10 డిసెం, 2014

767. చతుర్వ్యూహః, चतुर्व्यूहः, Caturvyūhaḥ

ఓం చతుర్వ్యూహాయ నమః | ॐ चतुर्व्यूहाय नमः | OM Caturvyūhāya namaḥ


శరీరపురుషశ్ఛన్దః పురుషో వేదపూరుషః ।
మహాపురుష ఇతి బాహ్వృచోపనిషదీరితాః ॥
చత్వారః పురుషా వ్యూహాః అస్య విష్ణోర్మహాత్మనః ।
యతస్తతో చతుర్వ్యూహ ఇతి కఙ్కీర్త్యతే బుధైః ॥

శరీర పురుషుడు, ఛందః పురుషుడు, వేద పురుషుడు, మహా పురుషుడు - అను నలుగురు పురుషులను తన నాలుగు వ్యూహములుగా అనగా అమరికలుగా కలవాడు చతుర్వ్యూహః అని బాహ్వృచోపనిషత్ యందు చెప్పబడినది.

:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
క. దివ్యమగు వాసుదేవా, ది వ్యూహ చతుష్టయంబు త్రిజగములందున్‍

సేవ్యం బని చెప్పంబడు, భవ్యగుణా! దాని నెరుఁగఁ బలికెద నీకున్‍. (892)
సీ. సత్త్వ ప్రధానమై స్వచ్ఛమై శాంతమై యూర్మిషట్కంబుల నొసరించి

సురుచిర షాడ్గుణ్య పరిపూర్ణమై నిత్యమై భక్తజన సేవ్యమై తనర్చి

వలనొప్పుచుండు న వ్వాసుదేవ వ్యూహ మంత మహత్తత్త్వమందు నోలి

రూఢిఁ గ్రియాశక్తి రూపంబు గల్గు నహంకార ముత్పన్నమయ్యె, నదియు
తే. సరవి వైకారికంబుఁ దైజసముఁ దామ, సంబు నా మూఁడు దెఱఁగుల జరుగు, నందుఁ

దనరు వైకారికము మనస్సునకు నింద్రి, యములకును గగనముఖ భూతముల కరయ. (893)
వ. అది దేవతారూపంబున నుండుఁ, దైజసాహంకారంబు బుద్ధి ప్రాణంబులుం గలిగి యుండుఁ, దామసాహంకారం బింద్రియ మేళనంబున నర్థమాత్రంబై యుండు మఱియును. (894)
సీ. అట్టి యహంకారమం దదిష్ఠించి సాహస్ర ఫణామండలాభిరాముఁ

డై తనరారు ననంతుఁడు సంకర్షణుం డనఁ దగు పురుషుండు ఘనుఁడు,

మహిత భూతేంద్రియ మానస మయుఁడు నై కర్తృత్వ కార్యత్వ కారణత్వ

ప్రకట శాంతత్వ ఘోరత్వ మూఢత్వాది లక్షణ లక్షితోల్లాసి యగుచు
తే. నుండు నమ్మేటి రెండవ వ్యూహ మనఁగ, ఘన వికారంబుఁ బొందు వైకారికంబు

వలన వినుము మనస్తత్త్వ మెలమిఁ బుట్టె, మఱియు వైకారికంబును మాత! వినుము. (895)
వ. అది యెట్టు లంటెన్ని సామాన్య చింతయు విశేషచింతయు ననం దగు సంకల్ప వికల్పంబులం జేసి కామసంభవం బనంబడు నెద్ది యనిరుద్దాఖ్యం బయిన వ్యూహం, బదియ హృషీకంబులకు నధీశ్వరంబయి సకల యోగీంద్ర సేవ్యం బగుచు శరదందీవరశ్యామం బయి యుండు... (896)

వాసుదేవము, సంకర్షణము, ప్రద్యుమ్నము, అనిరుద్ధము అనే దివ్యమైన ఈ నాలుగు వ్యూహములు ముల్లోకములలోను సేవింపదగినవి. సుగుణవతీ! వానిని నీకు వివరించి చెబుతాను.

వాసుదేవవ్యూహము ఆకలిదప్పులు, శోకమోహాలు, జరామరణాలు అనే ఆరు ఊర్ములనుండి విడివడినదై - ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము, అనే షడ్గుణములతో పరిపూరణమై - సత్త్వగుణ ప్రధానమై, నిర్మలమై, శాంతమై, నిత్యమై, భక్తజన సంసేవ్యమై అలరారుతు ఉంటుంది. మహత్తత్త్వము నుండి క్రియాశక్తి రూపమయిన అహంకారము పుట్టినది. ఆ అహంకారము వైకారికము, తైజసము, తామసము అని మూడు విధములుగా విడివడినది.

వానిలో వైకారికాహంకారము అనేది మనస్సునకు, పంచేంద్రియములకు, ఆకాశాది పంచభూతములకు ఉత్పత్తి స్థానమై దేవతా రూపమై ఉండునది.

తైకసాహంకారము బుద్ధి రూపమును, ప్రాణరూపమును కలిగి ఉండునది. తామసాహంకారము ఇంద్రియార్థములతో సమ్మేళనమును పొంది ప్రయోజనమాత్రమై ఉండునది.

వైకారికమైన సాత్త్వికాహంకారమును అధిష్ఠించి సంకర్షణ వ్యూహము ఒప్పుచుండును. వేయి పడగలతో ప్రకాశించెడివాడు, అనంతుడు అయిన సంకర్షణ పురుషుడు, మహానుభావుడు, పంచభూతములతో, పంచేద్రియములతో, మనస్సునతో నిండి ఉండెడివాడు. కర్త, కార్యము, కారణము అనే రూప భేదములు కలిగి శాంతత్వము, ఘోరత్వము, మూఢత్వమువంటి లక్షణములతో ఉల్లాసముగా ఉండెడివాడు. ఈ మేటి వ్యూహమే రెండవదయిన సంకర్షణ వ్యూహము. దీనినుంచె మనస్తత్త్వము పుట్టినది.

ఈ మనస్తత్త్వమునకు చింతనము సహజము. ఆ చింతనము రెండు విధములు. సామాన్య చింతనము, విశేష చింతనము. వీనికే క్రమముగా సంకల్పము, వికల్పము అని పేరు. ఈ సంకల్పవికల్పముల వల్లనే సృష్టిలోని వస్తువులు వేరు వేరు లక్షణములతో మనకు గోచరిస్తూ ఉంటాయి. వీని వల్లనే వివిధ కామములు ఉత్పన్నమవుతాయి. కనుకనే ఇది ప్రద్యుమ్న వ్యూహము అని చెప్పబడును. ఇక అనిరుద్ధమనే వ్యూహము సంగతి చెప్పెదను. ఇదే ఇంద్రియములు అలన్నింటికిని అధీశ్వరమై, యోగీంద్రులందరకు సంసేవ్యమై శరత్కాలమందలి నల్ల కలువవలె శ్యామల వర్ణముతో విరాజిల్లుతు ఉండునది. 



शरीरपुरुषश्छन्दः पुरुषो वेदपूरुषः ।
महापुरुष इति बाह्वृचोपनिषदीरिताः ॥
चत्वारः पुरुषा व्यूहाः अस्य विष्णोर्महात्मनः ।
यतस्ततो चतुर्व्यूह इति कङ्कीर्त्यते बुधैः ॥

Śarīrapuruṣaśchandaḥ puruṣo vedapūruṣaḥ,
Mahāpuruṣa iti bāhvr̥copaniṣadīritāḥ.
Catvāraḥ puruṣā vyūhāḥ asya viṣṇormahātmanaḥ,
Yatastato caturvyūha iti kaṅkīrtyate budhaiḥ.

As mentioned in the Bāhvr̥copaniṣat - Śarīra puruṣa, Chandaḥ puruṣa, Veda puruṣa and Mahā puruṣa are His four vyūha forms. Therefore He is Caturvyūhaḥ.

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे षड्विंशोऽध्यायः ::
यत्तत्सत्त्वगुनं स्वच्छं शान्तं भगवतह् पदम् ।
यदाहुर्वासुदेवाख्यं चित्तं तन्महदात्मकम् ॥ २१ ॥
स्वच्चत्वमविकारित्वं शान्तत्वमिति चेतसः ।
वृत्तिभिर्लक्षणं प्रोक्तं यथापां प्रकृतिः परा ॥ २२ ॥
महत्तत्त्वाद्विकुर्वानाद्भगवद्वीर्यसम्भवात् ।
क्रियाशक्तिरहङ्कारस्त्रिविधः समपद्यत ॥ २३ ॥
वैकारिकस्तैजसश्च तामसश्च यतो भवः ।
मनसस्चेन्द्रियाणां च भूतानां महतामपि ॥ २४ ॥
सहस्रशिरसं साक्षाद्यमनन्तं प्रचक्षते ।
सङ्कर्षणाख्यं पुरुषं भूतेन्द्रियमनोमयम् ॥ २५ ॥
कर्तृत्वं कारणत्वं च कार्यत्वं चेति लक्षणम् ।
शान्तघोरविमुढत्वमिति वा स्यादहङ्कृतेः ॥ २६ ॥
वैकारिकाद्विकुर्वाणान्मनस्तत्त्वमजायत ।
यत्सङ्कल्पविकल्पाभ्यां वर्तते कामसम्भवः ॥ २७ ॥
यद्विदुर्ह्यनिरुद्धाख्यं हृषीकाणामधीश्वरम् ।
शारदेन्दीवरश्यामं संराध्यं योगिभिह् शनैः ॥ २८ ॥
तैजसात्तु विकुर्वाणाद्बुद्धितत्त्वमभूत्सति ।
द्रव्यस्फुरणविज्ञानमिन्द्रियाणामनुग्रहः ॥ २९ ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 26
Yattatsattvagunaṃ svacchaṃ śāntaṃ bhagavatah padam,
Yadāhurvāsudēvākhyaṃ cittaṃ tanmahadātmakam. 21.
Svaccatvamavikāritvaṃ śāntatvamiti cētasaḥ,
Vr̥ittibhirlakṣaṇaṃ prōktaṃ yathāpāṃ prakr̥itiḥ parā. 22.
Mahattattvādvikurvānādbhagavadvīryasambhavāt,
Kriyāśaktirahaṅkārastrividhaḥ samapadyata. 23.
Vaikārikastaijasaśca tāmasaśca yatō bhavaḥ,
Manasascēndriyāṇāṃ ca bhūtānāṃ mahatāmapi. 24.
Sahasraśirasaṃ sākṣādyamanantaṃ pracakṣatē,
Saṅkarṣaṇākhyaṃ puruṣaṃ bhūtēndriyamanōmayam. 25.
Kartr̥itvaṃ kāraṇatvaṃ ca kāryatvaṃ cēti lakṣaṇam,
Śāntaghōravimuḍatvamiti vā syādahaṅkr̥itēḥ. 26.
Vaikārikādvikurvāṇānmanastattvamajāyata,
Yatsaṅkalpavikalpābhyāṃ vartatē kāmasambhavaḥ. 27.
Yadvidurhyaniruddhākhyaṃ hr̥iṣīkāṇāmadhīśvaram,
Śāradēndīvaraśyāmaṃ saṃrādhyaṃ yōgibhih śanaiḥ. 28.
Taijasāttu vikurvāṇādbuddhitattvamabhūtsati,
Dravyasphuraṇavijñānamindriyāṇāmanugrahaḥ. 29.

The mode of goodness, which is the clear, sober status of understanding the God and which is generally called vāsudeva, or consciousness, becomes manifest in the mahat-tattva.

After the manifestation of the mahat-tattva, these features appear simultaneously. As water in its natural state, before coming in contact with earth, is clear, sweet and unruffled, so the characteristic traits of pure consciousness are complete serenity, clarity, and freedom from distraction.

The material ego springs up from the mahat-tattva, which evolved from the Lord's own energy. The material ego is endowed predominantly with active power of three kinds -- good, passionate and ignorant. It is from these three types of material ego that the mind, the senses of perception, the organs of action, and the gross elements evolve.

The threefold ahankāra, the source of the gross elements, the senses and the mind, is identical with them because it is their cause. It is known by the name of Saṅkarṣaṇa, who is directly Lord Ananta with a thousand heads.

This false ego is characterized as the doer, as an instrument and as an effect. It is further characterized as serene, active or dull according to how it is influenced by the modes of goodness, passion and ignorance.

From the false ego of goodness, another transformation takes place. From this evolves the mind, whose thoughts and reflections give rise to desire.

The mind of the living entity is known by the name of Lord Aniruddha, the supreme ruler of the senses. He possesses a bluish-black form resembling a lotus flower growing in the autumn. He is found slowly by the yogis.

By transformation of the false ego in passion, intelligence takes birth, O virtuous lady. The functions of intelligence are to help in ascertaining the nature of objects when they come into view, and to help the senses.

चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।
चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥

Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,
Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి