4 నవం, 2013

366. హేతుః, हेतुः, Hetuḥ

ఓం హేతవే నమః | ॐ हेतवे नमः | OM Hetave namaḥ

అస్య జగతః ఉపాదానం నిమిత్తంచ కారణం స ఏవ ఈ జగత్తునకు ఉపాదానకారణమును నిమిత్తకారణమును ఆతడే. ఈ రెండు ప్రకారముల చేతను జగత్సృష్టికి హేతువు ఆతడే.

కుండకు మన్ను, కుండలమునకు బంగారము ఉపాదాన కారణములు. వానిని చేయు కుమ్మరియు స్వర్ణకారుడును నిమిత్తకారణములు. అటులే పరమాత్మ జగత్తునకు ఉపాదాన నిమిత్త కారణములు.

विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सहः ।
महीधरो महाभागो वेगवानमिताशनः ॥ ४० ॥

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరస్సహః ।
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦ ॥

Vikṣaro rohito mārgo heturdāmodarassahaḥ ।
Mahīdharo mahābhāgo vegavānamitāśanaḥ ॥ 40 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి