5 నవం, 2013

367. దామోదరః, दामोदरः, Dāmodaraḥ

ఓం దామోదరాయ నమః | ॐ दामोदराय नमः | OM Dāmodarāya namaḥ


దామోదరః, दामोदरः, Dāmodaraḥ
దమాదిసాధనోదారోత్కృష్టామతి రస్తిసా ।
తయా గమ్యత ఇతి స దామోదర ఇతీర్యతే ॥

దమము అనగా ఇంద్రియ సంయమనము మొదలగు రూపముగల సాధనముచే ఉత్కృష్టము అగు ఏ మతికలదో అట్టి మతి యున్నవారిచే తెలియబడువాడు.

:: మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి ఏకచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
దమాత్ సిద్ధిం పరీప్సన్తో మాం జనాః కామయన్తి హ ।
దివం చోర్వీం చ మధ్యం చ తస్మాద్ దమోదరో హ్యహమ్ ॥ 44 ॥

మనుష్యులు దమము అనగా ఇంద్రియనిగ్రహము ద్వారా సిద్ధిని పొందే ఇచ్ఛతో నన్ను పొందాలని కోరిక కలిగియుండి ఆ దమముద్వారానే వారు పృథివీ, స్వర్గము మరియు మధ్యవర్తి లోకాలలో ఉన్నత గమ్యాలను చేరుకోవాలని అభిలషిస్తారు. అందుకే నేను దామోదరుడుగా ప్రసిద్ధికెక్కాను.

:: మహాభారతే ఉద్యోగ పర్వణి యానసంధి పర్వణి సప్తతిమోఽధ్యాయః ::
న జాయతే జనిత్రాయమజస్తస్మాదనీకజిత్ ।
దేవానాం స్వప్రకాశత్వాద్ దమాద్ దమోదరో విభుః ॥ 8 ॥

శత్రుసేనలపై విజయాన్ని పొందే ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏ జన్మదాత ద్వారానూ జన్మను గ్రహించరుగావున ఆయన అజుడు. దేవతలు స్వయంప్రకాశ స్వరూపులై ఉంటారు కాబట్టి ఉత్కృష్ట రూపంలో ప్రకాశమానులు కావటంచేత శ్రీకృష్ణ భగవానుడిని 'ఉదర' అని పిలుస్తారు మరియూ దమము అనే గుణముతో సంపన్నులు కావడంచేత ఆయనకు 'దామ' అని మరో పేరు. ఈ ప్రకారముగా దామ మరియూ ఉదర - ఈ రెండు శబ్దాల సంయోగ కారణాన ఆయన దామోదరుడుగా ప్రసిద్ధికెక్కారు.

:: శ్రీ మహాపురాణే (బ్రహ్మపురాణే) చతురశీత్యధికశతతమోఽధ్యాయః ::
దదర్శ చాల్పదన్తాస్యం స్మితహాసం చ బాలకమ్ ।
తమోర్మద్యగతం బద్ధం దామ్నా గాఢం తథోదరే ॥ 41 ॥

కొలదిగ దంతములుగల నోరు గలవాడును చిరునగవుతో కూడినవాడును అగు బాలకుని - ఆ రెండు జంట మద్ధి చెట్ల నడుమ నున్నవానిని - త్రాటితో తన ఉదరము దృఢముగా కట్టబడియున్నవానిని చూచెను. తన ఉదరము నందలి ఆ దామ బంధనముచే (త్రాటితో కట్టబడుటచే) అతడు అటు తరువాతనుండి 'దామోదరుడు' అను వ్యవహారమును పొందినవాడాయెను.

దామాని లోకనామాని తాని యస్యోదరాంతరే ।
తేన దామోదరో దేవః శ్రీధరః శ్రీ సమాశ్రితః ॥

'దామములు' అనునది లోకములకు నామము. అవి ఎవని ఉదరాంతరమున అనగా ఉదరమునకు నడుమ ఉన్నవో అట్టి వాడును, శ్రీ (లక్ష్మి) చేత సమాశ్రితుడు (లెస్సగా ఆశ్రయించబడినవాడు) అగు శ్రీధరదేవుడు ఆ హేతువు చేతనే దామోదరుడుగా అయ్యెను.



दमादिसाधनोदारोत्कृष्टामति रस्तिसा ।
तया गम्यत इति स दामोदर इतीर्यते ॥

Damādisādhanodārotkr̥ṣṭāmati rastisā,
Tayā gamyata iti sa dāmodara itīryate.

He is attained by udāra and utkr̥ṣṭa i.e., superior disciplines of dāma i.e., self restraint; Hence He is Dāmodaraḥ.

:: महाभारते शांति पर्वणि मोक्षधर्म पर्वणि एकचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
दमात् सिद्धिं परीप्सन्तो मां जनाः कामयन्ति ह ।
दिवं चोर्वीं च मध्यं च तस्माद् दमोदरो ह्यहम् ॥ ४४ ॥

Mahābhāra - Book 12,  Mokṣadharma Section, Chapter 341
Damāt siddhiṃ parīpsanto māṃ janāḥ kāmayanti ha,
Divaṃ corvīṃ ca madhyaṃ ca tasmād damodaro hyaham.
44.

He is known as Dāmodaraḥ as He is attained by dāma (self-control) etc.

:: श्री महापुराणे (ब्रह्मपुराणे)चतुरशीत्यधिकशततमोऽध्यायः ::
ददर्श चाल्पदन्तास्यं स्मितहासं च बालकम् ।
तमोर्मद्यगतं बद्धं दाम्ना गाढं तथोदरे ॥ ४१ ॥

Brahma Purāṇa -  Chapter 184
Dadarśa cālpadantāsyaṃ smitahāsaṃ ca bālakam,
Tamormadyagataṃ baddhaṃ dāmnā gāḍaṃ tathodare. 41.

The inhabitants of Gokula saw the boy smiling with few or tiny teeth.She (Yaṣodā) bound Him tightly with a rope round His waist and betwixt them (the two trees). He became Dāmodara due to binding with a dāma or rope from that time.

दामानि लोकनामानि तानि यस्योदरांतरे ।
तेन दामोदरो देवः श्रीधरः श्री समाश्रितः ॥

Dāmāni lokanāmāni tāni yasyodarāṃtare,
Tena dāmodaro devaḥ śrīdharaḥ śrī samāśritaḥ.

Dama means the worlds. He in whose abdomen these worlds have their existence, that Lord, known also as Śrīnivāsa and Śrīdhara, is Dāmodara.

विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सहः ।
महीधरो महाभागो वेगवानमिताशनः ॥ ४० ॥

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరస్సహః ।
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦ ॥

Vikṣaro rohito mārgo heturdāmodarassahaḥ ।
Mahīdharo mahābhāgo vegavānamitāśanaḥ ॥ 40 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి