7 డిసెం, 2014

764. గదాగ్రజః, गदाग्रजः, Gadāgrajaḥ

ఓం గదాగ్రజాయ నమః | ॐ गदाग्रजाय नमः | OM Gadāgrajāya namaḥ


మన్త్రేణ నిగదేనాగ్రే జాయతే యో జనార్దనః ।
నిశబ్దలోపఙ్కృత్వా స గదాగ్రజః ఇతీర్యతే ॥
శ్రీ వాసుదేవావరజో గదో నామమహాయశాః ।
తస్మా దగ్రే జాయత ఇత్యపి విష్ణుస్తథోచ్యతే ॥

(ని)గదేన అగ్రే జాయతే అనగా నిగదము (మంత్ర) రూపమున ముందుగానే జనియించినవాడు. నిత్య తత్త్వమగు శబ్ద బ్రహ్మము అందరికంటెను ముందే జనించి స్వతః సిద్ధమై యుండును కదా! ఇందు 'నిగద' శబ్దమునందలి 'ని' అను నిపాతము లోపింపజేయబడునపుడు నిగదము అను అర్థమున 'గద' శబ్దమే ఇచ్చట ఉచ్చరించబడినది.

లేదా శ్రీకృష్ణావతారమున తన తమ్ముడగు గదుని కంటె ముందే జనించినవాడు.గదుడు వసుదేవ రోహిణులకు శ్రీ కృష్ణిని తరువాత జన్మించినవాడు.



मन्त्रेण निगदेनाग्रे जायते यो जनार्दनः ।
निशब्दलोपङ्कृत्वा स गदाग्रजः इतीर्यते ॥
श्री वासुदेवावरजो गदो नाममहायशाः ।
तस्मा दग्रे जायत इत्यपि विष्णुस्तथोच्यते ॥

Mantreṇa nigadenāgre jāyate yo janārdanaḥ,
Niśabdalopaṅkr̥tvā sa gadāgrajaḥ itīryate.
Śrī vāsudevāvarajo gado nāmamahāyaśāḥ,
Tasmā dagre jāyata ityapi viṣṇustathocyate.

(नि)गदेन अग्रे जायते / (ni)gadena agre jāyate In the form of nigada i.e., mantra He is born before everything. As śabda brahma, He originated before anything. The letter ni in nigadāgraja is dropped and it becomes Gadāgrajaḥ instead of Nigadāgrajaḥ.

Or since the name of Lord Kr̥ṣna's younger brother born of Vasudeva from Rohiṇi, is Gada, He is called Gadāgrajaḥ i.e., the elder born to Gada.

तेजोवृषो द्युतिधरस्सर्वशस्त्रभृतां वरः ।
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः ॥ ८१ ॥

తేజోవృషో ద్యుతిధరస్సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ॥ 81 ॥

Tejovr̥ṣo dyutidharassarvaśastrabhr̥tāṃ varaḥ,
Pragraho nigraho vyagro naikaśr̥ṅgo gadāgrajaḥ ॥ 81 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి