ఓం వ్యవస్థానాయ నమః | ॐ व्यवस्थानाय नमः | OM Vyavasthānāya namaḥ
అస్మిన్వ్యవస్థితిస్సర్వస్యేత్యయం పరమేశ్వరః ।
లోకపాలాద్యధికారాన్ జరాయుజాదిదేహినః ॥
బ్రహ్మణాదిక వర్ణాంశ్చ బ్రహ్మచర్యాదికాశ్రమాన్ ।
లక్షణాని చ స్త్రీ పుంసాం వావ్యవస్థాన ఉచ్యతే ॥
వ్యవస్థా - వ్యవస్థితిః - వ్యవస్థానం మొదలగు శబ్దములకు 'అమరిక' అని అర్థము. ప్రతియొక చేతనాచేతన పదార్థమునకును ఈ పరమాత్మనందే 'వ్యవస్థానము' ఏర్పడియున్నది. కావున ఆతడు 'వ్యవస్థానః' అనదగియున్నాడు. లేదా వ్యవస్థను చేయును. పరమాత్ముడు చేయు వ్యవస్థ వేని విషయమున ఎట్టిది? అనిన ఇంద్రాది లోకపాలుర వారి వారి అధికారములను; జరాయుజములు, అండజములు, ఉద్బిజ్జములు, స్వేదజములు మొదలగు ప్రాణుల స్థితులను బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర నామక ప్రధానవర్ణముల ధర్మములను బ్రహ్మచారి, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాసములను ఆశ్రమ ధర్మములను వేరు వేరుగా ఏర్పరచును.
Asminvyavasthitissarvasyetyayaṃ parameśvaraḥ,
Lokapālādyadhikārān jarāyujādidehinaḥ.
Brahmaṇādika varṇāṃśca brahmacaryādikāśramān,
Lakṣaṇāni ca strī puṃsāṃ vāvyavasthāna ucyate.
अस्मिन्व्यवस्थितिस्सर्वस्येत्ययं परमेश्वरः ।
लोकपालाद्यधिकारान् जरायुजादिदेहिनः ॥
ब्रह्मणादिक वर्णांश्च ब्रह्मचर्यादिकाश्रमान् ।
लक्षणानि च स्त्री पुंसां वाव्यवस्थान उच्यते ॥
Everything is based on Him or in whom the orderly regulation of the universe rests; so Vyavasthānaḥ.
Or the regulator of the guardians of the worlds and their appropriate duties and those who are born of wombs, born from eggs, born cleaving the earth; of the brāhmaṇa, kṣatriya, vaiśya and śūdra castes and of the intermediate castes, of the brahmacarya, gr̥hastha, vānaprastha and sanyāsa āśramās.
व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः । |
परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥ |
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః । |
పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥ |
Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ । |
Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి