3 జూన్, 2013

212. సత్యః, सत्यः, Satyaḥ

ఓం సత్యాయై నమః | ॐ सत्यायै नमः | OM Satyāyai namaḥ


సత్యః, सत्यः, Satyaḥ
సత్య వచనము తన రూపముగా కలవాడు గనుక సత్యః అనునది శ్రీ విష్ణువు యొక్క నామమే. తస్మాత్ సత్యం పరమం వదంతి (నారాయణోపనిషత్ 79) అనగా సత్యవచనమే పరమాత్ముని రూపము అను శ్రుతి ఇచట ప్రమాణము.

లేదా సత్యమునకును సత్యమగువాడు కాబట్టి సత్యః.

:: పోతన భాగవతము - నవమ స్కంధము ::
క. జగదవనవిహారీ! శత్రులోక ప్రహారీ! సుగుణఘనవిహారీ! సుందరీమానహారీ!

విగతకలుషపోషీ! వీరవిద్యాభిలాషీ! స్వగురుహృదతోషీ! సర్వదా సత్యభాషీ! (736)

లోక రక్షణకోసం సంచరించేవాడా! శత్రువుల సమూహాన్ని దండించేవాడా! సుగుణాలచే ఉద్యానవనంలో విహరించేవాడా! అందగత్తెల అభిమానాన్ని అపహరించేవాడా! పుణ్యాత్ములను పోషించేవాడా! వీరత్వంలో అభినివేశం కలవాడా! గురువుల హృదయాలకు సంతోషాన్ని కలిగించేవాడా! ఎల్లప్పుడూ సత్యాన్నే పలికేవాడా!

106. సత్యః, सत्यः, Satyaḥ



Because He is satyavacana as His words always come true vide the śruti Tasmāt satyaṃ paramaṃ vadaṃti (Nārāyaṇopaniṣat 79) therefore they say truth is paramount.

Or since He is the Truth of truth, He is Satyaḥ.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter14
Ekastvamātmā puruṣaḥ purāṇaḥ satyaḥ svayaṃjyotirananta ādyaḥ,
nityo’kṣaro’jasrasukho nirañjanaḥ pūrṇādvayo mukta upādhito’mr̥taḥ. (23)

:: श्रीमद्भागवते दशम स्कन्धे, पूर्वार्धे, चतुर्दशोऽध्यायः ॥
एकस्त्वमात्मा पुरुषः पुराणः सत्यः स्वयंज्योतिरनन्त आद्यः ।
नित्योऽक्षरोऽजस्रसुखो निरञ्जनः पूर्णाद्वयो मुक्त उपाधितोऽमृतः ॥ २३ ॥

You are the one Supreme Soul, the primeval Supreme Personality, the Absolute Truth - self-manifested, endless and beginning less. You are eternal and infallible, perfect and complete, without any rival and free from all material designations. Your happiness can never be obstructed, nor have You any connection with material contamination. Indeed, You are the indestructible nectar of immortality.

106. సత్యః, सत्यः, Satyaḥ

गुरुर्गुरुतमो धाम सत्यस्सत्यपराक्रमः ।
निमिषोऽनिमिषस्स्रग्वी वाचस्पति रुदारधीः ॥ २३ ॥

గురుర్గురుతమో ధామ సత్యస్సత్యపరాక్రమః ।
నిమిషోఽనిమిషస్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ॥ ౨౩ ॥

Gururgurutamo dhāma satyassatyaparākramaḥ ।
Nimiṣo’nimiṣassragvī vācaspati rudāradhīḥ ॥ 23 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి