6 డిసెం, 2014

763. నైకశృఙ్గః, नैकशृङ्गः, Naikaśr̥ṅgaḥ

ఓం నైకశృఙ్గాయ నమః | ॐ नैकशृङ्गाय नमः | OM Naikaśr̥ṅgāya namaḥ


చతుఃశృఙ్గోనైక శృఙ్గః చత్వారీత్యాదిమన్త్రతః శబ్ద బ్రహ్మ రూపమును వర్ణించునదిగా వ్యాఖ్యానించబడు మంత్రము తైత్తిరీయారణ్యకమున ఈ విధముగ నున్నది.

:: తైత్తిరీయారణ్యకే దశమ ప్రపాఠకః, ద్వాదశాఽనువాకః ::
చత్వారి శృఙ్గా త్రయోఽస్య పాదా - ద్వే శీర్షే సప్త హస్తాసోఽస్య ।
త్రిదా బద్ధో ఋషభో రోరవీతి - మహాదేవో మర్త్యాగ్‍ం ఆవివేశ ॥ 2 ॥


వృషభముగా భావింపబడు శబ్దబ్రహ్మమునకు - నామములు, ఆఖ్యాతములు(1), ఉపసర్గములు(2) మరియు నిపాతములు(3) అను నాలుగు విధములగు శబ్దభేదములే నాలుగు కొమ్ములును; భూతభవిష్యద్వర్తమాన కాలములు అను మూడు పాదములును; నిత్యములు(4), కార్యరూపములు(5) అను రెండు విధములగు శబ్దములే రెండు శిరస్సుల వలెను, ఏడు విభక్తులే ఏడు హస్తముల వలెను కలవు. ఆ వృషభము హృదయము, కంఠము, శిరము అను మూడు స్థానములయందు నిలుపబడి యుండును. సర్వ కామములను వర్షించుటచే 'వృషభము' అనబడు శబ్దబ్రహ్మ రూపుడు పరమాత్ముడు.

1.ఆఖ్యాతములు = క్రియాపదములు.
2.ఉపసర్గములు = అర్థ విశేషమును తెలుపుటకై క్రియాపదములకు ముందు ప్రయోగించబడు ప్ర, పరా, ప్రతి మొదలగు నిపాత శబ్దములు.
3.నిపాతములు = వ్యుత్పత్తి, శబ్దరూప నిర్మాణ ప్రక్రియ, తెలియరానివియు వివిదార్థములో ప్రయోగించ బడునవియు అగు శబ్దములు.
4.నిత్యములు = స్వయం సిద్ధములు.
5.కార్యరూపములు = జనించునవి.



चतुःशृङ्गोनैक शृङ्गः चत्वारीत्यादिमन्त्रतः / Catuḥśr̥ṅgonaika śr̥ṅgaḥ catvārītyādimantrataḥ Śabda Brahman or the sound form of Brahman is described to be with many (four) horns.

:: तैत्तिरीयारण्यके दशम प्रपाठकः, द्वादशाऽनुवाकः ::
चत्वारि शृङ्गा त्रयोऽस्य पादा - द्वे शीर्षे सप्त हस्तासोऽस्य ।
त्रिदा बद्धो ऋषभो रोरवीति - महादेवो मर्त्याग्‍ं आविवेश ॥ २ ॥

Taittirīy Āraṇyaka - Section 10, Chapter 12
Catvāri śr̥ṅgā trayo’sya pādā - dve śīrṣe sapta hastāso’sya,
Tridā baddho r̥ṣabho roravīti - mahādevo martyāgˈṃ āviveśa. 2.

The Sound form of Brahman called Vr̥ṣabha is imagined to be with - noun, verb, preposition and indeclinable sounds as four horns; past, present and future tenses as three legs; constants and derivatives as two heads and the seven vibhaktis or affixes as the 7 arms. This Vr̥ṣabha is located in windpipe, heart and head.

तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥

తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥

Tejovr̥ṣo dyutidharassarvaśastrabhr̥tāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśr̥ṅgo gadāgrajaḥ ॥ 81 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి