5 జూన్, 2013

214. నిమిషః, निमिषः, Nimiṣaḥ

ఓం నిమిషాయ నమః | ॐ निमिषाय नमः | OM Nimiṣāya namaḥ


నిమిషః, निमिषः, Nimiṣaḥ
నిమిషతి నేత్రే తన రెండు కన్నులను మూసికొని యుండువాడు. యోగ నిద్రారతస్య అస్య నేత్రే నిమీలితే యోగనిద్రాఽఽసక్తుడగు ఈతని కన్నులు రెండును మూసికొనియుండును.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
సీ. అనఘ! యేకోదకమై యున్న వేళ నంతర్నిరుద్ధానల దారు వితతి
భాతిఁ జిచ్ఛక్తి సమేతుఁడై కపట నిద్రాలోలుఁ డగుచు నిమీలితాక్షుఁ
డైన నారాయణుం డంబు మధ్యమున భాసుర సుధా ఫేన పాండుర శరీర
రుచులు సహస్ర శిరో రత్న రుచులతోఁ జెలిమి చేయఁగ నొప్పు శేష భోగ
తే. తల్పమునఁ బవ్వళించి యనల్పతత్త్వ, దీప్తిఁ జెన్నొందఁగా నద్వితీయుఁ డగుచు
నభిరతుండయ్యుఁ గోర్కులయందుఁ బాసి, ప్రవిమలాకృతి నానంద భరితుఁ డగుచు. (272)

పూర్వం ప్రళయసమయంలో విశ్వమంతా జలమయంగా ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకొని సముద్రమధ్యంలో పవ్వళించాడు. ఆ ఆదిశేషుడు స్వచ్ఛమైన అమృతం నురుగులవంటి శరీరం కలవాడు. అతని తెల్లని శరీర కాంతులు అతని వేయితలలపై తళతళలాడే రత్నాల కాంతులతో చెలిమి చేస్తున్నట్లుగా వెలుగోందాయి. నారాయణుడు తన కడుపులో అగ్నిని దాచుకొన్న దారువులా లోపల చైతన్య శక్తి కలవాడై ఉన్నాడు. అనంతమైన తత్త్వదీప్తితో అద్వితీయుడై ఆనందమయుడై కపటనిద్ర నభినయించుతూ కన్నులు మూసుకొని ఉన్నాడు. కుతూహలం కలిగి కూడా కోర్కెలు లేనివానిలా నిష్కళంకమైన స్వరూపంతో విరాజిల్లాడు.



Nimiṣati netre / निमिषति नेत्रे He whose eyelids are closed. Yoga nidrāratasya asya netre nimīlite / योग निद्रारतस्य अस्य नेत्रे निमीलिते He whose eyelids are closed in His Yoganidrā.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 11
Antaḥ sa tasminsalila āste’nantāsano hariḥ,
Yoganidrānimīlākṣaḥ stūyamāno janālayaiḥ. (31)

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे एकादशोऽध्यायः ::
अन्तः स तस्मिन्सलिल आस्तेऽनन्तासनो हरिः ।
योगनिद्रानिमीलाक्षः स्तूयमानो जनालयैः ॥ ३१ ॥

The Supreme Lord lies down in the water on the seat of Ananta, with His eyes closed, and the inhabitants of the Janaloka planets offer their glorious prayers unto the Lord with folded hands.

गुरुर्गुरुतमो धाम सत्यस्सत्यपराक्रमः ।
निमिषोऽनिमिषस्स्रग्वी वाचस्पति रुदारधीः ॥ २३ ॥

గురుర్గురుతమో ధామ సత్యస్సత్యపరాక్రమః ।
నిమిషోఽనిమిషస్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ॥ ౨౩ ॥

Gururgurutamo dhāma satyassatyaparākramaḥ ।
Nimiṣo’nimiṣassragvī vācaspati rudāradhīḥ ॥ 23 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి