5 ఫిబ్ర, 2015

824. అశ్వత్థః, अश्वत्थः, Aśvatthaḥ

2ఓం అశ్వత్థాయ నమః | ॐ अश्वत्थाय नमः | OM Aśvatthāya namaḥ


అశ్వత్థః శ్వోఽపిన స్థాతేత్యచ్యుతః ప్రోచ్యతే బుధైః ।
సకారస్యతకారః పృషోదరాదితయేష్యతే ॥
ఊర్ధ్వమూలోవాక్శాఖ ఏషోశ్వత్థ స్సనాతనః ।
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థః ప్రాహుర్వ్యయం ॥
ఇతి శ్రుతిస్మృతి బలాదశ్వత్థైతికథ్యతే ॥

ప్రపంచము ఇచ్చట 'అశ్వత్థ' వృక్షముగా చెప్పబడినది. శ్వస్థః అనగా రేపటివరకు నిలిచియుండునది. అశ్వస్థః అనగా రేపటికి నిలిచియుండునది కానిది. అనగా నిన్న, నేడు, రేపు అను కాల పరిమితులకు అతీతముగా నిలిచియుండునది అశ్వత్థః. వృషోదరాది గణమునందలి శబ్దమగుట చేత 'అశ్వస్థః' - 'అశ్వత్థః' అగును. 'ఊర్ధ్వమూలోఽవాక్శాఖ ఏషోఽశ్వత్థః సనాతనః' (కఠోపనిషత్ 2.3.1) - 'సంసార రూపమగు ఈ అశ్వత్థవృక్షము పై వైపునకు మూలమును, క్రింది వైపునకు కొమ్మలును కలదియు అనాది సిద్ధమును' అను శ్రుతియు, 'ఊర్ధ్వమూల మావాక్శాఖ మశ్వత్థం ప్రాహు రవ్యయమ్‍' (శ్రీమదభగవద్గీత 15.1) - 'పై వైపునకు మొదలును, క్రింది వైపునకు శాఖలును కల అవినాశియగు అశ్వత్థ వృక్షమునుగా ఈ సంసారమును తత్త్వవేత్తలు చెప్పుచున్నారు' అను స్మృతియు ఇచ్చట ప్రమాణములు.



अश्वत्थः श्वोऽपिन स्थातेत्यच्युतः प्रोच्यते बुधैः ।
सकारस्यतकारः पृषोदरादितयेष्यते ॥
ऊर्ध्वमूलोवाक्शाख एषोश्वत्थ स्सनातनः ।
ऊर्ध्वमूलमधःशाखमश्वत्थः प्राहुर्व्ययं ॥
इति श्रुतिस्मृति बलादश्वत्थैतिकथ्यते ॥

Aśvatthaḥ śvo’pina sthātetyacyutaḥ procyate budhaiḥ,
Sakārasyatakāraḥ pr̥ṣodarāditayeṣyate.
Ūrdhvamūlovākśākha eṣośvattha ssanātanaḥ,
Ūrdhvamūlamadhaḥśākhamaśvatthaḥ prāhurvyayaṃ.
Iti śrutismr̥ti balādaśvatthaitikathyate.

What stands tomorrow is Śvasthaḥ. What is not Śvasthaḥ i.e., that of which it cannot be said as 'staying tomorrow' is Aśvasthaḥ. That is, that whose existence is not determined by time as today, tomorrow being ever present without demarcation of time is aśvasthaḥ. By special rule, aśvasthaḥ becomes aśvatthaḥ vide śruti 'ऊर्ध्वमूलोऽवाक्शाख एषोऽश्वत्थः सनातनः' / 'Ūrdhvamūlo’vākśākha eṣo’śvatthaḥ sanātanaḥ' (कठोपनिषत् २.३.१ / Kaṭhopaniṣat 2.3.1) - 'the eternal tree with roots above and branches below' and the smr̥ti 'ऊर्ध्वमूल मावाक्शाख मश्वत्थं प्राहु रव्ययम्' / 'Ūrdhvamūla māvākśākha maśvatthaṃ prāhu ravyayamˈ (श्रीमदभगवद्गीत १५.१ / Śrīmadabhagavadgīta 15.1) - 'the philosophers speak of a deathless tree with roots above and branches below.'

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి