ఓం సుప్రసాదాయ నమః | ॐ सुप्रसादाय नमः | OM Suprasādāya namaḥ
సుప్రసాదః, सुप्रसादः, Suprasādaḥ |
అపకారవతాం శిశుపాలాదీనామపి మోక్ష ప్రదాతృత్వాత్ శోభనః ప్రసాదః యస్య అపకారులగు శిశుపాలాదులకు సైతము మోక్షప్రదుడగుటవలన శోభనము, శుభకరము అగు ప్రసాదము, దయ ఎవనికి కలదో అట్టివాడు.
:: పోతన భాగవతము దశమ స్కంధము, ఉత్తరభాగము ::
క. | కమలాక్షుని నిందించిన, దమఘోషతనూభవుండు దారుణ మల కూ |
పమునుం బొందక యే క్రియ, సుమహితమతిఁ గృష్ణునందుఁ జొచ్చే మునీంద్రా! (797) | |
వ. | అనిన శుకయోగి రాజయోగి కిట్లనియె. (798) |
మ. | మధుదైత్యాంతకుమీఁది మత్సరమునన్ మత్తిల్లి జన్మత్రయా |
వధియే ప్రొద్దుఁ దదీయ రూపగుణ దివ్యధ్యానపారీణ ధీ | |
నిధి యౌటన్ శిశుపాల భూవిభుఁడు తా నిర్ధూత సర్వాఘుఁడై | |
విధిరుద్రాదుల కందరాని పదవిన్ వే పొందె నుర్వీశ్వరా! (799) |
ఓ మునీంద్రా! శ్రీకృష్ణుణ్ణి నిందించిన శిశుపాలుడు భయంకర నరకకూపంలో పడకుండా భగవంతుడైన కృష్ణునిలో ఏ విధంగా ప్రవేశించాడో వివరించు.
ఈ విధంగా ప్రశ్నించిన మహారాజుతో మహర్షి ఇలా అన్నాడు - 'ఓ రాజేంద్రా! మధుసూదనుని మీది మాత్సర్యంతో మదోన్మత్తుడై మూడు జన్మలనుండీ ముకుందుని నిందిస్తూ, ఎల్లప్పుడూ విష్ణుదేవుని రూప గుణాలను ధ్యానిస్తూ వుండడంవల్ల శిశుపాలుడు సమస్త పాపాలనుంచి విముక్తుడై బ్రహ్మరుద్రాదులకు సైతం అందరాని పదవిని పొందాడు.'
Apakāravatāṃ śiśupālādīnāmapi mokṣa pradātr̥tvāt śobhanaḥ prasādaḥ yasya / अपकारवतां शिशुपालादीनामपि मोक्ष प्रदातृत्वात् शोभनः प्रसादः यस्य One whose prasāda or mercy is uniquely wonderful because He bestows salvation even on those like Śiśupāla and others who tried to harm Him.
Śrīmad Bhāgavata - Canto 10, Part II, Chapter 74
Janmatrayānuguṇita vairasaṃrabdhayā dhiyā,
Dhyāyaṃstanmayatāṃ yāto bhāvo hi bhavakāraṇam. (46)
:: श्रीमद्भागवते दशमस्कन्धे उत्तरार्धे चतुःसप्ततितमोऽध्यायः ::
जन्मत्रयानुगुणित वैरसंरब्धया धिया ।
ध्यायंस्तन्मयतां यातो भावो हि भवकारणम् ॥ ४६ ॥
Obsessed with hatred of Lord Kṛṣṇa throughout three lifetimes, Śiśupāla attained the Lord's transcendental nature. Indeed, one's consciousness determines one's future birth.
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः । |
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥ |
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః । |
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥ |
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ । |
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి