9 డిసెం, 2014

766. చతుర్బాహుః, चतुर्बाहुः, Caturbāhuḥ

ఓం చతుర్బాహవే నమః | ॐ चतुर्बाहवे नमः | OM Caturbāhave namaḥ


చతుర్బాహుః, चतुर्बाहुः, Caturbāhuḥ

చత్వారో బాహవోఽస్యేతి చతుర్బాహురితీర్యతే ।
వాసుదేవేరూఢమిదం నమేతి విదుషాం మతమ్ ॥


నాలుగు బాహువులు ఈతనికి కలవు. ఈ నామము వాసుదేవునియందు రూఢము అనగా వాడుక చేయబడుచున్న శబ్దము.

:: పోతన భాగవతము దశమ స్కంధము, పూర్వ భాగము ::
సీ. జలధరదేహు నాజానుచతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షుఁ
జారుగదాశంఖచక్రపద్మవిలాసుఁ గంఠకౌస్తుభమణికాంతి భాసుఁ
గమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు
నురుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు
తే. బాలుఁ బూర్ణేందురుచిజాలు భక్తలోల, పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁ
జూచి తిలకించి పులకించి చోద్య మంది, యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె (112)

అప్పుడు వసుదేవుడు ఆ బాలుని తేరిపారచూచినాడు. ఆ బాలుడు ఆయనకు దివ్య రూపముతో దర్శనమునిచ్చినాడు. ఆ పిల్లవాడు మేఘవర్ణ శరీరమును కలిగియున్నాడు. అతడి పొడవైన నాలుగు బాహువులలో గద, శంఖము, చక్రము, పద్మము వెలుగొందుచున్నాయి. తామరపువ్వు రేకులవంటి కన్నులు, విశాలమైన వక్షఃస్థలము కలవాని కంఠములో కౌస్తుభరత్నపు కాంతులు వెలుగొందుచున్నాయి. అందమైన మొలత్రాడు, కంకణములు, బాహుపురులు ధరించియున్నాడు. శ్రీవత్సము అనెడి మచ్చ వక్షఃస్థలముపైన మెరుస్తున్నది. చెవులకు ఉన్న కుండలముల కాంతితో నుదుటి ముంగురులు వెలుగొందుతున్నాయి. మణులు, వైఢూర్యాలు పొదిగిన కిరీటము ధరించియున్నాడు.

ఆ బిడ్డడు బాలుడుగనే ఉన్నా ఈ దివ్యలక్షణములన్నిటితోను పూర్ణచంద్రుని కాంతులు చిమ్ముతూ ఉన్నాడు. అతడు భక్తులందరిని రక్షించెడివాడు. సృష్టిలోని సుగుణములు అన్నియును అతనివద్దానుండియే పుట్టినవి. అతివిశాలమైన కరుణ కలవాడు.

అటువంటి బాలుని చూచిన వసుదేవుడు మళ్ళీ మళ్ళీ తేరిపారచూచి, పులకించి పోయాడు, ఆశ్చర్యపోయాడు, ఉప్పొంగిపోయాడు. ఆ పారవశ్యమునుండి తేరుకొని ఉత్సాహముతో నిలబడ్డాడు.



चत्वारो बाहवोऽस्येति चतुर्बाहुरितीर्यते ।
वासुदेवेरूढमिदं नमेति विदुषां मतम् ॥


Catvāro bāhavo’syeti caturbāhuritīryate,
Vāsudeverūḍamidaṃ nameti viduṣāṃ matam.


He has four arms. So Caturbāhuḥ. This is well known for Vāsudeva.

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे कृष्णजन्मनि तृतीयोऽध्यायः ::
तमद्भुतं बालकमम्बुजेक्षणं चतुर्भुजं शङ्खगदाद्युदायुधम् ।
श्रīवत्सलक्ष्मं गलशॊभिकौस्तुभं पीताम्बरं सान्द्रपयोदसौभगम् ॥ ९ ॥
महार्हवैदूर्यकिरीटकुण्डल त्विषा परिष्वक्तसहस्रकुन्तलम् ।
उद्दामकाञ्च्यङ्गदकङ्कणादिभिर्विरोचमानं वसुदेव ऐक्षत ॥ १० ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 3
Tamadbhutaṃ bālakamambujekṣaṇaṃ caturbhujaṃ śaṅkhagadādyudāyudham,
Śrīvatsalakṣmaṃ galaśóbhikaustubhaṃ pītāmbaraṃ sāndrapayodasaubhagam. 9.
Mahārhavaidūryakirīṭakuṇḍala tviṣā pariṣvaktasahasrakuntalam,
Uddāmakāñcyaṅgadakaṅkaṇādibhirvirocamānaṃ vasudeva aikṣata. 10.

Vasudeva then saw the newborn child, who had very wonderful lotus-like eyes and who bore in His four hands the four weapons śańkha, cakra, gadā and padma. On His chest was the mark of Śrīvatsa and on His neck the brilliant Kaustubha gem. Dressed in yellow, His body blackish like a dense cloud, His scattered hair fully grown, and His helmet and earrings sparkling uncommonly with the valuable gem Vaidūrya, the child, decorated with a brilliant belt, armlets, bangles and other ornaments, appeared very wonderful.

चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।
चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥

Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,
Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి