రమొనర్చువారిలో (లేక వేగవంతులలో) వాయువును, ఆయుధమును ధరించినవారిలో శ్రీరామచంద్రుడను, జలచరాలలో మొసలిని, నదులలో గంగానదిని అయియున్నాను.



सर्वशस्त्रभृतां श्रेष्ठः सर्वशस्त्रभृतां वरः / Sarvaśastrabhr̥tāṃ śreṣṭhaḥ sarvaśastrabhr̥tāṃ varaḥ He is best among the wielders of weapons.

:: श्रीमद्रामायणे अयोध्यकाण्डे अष्टनवतितमस्सर्गः ::
कृतकार्यमिदं दुर्गं वनं व्याळनिषेवितम् ।
यदध्यास्ते महातेजा रामः शस्त्रभृतां वरः ॥ १३ ॥

Śrīmad Rāmāyaṇa - Book 2, Chapter 98

Kr̥takāryamidaṃ durgaṃ vanaṃ vyāḷaniṣevitam,
Yadadhyāste mahātejā rāmaḥ śastrabhr̥tāṃ varaḥ. 13.

Blessed is this dense forest, inhabited by wild animals, where Rāma, the great warrior and the excellent man among the wielders of weapons, dwells.

:: श्रीमद्भगवद्गीत - विभूति योग ::
पवनः पवतामस्मि रामः शस्त्रभृतामहम् ।
झषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाह्नवी ॥ ३१ ॥


Śrīmad Bhavad Gīta - Chapter 10
Pavanaḥ pavatāmasmi rāmaḥ śastrabhr̥tāmaham,
Jhaṣāṇāṃ makaraścāsmi srotasāmasmi jāhnavī.
(31)

Of purifiers I am the wind, of the wielders of weapons I am Rāma, of fishes I am the Crocodile and of flowing rivers I am the Ganges.

तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥

తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥

Tejovr̥ṣo dyutidharassarvaśastrabhr̥tāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśr̥ṅgo gadāgrajaḥ ॥ 81 ॥

1 డిసెం, 2014

758. ద్యుతిధరః, द्युतिधरः, Dyutidharaḥ

ఓం ద్యుతిధరాయ నమః | ॐ द्युतिधराय नमः | OM Dyutidharāya namaḥ


ద్యుతిమఙ్గగతం కాన్తిం ధారయతచ్యుతో యతః ।
తస్మాదసౌ ద్యుతిధర ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥

ద్యుతిని అనగా తన అవయవములయందు విశిష్ట కాంతిని ధరించువాడు. తన సర్వాయవముల యందును స్వయం సిద్ధమును, సర్వావభాసకమును, శుద్ధ జ్ఞానాత్మకమగు జ్ఞానము అను ద్యుతి కలవాడు.




द्युतिमङ्गगतं कान्तिं धारयतच्युतो यतः ।
तस्मादसौ द्युतिधर इति सङ्कीर्त्यते बुधैः ॥

Dyutimaṅgagataṃ kāntiṃ dhārayatacyuto yataḥ,
Tasmādasau dyutidhara iti saṅkīrtyate budhaiḥ.

He bears dyuti i.e., from all his limbs effulgence radiates. From all His limbs - self emanating, all pervading pure blissful knowledge radiates.

तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥

తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥

Tejovr̥ṣo dyutidharassarvaśastrabhr̥tāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśr̥ṅgo gadāgrajaḥ ॥ 81 ॥