26 జూన్, 2013

235. ధరణీధరః, धरणीधरः, Dharaṇīdharaḥ

ఓం ధరణీధరాయ నమః | ॐ धरणीधराय नमः | OM Dharaṇīdharāya namaḥ


ధరణీధరః, धरणीधरः, Dharaṇīdharaḥ

వరాహశేషాదిఙ్మత్తేభాదిరూపేణ కేశవః ।
ధరణీం ధరతీత్యేష ధర్ణీధర ఉచ్యతే ॥

వరాహ, ఆదిశేష, దిగ్గజాది రూపములతో ఈ భూమిని ధరించు విష్ణువు ధరణీధరుడు.

:: పోతన భాగవతము - పఞ్చమ స్కంధము, ద్వితీయాశ్వాసము ::
చ. జలజభవాదిదేవ మునిసన్నుత తీర్థపదాంబుజాత! ని
     ర్మల నవరత్న నూపురవిరాజిత! కౌస్థుభ భూషణాంగ! యు
     జ్జ్వల తులసీ కురంగ మదవాసన వాసిత దివ్యదేహ! శ్రీ
     నిలయ శరీర! కృష్ణ! ధరణీధర! భాను శశాంకలోచనా!

బ్రహ్మ మొదలయిన దేవతలూ, ఋషులూ స్తుతించేవి, పుణ్య తీర్థాలవలె పవిత్రమైనవీ అయిన పాదపద్మాలు కలవాడవూ, నవరత్నాలతో ప్రకాశించే కాలి అందెలు గలవాడవూ, కౌస్తుభమణిని భూషణంగా ధరించినవాడవూ, వెల్లివిరిసే తులసీదళాల పరిమళాలూ, కస్తూరీ సుగంధాలూ, గుబాళించే దివ్యదేహం కలవాడవూ, లక్ష్మీదేవికి నివాసమయిన వక్షఃస్థలం కలవాడవూ, భూభారాన్ని వహించేవాడవూ, సూర్యచంద్రులే కన్నులుగా కలవాడవూ అయిన శ్రీకృష్ణా! నీకు నమస్కారం.



Varāhaśeṣādiṅmattebhādirūpeṇa keśavaḥ,
Dharaṇīṃ dharatītyeṣa dharṇīdhara ucyate.

वराहशेषादिङ्मत्तेभादिरूपेण केशवः ।
धरणीं धरतीत्येष धर्णीधर उच्यते ॥

He bears the Earth in the form of Varāha, Ādiśeṣa and the eight elephants sustaining the cardinal points of the world.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 13
Daṃṣṭrāgrakoṭayā bhagavaṃstvayā dhr̥tā virājate bhūdhara bhū sabhūdharā,
Yathā vanānniḥ sarato datā dhr̥tā mataṅgajendrasya sapannapadminī. (41)

:: श्रीमद्भागवते तृतीय स्कन्धे, त्रयोदशोऽध्यायः ::
दंष्ट्राग्रकोटया भगवंस्त्वया धृता विराजते भूधर भू सभूधरा ।
यथा वनान्निः सरतो दता धृता मतङ्गजेन्द्रस्य सपन्नपद्मिनी ॥ ४१ ॥

O lifter of the earth, the earth with its mountains, which You have lifted with Your tusks, is situated as beautifully as a lotus flower with leaves sustained by an infuriated elephant just coming out of the water.

आवर्तनो निवृत्तात्मा संवृतस्संप्रमर्दनः ।
अहसंवर्तको वह्निरनिलो धरणीधरः ॥ २५ ॥

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతస్సంప్రమర్దనః ।
అహసంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః ॥ ౨౫ ॥

Āvartano nivr̥ttātmā saṃvr̥tassaṃpramardanaḥ ।
Ahasaṃvartako vahniranilo dharaṇīdharaḥ ॥ 25 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి