24 నవం, 2013

386. సంస్థానః, संस्थानः, Saṃsthānaḥ

ఓం సంస్థానాయ నమః | ॐ संस्थानाय नमः | OM Saṃsthānāya namaḥ


విశ్వేశ్వరేఽస్మిన్భూతానాం సంస్థితః ప్రలయాత్మికా ।
సమీచీనం స్థాన మస్యేత్యయం సంస్థాన ఉచ్యతే ॥

సంస్థితః, సంస్థానం అనునవి లెస్సయగు నిలుకడ అను అర్థమున సమానార్థక పదములు. అట్లు ఇతనియందు సకల భూతములకును 'ప్రళయ' రూపము అగు ఉనికి ఏర్పడును అను అర్థమున పరమాత్ముడు 'సంస్థానః' అనబడుచున్నాడు. లేదా సమీచీనం స్థానం అస్య ఇతనికి లెస్సయగు ఉనికి కలదు. తాను ఎవ్వరిని ఆశ్రయించక కాలపు అవధులకు లోబడక ఏవియు తనకు అంటక తాను వేనిని అంటక శాశ్వతుడై యుండు ఉనికి లెస్సయగు ఉనికియే కదా!



Viśveśvare’sminbhūtānāṃ saṃsthitaḥ pralayātmikā,
Samīcīnaṃ sthāna masyetyayaṃ saṃsthāna ucyate.

विश्वेश्वरेऽस्मिन्भूतानां संस्थितः प्रलयात्मिका ।
समीचीनं स्थान मस्येत्ययं संस्थान उच्यते ॥

Here is the resting place of creatures in the form of pralaya or deluge.

Or as He is the ultimate existence and His abode is excellent hence He is Saṃsthānaḥ.

व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।
परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।
పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥

Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।
Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి