ఓం ఆవర్తనాయ నమః | ॐ आवर्तनाय नमः | OM Āvartanāya namaḥ
ఆవర్తనః, आवर्तनः, Āvartanaḥ |
ఆవర్తయితుం సంసారచక్రం శీలం అస్య సంసార చక్రమును త్రిప్పుచుండుట ఈతని శీలము అనగా అలవాటు.
:: పోతన భాగవతము ద్వితీయ స్కంధము ::
సీ. | భూపాలకోత్తమ! భూతహితుండు సుజ్ఞానస్వరూపకుఁడైన యట్టి |
ప్రాణికి దేహసంబంధ మెట్లగు నన్న మహి నొప్పు నీశ్వరమాయ లేక | |
కలుగదు, నిద్రలోఁ గలలోనఁ దోఁచిన దేహసంబంధంబుల తేఱఁగువలెను | |
హరియోగ మాయామహత్త్వంబునం బాంచ భౌతిక దేహసంబంధుఁ డగుచు | |
తే. | నట్టి మాయాగుణంబుల నాత్మ యోలి, బాల్య కౌమార యౌవనభావములను |
నర సుపర్వాది మూర్తులఁ బొరసి "యేను", "నాయ దిది" యను సంసారమాయఁ దగిలి. (223) |
"జీవుడు భూతాలకు మేలు చేకూర్చేవాడు, జ్ఞానమే స్వరూపంగా కలవాడు. అలాంటి వానికి శరీరంతో సంబంధం ఎలా కలిగింది!" అంటావా? జగతీతల మంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుని మాయ అనేది లేకపోతే జీవునికి దేహంతో సంబంధం కలుగదు. నిద్రించే వేళ స్వప్నంలో దేహాలతో సంబంధం గోచరిస్తుంది కదా! అలాగే నారాయణుని యోగమాయా ప్రభావం వల్ల జీవుడు పంచభూతాలతో కూడిన దేహంతో సంబంధం కలవాడవుతాడు. ఆ మాయాగుణాలవల్లనే క్రమంగా బాల్యం, కౌమారం యౌవనం అనే దశలు పొందుతాడు. మనుష్య, దేవతాది ఆకారాలను గూడా స్వీకరిస్తాడు. 'నేను' అనే అహంకారాన్నీ, 'నాది' అనే మమకారాన్నీ పెంచుకొంటాడు. సంసారమాయలో బద్ధుడవుతాడు.
Āvartayituṃ saṃsāracakraṃ śīlaṃ asya / आवर्तयितुं संसारचक्रं शीलं अस्य He is possessed of the nature or capacity to turn the wheel of saṃsāra or material existence.
Śrīmad Bhāgavata - Canto 2, Chapter 5
Kālaṃ karma svabhāvaṃ ca māyeṣo māyayā svayā,
Ātmanyadr̥cchayā prāptaṃ vibubhūṣurupādade. (21)
:: श्रीमद्भागवते द्वितीय स्कन्धे पञ्चमोऽध्यायः ::
कालं कर्म स्वभावं च मायेषो मायया स्वया ।
आत्मन्यदृच्छया प्राप्तं विबुभूषुरुपाददे ॥ २१ ॥
The Lord, who is the controller of all energies, thus creates, by His own potency, eternal time, the fate of all living entities, and their particular nature, for which they were created, and He again merges them independently.
आवर्तनो निवृत्तात्मा संवृतस्संप्रमर्दनः । |
अहसंवर्तको वह्निरनिलो धरणीधरः ॥ २५ ॥ |
ఆవర్తనో నివృత్తాత్మా సంవృతస్సంప్రమర్దనః । |
అహసంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ ౨౫ ॥ |
Āvartano nivr̥ttātmā saṃvr̥tassaṃpramardanaḥ । |
Ahasaṃvartako vahniranilo dharaṇīdharaḥ ॥ 25 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి