ఓం ప్రసన్నాత్మనే నమః | ॐ प्रसन्नात्मने नमः | OM Prasannātmane namaḥ
ప్రసన్నాత్మాః, प्रसन्नात्माः, Prasannātmāḥ |
ప్రసన్నః ఆత్మా రజస్తమోభ్యాం అకలుషితం అంతఃకరణం యస్య రజస్తమోగుణములచే కలుషితము కాని అంతః కరణము అనగా ప్రసన్నమగు ఆత్మ ఈతనికి కలదు. లేదా ప్రసన్నః ఆత్మా కరుణార్ద్రః స్వభావః అస్య విద్యతే కరూణార్ద్రమగు స్వభావము ఇతనికి కలదు. లేదా నిర్మలమగు స్వభావము ఇతనికి కలదు. కరుణాశాలి అనియే అర్థము. లేదా అవాప్త సకల కాముడు - పొందబడిన అన్ని కోరికల ఫలములును కలవాడూ, పొందవలసిన ఏ కోరిక ఫలములును లేనివాడును కావున రాగము మొదలగునవి లేని నిర్మలమగు ఆత్మ కలవాడు.
:: శ్రీమద్భగవద్గీత - మోక్షసన్న్యాసయోగము ::
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి ।
సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ॥ 54 ॥
బ్రహ్మైక్యము బొందినవాడు, నిర్మలమైన ప్రశాంతమైన మనస్సుగలవాడునగు మనుజుడు దేనిని గూర్చియు దుఃఖింపడు. దేనినీ కోరడు. సమస్త ప్రాణులందును సమబుద్ధిగలవాడై వానిని తనవలెనే చూచుకొనుచు నాయందలి ఉత్తమ భక్తిని పొందుచున్నాడు.
Prasannaḥ ātmā rajastamobhyāṃ akaluṣitaṃ aṃtaḥkaraṇaṃ yasya / प्रसन्नः आत्मा रजस्तमोभ्यां अकलुषितं अंतःकरणं यस्य One whose mind is never contaminated by Rājas or Tamas. Prasannaḥ ātmā karuṇārdraḥ svabhāvaḥ asya vidyate / प्रसन्नः आत्मा करुणार्द्रः स्वभावः अस्य विद्यते Or One who is extremely merciful by nature. Or One who is ever satisfied as has realized all His desires.
Śrīmad Bhagavad Gīta - Chapter 18
Brahmabhūtaḥ prasannātmā na śocati na kāṃkṣati,
Samassarveṣu bhūteṣu madbhaktiṃ labhate parām. (54)
:: श्रीमद्भगवद्गीत - मोक्षसन्न्यासयोग ::
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न कांक्षति ।
समस्सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥ ५४ ॥
By becoming engrossed in Brahman, calm souled, neither lamenting nor craving, beholding equality in all beings - he gains supreme devotion towards Me.
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः । |
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥ |
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః । |
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥ |
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ । |
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి