1 జన, 2014

424. విశ్రామః, विश्रामः, Viśrāmaḥ

ఓం విశ్రామాయ నమః | ॐ विश्रामाय नमः | OM Viśrāmāya namaḥ


సంసార సాగరే హి క్షుత్పిపాసాదిషడూర్మిభిః ।
తరంగితైరవిద్యాద్వైర్మహాక్లేశైర్మదాదిభిః ॥
ఉపక్లేశైశ్చ సువశీకృతానాం మృత్యుధర్మిణామ్ ।
విశ్రాంతిం కాంక్షమాణానాం సతతం పరితప్యతాం ।
కరోతి మోక్షం విశ్రామమితి విశ్రామ ఉచ్యతే ॥

క్షుత్‍, పిపాస, శోకము, మోహము, జరా మరియు మరణములనే ఆరు ఊర్ములచేతను (షడూర్ములు) తరంగములు కలదిగా అయియున్న సంసారసాగరమునందు అవిద్య, అస్మితా (చేతన, జడ తత్త్వముల పరస్పర తాదాత్మ్యభావన), రాగము, ద్వేషము, అభివేశము (పూర్వ జన్మ సంస్కారాదికముచే దేని విషయమున నయినను గాఢమగు ఆసక్తి) అనే మహాక్లేశముల చేతను, మదము మొదలగు ఉపక్లేశములచేతను వశీకరించుకొనబడిన వారును - విశ్రాంతిని కాంక్షించు వారును అగు వారికి మోక్షరూపమగు విశ్రామమును కలిగించునుగనుక ఈతండు విశ్రామః.



Saṃsāra sāgare hi kṣutpipāsādiṣaḍūrmibhiḥ,
Taraṃgitairavidyādvairmahākleśairmadādibhiḥ.
Upakleśaiśca suvaśīkr̥tānāṃ mr̥tyudharmiṇām,
Viśrāṃtiṃ kāṃkṣamāṇānāṃ satataṃ paritapyatāṃ,
Karoti mokṣaṃ viśrāmamiti viśrāma ucyate.

संसार सागरे हि क्षुत्पिपासादिषडूर्मिभिः ।
तरंगितैरविद्याद्वैर्महाक्लेशैर्मदादिभिः ॥
उपक्लेशैश्च सुवशीकृतानां मृत्युधर्मिणाम् ।
विश्रांतिं कांक्षमाणानां सततं परितप्यतां ।
करोति मोक्षं विश्राममिति विश्राम उच्यते ॥

For those who are entangled in the ocean saṃsāra (worldly existence) containing the six waves of hunger, thirst etc., caught up by the great griefs of avidyā etc., and the small griefs like pride etc., longing for rest, He bestows viśrāma or liberation. So Viśrāmaḥ.

ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి