17 నవం, 2013

379. కారణమ్, कारणम्, Kāraṇam

ఓం కారణాయ నమః | ॐ कारणाय नमः | OM Kāraṇāya namaḥ


కారణమ్, कारणम्, Kāraṇam

ఉపాదానం నిమిత్తం చ జగతః కారణమ్ స్మృతమ్ ।
తదేవేతి మహద్బ్రహ్మ కారణం పరికీర్త్యతే ॥

లోగడ చెప్పినట్లు జగదుద్పత్తికి ఉపాదాన కారణమును, నిమిత్త కారణమును పరమాత్ముడే గనుక 'కారణమ్‍'

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
సీ. ఆద్యంతశూన్యంబు నవ్యయంబై తగు తత్త్వ మింతకు నుపాదాన మగుట
గుణవిషయములు గైకొని కాలమును మహదాది భూతములు ద న్నాశ్రయింప
గాలానురూపంబుఁ గైకొని యీశుండు దన లీలకై తనుఁ దా సృజించెఁ
గరమొప్ప నఖిలలోకములందుఁ దా నుండుఁ దనలోన నఖిలంబుఁ దనరుచుండుఁ
తే. గాన విశ్వమ్మునకుఁ గార్యకారణములు దాన; య మ్మహాపురుషుని తనువు వలనఁ
బాసి విశ్వంబై వెలియై ప్రభాస మొందె, మానితాచార! యీ వర్తమాన సృష్టి. (342)

మొదలు తుద లేనిది, తరిగిపోనిదీ ఐన తత్త్వమే ఈ సృష్టికంతటికీ ప్రధాన కారణం. అందువల్ల గుణాలూ, ఇంద్రియార్థాలూ, మహత్తూ, పంచభూతాలు తన్ను ఆశ్రయించగా, ఈశ్వరుడు కాలానికి అనురూపమైన రూపం ధరించినవాడై వినోదానికై తనను తాను సృష్టించుకొన్నాడు. ఈ విధంగా సృష్టించిన సమస్తలోకాలందూ ఈశ్వరుడుంటాడు. ఆ యీశ్వరునియందు సమస్త లోకాలూ ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి విశ్వానికి కార్యమూ, కారణమూ రెండూ తానే. ఆ పరమపురుషుని శరీరం నుండి విడివడి ఈ విశ్వం విరాజిల్లుతున్నది. ఈ విధంగా వర్తమాన సృష్టి ఏర్పడింది.



Upādānaṃ nimittaṃ ca jagataḥ kāraṇam smr̥tam,
Tadeveti mahadbrahma kāraṇaṃ parikīrtyate.

उपादानं निमित्तं च जगतः कारणम् स्मृतम् ।
तदेवेति महद्ब्रह्म कारणं परिकीर्त्यते ॥

Since He is both the material and the instrumental cause, He is Kāraṇam.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 11
Tadāhurakṣaraṃ brahma sarvakāraṇakāraṇam,
Viṣṇordhāma paraṃ sākṣātpuruṣasya mahātmanaḥ. 41.

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे एकादशोऽध्यायः ::
तदाहुरक्षरं ब्रह्म सर्वकारणकारणम् ।
विष्णोर्धाम परं साक्षात्पुरुषस्य महात्मनः ॥ ४१ ॥

The Supreme Brahma, is therefore said to be the original cause of all causes. Thus the spiritual abode of Viṣṇu is eternal without a doubt, and it is also the abode of Mahā-Viṣṇu, the origin of all manifestations.

उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥

ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥

Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి