ఓం చాణూరాన్ధ్రనిషూదనాయ నమః | ॐ चाणूरान्ध्रनिषूदनाय नमः | OM Cāṇūrāndhraniṣūdanāya namaḥ
చాణూర నామాన మన్ధ్రం యోనిషూదితవాన్ హరిః ।
ససద్భిరుచ్యతే ఇతి చాణూరాన్ధ్ర నిషూదనః ॥
చాణూరుడు అను నామము కల అంధ్ర జాతీయుని చంపినందున హరి చాణూరాన్ధ్రనిషూదనః.
:: పోతన భాగవతము దశమ స్కంధ పూర్వ భాగము ::
క. | హరికిని లోఁబడి బెగడక, హరియురము మహోగ్రముష్టి నహితుఁడు పొడువన్ |
| హరి కుసుమమాలికాహత, కరిభంగిఁ బరాక్రమించెఁ గలహోద్ధతుఁడై. (1360) |
క. | శౌరి నెఱిఁజొచ్చి కరములు, క్రూరగతిన్ బట్టి త్రిప్పి కుంభిని వైచెన్ |
| శూరుం గలహ గభీరున, వీరుం జాణూరు ఘోరు వితతాకారున్. (1361) |
క. | శోణితము నోర నొకఁగ, జాణూరుం డట్లు కృష్ణసంభ్రామణ సం |
| క్షీణుండై క్షోణిం బడి, ప్రాణంబులు విడిచెఁ గంసుప్రాణము గలఁగన్. (1362) |
విరోధి అయిన చాణూరుడు కృష్ణునకు లోబడినప్పటికిని, భయపడక మహాభయంకరమైన పిడికిలితో వెన్నుని రొమ్మును పొడిచినాడు. పూలదండచే కొట్టబడిన ఏనుగు చందముగా ఆ పోటును లెక్క చేయక శ్రీహరి యుద్ధమందు విజృంభించి పరాక్రమము చూపినాడు.
పరాక్రమవంతుడును, యుద్ధమందు గంభీరుడును, భీతిగొలిపెడి వాడును, దొడ్డదేహము కలవాడును, వీరుడునుయగు చాణూరుడిని కృష్ణుడు చొచ్చుకొనిపోయి కర్కశముగా వాని చేతులు పట్టుకొని గిరగిర త్రిప్పి నేలపై కొట్టినాడు.
ఆ విధముగా అచ్యుతునిచేత గిర గిర త్రిప్పబడిన చాణూరుడు మిక్కిలిగ నలిగినవాడై నోటినుంచి నెత్తురు కారగా పుడమిమీదబడి ప్రాణములు విడిచినాడు. అతని ప్రాణములు వీడినవెంటనె కంసుని ప్రాణము కలబారినది.
चाणूर नामान मन्ध्रं योनिषूदितवान् हरिः ।
ससद्भिरुच्यते इति चाणूरान्ध्र निषूदनः ॥
Cāṇūra nāmāna mandhraṃ yoniṣūditavān hariḥ,
Sasadbhirucyate iti cāṇūrāndhra niṣūdanaḥ.
Since He is the killer of the wrestler from andhra deśa of the name Cāṇūra, He is called Cāṇūrāndhraniṣūdanaḥ.
:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे चतुश्चत्वारिंशोऽध्यायः ::
नचलत्तत्प्रहारेण मालाहत इव द्विपः ।
बाह्वोर्निगृह्य चाणूरं बहुशो भ्रामयन्हरिः ॥ २२ ॥
भूपृष्ठे पोथयामास तरसा क्षीण जीवितम् ।
विस्रस्ताकल्पकेशस्रगिन्द्रध्वज इवापतत् ॥ २३ ॥
Śrīmad Bhāgavata - Canto 10, Chapter 44
Nacalattatprahāreṇa mālāhata iva dvipaḥ,
Bāhvornigr̥hya cāṇūraṃ bahuśo bhrāmayanhariḥ. 22.
Bhūpr̥ṣṭhe pothayāmāsa tarasā kṣīṇa jīvitam,
Visrastākalpakeśasragindradhvaja ivāpatat. 23.
No more shaken by the demon's mighty blows than an elephant struck with a flower garland, Lord Kr̥ṣṇa grabbed Cāṇūra by his arms, swung him around several times and hurled him onto the ground with great force. His clothes, hair and garland scattering, the wrestler fell down dead, like a huge festival column collapsing.
सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः । |
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥ |
|
సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః । |
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥ |
|
Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ, |
Nyagrodhodumbaro’śvatthaścāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥ |