22 నవం, 2013

384. వ్యవసాయః, व्यवसायः, Vyavasāyaḥ

ఓం వ్యవసాయాయ నమః | ॐ व्यवसायाय नमः | OM Vyavasāyāya namaḥ


సంవిన్మాత్ర స్వరూపత్వాత్ వ్యవసాయ ఇతీర్యతే వ్యవసాయః అనగా నిశ్చయాత్మక జ్ఞానము అని అర్థము. పరమాత్ముడు నిర్విషయకమును నిరంజనమును అగు కేవల జ్ఞానమే తన స్వరూపముగా కలవాడు కావున 'వ్యవసాయః' అనదగియున్నాడు.

:: శ్రీమద్భగవద్గీత - సాఙ్ఖ్య యోగము ::
యామిమాం పుషిప్తాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః ।
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతివాదినః ॥ 42 ॥
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ ।
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ॥ 43 ॥
భోగైశ్వర్యప్రసక్తానాం తయాఽపహృతచేతసామ్ ।
వ్యవసాయాత్మికా బుద్ధిస్సమాధౌ న విధీయతే ॥ 44 ॥

వేదమునందు ఫలమునుదెలుపు భాగములం దిష్టముకలవారును, అందుజెప్పబడిన స్వర్గాది ఫలితములకంటే అధికమైనది వేఱొకటియెద్దియు లేదని వాదించువారును, విషయవాంఛలతో నిండిన చిత్తముకలవారును, స్వర్గాభిలాషులునగు అల్పజ్ఞులు, జన్మము, కర్మము, తత్ఫలము నొసంగునదియు, భోగైశ్వర్యసంపాదనకై వివిధకార్యకలాపములతో గూడినదియు, ఫలశూన్యమైనదియునగు ఏ వాక్యమును చెప్పుచున్నారో అద్దానిచే నపహరింపబడిన చిత్తముకలవారును, భోగైశ్వర్యప్రియులునగు జనులకు దైవధ్యానమందు నిశ్చయమైన బుద్ధి కలుగనే కలుగదు.



Saṃvinmātra svarūpatvāt vyavasāya itīryate / संविन्मात्र स्वरूपत्वात् व्यवसाय इतीर्यते Vyavasāyaḥ implies resolved knowledge. As He is of the nature of jñāna - pure and simple, He is Vyavasāyaḥ.

Śrīmad Bhagavad Gīta - Chapter 2
Yāmimāṃ puṣiptāṃ vācaṃ pravadantyavipaścitaḥ,
Vedavādaratāḥ pārtha nānyadastītivādinaḥ. 42.
Kāmātmānaḥ svargaparā janmakarmafalapradām,
Kriyāviśeṣabahulāṃ bhogaiśvaryagatiṃ prati. 43.
Bhogaiśvaryaprasaktānāṃ tayā’pahr̥tacetasām,
Vyavasāyātmikā buddhissamādhau na vidhīyate. 44.

:: श्रीमद्भगवद्गीत - साङ्ख्य योग::
यामिमां पुषिप्तां वाचं प्रवदन्त्यविपश्चितः ।
वेदवादरताः पार्थ नान्यदस्तीतिवादिनः ॥ ४२ ॥
कामात्मानः स्वर्गपरा जन्मकर्मफ़लप्रदाम् ।
क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति ॥ ४३ ॥
भोगैश्वर्यप्रसक्तानां तयाऽपहृतचेतसाम् ।
व्यवसायात्मिका बुद्धिस्समाधौ न विधीयते ॥ ४४ ॥

Those undiscerning people who utter flowery talk - which promises birth as a result of rites and duties and is full of various special rites meant for attainment of enjoyment and affluence, they remain engrossed in the utterances of Vedās and declare that nothing else exists; their minds are full of desires and they have heaven as the goal. One-pointed conviction does not become established in the minds of those who delight in enjoyment and affluence and whose intellects are always carried away by that.

व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।
परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।
పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥

Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।
Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి