22 డిసెం, 2014

779. దుర్గః, दुर्गः, Durgaḥ

ఓం దుర్గాయ నమః | ॐ दुर्गाय नमः | OM Durgāya namaḥ


అన్తరాయ ప్రతిహతేర్హరిర్దుఃఖాదవాప్యతే ।
ఇతి దుర్గ ఇతి విష్ణుః ప్రోచ్యతే విద్వదుత్తమైః ॥

సిద్ధి కలుగుటలో విఘ్నములచే దెబ్బతినిన సాధకులచే ఎంతయో శ్రమతో పొందబడువాడు. సాధకులు ఎన్నియో విఘ్నములను దాటిననే కాని ఎంతయో శ్రమచేసిననే కాని భగవద్ప్రాప్తి కలుగదు అని తాత్పర్యము.

:: పోతన భాగవతము చతుర్థ స్కంధము ::
సీ. శోకదావాగ్ని శిఖాకులితంబు పృథు క్లేశఘన దుర్గ దుర్గమంబు
దండధర క్రూర కుండలిశ్లిష్టంబు, పాపకర్మ వ్యాఘ్ర పరివృతంబు
గురు సుఖ దుఃఖ కాకోల పూరిత గర్త మగుచు ననాశ్రయ మైనయట్టి
సంసార మార్గ సంచారులై మృగతృష్ణికలఁబోలు విషయ సంఘము నహ మ్మ
తే. మేతి హేతుక దేహ నికేతనములు, నయి మహాభారవహు లైనయట్టి మూఢ
జనము లేనాఁట మీ పదాబ్జములు గానఁ, జాలు వారలు? భక్తప్రసన్న! దేవ! (173)

భక్తులను అనుగ్రహించే దేవదేవా! సంసారమార్గము శోకము అనే కారుచిచ్చు మంటలచే చీకాకైనది. కష్టాలు అనే గొప్ప కోటలతో దాటరానిది. యముడనే క్రూర సర్పముతో కూడినది. దుర్జనులు అనే పెద్ద పులులతో నిండినది. అంతులేని సుఖదుఃఖాలనే కాలకూట విషముతో నిండిన గుంట వంటిది. దిక్కు లేనిది. అటువంటి సంసార మార్గములో సంచరిస్తూ ఎండమావులవంటి ఇంద్రియ వాంఛలలో పడి కొట్టుమిట్టాడుతూ "నేను, నాది" అనే భావములకు కారణములయిన దేహం గేహం వంటి గొప్ప బరువును మోస్తూ ఉండెడి పరమ మూర్ఖులయిన మానవులు నీ పాద పద్మములను ఎప్పుడును చూడలేరు. 



अन्तराय प्रतिहतेर्हरिर्दुःखादवाप्यते ।
इति दुर्ग इति विष्णुः प्रोच्यते विद्वदुत्तमैः ॥

Antarāya pratihaterharirduḥkhādavāpyate,
Iti durga iti viṣṇuḥ procyate vidvaduttamaiḥ.

He who can only attained by considerable efforts from those who have slipped the path of realizing Him. Or in other words, He who can only be attained with difficulty by those who have overcome impediments.

:: श्रीमद्भागवते पञ्चमस्कन्धे चतुर्दशोऽध्यायः ::
स एष देहत्ममानिनां सत्त्वादिगुणविशेषविकल्पितकुशलाकुशलसमवहारविनिर्मित विविध देहावलिभिर्वियोगसंयोगाद्यनादिसंसारानुभवस्य द्वारभूतेन षडिन्द्रियवर्गेण तस्मिन्दुर्गाध्ववदसुगमेऽध्वन्यापतित ईश्वरस्य भगवतो विष्णोर्वशवर्तिन्या मायया जीवलोकोऽयं यथा वणिक्सार्थोऽर्थपरः स्वदेहनिष्पादितकर्मानुभवः श्मशानवदशिवतमायां संसाराटव्यां गतो नद्यपि विफलबहुप्रतियोगेहस्तत्तापोपसमनीं हरिगुरुचरणरविन्दमधुकरानुपदवीमवरुन्धे ॥ १ ॥

Śrīmad Bhāgavata - Canto 5, Chapter 14
Sa ēṣa dēhatmamānināṃ sattvādiguṇaviśēṣavikalpitakuśalākuśalasamavahāravinirmita vividha dēhāvalibhirviyōgasaṃyōgādyanādisaṃsārānubhavasya dvārabhūtēna ṣaḍindriyavargēṇa tasmindurgādhvavadasugamē’dhvanyāpatita īśvarasya bhagavatō viṣṇōrvaśavartinyā māyayā jīvalōkō’yaṃ yathā vaṇiksārthō’rthaparaḥ svadēhaniṣpāditakarmānubhavaḥ śmaśānavadaśivatamāyāṃ saṃsārāṭavyāṃ gatō nadyapi viphalabahupratiyōgēhastattāpōpasamanīṃ harigurucaraṇaravindamadhukarānupadavīmavarundhē. 1.

A man belonging to the mercantile community is always interested in earning money. Sometimes he enters the forest to acquire cheap commodities like wood and earth and sell them in the city at good prices. Similarly, the conditioned soul, being greedy, enters this material world for some material profit. Gradually he enters the deepest part of the forest, not really knowing how to get out. Having entered the material world, the pure soul becomes conditioned by the material atmosphere, which is created by the external energy under the control of Lord Viṣṇu. Thus the living entity comes under the control of the external energy, daivī māyā. Living independently and bewildered in the forest, he does not attain the association of devotees who are always engaged in the service of the Lord. Once in the bodily conception, he gets different types of bodies one after the other under the influence of material energy and impelled by the modes of material nature. In this way, the conditioned soul goes sometimes to the heavenly planets, sometimes to the earthly planets and sometimes to the lower planets and lower species. Thus he suffers continuously due to different types of bodies. These sufferings and pains are sometimes mixed. Sometimes they are very severe, and sometimes they are not. These bodily conditions are acquired due to the conditioned soul's mental speculation. He uses his mind and five senses to acquire knowledge, and these bring about the different bodies and different conditions. Using the senses under the control of the external illusionary energy, māyā, the living entity suffers the miserable conditions of material existence. He is actually searching for relief, but he is generally baffled, although sometimes he is relieved after great difficulty. Struggling for existence in this way, he cannot get the shelter of pure devotees, who are like bumblebees engaged in loving service at the lotus feet of Lord Viṣṇu.

समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

Samāvarto’nivr̥ttātmā durjayo duratikramaḥ,
Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి